ఆస్తి పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Mar 17 2026 8:28 AM | Updated on Mar 17 2026 8:28 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో మొత్తం రూ. 51.61కోట్లకు ఇప్పటివరకు రూ.19 కోట్లే వసూలు కావడమేమిటని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని, నిత్యం కనీసం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు వసూలు చేయాలని ఆదేశించారు. ఎవరైనా చెల్లించకుంటే రెవెన్యూ చట్టం ప్రకారం వారి ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. అంతకుముందు నగరంలోని బండమీదిపల్లి, హనుమాన్‌పురా, భగీరథ కాలనీ తదితర ప్రాంతాలలో ఆయనతో పాటు మున్సిపల్‌ కార్పొరేషన్‌ రెవెన్యూ అధికారులు కలిసి ఆస్తిపన్ను వసూళ్ల కోసం తిరిగారు. సకాలంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు చెల్లించి నగర అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ అజ్మీర రాజన్న, ఆర్‌ఓలు మహమ్మద్‌ ఖాజా, యాదయ్య, ఆర్‌ఐలు రమే ష్‌, అహ్మద్‌షరీఫ్‌, ముజీబుద్దీన్‌ పాల్గొన్నారు.

కనీస వేతనాలు

అమలు చేయాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: కేజీబీవీలు, యూఆర్‌ఎస్‌లు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ మాట్లాడుతూ విద్యాశాఖలో వివిధ విభాగాల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్నారని వారికి తక్కువ వేతనాలు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు ఇవ్వాలన్నారు. హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, గతంతో చేసిన సమ్మే వేతనాలను కూడా ఇవ్వాలని, పీఆర్సీ ప్రకారం ప్రతి ఏడాది రూ.వెయ్యి ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కోశాధికారి భాస్కర్‌, కార్యదర్శులు వేణుగోపాల్‌, అజయ్‌, హేమంత్‌కుమార్‌, జయంతి, ఖాదరయ్య, శ్రీనివాసులు, కనకమ్మ, రాధ, శంకర్‌, నరేష్‌, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement