మక్తల్: మక్తల్ మండలం భూత్పూర్, మాగనూర్ మండంలోని నేరడుగోమ్ గ్రామస్తులకు పునరావాసం క ల్పించాలని రెండు గ్రామాలకు చెందిన బాధితులు మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లో జల సాధన సమీక్ష సమావేశంలో భాగంగా మంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు పునరావాస బాధితులు తెలిపారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ ఎంపీటీసీ కుర్మయ్యగౌడ్, రాఘవేందర్‌రెడ్డి, చెన్నయ్యగౌడ్, అశోక్‌గౌడ్, బీంసేన్‌రావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


