అలంపూర్: పురుగు మందులోని విష తీవ్రతలలో తేడాలు ఉన్నప్పటికి పురుగు మందులు అన్నీ నిస్సందేహంగా విష పదార్థాలని గ్రహించాలి. అవి తయారయ్యే కర్మాగాలలో, నిల్వ ఉండే గిడ్డంగిల్లో, రైతు పైరుపై చల్లే సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటితో అతి జాగ్రత్తగా వ్యవహరించాలని ఏడీఏ సక్రియ నాయక్ సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకున్న కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా పురుగు మందుల విష ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో లక్షణాలను గుర్తించి సత్వరమే ప్రథమ చికిత్స అందించాలని ఏడీఏ పేర్కొంటున్నారు. పు రుగు మందులు మానవ శరీరంలోకి మూడు విధా లుగా చేరడానికి ఆస్కారం ఉందని వివరిస్తున్నారు.
చర్మం ద్వారా..
శరీరంపై పురుగు మందులు పడినప్పుడు చర్మం ద్వారా విషపదార్థం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నప్పుడు మరింత సులభంగా, త్వరగా శరీరంలోకి ప్రశేశించి నష్టం కలిగిస్తుంది.
ముక్కు ద్వారా..
పురుగు మందుల ద్వారా వెలువడే వాయువులు, ధూళీ అణువులను పీల్చడం వల్ల శరీరంలోకి విష పదార్థాం ప్రవేశించి హాని కలిగిస్తుంది.
నోటి ద్వారా..
పురుగు మందులను ముట్టుకున్నప్పుడు లేదా వాడిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహార పదార్థాలు తీసుకుంటే పురుగు మందుల అవశేషాలు మన శరీరంతోకి ప్రవేశిస్తాయి. అలాగే కలుషిత ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా పురుగు మందులు లోపలికి వెళ్లి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. ఒక్కొక్కసారి మరణం సంభవిస్తుంది.
పాడి–పంట


