హెచ్‌సీఏ కార్యదర్శిగా మన్నె జీవన్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ కార్యదర్శిగా మన్నె జీవన్‌రెడ్డి

Mar 11 2026 8:04 AM | Updated on Mar 11 2026 8:04 AM

నవాబుపేట: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా మండలంలోని గురుకుంట గ్రామానికి చెందిన మన్నె జీవన్‌రెడ్డి మంగళవారం నియమితులయ్యారు. ఈయన గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. కాగా ఎంఎస్‌ఎన్‌ ఫార్మ అధినేతగా ఉన్న ఆయన తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో చురుకై న పాత్ర పోషిస్తున్న తరుణంలో అసోసియేషన్‌కు ఎంపిక కావడం విశేషం. ఈయన ఎంపిక పట్ల ఎంజేఆర్‌ యువసేన సభ్యులు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మన్నె జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో హెచ్‌సీఏ మరింత బలోపేతం అవుతుందని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు మొదటిసారిగా హెచ్‌సీఏ కార్యదర్శి పదవి రావడంతో క్రీడాకారులు అభినందనలు తెలిపారు.

టీ స్టాల్‌లో నగదు చోరీ

గద్వాల క్రైం: ఓ టీస్టాల్‌లో గుర్తు తెలియని దుండగులు చొరబడి నగదు అపహరించిన ఘటన సోమవారం అర్థారాత్రి చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన ఆనంద్‌ స్నేహితులతో కలసి అనంతపురం స్టేజీ రోడ్డుమార్గంలో టీ బ్రేక్‌ పేరుతో టీ స్టాల్‌ను నిర్వహిస్తున్నాడు. రాత్రి కావడంతో టీ స్టాల్‌కు తాళం వేసి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అర్థారాత్రి గుర్తు తెలియని దుండగులు తాళం ధ్వంసం చేసి క్యాష్‌ కౌంటర్‌లో భద్రపరిచిన రూ.21వేల నగదును అపహరించారు. మంగళవారం ఉదయం నిర్వాహకులు టీ స్టాల్‌ను తెరిచేందుకు రాగా.. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. చోరీ ఘటనలో గుర్తు తెలియని ట్రాన్స్‌జెండర్‌ ఉన్నట్లు నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement