రాజాపూర్: లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామానికి చెందిన నరేష్(31) షాద్‌నగర్ శివారులోని ఎంఎస్‌ఎన్ ఫార్మాలో పనిచేస్తున్నారు. రోజు మాదిరిగా బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరాడు. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ లారీ రాజాపూర్ మండల శివారులో బైక్‌ను వెనక నుంచి ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సుభధ్ర, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.


