రాజాపూర్: క్షనికావేశంలో పురుగుల మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందిన ఘటన మండలంలోని నర్సింగ్‌తండాలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. తండాకు చెందిన జఠావత్‌శ్రీను(55)తండాలో ఇంటి పక్కన బాత్‌రూం గుంతల నిర్మాణం స్థలాల విషయమై అదేతండాకు చెందిన రవీందర్ భార్య అంజమ్మ, శ్రీను పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటుండగా.. గొడవ పెట్టుకున్నారు. మనస్తాపానికి గురైన శ్రీను పొలం వద్దకు వెళ్లి ఈనెల 5వ తేదీన పురుగులమందు తాగి ఇంటివచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించగా శనివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు.
రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు..
బైక్‌పై వెళ్తున్న యువకుడిని బొలేరో ఢీకొన్న ఘటనలో గాయాలపాలైన యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. ఖానాపూర్‌కు చెందిన శ్రీశైలం(19) తల్లిదండ్రులు కృష్ణయ్య, లావణ్యతో కలిసి బైక్‌పై అమ్మమ్మ గ్రామమైన ధర్‌పల్లిలో శుక్రవారం వెళ్లాడు. కందూరు పండుగలో పాల్గొని తిరుగుప్రయాణంలో తల్లిదండ్రులను అక్కడే ఉంచి స్వగ్రామానికి వస్తుండగా ఖానాపూర్ నుంచి ఓ బొలేరో డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొన్నాడు. తీవ్రగాయాలపాలైన శ్రీశైలంను స్థానికులు 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి
కందనూలు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దముద్దునూరులో శుక్రవారం రాత్రి జరగగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు.. ప్రకారం పెద్ద గ్రామానికి చెందిన భాస్కర్ (57) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. బుధవారం రాత్రి కిరాణం దుకాణానికి వెళ్లి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


