వనపర్తి రూరల్: మహిళా ఉపాధ్యాయురాలు ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ–2 శశిధర్ తెలిపిన వివరాలు.. న్యూటౌన్ కాలనీకి చెందిన రాకాసి శ్రీదేవి(45) చిన్నంబావి మండలం వెల్గొండ జిల్లా ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయురాలిగి పని చేస్తుంది. కొంత కాలం నుంచి మానసిక వ్యాధిలో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పిల్లలతో బయటికి వెళ్లిన భర్త సత్యనారాయణరెడ్డి ఇంటికి వచ్చి చూడగా ఫ్యానుకు వేలాడుతుండటం చూ సి తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి బాలీశ్వరమ్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


