రాజాపూర్(బాలానగర్): రోడ్డుప్రమాదాల నివారణకు జాతీయ రహదారి పైనున్న గ్రామాల ముఖ్య కూడళల్లో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఆగుతూ.. సాగుతున్నాయి. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.22కోట్ల నిఽ దులు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు 2024సెప్టెంబర్‌లో పనులను ప్రారంభించారు. రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ నత్తనడకన సాగిస్తుండటంతో ప్రతిరోజూ బాలానగర్ మండల కేంద్రంలో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం బాలానగర్ మండల కేంద్రంలో వారాంతపు సంత నిర్వహిస్తుండంతో గ్రామప్రజలు సంతలో కూరగాయలు కొనుగోలు చేయాలన్నా రోడ్డు దాటాల్సిన పరిస్థితి. వంతెన పనులు సాగుతుండటంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారులు, గృహ యజమానులు పనులు పూర్తికాక పోవడంతో వాహనాల ధాటికి దుమ్ము, ధూళీ పడుతుండటంతో ఇంకా ఎన్నిరోజులో ఈ అవస్థలు అంటు ఆవేదన చెందుతున్నారు. ఒక్కోరోజు పెద్దాయపల్లి వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం అవుతోంది. ఇంకా ఎన్ని నెలలు పడుతుందో ఈ పనులు పూర్తికావడానికి అని వాహనదారులు, ప్రజలు ఆపిస్తున్నారు.
కొన(సాగు)తున్న బాలానగర్
ఫ్లైఓవర్ పనులు
మండల కేంద్రంలో
రోడ్డు దాటేందుకు జనం ఇక్కట్లు
రెండేళ్లు కావస్తున్నా పూర్తికాని ఫ్లైఓవర్ నిర్మాణం పనులు


