స్టేషన్ మహబూబ్‌నగర్: గ్రామస్థాయి నుంచి రాజకీయం, పరిపాలన వ్యవస్థలో ఓబీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో శనివారం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు అనిల్ జైహింద్ ఆధ్వర్యంలో ఓబీసీ సముదాయాల సమస్యలపై కీలక సమావేశం జరిగింది. తెలంగాణలో ఓబీసీ సముదాయాల ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు జరిగిన పురోగతి, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలపై ఈ సమావేశంలో విస్త్రతంగా చర్చ నిర్వహించారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో సంజీవ్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ ఆలోచనా విధానం మేరకు బడుగు, బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేద్దామని అన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో ఓబీసీ సెల్ ఇన్‌చార్జీ రద్ర సంతోష్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


