అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అన్ని విధాలుగా ఆధునీకరించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా స్టేషన్ ముఖద్వారాలు, ప్రణాళికబద్ధమైన పార్కింగ్, పాదచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలతోపాటు ఆహ్లాదకరమైన అనుభూతి కోసం సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. పార్కింగ్, రైల్వే బుకింగ్ సౌకర్యం గదులు నిర్మాణం చేయనున్నారు. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రయాణికులు వివిధ ప్లాట్‌ఫాంలో దిగేందుకు వీలుగా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారం ముఖచిత్రం పూర్తిస్థాయిలో నవీకరణ, సుందరీకరణ చేయనున్నారు. రైల్వేస్టేషన్‌లో అనసవర నిర్మాణాలు తొలగించి సర్క్యులేటింగ్ ప్రాంతం, అప్‌గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలాలు, దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల సదుపాయాలు కల్పించనున్నారు.
అమృత్ భారత్ స్కీంకు ఎంపికై న శ్రీజోగుళాంబ రైల్వేస్టేషన్


