అలంపూర్: వ్యవసాయం... వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా నేల స్వభావం, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. విత్తనం వేసే సమయం నుంచి పంట చేతికి వచ్చే వరకు వాతవరణ ప్రభావం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అతివృష్టి లేక అనావృష్టి ఏది సంభవించినా పంటలకు తీవ్ర నష్టం తప్పదని ఏడీఏ సక్రియ నాయక్ వివరిస్తున్నారు. వీటిని ముందుగా తెలుసుకోగలిగితే కొంత వరకై నా నష్టాల బారి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. తుఫాను సమయం మబ్బులు, తేమ వాతావరణం, ఉష్ణోగ్రతలు తగ్గడం వంటివి బూజు తెగుళ్ల ఉధృతికి తోడ్పతాయని, వాతావరణం పొడిగా ఉంటే ఆకుముడత, రసం పీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇటువంటప్పుడు వ్యవసాయాధికారుల సూచనలతో పంటను కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు.
పాడి–పంట


