హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై దృష్టి ఏది? | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై దృష్టి ఏది?

Mar 16 2026 8:40 AM | Updated on Mar 16 2026 8:40 AM

ఆరు రోజుల్లో 322 మంది

బాలికలకు టీకాలు

పాలమూరు: జిల్లాలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు ఇస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. బాలికల తల్లిదండ్రులు వారి పిల్లలకు టీకాలు వేయించడంపై ఆసక్తి చూపడం లేదా.. లేక ఆరోగ్య శాఖ అధికారులు ప్రచారం చేయడంలో వెనుకబడ్డారా.. అనేది అంతుచిక్కడం లేదు. క్షేత్రస్థాయిలో అర్హులైన బాలికలను గుర్తించి కౌన్సిలింగ్‌ కల్పించి టీకాలు తీసుకునే విధంగా చైతన్యం కల్పించడంలో ఆరోగ్యశాఖ సిబ్బంది పూర్తిగా విఫలం అవుతున్నారు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మొదటి నెలరోజులపాటు జనరల్‌ ఆస్పత్రితోపాటు జడ్చర్ల ఆస్పత్రిలో టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 322 మంది బాలికలకు టీకాలు ఇస్తే ఇందులో మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో 154, జడ్చర్లలో 168మందికి ఇచ్చారు.

జిల్లాలోని ఆయా ఆస్పత్రుల్లో

బాలికలకు టీకాల పంపిణీ ఇలా..

తేదీ మ.నగర్‌ జడ్చర్ల

08.3.2026 21 35

09.3.2026 07 06

10.3.2026 34 44

11.3.2026 13 34

12.3.2026 36 25

13.3.2026 28 6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement