జడ్చర్ల: స్థానిక పురపాలిక కార్యాలయ భవనాన్ని శుక్రవారం రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రారంభించారు. దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఈ భవనాన్ని నిర్మించారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకమండలి సభ్యులకు, సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తన సొంత ఖర్చుతో దుస్తువులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, వైస్ చైర్‌పర్సన్ సారిక, కమిషనర్ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, నందకిషోర్, చైతన్య, చౌహాన్, రాజు, శ్రావణి, నవనీత, మహేశ్, సతీష్, ఉమాగౌడ్, జ్యోతి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


