‘ఐకానిక్‌ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఐకానిక్‌ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి’

Mar 9 2026 7:11 AM | Updated on Mar 9 2026 7:11 AM

కొల్లాపూర్‌: 167కే జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా మల్లేశ్వరం– సంగమేశ్వరం ప్రాంతాల మధ్య కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఎన్‌హెచ్‌ అధికారులను బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు కోరారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో నేషనల్‌ హైవే అధారిటీ రాష్ట్ర అధికారి ఆదిత్యను కలిశారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల గురించి చర్చించారు. అటవీ, రెవన్యూ శాఖల నుంచి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వంతెన నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ చివరి దశలో ఉందని, అప్పటిలోగా వంతెనకు అటాచ్‌మెంట్‌ రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరినట్లు సుధాకర్‌రావు తెలిపారు. వంతెన నిర్మాణం గూర్చి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని ఇప్పటికే పలుమార్లు కలిశామని, మరోసారి కలిసి పనులు వేగంగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement