అంగన్‌వాడీలో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లు చిన్నగా ఉన్నాయి. పిల్లలకు సరైన పోషకాహారం అందాలంటే మంచి సైజు గుడ్లు ఇవ్వాలి. ప్రభుత్వం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గుడ్లు ఇస్తోంది. కానీ, అంగన్‌వాడీకి వచ్చే గుడ్లు చిన్న సైజులో ఉండటంతో పిల్లలకు తగిన పోషకాహారం అందడం లేదు. ఈ విషయంపై అధికారులు దృష్టిపెట్టి నాణ్యమైన గుడ్లు ఇవ్వాలి.
– రాజేశ్వరి, రామచంద్రాపూర్ గ్రామం, మహబూబ్‌నగర్ రూరల్
విచారణ జరిపిస్తాం..
అంగన్‌వాడీలకు 45– 50 గ్రాముల మధ్య గుడ్ల సరఫరా చేయాలి. కోడి గుడ్లలో చిన్నసైజువి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం చిన్న గుడ్ల సరఫరాపై విచారణ చేస్తాం. తక్కువ పరిమాణం ఉన్న గుడ్లు సరఫరా చేస్తే వెంటనే వాటిని ‘వద్దు’ అ నేందుకు టీచర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వెంటనే సూపర్‌వైజర్లపై, అంగన్‌వాడీ టీచర్లపై చర్య లు తీసుకుంటాం. చిన్నగుడ్లు సరఫరా చేసినట్లు తేలితే కాంట్రాక్టర్‌కు నోటీసులిస్తాం.
– జరీనాబేగం, జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి
●


