జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కేంద్రం ప్రభుత్వం విద్యుత్ శాఖను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తుందని, ఉద్యోగులు ఏకమై ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని కాపాడుకుందామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ స్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు–2025కు వ్యతిరేకంగా మంగళవారం విద్యుత్ భవన్ ఎదుట భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాల్లో 29 రకాల ప్రయోజనాలు ఉన్నాయని, కేంద్రం తెస్తున్న కొత్త చట్టం వల్ల ఆ ప్రయోజనాలు పోతాయన్నారు. విద్యుత్ కార్మికులకు నష్టం కలిగించే చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం కాకుండా ప్రతి ఒక్క ఉద్యోగి నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు, డీఈ మోహనకృష్ణ, సోమశేఖర్ బాబ్య, విజయ్, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.


