● ఎండను తట్టుకునేందుకు బైక్‌కు గుడిసెలాంటి గొడుగు
జడ్చర్ల టౌన్: జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లుగా మండుతున్న ఎండలను తట్టుకునేందుకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన షర్ఫద్దీన్ బైక్‌కు గుడిసెలాంటి గొడుగును ఏర్పాటు చేసుకుని.. ప్రయాణం సాగిస్తున్నారు. రైస్‌మిల్ వర్కర్ కావటంతో నిత్యం ఏదో ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో బైక్‌కు ఒక గొడుగు అమర్చుకోవాలనుకున్నారు. స్వతహాగా వర్కర్ కావడంతో తన ఆలోచనను ప్రకారం రూ.3 వేలతో బైక్‌కు గొడుగును తయారు చేసుకున్నారు. ఇందుకు ఇనుప పైపులు, నెట్, గోనె సంచులు, వెదురుదబ్బలు ఉపయోగించారు. వాటిని కొనుగోలు చేసి చిన్నపాటి గొడుగు మాదిరి ప్రేమ్ తయారు చేసి బైక్ బంపర్‌కు అమర్చారు. ఇంకేముంది మండుటెండల్లోనూ బైక్‌పై రయ్ రయ్‌మంటూ ప్రయాణం సాగిస్తున్నారు. గొడుగు బైక్‌తోనే కోస్గి, కల్వకుర్తి, నారాయణపేట, అచ్చంపేట పట్టణాలకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. మరి ఎండలు ఎక్కువగా ఉంటే టాప్‌పై కొన్ని నీళ్లు చల్లుకుంటే చల్లగా ఉంటుందని, సాధారణంగా 50 కి.మీ.స్పీడ్ వెళితే గాలులు ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు. దీంతో బైక్‌ను చూసిన వారంతా అదిరిందయ్యా షర్ఫద్దీన్ అంటున్నారు.
ఎండలనుంచి తట్టుకునేందుకు బైక్‌కు ఏర్పాటు చేసుకున్న గుడిసెలాంటి గొడుగు


