అలంపూర్‌ ఆలయాల్లో గవర్నర్‌ సతీమణి | - | Sakshi
Sakshi News home page

అలంపూర్‌ ఆలయాల్లో గవర్నర్‌ సతీమణి

Mar 9 2026 7:11 AM | Updated on Mar 9 2026 7:11 AM

అలంపూర్‌: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర క్షేత్రాన్ని గవర్నర్‌ సతీమణి సుధాదేవ్‌వర్మ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, ఆలయ ఈఓ దీప్తి అర్చక స్వాములతో కలిసి గవర్నర్‌ సతీమణికి పూర్ణకుంభస్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ సతీమణి బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగుళాంబ మాతను దర్శించుకుని విశేష పూజలు చేశారు. వేద పండితులు ఆమెకు పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆలయ అధికారులు ఉన్నారు.

నల్లమల అడవిలో మంటలు

మన్ననూర్‌: ఆమ్రాబాద్‌ పులుల రక్షిత అభయారణ్యం, నల్లమల పరిసర ప్రాంతంలోని అప్పాపూర్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అటవి శాఖ ఫైర్‌ సిబ్బందితో పాటు వివిధ క్యాడర్లలో విధులు నిర్వహిస్తున్న వాచర్లు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. నల్లమల అటవీ సరిహద్దు ప్రాంతంలో ప్రతి నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో తరుచుగా అడవికి నిప్పు అంటుకుంటుందని అటవీశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ఫైర్‌, వాచర్‌ సిబ్బంది రాము, చంద్రమౌళి, రవి, మన్సూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement