కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఆత్మహత్య

Mar 16 2026 8:43 AM | Updated on Mar 16 2026 8:43 AM

నాగర్‌కర్నూల్‌ క్రైం: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలులో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోవర్దన్‌ తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన జరుపటి ఖాజా (39) మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య శనివారం ఉదయం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఖాజా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కూలి పనులకు పిలిచేందుకు ఓ వ్యక్తి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ట్రాక్టర్‌, ద్విచక్రవాహనం ఢీ.. యువకుడి మృతి

నాగర్‌కర్నూల్‌క్రైం : ట్రాక్టర్‌, ద్విచక్రవాహనం ఢీ కొట్టుకోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండల పరిధిలోని వనపట్ల గేటు సమీపంలో ఆదివారం చో టుచేసుకుంది. ఎస్‌ఐ గోవర్దన్‌ తెలిపిన వివరా ల ప్రకారం లింగాల మండలం కేసితండాకు చెందిన శ్రీఽశైలం (25), బాలరాజులు సొంత అన్నదమ్ములు. ఇద్దరు హైదరాబాద్‌లో లేబర్‌ కాంట్రాక్టు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరు కలిసి బైక్‌పై స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ ఢీకొనడంతో శ్రీశైలానికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా ,బాలరాజును హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కు టుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

దైవ దర్శనం

ముగించుకొని వెళ్తూ..

జడ్చర్ల: మండలంలోని గంగాపూర్‌ శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామిని దర్శించుకొని, తిరిగి వెళ్తున్న క్రమంలో గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బంధువుల కథనం మేరకు.. కోయిలకొండ మండలంలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన బొంతల చంద్రమ్మ (27) కుటుంబ సభ్యులతో కలిసి శనివారం గంగాపూర్‌లోని ఆలయానికి చేరుకున్నారు. అక్కడే నిద్ర చేసిన వారు ఆదివారం ఉదయం స్వామి దర్శనం చేసుకొని, తిరిగి ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో వైద్య చికిత్స కోసం జడ్చర్ల ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చంద్రమ్మ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

బిజినేపల్లి: మండలంలోని వట్టెంకు చెందిన వ్యక్తి ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాంచంద్రయ్యరాంచంద్రయ్య (62) హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో పూల దుకాణం నిర్వహిస్తున్నాడు. వట్టెం జాతర ఉత్సవాల సందర్భంగా నాలుగురోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం వట్టెం నుంచి బిజినేపల్లి వైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. అటుగా వెళ్లిన కొందరు గమనించగా.. రాంచంద్రయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాంచంద్రయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు.

మనస్తాపంతో

మహిళ ఆత్మహత్య

జడ్చర్ల: కుటంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని బోయలకుంటకు చెందిన యాదమ్మ (42) మూడు రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె ఉరి వేసుకొనిఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.వెంటనే గమనించిన ఆమె కు మార్తె స్వాతి వైద్య చికిత్స కోసం యాదమ్మను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..అప్పటి కే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఆ స్పత్రికి వచ్చిన మంత్రి శ్రీహరి మృతురాలి కు మార్తె స్వాతిని ఓదార్చి,అండగా ఉంటామ ని భ రోసానిచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కృష్ణా బ్రిడ్జి సమీపంలో మృతదేహం లభ్యం

కృష్ణా: మండలంలోని కృష్ణా బ్రిడ్జి సమీపంలో ఓ మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పో లీసులు వచ్చి విచారణ చేపట్టారు. ఈ క్ర మంలో రెండు రోజుల క్రితం మాగనూర్‌లో స్పృహ కోల్పోయి పడిన నల్లెనాగప్ప(45)గా గుర్తించి జక్లేర్‌లో ఉంటున్న ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తమ్ముడు నల్లె కుర్మయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నవీద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement