ఇలా చేస్తే ఆదా..
ప్రతిఇంట్లో ప్రస్తుతం ఎల్‌ఈడీ బల్బులనే వినియోగిస్తున్నారు. ఇప్పటికీ కొందరు ఫ్లోర్‌సెంట్ ట్యూబ్‌లైట్లు వాడుతున్నారు. వీటి సామర్థ్యం 40వాట్లు ఉండడంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిదృష్ట్యా ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు మేలు.
● ఏసీలను 24నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే చల్లదనంతోపాటు బిల్లు ఆదా అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇన్వర్టర్‌తో నడిచే ఏసీలు లభిస్తున్నాయి. గది చల్లబడగానే ఆటోమేటిక్‌గా ఏసీ నిలిచిపోతుంది. వీటితో కొంత విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. సాధారణ ఏసీలు కరెంటు పోయి వచ్చినప్పుడు పునఃప్రారంభమయ్యే సమయంలో లోడ్ పెరుగుతుంది. ఇది విద్యుత్ సరఫరా వ్యవస్థపై భారం పడుతుంది.
● సీజన్ మేరకు ఫ్రీజర్‌లో దశలు మారుస్తూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచినా మిగిలిన కాలాల్లో తగ్గించుకోవాలి.
● ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్‌ఈడీ బల్బులు, రిఫ్రిజరేటర్లు తదితర విద్యుత్ గృహోపకరణాలు 5స్టార్ ఉంటేనే విద్యుత్ వినియోగం తగ్గి బిల్లు ఆదా అవుతుంది.
● కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు అవసరం లేని సమయంలో స్విచ్చాఫ్ చేయాలి. ఫోన్‌చార్జింగ్ పూర్తయ్యాక చార్జర్‌ను ప్లగ్ నుంచి తొలగించాలి.
కల్వకుర్తి టౌన్: వేసవి నేపథ్యంలో ప్రజలు ఎండ వేడికి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపం నుంచి రక్షించుకోవడానికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతుండటంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ప్రభు త్వం తెల్లరేషన్ కార్డు దారులకు ప్రతినెలా గృహజ్యోతి కింద నెలకు 200యూనిట్లలోపు జీరో బిల్లులు జారీచేస్తున్నారు. అయితే విద్యుత్‌ను విచ్చలవిడిగా వాడితే ఈ పథకం వర్తించకుండా పోయే ప్రమాదం ఉంది. 200 యూనిట్లకు ఒక్క యూనిట్ అదనంగా వచ్చినా బిల్లు కట్టాల్సిందే. ఒకవైపు వేసవి తాపం, మరోవైపు విద్యుత్ బిల్లుల భారంతో ఒకటి కావాలంటే మరొకటి వదుకోవాల్సిన పరిస్థితి. దీనినుంచి గట్టెక్కాలంటే విద్యుత్‌ను పొదుపు చేసుకోవటమే మార్గం. ఉపకరణాలను పూర్తిగా కట్టేయాల్సిన అవసరం లేకుండా విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే నిరంతరాయంగా గృహజ్యోతిని వెలిగించవచ్చు.
పొదుపుగా వాడుకోవాలి
వేసవి కాలంలో విద్యుత్ పొదుపుగా వాడుకుంటేనే గృహజ్యోతి పథకాన్ని పొందేందుకు సులువుగా ఉంటుంది. అంచనాలు లేకుండా వాడే విద్యుత్‌తో 200యూనిట్లు దాటితే విద్యుత్ బిల్లు పూర్తిగా చెల్లించాల్సి వస్తుంది. బిల్లుల భారం నుంచి గట్టెక్కాలంటే విద్యుత్ పొదుపుగా వాడటమే ఏకై కమార్గం.
– నర్సింహారెడ్డి, ఎస్‌ఈ, నాగర్‌కర్నూల్
వేసవిలో విద్యుత్‌ను ఆదా చేస్తేనే ‘గృహజ్యోతి’
200 యూనిట్లు దాటితే వర్తించని పథకం
చిట్కాలు పాటిస్తే బిల్లుల భారం తగ్గే అవకాశం


