మిడ్జిల్: మండల కేంద్రానికి చెందిన గూళ్లరాములు, కొత్తూర్‌కు చెందిన జంగాల శ్రీనువాసులకు చెందిన రెండు ట్రాక్టర్లను చోరి చేసిన నిందితులను శుక్రవారం పట్టుకొని రిమాండ్ చేసి జడ్చర్ల కోర్టులో హాజరు పర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున గౌడ్, ఎస్‌ఐ శివనాగేశ్వరనాయుడు చోరీ ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఈనెల, గత నెలలో వ్యవసాయ పొలాల దగ్గర నిలిపిన ట్రాక్టర్లను ఏపీకి చెందిన పల్నాడు జిల్లా రొంపచర్ల మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నందిగాం పాపారావు, చంద్రశేఖర్ రావు కొత్తూర్ గ్రామంలో వరి గడ్డి కట్టలు కట్టేందుకు వచ్చి వాహనాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నిందితుల ఆచూకీ లభ్యం కావడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బాలు, వెంకటేష్, రహీమ్ తదితరులు ఉన్నారు.
రెండు ట్రాక్టర్లు స్వాధీనం


