మాగనూర్: మండల పరిధిలోని వడ్వాట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు వెట్టిచాకిరీ చేయిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు వారితో తరగతి గదులను, పరిసరాలను ఊడిపించడంతో పాటు ఇతర పనులు కూడా చేయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. విద్యార్థులతో పనులు చేయించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించిన ఉపాధ్యాయులపై ఉన్నతా ధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


