జడ్చర్ల: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఆర్‌పీఎఫ్ ఎస్ రాజు వివరాల ప్రకారం జడ్చర్ల రైల్వే స్టేషన్ పరిధిలో ఉదయం గుర్తుతెలియని మహిళ(48) ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతిచెందింది. రైలులో ప్రయాణిస్తూ కాలుజారి కిందపడిందా లేదా పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
వెల్దండ: మండలంలోని కొట్ర రెవెన్యూ శివారులో జాతీయ రహదారి సమీపంలోని వ్యవపాయం పొలంలో బుధవారం రాత్రి ఎరుకలి బాలకృష్ణ (27) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న మహీంద్రాథార్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లికి చెందిన బాలకృష్ణపై ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రమాదానికి కారణమైన బాలకృష్ణ పరారీలో ఉండడంతో పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో గురువారం కొట్ర రెవెన్యూ శివారులోని వ్యవసాయ పొలంలో యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడిని బాలకృష్ణగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆదిబట్ల పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇంట్లో వారితో
గొడపవడి..
కృష్ణా: కుటుంబ కలహాలతో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీద్ తెలిపిన వివరాల ప్రకారం.. రంజిత్ వైద్యనాథ్ (20) మండల పరిధిలోని హిందూపూర్ గ్రామ సమీపంలో గల ఇటుక బట్టిలో పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాడుగా ఉండేవాడు. అయితే బుధవారం రాత్రి మద్యం తాగి ఇంట్లో వారితో గొడవ పడి అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై మృతుడు తండ్రి వైద్యనాథ్ శ్రీపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
చారకొండ: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వీరబాబు కథనం మేరకు.. మండలంలోని సారంబండతండాకు చెందిన వడ్త్యావత్ హరికృష్ణ నాయక్ (29) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హరికృష్ణ ఏడేళ్ల క్రితం భారతితో వివాహం కాగా.. వారికి ఇద్దరు పిల్లలు పుట్టి పురిటిలోనే చనిపోయారు. దీంతో కుటుంబంలో సమస్యలు రావడంతో భార్య ఇటీవల తల్లిగారింటికి వెళ్లడంతో ఒంటరితనం అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం తల్లిదండ్రులు వచ్చేసరికి విగతజీవిగా మారాడు. విషయంపై సమాచారం అందుకున్న చారకొండ ఎస్‌ఐ వీరబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి దస్రునాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


