మాతృ మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మాతృ మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి

Mar 14 2026 8:11 AM | Updated on Mar 14 2026 8:11 AM

పాలమూరు: జిల్లాలో ఉన్న ప్రమాద లక్షణాలు గల గర్భిణీలను గుర్తించి, సమగ్ర ఆరోగ్య సేవల కింద ప్రతి ఏఎన్‌ఎం సమాచారం రికార్డు చేసి అవసరమైన పరీక్షలు చేయించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కృష్ణ అన్నారు. గర్భిణీ సమగ్ర ఆరోగ్య సేవల నిర్వహణపై ఏఎన్‌ఎంలకు శుక్రవారం జనరల్‌ ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహించారు. గర్భి ణీలకు అన్నిరకాల సేవలు అందేలా చూడాలని, గర్భం దాల్చిన వెంటనే వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో మాతృమరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఆర్మన్‌, యూనిసెఫ్‌ ఎన్‌జీఓ నుంచి డాక్టర్‌ కావ్య, డాక్టర్‌ సర్వాణి.. జ్వరం, 20 వారాల లోపు రక్తస్రావం, మానసిక ఆరోగ్యం, మూర్చ, కామెర్లు, తగ్గిన పిండ కదలికలు, ఇతర సమస్యలపై శిక్షణ ఇచ్చారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగా ఆజ్మీరా, డాక్టర్‌ శివకాంత్‌, డీఐఓ డాక్టర్‌ విద్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement