జన గణన–2027 అత్యంత కీలకం | - | Sakshi
Sakshi News home page

జన గణన–2027 అత్యంత కీలకం

Mar 16 2026 8:40 AM | Updated on Mar 16 2026 8:40 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు, దేశాభివృద్ధికి జన గణన–2027 అత్యంత కీలకం అని అదనపు కలెక్టర్‌ హరిప్రియ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జన గణన–2027 నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్‌ స్థాయి అధికారులకు మూడు రోజు ల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాస్థాయిలో జన గణన –2027 సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జన గణన రెండు దశల్లో కొనసాగుతుందని, మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్‌ లిస్టింగ్‌, హౌస్‌ ఎన్యుమరేషన్‌), గృహాల గణన కాగా.. రాష్ట్రంలో ఈ దశ మే 11న ప్రారంభమై జూన్‌ 9 వరకు కొనసాగుతుందన్నారు. రెండో దశలో జనాభా గణన ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమై.. మార్చి 1న రిఫరెన్స్‌ తేదీగా పరిగణి స్తారని చెప్పారు. ఈసారి జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్‌ విధాన ంలో నిర్వహించనున్నారని, మొబైల్‌ యాప్‌, వెబ్‌ పోర్టల్‌ను ఉపయోగించి గణన చేపట్టాలని సూచించారు. అలాగే ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి ముందు ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరిస్తారన్నారు.

జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి రవీందర్‌ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. చార్జి అధికారులుగా గ్రామీణ ప్రాంతంలో తహసీల్దార్‌, పట్టణ ప్రాంతంలో మున్సిపల్‌ కమిషనర్‌, కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌ ఉంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement