దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో రెండేళ్లుగా ఆర్టీసీ బస్సులు, కర్ణాటక బస్సులను ఆర్వోబీకి రెండు వైపుల రోడ్లపైనే నిలుపుతున్నారు. దీనివల్ల మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రయాణికులు, విద్యార్థులు సైతం రోడ్లపై నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన దుస్థితి. ఇక ఆర్టీసీ వారు కనీసం తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వానలో తడుస్తూ, ఎండలో నిలబడి ఇబ్బందులు పడుతూ బస్సులను ఎక్కాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.


