మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌ల వల్ల జాతీయ సమగ్రతను పెంపొందిస్తాయని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటకలోని రాయచూర్‌లో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌ను పీయూ విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ క్యాంపులో విద్యార్థులు పాల్గొనడం గొప్ప విషయం అని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి క్యాంపులో పాల్గొనడం వల్ల పలు అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. జాతీయ ఐక్యత, సహకారం, సామాజిక బాధ్యత.. తదితర అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఇందులో నేర్చుకున్న అంశాల ద్వారా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, లీడర్‌లు సోమ్లా, అధ్యాపకులు భూమయ్య, రవికుమార్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.


