సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

Mar 16 2026 8:43 AM | Updated on Mar 16 2026 8:43 AM

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం గుడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో నీటిని పూర్తిస్థాయిలో నింపి రైతులకు సకాలంలో నీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పని చేస్తున్నాయని, మిగిలిన రెండు మోటార్లు కూడా ప్రారంభించాలని సూచించారు. కాల్వ వెడల్పు పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇంజినీర్లు, రాజకీయ నాయకులు కక్కుర్తి వల్ల ప్రాజెక్టు పరిస్థితి దెబ్బతిందని ఆరోపించారు. సాగునీటి మంత్రి పర్యటనలు కేవలం చుట్టపు చూపులు గానే మిగిలిపోతున్నాయని వాఖ్యానించారు. గుడిపల్లి కట్టపై ముళ్లపొదలు, చెట్లు పెరగడం వల్ల ప్రమాదం పొంచి ఉందని అందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు శశిధర్‌రెడ్డి, రవి, బాలగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement