కందనూలు: నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, కాలువల ద్వారా నీరందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంట పొలాలకు నీటి కొరత లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా మూడు కిలోమీటర్ల మేర పనులు పూర్తయితే దాదాపు 57 టీఎంసీల నీరు నిల్వ ఉండేదన్నారు. వాటిపై శ్రద్ధ పెట్టకుండా ప్రభుత్వ పెద్దలు అలసత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి నాగర్‌కర్నూల్ జిల్లా సస్యశ్యామలం చేయాలని లేకపోతే ఏడారి అయ్యే ప్రమాదం ఉందని ఆరోపించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ తిమ్మాజీపేట పాండు, నాయకులు అర్థం రవి, తదితరులు పాల్గొన్నారు.


