పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు

Mar 11 2026 8:04 AM | Updated on Mar 11 2026 8:04 AM

మహమ్మదాబాద్‌: మండలంలోని నంచర్ల ప్రాథమిక పాఠశాల తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. నంచర్లలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఉదయం 2వ తరగతి విద్యార్థులు ఎప్పటిలాగే వచ్చి తమ గదిలో చదువుకుంటూ కూర్చున్నారు. ఒక్కసారిగా పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడటంతో మిగతా వారంతో బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ పాఠశాలను సందర్శించి ఘటనపై ఆరా తీశారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించి.. పాఠశాలకు మరమ్మతు చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement