మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం ఉమ్మడి జిల్లా జూనియర్ బాలబాలికల బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంపికై న జట్లు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభచాటి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌బిన్ అహ్మద్ జాకీర్ అడ్వకేట్, నసరుల్లా హైదర్, సుబాన్‌జీ, ఎండీ ఇలియాజ్, షకీల్, ఉస్మాన్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.


