కృష్ణా: ఓ యువకుడి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ముడుమాల్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు వివరాలు.. గ్రామానికి చెందిన గుంటెప్ప కుమారుడు కుర్వ హన్వేశ్ (22) శుక్రవారం తన పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం సమయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి, ఆత్మహత్యకు గల కారణాలను గుర్తించాలని తండ్రి గుంటెప్ప విజ్ఞప్తి చేస్తున్నారు.
యువకుడు
అనుమానాస్పద మృతి
కొల్లాపూర్ రూరల్: మండల పరిధిలోని కుడికిల్లకు చెందిన జుగుట్ట రాంబాబు (30) అనే యువకుడు గ్రామ సమీపంలో ఉన్న కేఎల్‌ఐ ప్రధాన కాలువ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఈ నెల11న వ్యవసాయ పొలానికి వెళ్లొస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకు తిరిగి రాకపోవడంతో రెండు రోజుల నుంచి గా లింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం కేఎల్‌ఐ కాలువ సమీపంలో శవమై కనిపించడంతో మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి మహేశ్వరం కొల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రాంబాబు బైక్ స్నేహితుడు శ్రీకాంత్ దగ్గర దొరకడంతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
లోకిరేవు రోడ్డు
బాధితులకు ఇళ్ల స్థలాలు
జడ్చర్ల: నవాబ్‌పేట మండలం లోకిరేవు రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న బాధితులకు త్వరలోనే ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. త్వరలోనే కలెక్టర్‌తో సమావేశమై సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. అనంతరం 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
బాధిత కటుంబానికి పరామర్శ
బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న ఘటనకు సంబంధించి నాగసాల గ్రామానికి వెళ్లి బాధిత భీమేశ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.50 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ రాజేందర్‌గౌడ్, నాయకులు గోప్లాపూర్ యాదయ్య, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


