వచ్చే వారం సంగమేశ్వరుడికి తొలిపూజలు | - | Sakshi
Sakshi News home page

వచ్చే వారం సంగమేశ్వరుడికి తొలిపూజలు

Mar 17 2026 8:35 AM | Updated on Mar 17 2026 8:35 AM

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని సోమశిల గ్రామ సమీపంలో కృష్ణానది అవతలి ఒడ్డున నదిలో ఉన్న ప్రాచీన సంగమేశ్వర దేవాలయం కృష్ణమ్మ ఒడి నుంచి బయట పడుతుంది. సోమవారం ఆలయం దాదాపుగా సగం భాగం వరకు దర్శనమిచ్చింది. శ్రీశైలం జలాశయం నీటిమటం 843.70 అడుగులకు చేరడంలో ఆలయ ప్రహరీ భాగం కింది వరకు నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో ఆలయ ముఖద్వారం దర్శనమిచ్చింది. మరో ఐదు అడుగులు నీరు తగ్గితే ఆలయం పూర్తిగా బయట పడుతుందని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. రానున్న సోమవారం ప్రాచీన సంగమేశ్వరుడికి తొలి పూజలు ప్రారంభమవనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement