పీయూలో ఖోఖో మహిళా జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

పీయూలో ఖోఖో మహిళా జట్టు ఎంపిక

Mar 17 2026 8:35 AM | Updated on Mar 17 2026 8:35 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో ఖోఖో మహిళా జట్టు ఎంపికలను సోమవారం నిర్వహించారు. ఈ మేరకు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ శ్రీనివాస్‌ హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు యూనివర్సిటీ క్రీడలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని, ఇక్కడ క్రీడల్లో ఎంపికై న విద్యార్థులు నిరంతర సాధన ద్వారా మంచి ఫలితాలను రాబట్టేందుకు అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఇక్కడ ఎంపికై న విద్యార్థినులు ఈనెల 26నుంచి 31వ వరకు కర్ణాటకలోని దేవేంగిరి యూనివర్సిటీలో నిర్వహించే పోటీల్లో పాల్గొనున్నారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్‌, ఇన్‌చార్జి సత్యభాస్కర్‌, కోకో అసోసియేషన్‌ సెక్రెటరీ బాలరాజయ్య, కోచ్‌లు రూప, శ్రీనివాస్‌, రజిని, శ్వేత పాల్గొన్నారు.

పీయూలో భగత్‌సింగ్‌ వర్ధంతి

పీయూలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ 95వ వర్ధంతి కార్యక్రమాన్ని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారుతి, సీతారాం మాట్లాడుతూ.. బ్రిటీష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బలైన రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, భగత్‌సింగ్‌ విప్లవవీరులు స్వాతంత్య్రం కోసం జీవితాలనే అర్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో హర్షవర్ధన్‌, సంజీవ్‌, బాలు, నవీన్‌, తిరుమలేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళలు

సామాజికంగా ఎదగాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మహిళలు సామాజికంగా ఎదగాలని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కొకన్వీనర్‌ శ్రీదేవి అన్నారు. సోమవారం స్థానిక డైట్‌ కాలేజీలో అంతర్జాతీయ శ్రామిక పోరాట దినంపై సెమినార్‌ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా శ్రామిక పోరాట దినం అంటే అందాలు, ముగ్గులు పోటీలు కాదని.. అదొక స్ఫూర్తిదాయకమైన రోజని తెలియజేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికపరంగా ముందుండి వాటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డైట్‌ కాలేజీ లెక్చరర్‌ జ్యోతి మాట్లాడుతూ.. మహిళలకు వేరే ఎవరో చెప్పనవసరంలేదని.. తమకు తాము అద్భుతంగా సృష్టించుకోగలరన్నారు. పాలమూరు యూనివర్సిటీ జేఏసీ లీడర్‌ నరేందర్‌ మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో సాధించాల్సింది ఇంకా మిగిలే ఉందని, హక్కులు, చట్టాల కొరకు నిరంతరం వి ద్యార్థిదర్శనం నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డైట్‌ లెక్చరర్స్‌ రఫియా, ఐషా, బాలీశ్వరి, పాలమూ రు యూనివర్సిటీ విద్యార్థి పవన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement