చట్టాలపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Mar 11 2026 7:55 AM | Updated on Mar 11 2026 7:55 AM

జడ్చర్ల టౌన్‌: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా న్యాయం పొందేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఇందిర అన్నారు. మంగళవారం జడ్చర్లలోని బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ సెల్‌ సౌజన్యంతో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. పీడబ్ల్యూడీవీ, పీన్‌డీటీ, పోక్సో చట్టాల గురించి వివరించారు. డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేశారు. ప్రివెన్షన్‌ అంటే అవేర్‌నెస్‌ తీసుకురావడమేనన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సుకన్య, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కౌన్సిలర్‌ యాదగిరి, వైస్‌ ప్రిన్సిపాల్‌ నర్మద, శ్రీనివాసులు, పరీక్షల ని యంత్రణ అధికారి సులేమాన్‌, ఏపీఓ రాఘవేందర్‌రెడ్డి, అధ్యాపకులు సతీష్‌రెడ్డి, సురయ, జబ్బార్‌, రాజేశ్వరి, నర్సింహులు, నందకిశోర్‌, ఇస్రత్‌ సుల్తాన, జయలీల, రజనిలు పాల్గొన్నా రు. కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఐఎంఎస్‌ఎస్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ పారా లీగల్‌ వలంటీర్స్‌ డ్రగ్‌ అబ్యూస్‌పై చేసిన స్కిట్‌ ఆకట్టుకుంది.

ప్రగతి ప్రణాళికలోఅందరి భాగస్వామ్యం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వాము లు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, మున్సిపల్‌ చైర్మన్లకు అవగాహన కల్పిస్తామన్నారు. అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తామన్నారు.

14న ఉగాది

కవి సమ్మేళనం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో శ్రీపరాభవ ఉగాది కవి సమ్మేళనం, బోల యాదయ్య రచించిన హార్ట్‌బీట్‌ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాహితీ అధ్యక్షుడు భీంపల్లి శ్రీకాంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పాలమూరు నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఉన్న రెడ్‌క్రాస్‌ భవన్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించే కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వి.మనోహర్‌రెడ్డి, బెక్కెం జనార్దన్‌ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. కవి సమ్మేళనంలో కవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement