భారతదేశం వేదభూమి | - | Sakshi
Sakshi News home page

భారతదేశం వేదభూమి

Mar 16 2026 8:43 AM | Updated on Mar 16 2026 8:43 AM

బిజినేపల్లి: వేల ఏళ్లు విదేశీయులు భారతదేశంపై దాడిచేసి పరిపాలించినా, హిందూ సంస్కృతి చెక్కు చెదరలేదని, భారతదేశం వేద భూమి అని భువనేశ్వరి పీఠం పీఠాధిపతి శ్రీకమలానంద భారతిస్వామి అన్నా రు. ఇలాంటి భరత భూమిపై జన్మించడం అంటే ఎన్నో జన్మల పుణ్యం కలిగి ఉండాలన్నారు. ఆదివారం పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతిస్వామి మాట్లాడుతూ.. హిందూ అంటేనే నాగరికత అని, హిందువులు భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తారన్నారు. హిందుత్వం ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. ఆల యాలు కేవలం నిర్మాణాలే కాదని, అవి మన నాగరికతకు ఆత్మ అని నేటి తరానికి మనం గుర్తు చేయాలన్నారు. మనుషులు దుర్గుణా లను వదిలి సన్మార్గంలో నడిచినప్పుడే ఆధ్యాత్మికత పెంపోందు తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు జున్న శేఖర్‌రెడ్డి, జగదీష్‌, డా.గోపాల్‌, జాకీర్‌హుస్సేన్‌, విష్ణుమూర్తి, గాడి శశికల, సురేందర్‌, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement