వ్యాక్సినేషన్‌కు కనిపించని ఆదరణ | - | Sakshi
Sakshi News home page

వ్యాక్సినేషన్‌కు కనిపించని ఆదరణ

Mar 11 2026 8:54 AM | Updated on Mar 11 2026 8:54 AM

రెండో రోజు 13 మందికి హెచ్‌పీవీ టీకాలు

పాలమూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు అంతగా ఆదరణ లభించడం లేదు. 14 ఏళ్లు నిండిన బాలికల సంబంధించిన తల్లిదండ్రుల నుంచి స్పందన రాకపోవడంతో వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతుంది. రెండో రోజు సోమవారం జనరల్‌ ఆస్పత్రిలో ఏడుగురికి, జడ్చర్లలో ఆరుగురికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే స్వచ్ఛందంగా వచ్చిన వారికే టీకాలు ఇస్తున్నారు. ఇప్పుడు నమోదవుతున్న లెక్కలు చూస్తుంటే ఏడాది గడిచిన జిల్లాలో ఉన్న లక్ష్యం పూర్తి అయ్యే అవకాశ కన్పించడం లేదు. జిల్లాలో 8,936 మంది అర్హులైన బాలికలు ఉన్న నేపథ్యంలో రోజు పదిమందికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకు వస్తే గానీ విజయవంతం అయ్యే పరిస్థితి కన్పించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement