పుణె టూ పాలమూరుకు ఎండు గంజాయి | - | Sakshi
Sakshi News home page

పుణె టూ పాలమూరుకు ఎండు గంజాయి

Mar 13 2026 8:55 AM | Updated on Mar 13 2026 8:55 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: ద్విచక్ర వాహనంలో ఎండు గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని ఎకై ్సజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌ ఎకై ్సజ్‌ సీఐ వీరారెడ్డి, ఎస్‌ఐ సుష్మ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని బోయపల్లి గేట్‌ దగ్గర చేసిన తనిఖీల్లో మహ్మద్‌ఖాన్‌పల్లి తండాకు చెందిన విస్లావత్‌ రమేష్‌ తనకు సంబంధించిన ద్విచక్రవాహనంలో 240గ్రాముల ఎండు గంజాయి తీసుకుని వెళ్తుంటే అదుపులోకి తీసుకోన్నారు. రమేష్‌ నాయక్‌ కొన్ని రోజుల నుంచి పుణేలో నివాససటున్న క్రమంలో ఇటీవల మహబూబ్‌నగర్‌కు వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి గంజాయి తీసుకువచ్చి స్థానికంగా విక్రయాలు చేసినట్లు గుర్తించారు. రమేష్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు గంజాయి, ఒక బైక్‌, ఒక సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసినట్లు సీఐ వీరారెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement