మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సంచార, వియుక్త జాతుల జీవన విధానం, సామాజిక పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర అధ్యయనానికి సంబంధించి ‘సంచార జాతుల సమగ్ర సమాచారం’ అనే పుస్తకాన్ని పీయూలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ సంచార జాతుల జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన ముఖచిత్రాన్ని ప్రతిబించే ఈ పుస్తకం విద్యార్థులకు, అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు సోమేశ్వర్, చంద్రశేఖర్‌రెడ్డి, వేణు, రవీందర్‌రెడ్డి, రాఘవేందర్, నాగరాజు, నిరంజన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


