విద్యార్థులు చట్టాల గురించి తెలుసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు చట్టాల గురించి తెలుసుకోవాలి

Mar 7 2026 9:22 AM | Updated on Mar 7 2026 9:22 AM

పాలమూరు: మహిళల భద్రత, హక్కులపై చట్టపరంగా పొందే సహాయంపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. శుక్రవారం నగరంలోని ధన్వంతరి ఫార్మా కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పోక్సో, డొమెస్టిక్‌ వైలెన్స్‌తో పాటు చట్టాల్లో ఉండే హక్కులు, రక్షణ చర్యలు, శిక్షలపై సమగ్ర అవగాహన కల్పించారు. సివిల్‌, క్రిమినల్‌ చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ యశోద, రాజు, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement