● మంత్రిని విన్నవించిన ఎమ్మెల్యే జీఎంఆర్
దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గంలో రైతులకు సంబంధించి పలు అబివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును సోమవారం కలిసి చర్చించారు. హైదరాబాద్‌లోని మంత్రి చాంబర్‌లో ఎమ్మెల్యే కలిసి కౌకుంట్ల మండలకేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో రైతులకు సహకారం అందించేందుకు కొత్తగా ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు. పేరూర్, చౌదర్‌పల్లి గ్రామాలలో వ్యవసాయశాఖ సేవలు రైతులకు దగ్గరగా ఉండేలా కొత్తగా ఏఈఓ క్లస్టర్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. దేవరకద్ర, కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రాలలో వ్యవసాయ శాఖకు చెందిన ఏడీఏ కార్యాలయాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
● నూతనంగా ఎన్నికై న రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని సోమవారం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.


