అచ్చంపేట రూరల్: మండలంలోని సింగారం గ్రామస్తులను కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడద తప్పించేందుకు గ్రామ సర్పంచ్ నీలం శేఖర్ వినూత్న ఆలోచన చేశారు. గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ జగన్‌తో కొండముచ్చు వేషధారణ వేయించి.. గ్రామం నుంచి కోతులను తరిమే ప్రయత్నం చేశారు. వింత వేషధారణ చూసిన కోతులు.. కొంత వరకు ఆందోళనకు గురై చెట్లపైకి పరుగులు పెట్టాయి. కోతులు మైదాన ప్రాంతం, గ్రామాల్లోకి వచ్చి పంటలను నాశనం చేయడంతో పాటు ఇళ్లలో వండిన ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నాయి. కోతుల బెడద నుంచి తప్పించి శాశ్వత పరిష్కరం చూపాలని ప్రజలు కోరుతున్నారు.


