తొలి రోజు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

తొలి రోజు ప్రశాంతం

Mar 15 2026 5:56 AM | Updated on Mar 15 2026 5:56 AM

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

13,188 మంది విద్యార్థులు హాజరు.. 23 మంది గైర్హాజరు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం తెలుగు పరీక్ష జరిగింది. ఉదయం 8 గంటలకే విద్యార్థులు, తల్లిదండ్రుల కోలాహలంతో పరీక్ష కేంద్రాలు సందడిగా మారాయి. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. 9 గంటలకే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మొత్తం 60 పరీక్ష కేంద్రాల్లో 13,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 13,188 మంది హాజరయ్యారు. మిగిలిన 23 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా ఓ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ 8 కేంద్రాలు, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ నాలుగు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పది కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement