ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి విపరీతమైన దుమ్ము ధూళీ షాప్‌లోకి వస్తుంది. షాప్‌లో ఉన్న వస్తువులపై దుమ్ము క్లీన్ చేసిచేసి చస్తున్నాం. వినియోగదారులు వస్తువులు కొనుగోలుకు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ఎప్పుడు పూర్తవుతాయో ఇంకా ఎన్నిరోజులు మాకి సమస్యలు.
– కట్ట అనుషా, సూపర్ మార్కెట్
నిర్వాహకురాలు, బాలానగర్
ట్రాఫిక్‌తో ఇబ్బందులు తప్పడంలేదు
ఫ్లైఓవర్ పనులు మొదలయినప్పటి నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు షాద్‌నగర్ వెళ్లాలంటే బ్రిడ్జి పనుల మూలంగా ఇటు పెద్దాయపల్లి చౌరస్తావరకు వాహనాలు నిలుస్తున్నాయి. అటు పోలీస్టేషన్ పెట్రోల్ బంక్ వరకు వాహనాలు ఆగుతున్నాయి. కాంట్రాక్టర్ పనులను త్వరగా పూర్తి చేస్తే బాగుటుంది.
– నవీన్‌రెడ్డి, శేరిగూడ, బాలానగర్
●


