బీడీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ చిన్నచింతకుంటలో భారీ ప్రదర్శన నిర్వహించి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు వేతన పెంపు డిమాండ్ నోటీసులు అందించాం. వెయ్యి బీడీల తయారీకి రూ.400 చెల్లించాలని కోరాం. దీంతోపాటు పీఎఫ్, ఈపీఎఫ్ ప్రతి కార్మికుడికి వర్తింపచేజేయాని విన్నవించాం.
– రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు,
ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం, అమరచింత
నెలలో 20 పనిదినాలు ఉండగా.. 15 వేల బీడీలు తయారు చేస్తున్నాం. కుటుంబ పోషణ బీడీల తయారీపైనే ఆధారపడింది. వెయ్యి బీడీల తయారీకి రూ.290 చెల్లిస్తున్నారు. కూలి సరిపోక పోషణ భారంగా మారింది. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. అందుకు అనుగుణంగా రూ.400 చెల్లిస్తే బాగుంటుంది.
– సులోచనమ్మ,
బీడీ కార్మికురాలు, అమరచింత
చాలీచాలని కూలితో ఇబ్బందులు పడుతున్నా ం. యాజమాన్యం వెంటనే ధరలు పెంచాలి. అలాగే జరిమానాను పూర్తిగా రద్దు చేయాలి. పొద్దంతా కూర్చొని తయారుచేసిన వెయ్యి బీ డీలకు రూ.400 చెల్లించాలి. లేనిపక్షంలో కార్మిక సంఘంతో కలిసి ఆందోళన చేపడతాం.
– సరోజ, బీడీ కార్మికురాలు, మస్తీపురం
●


