కందనూలు: మహనీయుల ఆశయసాధనే బీసీ జాగృతి సేన లక్ష్యమని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్‌లో మహానీయుల నెల సందర్భంగా పూలె, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ .. పేదప్రజల బతుకుల్లో అక్షర జ్యోతి వెలిగించిన పూలె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదివిన తర్వాత గొప్పగా జీవించే అవకాశం ఉన్నా షెడ్యూల్ కులాల ప్రజలతో పాటు దేశ ప్రజలకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కల్పించారన్నారు. కార్యక్రమంలో బీసీ జాగృతిసే రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌చారి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నిరంజన్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.


