2027 డిసెంబర్ వరకు..
● తొలి విడతలో
రూ.1,400 కోట్లు
మంజూరు..
స్టేజీ–1 పనులు షురూ
● కాట్రేవులపల్లి వద్ద
అప్రోచ్ చానల్,
పంప్‌హౌస్ పనులు ముమ్మరం
● మొత్తంగా లక్ష
ఎకరాలకు సాగునీరు..
ప్రాజెక్ట్ వెంట గ్రీన్‌బెల్ట్
● 56 హెక్టార్లలో
మొక్కల పెంపకం..
రైతాంగంలో
హర్షాతిరేకాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి ఇటీవలే తొలి విడత నిధులు మంజూరు కాగా.. పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక భారం పడకుండా ఇదివరకే అనుకూలంగా ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతోపాటు ప్రాజెక్ట్ వెంట గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు.
రిజర్వాయర్ల
సామర్థ్యం:
4 టీఎంసీలు
మొత్తం విడతలు :
3
మంజూరైనవి : రూ.1,400 కోట్లు
వ్యయం : రూ.2,945 కోట్లు
కొడంగల్ పనులు ప్రారంభమయ్యాయి. స్టేజీ–1 కింద మక్తల్ మండలంలోని కాట్రేవులపల్లి నుంచి ఊట్కూర్ వరకు, స్టేజీ–2 కింద ఊట్కూర్ మండలంలోని బాపూర్ నుంచి కానుకుర్తి వరకు పనులను డిసెంబర్ 2027 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 2 ప్యాకేజీలకు సంబంధించి రూ.2,945 కోట్లతో భూసేకరణ, కాల్వ, పంప్ హౌస్‌లు, రిజర్వాయర్ల పనులు రాఘవ, మెగా కన్‌స్ట్రక్షన్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. – శ్రీధర్,
ఎస్‌ఈ, ఇరిగేషన్, మహబూబ్‌నగర్


