మహిళలకు అన్ని ఇబ్బందులే.. | - | Sakshi
Sakshi News home page

మహిళలకు అన్ని ఇబ్బందులే..

Mar 12 2026 8:41 AM | Updated on Mar 12 2026 8:41 AM

బస్టాండ్‌లోకి బస్సులు రాకపోకలు లేక ఆర్వోబీ పక్కనే రోడ్డుపైనే బస్సులు ఆపుతున్నారు. గ్రామాలకు వెళ్లే బస్సుల కోసం రోడ్డుపైనే ఎదురుచూడాల్సి వస్తోంది. సరైన నీడ లేక ఎండలో నిలబడుతున్నాం. కనీసం కూర్చోడానికి కూడా జాగా లేదు. తాగడానికి నీళ్లు లేవు, మూత్రశాలలు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి. –రాములమ్మ, అప్పంపల్లి,

చిన్నచింతకుంట మండలం

రోడ్డుపైన

నిలబడలేక..

దేవరకద్ర బస్టాండ్‌ మూతపడడంతో బస్సుల కోసం రోడ్డుపైనే ఎదురు చూడాల్సి వస్తోంది. కనీస నీడ సౌకర్యం కూడా లేకపోవడంతో ఎండలో వేసిన బెంచీలపై కూర్చోవాల్సిన దుస్థితి ఉంది. దాహం తీర్చుకోవడానికి తాగునీరు కూడా దొరకడం లేదు. పిల్లలతో వచ్చే ఆడవారు చాలా ఇబ్బందులు పడతున్నారు. నీడను కల్పించడానికి తాత్కాలికంగా షెడ్డు వేసి సౌకర్యాలు కల్పించాలి.

–మణెమ్మ, వెంకంపల్లి, కౌకుంట్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement