ఓపెన్‌ స్కూల్‌తో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌తో ఉజ్వల భవిష్యత్‌

Mar 16 2026 8:43 AM | Updated on Mar 16 2026 8:43 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని యూనివర్సిటీ ఈఎంఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ రబీంద్రనాథ్‌ సోలమాన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో ఆదివారం టీసీఎస్‌ ఐయాన్‌ జాబ్‌ అచీవర్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు టీసీఎస్‌ సహకారంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులను కార్పొరేట్‌ కంపెనీలకు అనుగుణంగా తయారు చేస్తామని.. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌ సర్వీస్‌ వింగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మూడేళ్ల డిగ్రీ పూర్తయ్యేలోగా కమ్యూనికేన్‌ స్కిల్స్‌, పలు అంశాలపై అవగాహన పెంచుతామన్నారు. వియ్‌ హబ్‌, రాస్కీ, రామానంద తీర్థ ఇనిసిట్యూషన్స్‌ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. విద్యార్థులు వాటిని అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నారు. అనంతరం బ్రోచర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్‌ అధికారి వేణుగోపాల్‌రెడ్డి, నిరంజన్‌గౌడ్‌, రాఘవేందర్‌రెడ్డి, హన్మంతు, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement