breaking news
USA
-
నీకెందుకూ ఈ ఉద్యోగం.. ఐదు రోజులకే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీపై ట్రంప్ వేటు!
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ప్రతిష్టాత్మకమైన వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవిలో ఊహించని నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. నూతన ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన కేటీ జకారియా కేవలం ఐదు రోజులకే తన పదవిని కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఆమెను అత్యంత వేగంగా బాధ్యతల నుండి తప్పించడం హాట్ టాపిక్‌గా మారింది.శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే విధులకు హాజరైన జకారియా.. రూజ్వెల్ట్ రూమ్‌లో కమ్యూనికేషన్స్ టీమ్‌తో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వెస్ట్ వింగ్‌లోని తన కార్యాలయంలో కూర్చుని ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ట్రంప్ సీనియర్ సలహాదారు జేసన్ మిల్లర్ ఆమె ఆఫీస్ తలుపు తట్టారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మనతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారు. కాస్త పక్కకు వస్తారా అని మిల్లర్ కోరారు. దాంతో ఇంటర్వ్యూను మధ్యలోనే ఆపేసి వెన్స్ని కలవడానికి వెళ్లిన జకారియా.. తిరిగి ఆ గదిలోకి రాలేదు. తన ఉద్యోగంలోనూ కొనసాగలేకపోయారు. వాన్స్ భేటీ జరిగిన కొద్ది క్షణాల్లోనే ఆమెపై వేటు పడింది.ట్రంప్ ముందే హెచ్చరించారా?ఈ పరిణామంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. అదే రోజు ఉదయం తాను జకారియాతో మాట్లాడినట్లు గుర్తుచేసుకున్నారు. నేను ఆమెతో అన్నాను.. కేటీ, ఈ ఉద్యోగం నిజంగా నీకు అవసరమా? నిజాయితీగా చెప్పాలంటే ఈ పదవి నీకు అనవసరం అని చెప్పాను. నేను గనుక ఆమె స్థానంలో ఉంటే ఈ ఉద్యోగం గురించి మరోసారి ఆలోచించుకునేవాడినని అన్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కోల్పోయిన తర్వాత తర్వాత జకారియా ఫోన్ ద్వారా వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడారు. నాకు ఉన్న పరిమిత సమయం, సమాచారంతో ప్రెస్ బ్రీఫింగ్ను సమర్థవంతంగా నిర్వహించడానికి నా శక్తినంతటినీ ధారపోశాను. ట్రంప్‌కు, అమెరికా ప్రజలకు నా శ్రేష్ఠమైన సేవలు అందించడమే నా లక్ష్యంగా పనిచేశాను అని పేర్కొన్నారు.వేటుకు దారితీసిన కారణాలు ఇవే..కేటీ జకారియా ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె నిర్వహించిన మొదటి ప్రెస్ బ్రీఫింగ్ ఏమాత్రం ఆకట్టు కోలేకపోయింది. దీనికి తోడు ఆమె విద్యార్హతలు, నేపథ్యంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. తాను సుదీర్ఘకాలంగా న్యాయవాదిగా పని చేస్తున్నట్లు జకారియా చెప్పుకొచ్చారు. అయితే, ఆమె అమెరికాలోని ఏ రాష్ట్రంలోనైనా లేదా గతంలో తాను పనిచేసిన చైనాలోని భారీ లా ఫామ్లోనైనా బార్ ఎగ్జామ్ పాసయ్యారా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయడంలో విఫలమయ్యారు. చివరికి, ఆమె అసలు బార్ ఎగ్జామ్ పాస్ కాలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆధారాలతో సహా నిరూపించింది. కొత్త బాధ్యతల్లోకి జకారియా?జకారియా తొలగింపుపై వస్తున్న రకరకాల ఊహాగానాలను వైట్‌హౌస్ కొట్టిపారేసింది. ఆమె ట్రంప్ ప్రభుత్వంలోనే కొనసాగుతారని, అయితే ఆమెకు కేటాయించే కొత్త బాధ్యతలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.ఇదీ చదవండి : కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు? -
రష్యాపై ఆంక్షల సడలింపు చారిత్రాత్మకం: పుతిన్ ప్రతినిధి
రష్యాపై కొత్తగా విధించాల్సిన కొన్ని ఆంక్షలను సడలిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి కిరిల్ దిమిత్రియేవ్ స్వాగతించారు. ఈ నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. ఆంక్షలు, ఘర్షణలకు బదులుగా చర్చలు, ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని తన Xలో ఖాతాలో పేర్కొన్నారు.రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు వీలు కల్పించే చట్టం అమలుకు ముందు ట్రంప్ కీలక ఆంక్షల నుంచి మినహాయింపునిస్తూ ఈ ఉత్తర్వుపై సంతకం చేశారు.ఇటీవల పుతిన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం రష్యా భారీ మొత్తంలో డీజిల్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేయనుందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందం రష్యాకు ప్రయోజనం చేస్తూ, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు సహకరిస్తుందని అమెరికాలోని పలువురు రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు.ఇదిలా ఉండగా మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వచ్చే ఏడాది తమ దేశానికి దాదాపు 80 బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక సాయం అందించాలని యూరోపియన్ యూనియన్ నేతలను కోరారు.ఇదీ చదవండి: పిల్లలకూ ఇంటర్నెట్ హక్కు.. వయసు ఆధారిత నిషేధానికి 'సుప్రీం' నో -
భార్యకు సింపుల్ గిఫ్ట్ : రూ. 5 కోట్ల సర్ప్రైజ్
భార్యాభర్తల మధ్య ఒక సరదా గిఫ్ట్ కోట్లరూపాయల జాక్‌పాట్‌ను తెచ్చిపెట్టిందంటే నమ్మగలరా? అవును అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఒక దంపతులకు , స్థానిక కిరాణా దుకాణంలో చేసిన ఒక మామూలు లాటరీ టికెట్ ఆజన్మాంతం మర్చిపోలేని బహుమతిగా నిలిచింది.అమెరికాకు చెందిన వ్యక్తి తన భార్యకు లాటరీ టిక్కెట్లను బహుమతిగా ఇచ్చాడు. అలా సరదాగా ఇచ్చిమర్చిపోయిన లాటరీ టికెట్ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 5 కోట్ల జాక్‌పాట్‌ను గెలుచుకుంది ఆ డబ్బులో కొంత భాగాన్ని ట్రావెలింగ్ కోసం ఖర్చు చేయాలని భావిస్తున్నామంటూ సంతోషంగా వెల్లడించింది.ఇదీ చదవండి: గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతివర్జీనియాలోని బెడ్ఫోర్డ్ కౌంటీకి చెందిన ఒక వ్యక్తి స్థానిక కన్వీనియన్స్ స్టోర్‌లో రెండు 'గోల్డ్ 7ఎస్' స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్లు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాడు. వాటిని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. భార్య ఆ టికెట్లను స్క్రాచ్ చేయగా, అందులో ఒక టికెట్‌కు టాప్ ప్రైజ్ అయిన డాలర్ల 577,777 (సుమారు రూ. 5 కోట్లు) దక్కింది. ఈ డబ్బుతో తాను ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేయాలని ఆశపడుతున్నట్లు ఆమె వర్జీనియా లాటరీ అధికారులతో పంచుకున్నారు. ఇదీ చదవండి: 39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం -
అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!
-
భారత్, చైనా దేశీయులపై.. అమెరిక నేత సంచలన వ్యాఖ్యలు
ఇటీవల కాలంలో అమెరికా నాయకులకు హెచ్-1బీ వీసాపై ద్వేషం కక్కడం పరిపాటిగా మారింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ హెచ్1బీ వీసా విధానంపై మండిపడ్డారు. ఈ విధానాన్ని తప్పుడు పద్ధతిలో వినియోగించుకుంటూ అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యల వేడి చల్లారకముందే తాజాగా మరో అమెరికన్ కాంగ్రెస్ నేత హెచ్-1బీపై విషం చిమ్మారు. హెచ్-1బీ, ఓపీటీ కార్యక్రమాలను “మోసపూరితమైనవి” గా అభివర్ణించారు.సేలం న్యూస్ ఛానల్ (ఎస్ఎన్సీ)లో ప్రసారమైన ‘ది స్కాట్ జెన్నింగ్స్ షో’ కార్యక్రమంలో స్కాట్ జెన్నింగ్స్తో మాట్లాడుతూ "అమెరికాలో కంప్యూటర్ సైన్స్ సహా ఇతర కోర్సులు పూర్తి చేసిన స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ ఉద్యోగాలు భారత్, చైనా నుంచి హెచ్-1బీ వీసాలపై వస్తున్న విదేశీ ఉద్యోగులు కొల్లగొడుతున్నారు. తక్కువ వేతనాలకు పనిచేసేందుకు సిద్ధంగా ఉండే విదేశీ ఉద్యోగులను కంపెనీలు నియమించుకుంటున్నారు". అని విమర్శించారు. దానితో పాటు హెచ్-1బీ, ఓపీటీ కార్యక్రమాలను “మోసపూరితమైనవి” గా అభివర్ణించారు. గతేడాది అమెరికాలో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి కోర్సుల్లో సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేశారు. అదే సమయంలో ఐదు లక్షలకు పైగా హెచ్-1బీ వీసాలు జారీ చేశారు. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం. చివరికి తక్కువ వేతనాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉండటంతో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నారు. దీంతో మన దేశానికి చెందిన యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆయన ఆరోపించారు. హెచ్-1బీ పరిచయం“అమెరికాలో భర్తీ చేయడానికి తగిన ఉద్యోగులు అందుబాటులో లేని స్థానాల్లో పనిచేసేందుకు అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని తీసుకువస్తామని హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని పరిచయం చేశారు. కానీ, ఈ కార్యక్రమం ఆ విధంగా పనిచేయడం లేదు. బదులుగా, తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ కార్మికులను తీసుకువస్తున్నారు. అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న మన యువ గ్రాడ్యుయేట్ల అవకాశాలను వీరు దెబ్బతీస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.హెచ్-1బీ వీసాదారుల కుటుంబ సభ్యులపైహెచ్-1బీ వీసాపై అమెరికాకు వచ్చే ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకువస్తారని రైలీ మూర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఆయన చైన్ మైగ్రేషన్ (కుటుంబ సంబంధాల ఆధారంగా వలసలు కొనసాగడం)తో ముడిపెట్టారు.సాధారణంగా ఒక హెచ్-1బీ వీసాదారుడు తన కుటుంబానికి చెందిన పది మందిని అమెరికాకు తీసుకువస్తారు. దీనితో పాటు మొత్తం కుటుంబ వలసల వ్యవస్థ కూడా కొనసాగుతుందన్నారు. హెచ్-1బీ కఠిన నిబంధనలు ఇదిలా ఉండగా, హెచ్-1బీ, ఎల్-1 వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాల పొడిగింపు దరఖాస్తుల పరిశీలన విధానంలో మార్పులు తీసుకురావాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ముఖ్యంగా భారతీయ వలసదారులపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం, ఒక ఉద్యోగి వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసినప్పుడు, గతంలో అదే పరిస్థితుల్లో ఆమోదించిన దరఖాస్తుకు సాధారణంగా ప్రాధాన్యం ఇస్తారు. అయితే, డీహెచ్ఎస్ ప్రతిపాదించిన కొత్త నిబంధన అమల్లోకి వస్తే, గతంలో దరఖాస్తు ఆమోదం పొందినప్పటికీ, అదే పరిస్థితులు కొనసాగుతున్న సందర్భంలో కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అర్హతలను మరోసారి పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.ఈ ప్రతిపాదన ఇంకా అమల్లోకి రాలేదు. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని డీహెచ్ఎస్ కోరుతోంది. ఈ ప్రతిపాదనలోని అన్ని అంశాలపై అభిప్రాయాలను స్వీకరించనున్నట్లు విభాగం తెలిపింది.హెచ్-1బీలో భారతీయుల వాటా అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) గణాంకాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసా లబ్ధిదారుల్లో భారతీయుల వాటా సుమారు 70 శాతంగా ఉంది. అందువల్ల హెచ్-1బీ వీసా విధానంలో మార్పులు, దరఖాస్తుల పరిశీలన కఠినతరం చేసే ప్రతిపాదనలు భారతీయ నిపుణులు, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు, వీసా పొడిగింపుల కోసం ఎదురుచూస్తున్నవారిపై ప్రత్యేక ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్‌కు ట్రంప్ ఊరట -
ఐదు రోజులకే ఔట్.. ట్రంప్ ప్రెస్ సెక్రటరీ రికార్డు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమించిన కేటీ జకారియా పదవిలో వారం రోజులు కూడా పూర్తికాకముందే వైదొలగాల్సి వచ్చింది. ఆమెను పదవి నుంచి తొలగించినట్లు వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో కీలకమైన మధ్యంతర ఎన్నికలకు రెండు వారాల ముందు ట్రంప్ తన ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ముఖ్య ప్రతినిధిని కోల్పోవడం గమనార్హం.కేటీ జకారియా(Katie Zacharia) ప్రెస్ సెక్రటరీ పదవిలో కొనసాగడంపై ట్రంప్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బాధ్యతల్లో కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని ఆమెకు సూచించానని ఆయన తెలిపారు. ‘‘నువ్వు సంతోషంగా ఉండటమే మంచిదని చెప్పా. ఈ పనిలో నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండగలవో లేదో నాకు తెలియదు. ఇదేమీ సులభమైన పని కాదు’’ అని జకారియాతో అన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. మరోసారి ఈ విషయంపై మాట్లాడతానని కూడా చెప్పారు. అయితే, ఆ వెంటనే ఆమెను పదవి నుంచి తొలగించినట్లు వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు.బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆమె న్యాయవిద్యార్హతలపై ప్రశ్నలు, మీడియా సమావేశంలో పనితీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.కేటీ జకారియా నేపథ్యం41 ఏళ్ల కేటీ జకారియా కాలిఫోర్నియాలో జన్మించారు. పెప్పర్డైన్ యూనివర్సిటీలో 2007లో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, 2011లో న్యాయశాస్త్ర పట్టా పొందారు. జార్జ్ డబ్ల్యూ. బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్‌హౌస్‌లో ఇంటర్న్‌గా పనిచేశారు. అనంతరం చైనాలోని బీజింగ్‌లో అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన న్యాయ సంస్థలో పనిచేశారు. ఫాక్స్ న్యూస్, న్యూస్‌మాక్స్ వంటి సంస్థల్లో రాజకీయ వ్యాఖ్యాతగా, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆమెకు నలుగురు పిల్లలు. న్యాయవిద్య.. బార్ పరీక్షపై వివాదంకరోలిన్ లీవిట్ స్థానంలో కేటీ జకారియాను ప్రెస్ సెక్రటరీగా ట్రంప్ ఇటీవల నియమించుకున్నారు. ఈ నెల 12న బాధ్యతలు చేపట్టి.. మరుసటి రోజే తొలిసారిగా వైట్‌హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే, ఆమె గతంలో న్యాయవాదిగా పనిచేశారన్న అంశంపై ప్రశ్నలు మొదలయ్యాయి. తాను అంతర్జాతీయ లావాదేవీల చట్టానికి సంబంధించిన న్యాయవృత్తిలో పనిచేశానని, అందుకు అవసరమైన అర్హతలు ఉన్నాయని జకారియా వెల్లడించారు.కానీ, అమెరికాలోని ఏ రాష్ట్రంలోనూ లేదంటే కొలంబియా జిల్లాలోనూ ఆమె న్యాయవాదిగా నమోదైనట్లు ఆధారాలు లభించలేదని అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. పెప్పర్డైన్ యూనివర్సిటీలో న్యాయవిద్య అభ్యసించిన జకారియా.. గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని అంగీకరించారు. అమెరికాలో న్యాయవాదిగా పనిచేయాలంటే సంబంధిత రాష్ట్ర బార్లో ప్రవేశం పొందడం తప్పనిసరి. ఈ వ్యవహారం ఆమెపై విమర్శలకు మరింత ఆజ్యం పోసింది.మీడియా కవరేజీపై ట్రంప్ అసంతృప్తితన ప్రభుత్వ పనితీరుపై మీడియా కవరేజీ విషయంలో ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి మరింత సమర్థంగా తీసుకెళ్లే ప్రతినిధి కావాలని భావించారు. అందుకే జకారియాను ఎంపిక చేశారు. అయితే, ఆమె నియామకం తర్వాత తొలి రోజుల్లోనే వివాదాలు చుట్టుముట్టడంతో పరిస్థితి మారిపోయింది.ప్రస్తుతం కొత్త ప్రెస్ సెక్రటరీ నియామకంపై తొందరపడటం లేదని ట్రంప్.. ఫాక్స్ న్యూస్‌తో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. జకారియా వైదొలగడం వైట్‌హౌస్ చరిత్రలో అత్యంత స్వల్పకాలం ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన ఉదంతంగా నిలిచే అవకాశం ఉందని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్ తొలి పాలనలో కేవలం పది రోజుల పాటు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆంథోనీ స్కారముచీ ఈ పరిణామంపై స్పందిస్తూ.. రికార్డులు బద్దలవుతుంటాయని, అయితే ఇతరుల బాధలో తాను ఆనందించనని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ట్రంప్ కోడలిగా ఛాన్స్ మిస్.. ఎవరీమె? -
అమెరికా వలస నిబంధనలు మరింత కఠినం
వాషింగ్టన్: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం వలస నిబంధనలను మరింత కఠినం చేసింది. హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములతో సహా వర్క్ పర్మిట్ల (ఉద్యోగ అనుమతులు) ఆటోమేటిక్ పొడిగింపును మంజూరు చేసే విధానాన్ని తాజాగా రద్దు చేసింది. వర్క్ ఆథరై జేషన్ డాక్యుమెంట్ల (ఈఏడీ) పొడిగింపు దరఖా స్తులు పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈ ఆటోమేటిక్ పొడిగింపు లభించేది. ఈ నిర్ణయం భారతీయులతో సహా అనేక మంది విదేశీ నిపుణులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన మధ్యంతర ఉత్తర్వును గతేడాది అక్టోబర్ 30వ తేదీన విడుదలచేయగా, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) బుధవారం తుది నిబంధనను ఖరారు చేసింది. యూఎస్సీ ఐఎస్‌లో ప్రాసెసింగ్ ఆలస్యాన్ని నివారించడానికి, రెన్యూవల్ దరఖాస్తుల సంఖ్యను తగ్గించడానికి అధ్యక్షుడు బైడెన్ హయాంలో 2022 మేలో ఈఏడీ పర్మిట్ల కోసం 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపును ప్రవేశపెట్టారు. -
‘బంగారు’ కాంతుల్లో చైనా.. భారీ అప్పుల్లో అమెరికా
అమెరికా.. చైనా.. రెండు బలమైన ఆర్థిక శక్తులు. తలసరి ఆదాయం పరంగా తొలి రెండు స్థానాల్లో ఉండే ఈ రెండు దేశాలు.. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ పెద్దన్నగా పిలుచుకునే అమెరికా భారీ అప్పుల్లో కూరుకుపోగా.. రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి చైనా ‘బంగారు’ కాంతుల్లో మెరిసిపోతోంది.ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా బంగారం నిల్వలను వేగంగా పెంచుకుంటోంది. అమెరికా జాతీయ రుణం 40 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిన వేళ.. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు బీజింగ్ బంగారాన్ని కీలక ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది. చైనా సెంట్రల్ బ్యాంక్ సెప్టెంబర్‌లో సుమారు 23 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దాదాపు మూడేళ్లలో ఇదే అతిపెద్ద నెలవారీ కొనుగోలు. దీంతో వరుసగా 23 నెలల పాటు బంగారం నిల్వలను పెంచుకున్నట్లయింది.ఆందోళనకరంగా అమెరికా రుణభారంఅమెరికా రుణం పెరుగుతుండటం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలను పెంచుతోంది. కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం (సీబీఓ) అంచనాల ప్రకారం.. అమెరికా ప్రజల చేతుల్లో ఉన్న ప్రభుత్వ రుణం 2026లో ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 101 శాతంగా ఉండగా, 2036 నాటికి 120 శాతానికి చేరవచ్చు. ఈ నేపథ్యంలో డాలర్ ఆధారిత ఆస్తులపై పూర్తిగా ఆధారపడకుండా నిల్వలను విభిన్న మార్గాల్లో విస్తరించుకోవాలని చైనా భావిస్తోంది.ఆంక్షల భయంతోనూ బంగారానికి ప్రాధాన్యం2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యా సెంట్రల్ బ్యాంక్‌కు విదేశాల్లో ఉన్న ఆస్తుల్లో సుమారు 300 బిలియన్ డాలర్లను స్తంభింపజేశాయి. విదేశాల్లో భద్రం చేసిన ఆస్తులపైనా రాజకీయ నిర్ణయాలు ప్రభావం చూపవచ్చనే అంశాన్ని ఈ పరిణామం స్పష్టం చేసింది. అదే దేశీయంగా నిల్వ చేసుకునే బంగారంపై మరో దేశానికి ప్రత్యక్ష నియంత్రణ ఉండదు. అందువల్ల ఆంక్షలు, ఆస్తుల స్తంభన వంటి ప్రమాదాల నుంచి కొంత రక్షణ పొందవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.చైనా కుటుంబాలూ బంగారం వైపుచైనా సెంట్రల్ బ్యాంక్‌తో పాటు అక్కడి సాధారణ ప్రజలు కూడా బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం.. 2026 ప్రథమార్ధంలో చైనాలో బంగారు కడ్డీలు, నాణేల పెట్టుబడి డిమాండ్ రికార్డు స్థాయిలో 314 టన్నులకు చేరింది. బలహీనంగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్, షేర్ మార్కెట్లపై అనిశ్చితి, పొదుపును భద్రపరచుకోవాలనే ఆకాంక్ష ఇందుకు కారణాలుగా ఉన్నాయి.డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బంగారం?చైనా మాత్రమే కాకుండా పోలాండ్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాలు కూడా బంగారం నిల్వలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలను వైవిధ్యం చేసుకోవడంలో భాగంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే, చైనా కొనుగోళ్లు కేవలం ధరల పెరుగుదలపై అంచనాలకే పరిమితం కావు. ఆర్థిక భద్రత, అంతర్జాతీయ ఆంక్షల ప్రమాదం, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం వంటి దీర్ఘకాలిక వ్యూహాల్లో బంగారం కీలక పాత్ర పోషిస్తోంది.ఇదీ చదవండి: గోల్డ్ ఇన్వెస్టర్లకు అలర్ట్: బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత -
ప్రపంచ వేదికపై భద్రాచలం బిడ్డ విజయకేతనం!
రెనో (అమెరికా), అక్టోబర్ 15: సంకల్ప బలానికి వయసు అడ్డుకాదని, గుండెకు బైపాస్ సర్జరీ జరిగినా ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించారు భద్రాచలానికి చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ ఎస్బీఐ అధికారి డి.వి. శంకరరావు. అమెరికాలోని నెవాడా రాష్ట్రం, రెనో నగరంలో జరుగుతున్న 2026 IPF వరల్డ్ మాస్టర్స్ క్లాసిక్ అండ్ ఎక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మాస్టర్స్-4, 74 కిలోల విభాగంలో ప్రపంచ స్థాయిలో మూడో స్థానం సాధించి కాంస్య పతకం గెలిచి పోడియంపై స్థానం పొందారు. ఒకప్పుడు గుండె బైపాస్ శస్త్రచికిత్సను ఎదుర్కొన్న శంకరరావు, నేడు అదే గుండె నిండా ఆత్మవిశ్వాసంతో ప్రపంచ క్రీడావేదికపై భారత త్రివర్ణ పతాకానికి గౌరవం తీసుకురావడం అపూర్వమైన ఘట్టం. జాతీయ స్థాయిలో పలు పతకాలు, రికార్డులు సాధించిన ఆయన, ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమించి ప్రపంచ పోటీలకు వెళ్లి ఈ ఘనవిజయం అందుకున్నారు.ఇది కేవలం ఒక కాంస్య పతకం ఎంతమాత్రం కాదు. ఆయన ప్రదర్శన దేశానికి గర్వకారణం, తెలంగాణకు కీర్తికిరీటం, భద్రాచలానికి అపూర్వ గౌరవమని చెప్పొచ్చు. “వయసు శరీరానికే తప్ప సంకల్పానికి కాదు! గుండెకు శస్త్రచికిత్స జరగవచ్చు, కానీ గుండెలోని గెలవాలనే తపనకు కాదు!” అని శంకర్రావు విషయంలో నిజమైంది. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
-
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అగ్రరాజ్యం అమెరికాతో పాకిస్థాన్‌కు యుద్ధం వస్తే.. భారత్ ఎవరికి మద్దతు ఇవ్వాలి? ఈ ప్రశ్న చుట్టూ ఇప్పుడు రాజకీయ దుమారం రేగింది. పాకిస్థాన్ విషయంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే భారత్ పాక్‌కు అండగా ఉంటుందని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా పలువురు రాజకీయ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.రాజస్థాన్‌లో గురువారం జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో మదన్ రాథోడ్ మాట్లాడుతూ.. భారత్ భౌగోళికంగా పాకిస్థాన్‌కు పొరుగున ఉన్న దేశమని పేర్కొన్నారు. అమెరికా, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగితే భారత్ పాకిస్థాన్ పక్షాన ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, మన దేశానికి సంబంధించిన అంతర్గత సమస్యల విషయంలో మాత్రం భారత్ పక్షానే నిలబడాలని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.కాంగ్రెస్ తీవ్ర విమర్శలురాథోడ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ తీవ్రంగా స్పందించారు. భారత సైనికులు, ప్రజలపై దాడులకు పాల్పడే పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని ప్రశ్నించారు. అలాగే, కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త సందీప్ గుప్తా కూడా రాథోడ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అమెరికా-పాకిస్థాన్ యుద్ధం వస్తే పాక్‌కు అండగా ఉంటామని చెప్పడం బీజేపీ వైఖరిని బయటపెట్టిందని ఆయన ఆరోపించారు."अगर अमेरिका और पाकिस्तान के बीच युद्ध छिड़ता है, तो हम पाकिस्तान के साथ खड़े होंगे क्योंकि वह हमारा पड़ोसी है।" -राजस्थान बीजेपी अध्यक्ष मदन राठौड़ https://t.co/W4y9oUjLwE— Mukesh Mathur (@mukesh1275) October 15, 2026సోషల్ మీడియాలోనూ విమర్శలుఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం రాథోడ్ వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఆప్ ఉపాధ్యక్షుడు రామ్ గుప్తా ఈ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కూడా రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడి మాటలను తప్పుబట్టారు. మొత్తంగా, అమెరికా-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే భారత్ ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై మదన్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారాయి. ఇదీ చదవండి: పొలిటికల్ ఎంట్రీ.. సస్పెన్స్‌కు తెర దించిన మాజీ ఐఏఎస్ దివ్య -
అమెరికా గ్రీన్ కార్డుల వివాదం.. బ్రాడ్ స్మిత్ హెచ్చరిక!
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డులు ఇచ్చే విషయంలో.. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు టెక్ రంగంలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులపై ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. దీనిపై మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ స్పందించారు.బ్రాడ్ స్మిత్ హెచ్చరికగ్రీన్ కార్డుల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంపై బ్రాడ్ స్మిత్ ఆందోళనను వ్యక్తం చేశారు. విదేశీ ఉద్యోగులకు అమెరికాలో శాశ్వతంగా స్థిరపడే అవకాశాలను తగ్గిస్తే.. భవిష్యత్తులో టెక్నాలజీ రంగం నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఎందుకంటే.. అమెరికాలోని టెక్ కంపెనీలు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకుంటాయి. అలాంటి వారికి అవకాశాలు తగ్గిస్తే.. వారు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో అమెరికా కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కోల్పోవచ్చని స్మిత్ అభిప్రాయపడ్డారు.జేడీ వాన్స్ ఆరోపణమైక్రోసాఫ్ట్ హెచ్-1బీ వీసా విధానాన్ని దుర్వినియోగం చేసిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించారు. దీనిపై స్పందించిన బ్రాడ్ స్మిత్ ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తమ కంపెనీ విదేశీ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇస్తుందనే వాదనను కూడా ఆయన అంగీకరించలేదు. ఉద్యోగి ఏ దేశానికి చెందినవారైనా, వారి ఇమ్మిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా ఒకే విధమైన వేతన వ్యవస్థను అనుసరిస్తామని ఆయన వివరించారు.9000 మంది అమెరికన్లను ఉద్యోగాలుఅంతేకాకుండా.. మైక్రోసాఫ్ట్ గత ఏడాది 9,000 మందికి పైగా అమెరికాలో జన్మించిన ఉద్యోగులను నియమించుకుందని స్మిత్ తెలిపారు. కాబట్టి.. విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నామనే కారణంతో అమెరికా పౌరులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని భావించడం సరికాదని ఆయన చెప్పాలనుకున్నారు.గ్రీన్ కార్డు వివాదం.. భారతీయ ఐటీ ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే చాలా మంది భారతీయ నిపుణులు H-1B వీసాల ద్వారా అమెరికాలో పనిచేస్తున్నారు. వారిలో చాలామంది భవిష్యత్తులో గ్రీన్ కార్డు పొంది అక్కడే స్థిరపడాలని ఆశిస్తారు. కానీ.. గ్రీన్ కార్డు ప్రక్రియపై ఆంక్షలు విధిస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: అమెజాన్‌కు పోటీగా మస్క్ ఈ కామర్స్! -
వెనక్కి తగ్గిన ట్రంప్.. లైవ్ మరణశిక్ష ప్లాన్ రద్దు
అమెరికాలో సంచలనం రేపిన లైవ్ మరణశిక్ష ప్రతిపాదనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. ఫోర్ట్ హుడ్ నరమేధం కేసులో దోషిగా తేలిన మాజీ ఆర్మీ మేజర్ నిడాల్ హసన్‌కు విధించిన మరణశిక్షను ప్రపంచమంతా చూసేలా లైవ్‌స్ట్రీమింగ్ చేయాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రతిపాదించారు. అయితే ఈ నిర్ణయంపై సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు, మత పెద్దలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో లైవ్ ప్రసార ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.అమెరికాలో మరణశిక్షను ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూసేలా ప్రసారం చేయాలన్న ప్రతిపాదనకు బ్రేక్ పడింది. 2009లో ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో 13 మందిని కాల్చి చంపిన మాజీ ఆర్మీ మేజర్ నిడాల్ మాలిక్ హసన్‌కు డిసెంబర్ 3న ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను లైవ్‌స్ట్రీమింగ్ చేయాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించడంతో అమెరికాలో రాజకీయ, నైతిక వివాదం మొదలైంది. సొంత రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే హసన్‌కు మరణశిక్ష మాత్రం నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే అమలవుతుందని స్పష్టం చేశారు.ప్రపంచానికి చూపిస్తే..నేరాలకు పాల్పడేవారికి ఎదురయ్యే పరిణామాలను ప్రపంచం చూడాలని, అలాంటి ప్రసారం ఇతరులకు హెచ్చరికగా నిలుస్తుందని హెగ్సెత్ వాదించారు. ఉగ్రవాదులుగా భావించే వ్యక్తులపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అందరికీ తెలియాలన్నది ఈ ప్రతిపాదన వెనుక ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు. అయితే మరణశిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా నేరాలను అరికట్టగలమా? ఒక వ్యక్తి ప్రాణాలు తీసే ప్రక్రియను ప్రపంచానికి చూపించడం అవసరమా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.ఈ ప్రతిపాదనపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు రిపబ్లికన్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మత పెద్దలు కూడా వ్యతిరేకించారు. అమెరికన్లలో మెజారిటీ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఒపీనియన్ పోల్స్ సూచించాయి. దీంతో ఈ ప్రతిపాదనకు రాజకీయంగా, సామాజికంగా మద్దతు తగ్గింది.ట్రంప్ ఏమన్నారంటే..లైవ్ ప్రసారం వల్ల నేరాలకు భయపడేలా చేయవచ్చని తాను భావించినప్పటికీ, మంచి ఉద్దేశంతో ఆలోచించే చాలామంది మరణశిక్షను కళ్లారా చూడటానికి ఇష్టపడటం లేదని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోమని స్పష్టం చేశారు. అయితే బాధితుల కుటుంబాలకు మాత్రం ఇష్టమైతే మరణశిక్షను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబాలు న్యాయం జరగడాన్ని స్వయంగా చూడటానికి అర్హులని వ్యాఖ్యానించారు. అంటే, ప్రజలందరికీ ప్రసారం చేసే ప్రతిపాదనను రద్దు చేసినప్పటికీ, బాధితుల కుటుంబాల సమక్షంలో శిక్ష అమలు చేసే అవకాశాన్ని కొనసాగిస్తున్నారు.Trump Cancels Livestream of Fort Hood Attacker U.S. President Donald #Trump has cancelled plans to livestream the execution of Fort Hood attacker Nidal Hasan by firing squad following widespread global criticism. #Trump stated that many well-meaning individuals preferred not to watch the event, despite previously defending it as a deterrent.— Daily Euro Times (@dailyeurotimes) October 16, 2026హెగ్సెత్తో విభేదాలా?ట్రంప్ నిర్ణయం రక్షణ మంత్రి హెగ్సెత్కు ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది ఆయనే. ట్రంప్ కూడా గతంలో లైవ్ ప్రసారానికి మద్దతు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గారు. అధ్యక్షుడు, రక్షణ మంత్రి మధ్య బహిరంగంగా అభిప్రాయ భేదం కనిపించడం అరుదైన పరిణామంగా విశ్లేషణలు వెలువడ్డాయి.అయితే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని పెంటగాన్ తోసిపుచ్చింది. ట్రంప్ నిర్ణయంపై హెగ్సెత్ మద్దతు తెలిపారని, ఇద్దరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ వెల్లడించారు. ఈ ప్రకటనతో వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ, లైవ్ ప్రసార ప్రతిపాదన వెనక్కి తీసుకోవడం మాత్రం స్పష్టమైన పరిణామంఆనాడు ఏం జరిగిందంటే..నిడాల్ హసన్ అమెరికా సైన్యంలో మానసిక వైద్యుడిగా పనిచేశారు. 2009 నవంబర్ 5న టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలోని వైద్య కేంద్రంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. కాల్పుల సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో హసన్ గాయపడి నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. అప్పటి నుంచి వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.ఈ కేసులో 2013లో సైనిక న్యాయస్థానం హసన్‌ను దోషిగా తేల్చింది. ముందస్తు ప్రణాళికతో హత్యలకు పాల్పడినందుకు మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఆ శిక్షను ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా అమలు చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 3న శిక్ష అమలుకు సంబంధించిన న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.మరణశిక్షపై మరోసారి చర్చఅమెరికాలో మరణశిక్ష అమలుపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఇటీవల టెన్నెసీలో క్రిస్టా పైక్‌కు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేసే ప్రయత్నం విఫలమైందన్న వార్తలు కూడా ఈ అంశంపై దృష్టిని పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరణశిక్షను లైవ్ ప్రసారం చేయాలన్న ప్రతిపాదన మరింత వివాదాస్పదంగా మారింది.మొత్తానికి, హసన్‌కు మరణశిక్ష విధించడం కొత్త పరిణామం కాదు. కానీ ఆ శిక్షను ప్రపంచమంతా చూసేలా ప్రసారం చేయాలన్న ఆలోచనే అమెరికాలో పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయ నాయకులు, మత పెద్దలు, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ట్రంప్ ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. లైవ్ మరణశిక్షతో కఠిన సందేశం ఇవ్వాలన్న ప్రయత్నం చివరకు వివాదంతో ఆగిపోయింది. ఇదీ చదవండి: ఆలయంపై దాడి కుట్ర భగ్నం.. సంచలన విషయాలు వెలుగులోకి -
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఒరెగాన్ రాష్ట్రంలోని బెండ్ నగరంలో ఉన్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాగా, కాల్పులు జరిపిన 16 ఏళ్ల యువకుడు కూడా ఈ ఘటనలో మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం.. స్కూల్ ప్రాంగణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుపై కాల్పులు జరిపినట్లు తొలుత అత్యవసర సమాచారం అందింది. క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తుపాకీ గాయంతో పడి ఉన్న నిందితుడిని గుర్తించారు. అయితే అతడిని ఎవరు కాల్చి చంపారనే విషయంపై స్పష్టత రాలేదు. నిందితుడిని అక్కడే ఉన్న మరో వ్యక్తి కాల్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.BREAKING UPDATE: Three children, ages 5, 8, and 11, and one teacher were killed in a shooting at Silver Rail Elementary School in Bend, Oregon. A 16-year-old shooter was followed into the school by a community member who neutralized him. A 7-year-old child and another teacher were critically injured and transported to a local hospital. According to police, the shooter first fired at a vehicle outside the school before forcing his way inside through locked doors. It is not yet clear whether he had any connection to the school. Neither the victims nor the shooter have been publicly identified at this time. The investigation is ongoing.— I Meme Therefore I Am 🇺🇸 (@ImMeme0) October 16, 2026ఇక, ఈ పాఠశాలలో కిండర్‌గార్టెన్ నుంచి ఐదో తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది. సాధారణంగా ఐదు నుంచి 11 ఏళ్ల వయసున్న చిన్నారులు ఇక్కడ చదువుకుంటారు. పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు, 40 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు దారితీసిన కారణాలు, మృతుల వివరాలు, నిందితుడి మృతికి దారితీసిన పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు చదువుకునే పాఠశాలలోనే ఈ దారుణం చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.ఇదీ చదవండి: India-US trade: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు -
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు
సాక్షి,న్యూఢిల్లీ: భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో కీలక ముందడుగు పడింది. ఒప్పందంలోని తొలి విడత ఖరారైందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యాయపరమైన ముసాయిదా రూపకల్పన జరుగుతోందని, త్వరలోనే ప్రక్రియను పూర్తి చేసి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌కు పోటీ దేశాలతో పోలిస్తే మెరుగైన వాణిజ్య ప్రయోజనాలు లభించేలా ఒప్పందాన్ని ఖరారు చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ఖరారు చేసి సంతకాలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే అమెరికాలో సుంకాల విధానం ఖరారయ్యే ప్రక్రియతో పాటు ఈ ఒప్పందం కూడా ముందుకు సాగుతుందని వివరించారు.విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం భారత్-అమెరికా వాణిజ్య చర్చలు తుది దశకు చేరువవుతున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ఇతర పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌కు లభించే వాణిజ్య ప్రయోజనాలు కూడా కీలకమని ఆయన పేర్కొన్నారు.2025 ప్రారంభం నుంచి ఇరు దేశాలు ఈ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. సుంకాల వివాదాలను పరిష్కరించడం, వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, ఇరు దేశాల మార్కెట్లలో పరస్పర అవకాశాలను పెంచడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలు.గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన అదనపు సుంకాలు, హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు, వలస విధానాల్లో మార్పులు వంటివి ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో జరగాల్సిన వాణిజ్య ఒప్పందం ఖరారైతే ఇరు దేశాల ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు ఊతం లభించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్, చైనాపై సుంకాల ముప్పు.. 10 రోజుల్లో ట్రంప్ కీలక నిర్ణయం! -
ఇరాన్‌పై ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ప్రయోగానికి అమెరికా ప్లాన్?
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మళ్లీ ప్రారంభిస్తే.. ఆ దేశంలోని అణు కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేసే అవకాశాలను అమెరికా సైన్యం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (MOAB)గా పిలిచే అత్యంత శక్తిమంతమైన బాంబును ఉపయోగించే ప్రణాళిక కూడా ఉన్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది. ఈ వివరాలను అమెరికా అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. అయితే ఈ నివేదికను రాయిటర్స్ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే.. ఇరాన్‌లోని ఇంధన కేంద్రాలు, పిక్‌యాక్స్ మౌంటైన్ వంటి అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశాలను సైన్యం ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ దాడులు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు కానీ.. లేదంటే ఎన్నికల తర్వాత ఈ సైనిక చర్యలను పునఃప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సదరు కథనం పేర్కొంది.భూగర్భ కేంద్రాలపై ఎంతవరకు ప్రభావం?MOAB బరువు సుమారు 9,800 కిలోలు. ఇది అణ్వాయుధం కాదు కానీ, భారీ పేలుడు సృష్టించగలదు. అయితే గ్రానైట్ పొరలతో రక్షణ కల్పించిన భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఈ బాంబు ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుందనే సందేహాలు అమెరికా అధికారుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీని భారీ పేలుడు పరిధి కారణంగా జరిగే ప్రాణనష్టంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.యుద్ధం నుంచి బయటపడేందుకు, తమకు విజయం లభించినట్లు చూపించేందుకు ట్రంప్ ప్రభుత్వం వివిధ సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు సీఎన్ఎన్ నివేదించింది. అయితే, ఇరాన్‌పై కొత్త దాడులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇదీ చదవండి: భారత్, చైనాపై సుంకాల ముప్పు.. 10 రోజుల్లో ట్రంప్ కీలక నిర్ణయం! -
చికాగోలో సామూహిక అత్యాచారం కలకలం : ‘నా టర్న్’ఎపుడు అంటూ రచ్చ?!
'కార్నెల్ 7' సామూహిక అత్యాచార ప్రకంపనల మధ్య అమెరికాలోని మరో ఉన్నత విశ్వవిద్యాలయంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఉదంతం సంచలనం రేపింది. 18వేల మంది విద్యార్థులతో అమెరికాలో అగ్రశ్రేణి పరిశోధనా సంస్థ చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగో (University of Chicago) క్యాంపస్ సమీపంలోని ఒక ఫ్రాటర్నిటీ హౌస్ (Fraternity House)లో 21 ఏళ్ల యువతి యూనివర్శిటీ విద్యార్థిని కాదు) పై సామూహిక అత్యాచారం జరిగినట్టు కేసు నమోదైంది. అక్టోబర్ 11 ఆదివారం తెల్లవారు జామున సుమారు 1:50 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. ఫ్రాట్ హౌస్ బాత్రూమ్లోనే తనపై అత్యాచారం జరిగిందని, ఆ సమయంలో తలుపు బయట కొందరు పురుషులు "నా వంతు ఎప్పుడు?", "నన్ను లోపలికి రానివ్వండి" అని కేకలు వేశారంటూ ఆమె పోలీసుల ముందు వాపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆమెపై బాధితురాలి స్నేహితురాళ్లు ఇదే విషయాన్ని ధృవీకరించారు. కార్నెల్ యూనివర్శిటీలోని ఒక ఫ్రాటర్నిటీ హౌస్‌లో జరిగిన సామూహిక అత్యాచారం ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో, లైంగిక వేధింపుల కేసులను కళాశాలలు, విశ్వవిద్యాలయాల నిర్వహణ తీరుపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ సంఘటన మరింత దిగ్భ్రాంతి రేపింది. చికాగో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితుల కోసం విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిపైనా అభియోగాలు మోపలేదని చికాగో పోలీసులు తెలిపారు. అయితే, అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. అయితే అతడు తమ విద్యార్థి కాదని, లేదా పాఠశాలతో మరే విధంగానూ సంబంధం లేదని కూడా తెలిపారు.ఇదీ చదవండి: అయ్యో...ట్రెడ్మిల్ మీదే కుప్పకూలి..! వైరల్ వీడియోమరోవైపు క్యాంపస్ సమీపంలోని ఆల్ఫా ఎప్సిలాన్ పై (Alpha Epsilon Pi) ఫ్రాటర్నిటీ హౌస్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సదరు సంస్థ తమ చికాగో చాప్టర్‌కు సంబంధించిన అన్ని ఈవెంట్లను, కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసింది. యూనివర్శిటీకి చెందిన సీసీటీవీ కెమెరాలు, లైసెన్స్ ప్లేట్ రీడర్ల ద్వారా సేకరించిన వీడియోఆధారాలను, కీలక సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు షికాగో పోలీస్ డిపార్ట్మెంట్కు (CPD) అందించారు.ఈ దర్యాప్తుకు తాము పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వారు ప్రకటించారు.ఇదీ చదవండి: జర్మనీలో అగ్నిప్రమాదం : ముగ్గురు భారతీయులు సజీవ దహనం -
భారత్, చైనాపై సుంకాల ముప్పు.. 10 రోజుల్లో ట్రంప్ కీలక నిర్ణయం!
సాక్షి,న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే భారత్, చైనా సహా ఇతర దేశాలపై ఆంక్షలు విధించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 10 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ఈ చర్యల ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే ట్రంప్ లక్ష్యమని తెలిపారు.బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మాట్లాడిన గోర్.. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై జరిమానాలు, ఆంక్షలు విధించే అధికారం ట్రంప్‌కు కల్పించే బిల్లుకు అమెరికా సెనేట్‌లో 86 మంది సభ్యులు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ చర్యలు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకుంటున్నవి కావని ఆయన స్పష్టం చేశారు. భారత్‌కు మినహాయింపు ఇస్తారా?.. లేదా?.. అన్నది ట్రంప్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంభారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు పురోగతిలో ఉన్నాయని సెర్గియో గోర్ వెల్లడించారు. ఇప్పటికే పలు కీలక అంశాలపై అవగాహన కుదిరిందని, మిగిలిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. రక్షణ, ఐటీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ (AI) వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవాలని అమెరికా భావిస్తోందని తెలిపారు. భారత్‌లో అమెరికా కంపెనీల పెట్టుబడులు పెరగడం ద్వారా ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని గోర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కోర్టు ఆదేశం.. అమెరికాలో గ్రీన్ కార్డ్ లాటరీకి గ్రీన్ సిగ్నల్ -
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు దుర్మరణం
-
దృష్టి కోసం సంగీత, నృత్య మహోత్సవం
అవసరమైన వారికి కంటి చూపును ప్రసాదించాలనే మహోన్నత ఆశయంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆర్కాన్సాస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి నిధుల సేకరణ కార్యక్రమం ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్ – 2026’ విజయవంతంగా జరిగింది.అక్టోబర్ 3, శనివారం బెంటన్‌విల్‌లోని ది నైబర్‌హుడ్ చర్చిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యారు. సంగీత, నృత్య ప్రదర్శనలతో ఆహ్లాదకరంగా సాగిన ఈ వేడుక, కంటి చూపు అవసరమైన నిరుపేదలకు సహాయం చేయాలనే సేవా సంకల్పానికి వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని ఆర్కాన్సాస్ విభాగం ఉపాధ్యక్షుడు వైద్యనాథన్ వెంకటసుబ్రమణియన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర నేత్రాలయ లక్ష్యాలను, కంటి వైద్య సేవలను అవసరమైన వారికి అందించడంలో శంకర నేత్రాలయ యూఎస్ఏ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుంది. శంకర నేత్రాలయ చేపట్టిన ‘అడాప్ట్ ఎ విలేజ్’ (ఒక గ్రామాన్ని దత్తత తీసుకునే కార్యక్రమం) పథకానికి ఆర్కాన్సాస్ రాష్ట్రం నుంచి తొలి దాతగా బాపూజీ వక్కలగడ్డ ముందుకు వచ్చారు. సేవా కార్యక్రమాలకు ఆయన అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఆర్కాన్సాస్ విభాగం నాయకులు వేదికపై ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం ఆద్యంతం వైద్యనాథన్ వెంకటసుబ్రమణియన్తో పాటు విభాగం నాయకులు అరవింద్ శివసుబ్రమణియన్, కీర్తి దీనదయాళన్, శక్తివేల్ బాలచంద్రన్, సాయి పూర్ణిమ శంకర నేత్రాలయ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు.ఇక శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు, శంకర రత్న పురస్కార గ్రహీత బాలరెడ్డి ఇందుర్తి అందిస్తున్న నాయకత్వానికి, నిరంతర సహకారానికి ఆర్కాన్సాస్ విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అమెరికా వ్యాప్తంగా శంకర నేత్రాలయ సేవలను విస్తరించడంలో, ‘అడాప్ట్ ఎ విలేజ్’ కార్యక్రమాన్ని బలోపేతం చేయడంలో, సంచార కంటి వైద్య సేవలను మరింత మందికి చేరువ చేయడంలో ఆయన చేస్తున్న కృషిని కొనియాడింది.అలాగే కార్యక్రమ నిర్వహణ, సమన్వయం, ఇతర ఏర్పాట్లలో సహకరించిన మూర్తి రేకపల్లి, డాక్టర్ రెడ్డి ఉరిమిండి, శ్యామ్ అప్పాలి, వంశీకృష్ణ ఎరువరం, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి, కార్తికేయన్, దీనదయాళన్లకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ది నైబర్‌హుడ్ చర్చి యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.చివరగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సతీష్ శ్రీనివాసన్, పాల్ వినోద్ కుమార్, సంతోష్ సీతారామన్, జగన్ రామచంద్రన్, రాజ్ యెర్లగడ్డ, చంద్రశేఖర్ పి., గణపతి రాజమణి అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించింది.అలాగే విద్యార్థులు సువర్ణరేఖ బాబు, అక్షర లక్ష్మణ్, తన్వి మహేష్ కుమార్, ఆదితా నవీన్ కుమార్, సరయు, రియా కీర్తి, సాధ్వి వైద్యనాథన్, నివిన్ పాల్ వినోద్ కుమార్ సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. కాగా, కంటి చూపు కోల్పోయిన నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శంకర నేత్రాలయ యూఎస్ఏ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు దాతలు, సేవాభిమానులు సహకరించాలని నిర్వాహకులు కోరారు.ఇదీ చదవండి: హ్యూస్టన్‌లో పూర్వ విద్యార్థులతో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలు -
సీజేపీ నిరసనలు.. అమీర్ ఖాన్ మేనల్లుడికి బిగ్ షాక్
అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు పెద్ద షాకే ఇచ్చారు. అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన సీజేపీ నిరసనలో పాల్గొనడమే ఇందుకు కారణం. ఇమిగ్రేషన్ చట్ట నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 10న ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్ వద్ద సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఈ నిరసన జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్, ఆయన భాగస్వామి లేఖా వాషింగ్టన్, అమీర్ ఖాన్ బంధువు జైన్ మేరీ ఖాన్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు.ఇమ్రాన్ ఖాన్‌కు అమెరికా పౌరసత్వం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇక్కడ జరిగే నిరసనల్లో పాల్గొనే హక్కు ఉండదని.. ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఆయనకు నోటీసులు జారీ చేసి, అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు.Actor Imran Khan, nephew of Aamir Khan, has been issued a notice by Mumbai Police directing him to leave India by October 28. Imran Khan had participated in a protest at Mumbai’s August Kranti Maidan demanding the resignation of Chief Election Commissioner Gyanesh Kumar. Mumbai Police had also detained him. Action has been taken against Imran Khan under the relevant provision of the Immigration Act over his participation in the protest despite not being an Indian citizen: Mumbai Police— IANS (@ians_india) October 15, 2026చట్టంలోని సెక్షన్లు ఏం చెబుతున్నాయి?ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025 ఉల్లంఘన కింద.. ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు ఎగ్జిట్ నోటీసులు ఇచ్చారు. ఈ యాక్ట్‌లోని సెక్షన్ 7 విదేశీయుల భారత్‌లో ప్రవేశం, ప్రయాణం, నివాసం, నిష్క్రమణను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పిస్తుంది. అలాగే సెక్షన్ 29 ప్రకారం, చట్టం.. దాని కింద రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన సందర్భాల్లో, లేదంటే భద్రతకు సంబంధించిన ప్రతికూల నివేదిక ఉన్నప్పుడు, విదేశీయుడిని దేశం నుంచి తొలగించేందుకు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈ నిబంధనల కింద ఇమ్రాన్‌కు నోటీసులు జారీ చేశారు.జైన్ మేరీ, లేఖాకు గాయాలుఅయితే సీజేపీ నిరసనల సమయంలో పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని.. యూనిఫాంలో ఉన్న సిబ్బంది బలంగా పట్టుకోవడంతో గాయాలయ్యాయని లేఖా వాషింగ్టన్ ఆరోపించారు. తనతో పాటు జైన్ మేరీ ఖాన్‌కు కూడా చేతులు, వేళ్లు, కాళ్లపై గాయాలయ్యాయని ఆమె సోషల్ మీడియాలో వివరించారు. జైన్ మేరీ కూడా తన చేతులు, వేళ్లు, కాళ్లపై కనిపించిన గాయాల గుర్తులను వీడియోలో చూపించారు. పోలీసుల చర్యపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.లేఖా కథనం ప్రకారం.. స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకునేందుకు తామంతా ఆగస్టు క్రాంతి మైదాన్‌కు వెళ్లారు. అక్కడ ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతుండగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, అనంతరం తమను పోలీసు వాహనంలోకి ఎక్కించి కొన్ని గంటలపాటు తిప్పారని ఆమె ఆరోపించారు.ఇమ్రాన్ ఏమన్నారు?తాను ఏ రాజకీయ సంస్థకు ప్రాతినిధ్యం వహించడం లేదని, ఒక పౌరుడిగా అక్కడికి వెళ్లానని ఇమ్రాన్ మీడియాకు తెలిపారు. విడుదలైన తర్వాత పోలీసులతో మాట్లాడిన వీడియోల్లో ‘జై హింద్’ అంటూ నినాదం చేయడం కూడా కనిపించింది. పోలీసు వాహనంలో దాదాపు రెండు గంటలపాటు తిప్పారని ఆయన వివరించిచాడు. అమెరికా పౌరసత్వంపై వివాదంఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని పేర్కొంటూ బీజేపీ నేత కిరీట్ సోమయ్య ఆయన నిరసనలో పాల్గొనడంపై విచారణ జరపాలని, దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీసులు ఇమిగ్రేషన్ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నోటీసులపై తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలియాల్సి ఉంది.ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు మేనల్లుడు. ప్రముఖ దర్శకుడు నాసిర్ హుస్సేన్ మనవడు కూడా. 2008లో అబ్బాస్ టైర్‌వాలా దర్శకత్వంలో వచ్చిన ‘జానే తూ యా జానే నా’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. జెనీలియా కథానాయికగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ అప్పట్లో యువతను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘కిడ్నాప్’, ‘లక్’, ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’, ‘బ్రేక్ కే బాద్’, ‘ఢిల్లీ బెల్లీ’, ‘మేరే బ్రదర్ కీ దుల్హన్’, ‘ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ’, ‘మత్రు కీ బిజ్లీ కా మండోలా’, ‘గోరి తేరే ప్యార్ మే’, ‘కట్టీ బట్టీ’ వంటి సినిమాల్లో నటించారు. కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, 2026లో ‘హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్’లో ప్రత్యేక పాత్రతో మళ్లీ తెరపై కనిపించారు. ఆయన పార్ట్నర్ లేఖా వాషింగ్టన్ కూడా నటే. తెలుగులో ‘వేదం’లో మంచు మనోజ్‌కు జోడిగా నటించారు.ఇదీ చదవండి: అదసలు ప్రేమే కాదు.. బిహార్-రష్యా ప్రేమ్ కహానీలో బిగ్ ట్విస్ట్ -
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం
వాషింగ్టన్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విస్కాన్సిన్ రాష్ట్రంలోని విస్కాన్సిన్ డెల్స్ సమీపంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక, విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. తాజా సమాచారం ప్రకారం.. విమానం రెక్కలపై మంచు పేరుకుపోవడం, ప్రతికూల వాతావరణం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.అధికారుల వివరాల ప్రకారం.. ఆరుగురు ప్రయాణించే సామర్థ్యమున్న సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46 మాలిబు విమానం కెన్‌షా నుంచి మెనోమోనీకి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) సుమారు 9.30 గంటల సమయంలో విమానం కూలిపోయినట్లు అత్యవసర సేవలకు సమాచారం అందింది. మిర్రర్ లేక్ స్టేట్ పార్క్ సమీపంలోని డెల్లోనా ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కూలినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తుపాను కొనసాగుతోంది.రెక్కలపై మంచు.. పైలట్ హెచ్చరిక!విమాన ప్రమాదానికి సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమానం సుమారు 24,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో రెక్కలపై మంచు పేరుకుపోతున్నట్లు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చినట్లు అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB) వెల్లడించింది. ఎత్తు తగ్గించేందుకు అనుమతి కోరగా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంగీకరించింది. ఆ తర్వాత విమానం వేగంగా కిందికి దిగుతూ కుడివైపు మలుపు తిరిగినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు, రాడార్ ట్రాకింగ్ నిలిచిపోయాయి. రెక్కలపై మంచు పేరుకుపోవడం విమానం గాలిలో స్థిరంగా ప్రయాణించే సామర్థ్యాన్ని దెబ్బతీయగలదని నిపుణులు చెబుతున్నారు. Fatal plane crash in Sauk County, WI (near Wisconsin Dells) Piper PA-46-350P Malibu Mirage N931TT (2008, owned by Compass Pro LLC) went down ~9:30 p.m. CDT Oct 13 in the Town of Dellona. All 6 aboard (5 adults, 1 child) killed. No injuries on the ground. Departed Kenosha (KENW) for Menomonie. Pilot reported icing at 24,000 ft, requested descent. Entered a right descending turn that increased in rate until contact/ADS-B lost. FR24 data showed extreme vertical speeds of ~9,500–10,100 fpm. Just before tracking ended, it increased to 19,000 fpm with a spiral-like path over the area. FAA & NTSB investigating. #Aviation #PlaneCrash #Wisconsin #N931TT— SLCScanner (@SLCScanner) October 14, 2026ఇదీ చదవండి: పాక్ డబుల్ గేమ్.. దాయాది పిల్లిమొగ్గలు! -
అమెరికా ఆలయంలో భారీ నరమేధం కుట్ర భగ్నం
అమెరికాలో భారీ నరమేధం కుట్రను అక్కడి పోలీసులు భగ్నం చేశారు. ఇల్లినాయిస్ స్టేట్ చికాగో నగరం పరిధిలోని ఓ హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు తెగపడాలని, హిందువులను భారీగా చంపాలని ఓ టీనేజర్ ప్లాన్ గీశాడు. అయితే గన్ జామ్ కావడం, చివరి నిమిషంలో సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని నిలువరించి.. అరెస్ట్ చేశారు. అతను పక్కా భారత వ్యతిరేకి అని గుర్తించారు.ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పలాటైన్కు చెందిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్.. భారతీయులపై విద్వేషాన్ని వ్యక్తం చేస్తూ తరచూ సోషల్ మీడియా పోస్టులు చేస్తుండేవాడు. ఉపన్యాసాలు ఇస్తుండేవాడు. ఈ క్రమంలో కాల్పుల ప్రణాళికతో కూడిన మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నాడు. అతడు సామూహిక కాల్పులకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్టోబర్ 11వ తేదీన పలాటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. ఆకస్మిక తనిఖీఉల జరిపిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భారతీయులపై భయంకరమైన విద్వేషం..పాపోరాకిస్ టాకో బెల్ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. దర్యాప్తులో భాగంగా పాపోరాకిస్ ఎలక్ట్రానిక్ సమాచారాన్ని పరిశీలించిన పోలీసులు.. ‘వై ఐ ఫాట్: ఏకేఏ (అరోరా షూటర్స్ మేనిఫెస్టో)’ పేరుతో ఉన్న పత్రాన్ని గుర్తించారు. అందులో శ్వేతజాతి(వైట్పీపుల్) ఆధిపత్యవాద, తీవ్రవాద భావజాలంతోపాటు దక్షిణాసియా ప్రజలు.. అందునా ముఖ్యంగా భారతీయులపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.తోటి ఉద్యోగుల వాంగ్మూలాల ప్రకారం.. పాపోరాకిస్ ఇతర జాతుల ప్రజలపై అవమానకర వ్యాఖ్యలు చేసేవాడు. భారతీయులపై ప్రత్యేకంగా ద్వేషం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్ 11న దాడికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆ రోజు ప్రత్యేకమైనదని సహోద్యోగులతో చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అతడి ఇంట్లో రైఫిల్, తూటాలు, బాడీ ఆర్మర్తోపాటు ఇతర వ్యూహాత్మక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దాడికి సంబంధించిన వివరాలను అతను మరో వ్యక్తికి కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఏ ఆలయంపై దాడి చేయాలనుకున్న విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. కానీ, అరోరా వెంకటేశ్వరస్వామి ఆలయంపై దాడికి అతను స్కెచ్ గీసినట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి.రెండు అభియోగాలు..పాపోరాకిస్‌పై ఉగ్రవాద బెదిరింపులకు సంబంధించిన ఒక అభియోగంతోపాటు, రైఫిల్‌ను అక్రమంగా కలిగి ఉన్నాడనే మరో అభియోగాన్ని నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే అదనపు అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఎఫ్‌బీఐ కూడా విచారణలో సహకరిస్తోంది. కుక్ కౌంటీ కోర్టులో బుధవారం హాజరైన పాపోరాకిస్‌ను జడ్జి కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేశారు.ఆలయాలకు పోలీసుల హెచ్చరికలు..ఈ ఘటనతో అక్కడి పోలీసులు హిందూ ప్రార్థనా మందిరాలను అప్రమత్తం చేశారు. ఇల్లినాయిస్ స్టేట్‌లో మొత్తంగా 58 ఆలయాలు ఉన్నట్లు ఆన్లైన్ డాటా ఆధారంగా తెలుస్తోంది. దీంతో భక్తులు, ఆలయాల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన హిందూ అమెరికన్ ఫౌండేషన్.. పోలీసులు వేగంగా స్పందించడాన్ని అభినందించింది. అనుమానాస్పద సమాచారం లేదా ముప్పు కనిపిస్తే అధికారులకు తెలియజేయాలని హిందూ కమ్యూనిటీని కోరింది.ఇదీ చదవండి: సీజేపీకి అమెరికా నిధులు.. మోదీకి మద్దతుగా ఉద్యమం! -
ప్రతిభ–సాంకేతికతలను విడదీయలేరు
‘పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్’ కార్య క్రమం కింద విదేశీ ఉద్యోగులకు జారీ చేసే వీసాలను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల స్తంభింపజేసింది. ఆ నిర్ణయం ప్రసిద్ధ అమెరికన్ టెక్నాలజీ సంస్థలపైనే కాక, అగ్రశ్రేణి భారతీయ ఔట్ సోర్సింగ్ కంపెనీలపైన కూడా ప్రభావం చూపనుంది. అమెరికన్ల స్థానంలో విదేశీయులను తె చ్చుకునేందుకు ఈ ఉపాధి ఆధారిత కార్మిక పథకాలను (ఎంప్లాయ్మెంట్ బేస్డ్ లేబర్ ప్రోగ్రామ్స్) సాంకేతిక పరిశ్రమ దుర్వినియోగ పరుస్తోందనే కారణంపై అటువంటి నిర్ణయం తీసుకున్నట్లు అమెరికన్ ప్రభుత్వం సమర్థించుకుంది. అమెరికా ఇటువంటి స్వీయ సంరక్షణ చర్యలకు దిగడం ఇదే మొదటిసారేమీ కాదు. అమెరికా అధ్యక్ష పదవిని అలంకరిస్తున్న వారు దేశీయ రాజకీయ ప్రయోజనాల నిమిత్తం హెచ్–1బి వీసా లను ఒక తాయిలంలా వాడుకుంటూనే ఉన్నారు. విదేశాలలోని వారికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలకు ఇస్తున్న పన్ను విరామాలకు స్వస్తి పలుకుతున్నట్లు 2008లో అప్పటి అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. తర్వాత, జో బైడెన్ కూడా అదే పంథా అనుసరించారు. చవుక వనరులే అమెరికా చోదక శక్తితక్కువ వేతనాలకు లభించే సిబ్బంది సదుపాయాన్ని అమె రికన్ సాంకేతిక కంపెనీలు ఏనాటి నుంచో వినియోగించుకుంటు న్నాయి. సెమీకండక్టర్ల తయారీకి 1960లలో అవి ఆ వెసులుబా టును ఉపయోగించుకున్నాయి. అప్పట్లో ఆ పరిశ్రమకు పెద్ద సంఖ్య లో సిబ్బంది అవసరమయ్యేవారు. తర్వాత, సాఫ్ట్వేర్ సర్వీ సులు, ప్రోగ్రామింగ్లలోను అవి ఆ ప్రత్యేక ప్రయోజనాన్ని వదులు కోలేదు. ‘ఫెయిర్ చైల్డ్ సెమీకండక్టర్’ సంస్థ అధ్యక్షుడు రాబర్ట్ నాయస్, ఉత్పత్తి సదుపాయాలు నెలకొల్పేందుకు 1960 లలో భారత్, దాని చుట్టుపక్కల దేశాలను సందర్శించారు.భారత్ అనుమతించకపోవటంతో హాంగ్‌కాంగ్‌లో వాటిని నెలకొల్పు కున్నారు. మరికొద్ది ఏళ్ల తర్వాత ఆయన ‘ఇంటెల్’ను స్థాపించారు. ఎలక్ట్రానిక్స్, ఐసీ (ఇంటెగ్రేటెడ్ సర్క్యూ ట్స్) తయారీకి ఇతర అమెరికన్ కంపెనీలు సింగపూర్, మలేసియా, తైవాన్లను ఎంచు కున్నాయి. తదనంతర రెండు దశాబ్దాల్లో ఆయా దేశాలు సాంకేతిక వస్తూత్పత్తి కేంద్రాలుగా అవతరించాయి. సెమీకండక్టర్ డిజైన్, అమెరికన్ క్లయింట్లకు సాఫ్ట్వేర్ సర్వీసులు, ప్రోగ్రామింగ్‌తో భారత్ 1970లు, 1980లలో ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం చేసింది. అమెరికన్ సాంకేతిక పరిశ్రమతో భారత్ ఒడంబడికలు వివిధ పునరావృతులకు లోనయ్యాయి. మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా అవి పరిణామం చెందుతూ వచ్చాయి. అమెరికన్ సంస్థల స్వల్పకాలిక లేదా మధ్యకాలిక అవసరాల నిమిత్తం భారతీయ సంస్థలు తమ ఇంజనీర్లను అమెరికాకు పంపించడంతో ఇది చిన్నగా మొదలైంది. అమెరికాలో పని పూర్తికాగానే వారు స్వదేశానికి తిరిగి వచ్చేసేవారు. తదుపరి దశలో, అది ‘ఆన్సైట్’ మోడల్‌గా మారింది. అంటే, భారతీయ కంపెనీలు పంపిన ఉద్యోగులు అమెరికన్ కంపెనీల సిబ్బందిలో భాగమవుతారు. దీర్ఘకాలిక ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటారు. భారతీయ సంస్థలు అమెరికన్ క్లయింట్ల విశ్వాసాన్ని చూర గొని, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డ తర్వాత, ఆన్సైట్ పనిలో కొంత భాగం, భారతదేశం నుంచే చక్కబెట్టడం మొదలైంది. ఇది ‘ఆఫ్‌షోర్’ మోడల్ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. భారత్ నుండి 10,000 కోట్ల డాలర్లు!అమెరికాలో ఉంటున్న భారతీయులను నియోగించుకుని భారతీయ కంపెనీలపై ఆధార పడే బదులు, తామే భారతదేశంలో కొందరిని ఉద్యోగాల్లోకి తీసుకుని, అక్కడ నుంచే పని చేయించటం బాగుంటుందని అమెరికన్ కంపెనీలు గ్రహించాయి. ఇది మరింత తక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారంగా పరిణమించింది. మైక్రో సాఫ్ట్ 1990ల చివరలో దీనికి శ్రీకారం చుట్టింది. మరికొన్ని సంస్థలు కూడా అదే బాట పట్టాయి. బ్యాంకులు, బీమా సంస్థలు, లాజిస్టిక్స్ కంపెనీలు, విమానయాన సంస్థలు, న్యాయ సేవా సంస్థలు, గ్లోబల్ కన్సల్టింగ్–ఆడిటింగ్ దిగ్గజాలు తదితర సంస్థలు అదే తరహాననుసరించాయి. అవి తెర వెనుక చక్కబెట్ట వలసిన పనుల్లో చాలా వాటిని లేదా బిజినెస్ ప్రాసెస్లను బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, నోయిడా వంటి చోట్లకు తరలించాయి. ఔట్ సోర్సింగ్ వ్యాపారం గత ఇరవై ఏళ్లలో మరింత వైవిద్యీకరణకు లోనైంది. ఇంజనీరింగ్, ఆర్–డి, ప్రాడక్ట్ అభివృద్ధి వంటివి కూడా ఇందులో చేరాయి. అగ్ర సంస్థలు తమ ముఖ్య కార్య కలాపాల్లో కొన్నింటిని చక్కబెట్టేందుకు భారతదేశంలోనే విభాగా లను నెలకొల్పు కున్నాయి. ఇది పెద్ద మార్పు కింద లెక్క. కేవలం వ్యయాన్ని ఆదా చేసుకునేందుకుకాక, నవీకరణ, పరిశోధన, మేధా హక్కుల (ఐపి) సృష్టికి అవి భారత్‌లో నడుం బిగించాయి. ఈ రోజున, ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో దాదాపు ప్రతి కంపెనీకి దాని స్వీయ యాజమాన్య గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జి.సి.సి.)లు బెంగళూరు లేదా హైదరాబాద్ లలో ఉన్నాయి. అటువంటి సెంటర్లు 2025 నాటికి 2,100కి పైగా ఉన్నట్లు, అవి 23.6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్క తేలింది. అవి దాదాపు 10,000 కోట్ల అమె రికన్ డాలర్ల రాబడులకు దోహద పడుతున్నాయి. విడదీయరాని సాంకేతిక బంధంమెయిన్ ఫ్రేమ్ నుంచి మినీ, మైక్రో కంప్యూటర్ వరకు, ఇంట ర్నెట్, డాట్ కామ్, వై2కె, మొబైల్, సోషల్ మీడియా, క్లౌడ్, బిగ్ డేటా... ఇలా ప్రతి సాంకేతిక రూపాంతీకరణలోను భారతీయ టెక్నా లజీ కంపెనీలు కీలక పాత్ర వహించాయి. స్వయం ప్రతిపత్తితో వ్యవహరించగల కృత్రిమ మేధ (ఏఐ), వివిధ రంగాల్లో ‘డీప్ టెక్’ వాడకం మొదలవటంతో ఇపుడు కూడా అవి అదే పనిలో ఉన్నాయి. టెక్నాలజీ ఔట్సోర్సింగ్ ప్రక్రియ అమెరికా, భారత్‌లు రెండింటిలోను బాగా వేళ్లూనుకుపోయింది. దాన్ని వెనక్కి తిప్పడం అయ్యే పని కాదు. అమెరికా, ఇండియాలు పరస్పర ఆధారితమైనవి. వేగంగా అమలులోకి తెచ్చేందుకు, ప్రపంచవ్యాప్తంగా పనులు చేసేందుకు, స్థాయిని పెంచుకునేందుకు, ఇతర సానుకూలతలకు అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు భారతీయ ఇంజనీర్లు, ప్రతిభావంతుల అవసరం ఉంది. రాబడులను నిలబెట్టుకునేందుకు, యాక్సెస్ ఆపరేటింగ్ సిస్టం (విండోస్, యాపిల్, ఐఓఎస్, ఆండ్రాయిడ్)లకు, డెవలప్మెంట్ నిమిత్తం క్లౌడ్ మౌలిక వసతులకు అమెరికాతో వ్యాపారం చేయాల్సిన అవసరం భారతీయ కంపెనీలకు ఉంది. ఇది రాకపోకలు రెండింటికీ వీలున్న దారి.ఔట్ సోర్సింగ్ బిజినెస్‌తో పాటు, అమెరికాలోని సాంకేతిక శక్తి కేంద్రం సిలికాన్ వ్యాలీని చాలా వరకు భారత్, చైనా, ఇతర దేశాల నుంచి వెళ్లిన ప్రతిభావంతులే నడిపిస్తున్నారు. అమెరికా, వీసాలను స్తంభింపజేసినప్పటికీ ఆ బండి నడవవలసింది ప్రతిభ, సాంకేతికతల జోడెడ్లతోనే! - దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
పశ్చిమాసియా రాజకీయాల్లో ముగిసిన ఓ శకం.. ఇక పరిణామాలేంటి?
పశ్చిమాసియా రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. అదే.. ఇరాక్ నుంచి అమెరికా వైదొలిగింది. ఇప్పుడు పరిస్థితులు అంతకంటే పెద్ద సంక్షోభానికి తెరలేస్తుందా అన్నట్లుగా తయారవుతున్నాయి. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ప్రపంచాన్ని గడగడలాడించిన 'వార్ ఆన్ టెర్రర్' (War on Terror).. పాతికేళ్ల తర్వాత ఇప్పుడు అధికారికంగా ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి ఇరాక్ గడ్డపై మిగిలి ఉన్న చివరి అమెరికన్ బలగాలు కూడా పూర్తిగా వెనక్కి వచ్చేశాయి.ఇరాక్ ఉత్తర ప్రాంతాల్లో ఉన్న ఆ కొన్ని వందల మంది సైనికులు సైతం తమ సైనిక సామగ్రితో స్వదేశానికి పయనమయ్యారు. పైకి చూస్తే ఇది ఒక యుద్ధం ముగింపులా కనిపించవచ్చు. కానీ, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల మాటల్లో మాత్రం అమెరికా నిష్క్రమణ అనేది శాంతికి ఆరంభం కాదని, అగ్నిపర్వతం బద్ధలవ్వడానికి సంకేతమనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఇరాక్ అనేది ఒక సహజమైన దేశమా? లేక వలస పాలకులు బలవంతంగా నిర్మించిన రాజ్యమా? అమెరికా ఔట్ అయ్యాక.. ఇరాక్‌లో ఏం జరగబోతోంది..? పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.. -
అమెరికా కంపెనీలపై రష్యా దాడులు.. కోకాకోలా ప్లాంట్ ధ్వంసం
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీల స్థావరాలు దెబ్బతిన్నాయి. ప్రముఖ దిగ్గజ కంపెనీ కోకాకోలా ప్లాంట్ ధ్వంసం కాగా, మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ గిడ్డంగిపై కూడా దాడి జరిగింది. అంతేకాదు పెప్సికో ఉత్పత్తి కేంద్రం కూడా దెబ్బతిన్నట్లు సదరు సంస్థ వెల్లడించింది.ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. సెప్టెంబర్ ప్రారంభంలో కీవ్ సమీపంలోని కోకాకోలా ప్లాంట్ రష్యా డ్రోన్ దాడిలో ధ్వంసమైంది. సెప్టెంబర్ 25న కీవ్ ప్రాంతంలోని మెక్‌డొనాల్డ్స్ గిడ్డంగిపై దాడి జరగడంతో సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని రెస్టారెంట్లు కార్యకలాపాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. గత ఏడాది ఆగస్టులో మైకొలైవ్లోని పెప్సికో ఉత్పత్తి కేంద్రం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.అమెరికా కంపెనీలపై దాడులు జరుగుతున్నప్పటికీ ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగా ఖండించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో అమెరికా వ్యాపార సంస్థలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆండీ హండర్ పేర్కొన్నారు. ఈ దాడులపై చర్చించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో సమావేశం కావాలని కోరినా స్పందన రాలేదన్నారు. ఇదీలా ఉండగా మరోవైపు యుద్ధాన్ని ముగించి శాంతి ఒప్పందం కుదిరేలా అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తోందని వైట్‌హౌస్ తెలిపింది.అయితే దెబ్బతిన్న ప్రతి సంస్థను అమెరికా యాజమాన్యం కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని సదరు కథనం పేర్కొంది. ఇదీ చదవండి: పరువు నష్టం కేసు.. ట్రంప్ డిపాజిషన్ వాయిదా! -
పరువు నష్టం కేసు.. ట్రంప్ డిపాజిషన్ వాయిదా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై దాఖలు చేసిన 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 16న జరగాల్సిన ట్రంప్ డిపాజిషన్ వాయిదా పడింది. దేశానికి ప్రాముఖ్యమైన అనేక ఇతర పనుల కారణంగా ఆయన కోర్టుకు హాజరుకాలేరని ట్రంప్ తరఫు న్యాయవాదులు తెలిపారు.అయితే ట్రంప్ విచారణను నిరవధికంగా వాయిదా వేయలేరని పేర్కొంటూ బీబీసీ.. కోర్టును ఆశ్రయించింది. డిసెంబర్ నెల మధ్య వరకు ట్రంప్ అందుబాటులో ఉండరని, విచారణను జనవరికి వాయిదా వేయాలని ఆయన న్యాయవాదులు సూచించినట్లు బీబీసీ వెల్లడించింది. విచారణ గడువు ముగియడానికి మరో రెండు నెలల గడువు మాత్రమే ఉన్నందున, ట్రంప్ వాంగ్మూలానికి కచ్చితమైన తేదీని నిర్ణయించాలని న్యాయమూర్తిని కోరింది.అసలు కేసు ఏమిటంటే?2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ హింసకు సంబంధించి ట్రంప్ చేసిన ప్రసంగంలోని దృశ్యాలను బీబీసీ ఓ డాక్యుమెంటరీలో ఎడిట్ చేసి ప్రసారం చేసిందని ట్రంప్ ఆరోపించారు. ఆ ఎడిటింగ్ వల్ల తాను హింసను ప్రేరేపించినట్లు ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగిందని పేర్కొంటూ 2025 డిసెంబర్లో బీబీసీపై కేసు వేశారు. జరిగిన ఘటనపై బీబీసీ క్షమాపణలు చెప్పింది, ట్రంప్‌కు పరువు నష్టం కలిగించాలనే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేసింది. తొలుత 10 బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరిన ట్రంప్, అనంతరం తన ప్రతిష్ఠకు జరిగిన నష్టానికే పరిమితమయ్యారు. ఈ కేసు వ్యవహారంపై కోర్టులో వచ్చే వారం విచారణ జరగనుంది.ఇదీ చదవండి: లడఖ్‌పై చైనాకు భారత్ గట్టి కౌంటర్ -
సీజేపీపై అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు
కాక్రోచ్ జనతా పార్టీ, దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన కొందరు దాతలు వాళ్లకు నిధులు సమకూరుస్తున్నారని అన్నారు. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించే శక్తులు ఈ నిధుల వెనుక ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దేశంలో పాలనను అస్థిరపరిచే ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ భారత యువతకు పిలుపునిచ్చారామె.ఎక్స్‌లో చేసిన పోస్టులో మిల్బెన్.. మోదీని వ్యతిరేకించే అమెరికా దాతలు దీప్కే, సీజేపీకి నిధులు అందిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయవాద నాయకులను లక్ష్యంగా చేసుకోవడం కొందరు దాతల పద్ధతిగా మారిందని పేర్కొన్నారు. అమెరికాలో చదువుకున్న వ్యక్తులను గుర్తించి, వారిని తీవ్రవాద భావజాలం వైపు మళ్లించి, తిరిగి వారి దేశాలకు పంపి గందరగోళం సృష్టించేందుకు నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు.To all the beautiful young patriots in India: This is not the time to be silent. @abhijeet_dipke and the @Cockroachisback are being funded by donors in the U.S. who are against Prime Minister @NarendraModi and your future under his leadership. Do not fear, my young patriots. Your Prime Minister, who has served India for 25 years, 12 years as Prime Minister, elected three consecutive terms, is not going to bow to disruptive forces from my country. And these select donors have a pattern globally - target conservative global leaders, find an U.S. educated person from the country, radicalize them, send them back to the country, and fund them to start chaos and destruction. None of them have been successful but have impacted the development and governance of the country. It is time for a new voice in #India, born, raised, educated on the soil of India, to RISE UP, organize, and peacefully protest the disruptive spirit of the Cockroach Party. There should always be a counter movement to uphold democracy and freedom. Rise up, young patriots! Rise up!— Mary Millben (@MaryMillben) October 14, 2026ప్రజాజీవితంలో 25 ఏళ్ల అనుభవం, ప్రధానిగా 12 ఏళ్ల పాలన ఉన్న మోదీ.. తన దేశానికి చెందిన విచ్ఛిన్నకర శక్తులకు తలొగ్గబోరని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను కాపాడేందుకు ప్రతిఉద్యమం ఉండాలని పేర్కొంటూ.. భారత యువత సంఘటితమై సీజేపీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని కోరారు. ‘ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు.. యువ దేశభక్తులారా, ముందుకు రండి’ అంటూ పిలుపునిచ్చారు.బ్యాక్‌గ్రౌండ్ ఇదే..మేరీ మిల్బెన్ అమెరికాకు చెందిన గాయని, నటి. ఆఫ్రికన్-అమెరికన్ నేపథ్యానికి చెందిన ఆమె.. దేశభక్తి గీతాలు, జాతీయ గీతాల ఆలాపనతో గుర్తింపు పొందారు. అమెరికాలోని ఓక్లహోమాలో పాస్టర్ కుమార్తెగా పెరిగిన ఆమె.. సంగీత రంగంలోకి రాకముందు అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ప్రభుత్వంలో వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ అపాయింటీగా పనిచేశారు. అనంతరం గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికా అధ్యక్షుల కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఐదుగురు అమెరికా అధ్యక్షుల కార్యక్రమాల్లో జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలు ఆలపించారు.మోదీతో ప్రత్యేక అనుబంధంభారత్లోనూ మేరీ మిల్బెన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2022లో భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వ ఆహ్వానంపై ఆమె తొలిసారి భారత్‌కు వచ్చారు. అదే ఏడాది స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. 2023 జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా అధికారిక పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన కార్యక్రమంలో భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ పాల్గొన్న అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో ఆమె పేరు భారత్‌లో బాగా చర్చకు వచ్చింది. మోదీ ప్రభుత్వానికి మద్దతుగా గతంలోనూ ఆమె పలుమార్లు వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే బీజేపీ నేతల ప్రశ్నలుసీజేపీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న అంశంపై బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్.. ప్రతిపక్ష నేతలు, సీజేపీ విదేశీ మద్దతుతో దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సైతం డిప్కే కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నవారెవరని ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను దీప్కే తోసిపుచ్చారు. పైగా విదేశీ నిధులు సీజేపీ కార్యకలాపాలకు చేరి ఉంటే, అది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వైఫల్యమే అవుతుందని వ్యాఖ్యానించారు. అదెలాగో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఉన్న మంత్రిత్వ శాఖనే వివరించాలని సెటైర్ వేశారు. ప్రస్తుతం సీజేపీ నేతలు, మద్దతుదారులు ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో మిల్బెన్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ క్రమంలో విదేశీ నిధుల ఆరోపణలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి.ఇదీ చదవండి: అప్రకటిత ఎమర్జెన్సీ ఎందుకు మోదీగారూ? -
ఇరాన్ కొత్త గేమ్.. ట్రంప్–నెతన్యాహుకు చుక్కలే!
ఇరాన్ యుద్ధంలో మరో కీలక మలుపు! అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో సైనికంగా దెబ్బతిన్నా.. హార్ముజ్ జలసంధి వద్ద కొత్త వ్యూహాలతో ఇరాన్ ఎదురుదాడికి దిగుతోంది. చమురు నౌకలపై దాడులను పెంచడంతో పాటు, తమ ఆంక్షలను ఉల్లంఘించే నౌకలకు ఈ మార్గాన్ని మూసివేయాలని భావిస్తోంది. ప్రపంచ చమురు ధరలు తగ్గకుండా చూడటం, నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ల అవకాశాలను దెబ్బతీయడం కూడా తమ వ్యూహంలో భాగమని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.మరోవైపు, ఇరాన్‌పై మళ్లీ భారీ సైనిక దాడులు చేయాలా? లేదంటే ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనంతో ఒత్తిడి కొనసాగించాలా? అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందిగ్ధంలో ఉన్నాడట. ఇటు ఇరాన్ అణు కార్యక్రమం తిరిగి ఊపందుకుంటోందన్న ఆందోళనతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త దాడులకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.హార్ముజ్ వద్ద కొత్త ఎత్తుగడలుఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం నుంచే సాగేది. నౌకల రాకపోకలను పరిమితం చేసి అమెరికాపై ఒత్తిడి పెంచాలని టెహ్రాన్ భావిస్తోంది. గత పది రోజులుగా దాడుల వ్యూహాన్ని మార్చినట్లు ఇద్దరు సీనియర్ ఇరాన్ అధికారులు రాయిటర్స్‌కు వెల్లడించారు.చిన్న పడవలతో నిఘా.. ఆపై దాడులు!అమెరికా దాడుల్లో ఇరాన్ రాడార్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కొత్త పద్ధతిని అనుసరిస్తున్నట్లు అమెరికా సైనిక అధికారి తెలిపారు. ఆయుధాలు లేని చిన్న పడవల్లో నిఘా సిబ్బందిని పంపి, అమెరికా నౌకాదళంతో పాటు ఇతర లక్ష్యాల కదలికలను గుర్తిస్తున్నట్లు వివరించారు. గత వారం ఇలాంటి ఓ పడవలోని సిబ్బంది సమాచారాన్ని ఐఆర్‌జీసీకి చేరవేస్తున్నట్లు గుర్తించిన అమెరికా బలగాలు వారిని బయటకు పంపించి, పడవను ధ్వంసం చేశాయని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదన్నారు.గల్ఫ్ ఆఫ్ ఒమన్ వరకూ విస్తరణ?హార్ముజ్కే పరిమితం కాకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఖతార్, యూఏఈ తీరాలకు సమీపంలోని సముద్ర జలాల్లోనూ కార్యకలాపాలను విస్తరించాలన్నది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. గత 48 గంటల్లో ట్యాంకర్లతో సహా వాణిజ్య నౌకలకు సంబంధించి కనీసం ఐదు ఘటనలు నమోదయ్యాయి. వీటిలో డ్రోన్ దాడులు కూడా ఉన్నట్లు సమాచారం. తమ ఆంక్షలను ఉల్లంఘించే నౌకలకు హార్ముజ్ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలను తగ్గించేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని పేర్కొంటున్నారు. హార్ముజ్ వద్ద వాణిజ్య నౌకలకు ముప్పు తీవ్రంగానే ఉందని జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా హెచ్చరించింది.దాడులు చేయాలా? ఆగాలా?ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య చేపట్టే అంశంపై ట్రంప్, నెతన్యాహు చర్చించినట్లు ఆక్సియోస్ కథనం వెల్లడించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ‘పికాక్స్ మౌంటెన్’ ప్రాంతాన్ని యురేనియం శుద్ధి కేంద్రంగా ఉపయోగించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సెంట్రల్ కమాండ్ నాయకత్వం సైనిక చర్యకు మద్దతిస్తున్నట్లు కథనం పేర్కొంది. అయితే ట్రంప్ సలహాదారుల్లో ఎక్కువమంది ఆర్థిక ఆంక్షలు, ఇతర ఒత్తిడి మార్గాలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.దాడులపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోలేదని, నవంబర్ 3న జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడి చేయబోమని ఆయన ప్రకటించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. ట్రంప్, నెతన్యాహు మళ్లీ యుద్ధం ప్రారంభించే అంశంపై చర్చించారన్న వార్తలను వైట్‌హౌస్ అధికారి ఖండించారు. ఇరువురు నేతల మధ్య క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుగుతాయని నెతన్యాహు కార్యాలయం పేర్కొంది.ఎన్నికలే అసలు లెక్కా?ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న, అమెరికాలో నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే నెతన్యాహుకు రాజకీయంగా ప్రయోజనం కలగవచ్చన్న అంచనాలున్నా, ఇరాన్ ప్రతిదాడులతో ఎన్నికలు వాయిదా పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా ఉంది. అమెరికాలో యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగితే ట్రంప్ రిపబ్లికన్లకు ఎన్నికల్లో నష్టం వాటిల్లవచ్చు. అందుకే సైనిక చర్యపై ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.అమెరికా ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేస్తోంది. హార్ముజ్ వద్ద ఇరాన్ కొత్త వ్యూహాలు, అమెరికా–ఇజ్రాయెల్ సైనిక సన్నద్ధత మధ్య ట్రంప్ తీసుకునే నిర్ణయం యుద్ధ భవిష్యత్తుతో పాటు ప్రపంచ చమురు ధరలు, ఎన్నికల రాజకీయాలపైనా ప్రభావం చూపనుంది.ఇదీ చదవండి: 30 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ! -
దొరికిన కోట్ల విలువ చేసే వజ్రం .. రాత్రికి రాత్రే మారిన రాత!
వాషింగ్టన్: తంతే బంగారు పాన్పులో పడ్డాడు అనే సామెత మనం తరచుగా వాడుతుంటాం.. అమెరికాలో ఓ వ్యక్తి విషయంలో సరిగ్గా ఇటువంటి ఘటన జరిగింది. ఎన్నో ఏళ్లుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న ఓక వ్యక్తికి ఎట్టకేలకు అదృష్ట లక్ష్మీ కరుణించింది. అతని కష్టానికి డబుల్ బోనస్‌గా కోట్ల విలువ చేసే వజ్రం దొరికింది. అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌లో ఓ వ్యక్తికి అత్యంత అరుదైన పసుపు రంగు వజ్రం లభించింది. దాదాపు 6.03 క్యారెట్ల బరువున్నఈ వజ్రం జాక్ పీరాడిన్ అనే రత్నాల అన్వేషకుడికి దొరికింది. దీని విలువ సుమారు 10 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.8.3 కోట్ల నుంచి రూ.9.6 కోట్ల వరకు) ఉండవచ్చని అంచనా . ఈ వార్తను అక్కడి ప్రముఖ మ్యాగజైన్ పీపుల్ ప్రచురించింది.వివరాల్లోకి వెళితే..ఈ ఏడాది జనవరిలోపీరాడిన్ తన స్నేహితుడు మైఖేల్ షూమేకర్‌తో కలిసి అక్కడి మట్టిని, చిన్న రాళ్లను వేరు చేస్తుండగా ఈ వజ్రం బయటపడింది. ఈ అరుదైన ఘటన టిక్‌టాక్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో ఇది మరింత వైరల్‌గా మారింది. గోరు పరిమాణంలో కనిపించిన ఆ రాయిని దగ్గరగా పరిశీలించగా అది అరుదైన పసుపు వజ్రమని గుర్తించి వారిద్దరూ ఆశ్చర్యపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆ పార్కులో లభించిన వజ్రాల్లో ఇదే అతిపెద్దదని పార్కు అధికారులు ధ్రువీకరించారు.అయితే ఈ వజ్రం లభించిన అనంతరం జాక్ పీరాడిన్ మాట్లాడుతూ.. “నేను దానికి సుమారు ఎనిమిది అడుగుల దూరంలో ఉన్నాను. అయితే, ఏదో కారణంతో వెనక్కి తిరిగి చూడగా, రాళ్ల కుప్ప మధ్యలో నుంచి అది మెరుస్తూ కనిపించింది” అని తెలిపారు. ఆయన వజ్రాల అన్వేషణ 2013లో ప్రారంభమైంది. అప్పట్లో సరదాగా ఈ పార్కును సందర్శించిన ఆయనకు వజ్రాల కోసం వెతకడంపై క్రమంగా ఆసక్తి పెరిగింది. ఇది కాస్త వ్యసనంగా మారింది. ఎంతలా అంటే చివరకు ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండేందుకు మిస్సోరీ నుంచి అర్కాన్సాస్‌లోని మర్ఫ్రీస్బరో సమీపానికి మారిపోయారు. అప్పటి నుంచి వజ్రాల కోసం నిరంతరం అన్వేషణ కొనసాగిస్తునే ఉన్నారు. అయితే, ఇన్నేళ్లుగా వజ్రాల కోసం వెతుకుతున్నప్పటికీ తన అభిరుచి పెద్దగా ఆర్థిక ప్రయోజనాన్ని అందించలేదని తెలిపారు. ఈ 13 ఏళ్ల కాలంలో ఆయన 300కు పైగా చిన్న వజ్రాలను గుర్తించినప్పటికీ వాటికి అంత విలువ లేదని పేర్కొన్నారు. అమెరికన్ డ్రీమ్ వజ్రంతో తన కల సాకారమైందని పేర్కొన్నారు. -
అమెరికా రాయబారి మెచ్చిన దుర్గా పూజ..! ఆ కారణంగానే స్పెషల్..
దేవి నవరాత్రుల సందడి మొదలైంది. యావత్తు భారతదేశం ఈ సమయంలో భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మికతతో విలసిల్లుతుంది. ఎటు చూసినా.. పండుగ శోభతో మనోహరంగా ఉంటుంది. అందులోనూ ఈ దుర్గా పూజ కోల్‌కతాలో మరింత ప్రత్యేకం. అక్కడ దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ వేడుకలను ప్రత్యేకంగా వీక్షించేందుకు కోల్‌కతాలో పర్యటించారు. అంతేగాదు ఈ పండుగపై తన అభిప్రాయాలను కూడా సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో ఇలా పంచుకున్నారు. కోల్‌కతాకు తిరిగి రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ పర్యటన సందర్భంగా నగరంలో కొన్ని అందమైన దుర్గా పూజ పండాల్లను సందర్శించి, ఈ వేడుకతో ముడిపడి ఉన్న సృజనాత్మకతను, సాముహిక స్ఫూర్తిని అనుభవించానని అన్నారు. ఈ పర్యటనలో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందానన్నారు. అంతేగాదు ఈ దుర్గాపూజ ప్రతి ఒక్కరికి ఎందుకింతో ప్రత్యేకమో అనుభవపూర్వకంగా అర్థమైందన్నారు. అలాగే అందరికీ దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఈ వేడుకలో అమ్మవారి విగ్రహాలను తయారు చేయు విధానం, ఆ పూజలో దాగున్న సమాజ స్ఫూర్తి ఈ పండుగను మరింత ప్రత్యేకం చేశాయని నొక్కి చెప్పారు. అందుకే ఈ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ దుర్గా పూజ శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు అమెరికా రాయబారి సెర్గియో. Great to be back in Kolkata! Visited some beautiful pandals and experienced firsthand the incredible creativity, community spirit, and warmth. I can see why this celebration is so special. Happy Durga Puja to everyone celebrating! https://t.co/PsX4imUqhD— Ambassador Sergio Gor (@USAmbIndia) October 12, 2026ఇదీ చదవండి: నటి యామీ గౌతమ్ ధరించిన కుర్తాసెట్.. అన్ని లక్షలా..! -
నక్కజిత్తుల మస్క్.. అడ్డంగా బుక్కయ్యాడుగా!
భారత్‌లో వ్యాపార గుత్తాధిపత్యాలపై గళమెత్తిన టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతులు ఆలస్యం కావడానికి కొందరు సంపన్న వ్యాపారవేత్తలే కారణమంటూ ఆరోపించిన మస్క్.. రిలయన్స్, బీజేపీ మధ్య సంబంధాలపై విమర్శలు గుప్పించారు. అయితే, అమెరికాలో రిపబ్లికన్లు అధికారంలో కొనసాగేందుకు భారీగా రాజకీయ విరాళాలు అందించడంపై ఇప్పుడు ఆయనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సెనేటర్ బెర్నీ శాండర్స్ మస్క్‌పై తీవ్రంగా స్పందించారు.అమెరికాలో రాజకీయాల కోసం మస్క్ ఖర్చు చేస్తున్న భారీ మొత్తాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు కాంగ్రెస్‌పై తమ పట్టును కొనసాగించేందుకు మస్క్ సుమారు 36.6 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి. ఇందులో జూలై నుంచి అందించిన విరాళాలే కనీసం 27.6 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు పేర్కొన్నాయి.రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థులకు మద్దతిచ్చే సెనేట్ లీడర్షిప్ ఫండ్‌కు 15.8 కోట్ల డాలర్లు, తన రాజకీయ కమిటీ అమెరికా పీఏసీకి 7.6 కోట్ల డాలర్లు అందించినట్లు నివేదికలు తెలిపాయి. ఇతర రిపబ్లికన్ అనుకూల రాజకీయ కమిటీలకూ ఆయన నిధులు సమకూర్చారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా కూడా మస్క్ భారీగా ఖర్చు చేశారు.‘సంపన్నుల గుప్పిట్లో రాజకీయాలా?’మస్క్ విరాళాలపై అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ తీవ్రంగా స్పందించారు. 2024లో ట్రంప్ గెలుపు కోసం మస్క్ సుమారు 29 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల పట్టు కొనసాగేందుకు మరో 36.6 కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నారని విమర్శించారు. సంపన్నులు తమ ఆర్థిక శక్తితో రాజకీయ వ్యవస్థపై అసాధారణ ప్రభావం చూపుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎన్నికల ప్రచారానికి కొద్దిమంది బిలియనీర్లు భారీగా నిధులు సమకూర్చే పరిస్థితి పెరిగితే.. సామాన్య ప్రజల సమస్యల కంటే సంపన్నుల ప్రయోజనాలకే రాజకీయాల్లో ప్రాధాన్యం పెరిగే ప్రమాదం ఉందన్నది శాండర్స్ వాదన. రాజకీయ వ్యవస్థ కొద్దిమంది ధనవంతుల గుప్పిట్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మస్క్ విరాళాలను ప్రస్తావిస్తూ, సంపదను రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.స్టార్‌లింక్ ఎంట్రీతో మొదలైన వివాదంప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న మస్క్‌కు భారత్ కీలక మార్కెట్. అయితే, దేశంలో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. కొందరు భారతీయ ‘ఒలిగార్క్’లు తమ వ్యాపార గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.‘ఒలిగార్క్’ అంటే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై అసాధారణ ప్రభావం చూపగల కొద్దిమంది సంపన్నులు లేదంటే శక్తిమంతుల సమూహం. భారత్‌లో అలాంటి వ్యాపారవేత్తలే పోటీని అడ్డుకుంటున్నారన్నది మస్క్ వాదన. స్టార్‌లింక్‌కు మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తే వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయం. అయితే, అనుమతుల ప్రక్రియలో జాప్యానికి వ్యాపార గుత్తాధిపత్యాలే కారణమన్న ఆరోపణ నిర్ధారణ కాలేదు.‘ప్రధాని అంబానీనా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలుఈ వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని మస్క్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ‘భారత్‌కు అసలైన బాస్ అంబానీనా?’ అన్న అర్థం వచ్చేలా ప్రశ్నించడంతోపాటు ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. భారత్‌లో టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లో వ్యాపార ప్రయోజనాలు, పోటీ, ప్రభుత్వ అనుమతులపై ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. భారత్‌లోనూ మస్క్‌కు కౌంటర్లుమస్క్ వ్యాఖ్యలపై భారతీయుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఒక సంస్థకు మార్కెట్లో పోటీ చేసే అవకాశం ఉండాలని కోరడం వేరు.. తన వ్యాపారానికి అనుకూలంగా నిర్ణయాలు రావాలని కోరుతూ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలపై ఆరోపణలు చేయడం వేరన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్టార్‌లింక్‌కు అనుమతులు ఇవ్వాలా వద్దా అన్నది నిబంధనలు, భద్రతా ప్రమాణాల ఆధారంగా నిర్ణయించాలే తప్ప, వ్యాపారవేత్తల మధ్య ఆరోపణలతో తేల్చకూడదని పలువురు పేర్కొన్నారు.మస్క్ వాదనకే ఎదురుప్రశ్న!ఇక్కడే మస్క్ వాదనపై విమర్శకులు ఎదురుప్రశ్నలు సంధిస్తున్నారు. భారత్ విషయంలో సంచలన ఆరోపణలు చేస్తూ.. అమెరికాలో మాత్రం ఒక రాజకీయ పక్షం అధికారంలో కొనసాగేందుకు భారీగా నిధులు సమకూరుస్తున్నారు. ఇతరుల ఆర్థిక ప్రభావాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తి.. తన సంపదతో రాజకీయాలపై ప్రభావం చూపడాన్ని ఎలా చూడాలన్న ప్రశ్నను సీనియర్ పొలిటీషియన్ అయిన శాండర్స్ ముందుకు తెచ్చారు. మరి అమెరికాలో తన రాజకీయ విరాళాలపై వస్తున్న ప్రశ్నలకు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఏఐ విషయంలో అన్నీ అతి భయలేనా? -
మధ్యంతర ఎన్నికలకు మస్క్ భారీ విరాళం
వాషింగ్టన్: అమెరికాలో నవంబర్ మూడో తేదీన జరగాల్సిన మధ్యంతర ఎన్నికలకు గాను అధ్యక్షుడు ట్రంప్ సారథ్యంలోని అధికార రిపబ్లికన్ పార్టీకి స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ అత్యధికంగా విరాళాలను అందజేసినట్లు వెల్లడైంది. ఆయన ఏకంగా 276 మిలియన్ డాలర్లు అంటే, రూ. 2,638 కోట్లు విరాళంగా సమకూర్చారు. డెమోక్రాటిక్ పార్టీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి దన్నుగా ఉండేందుకు జూలై నుంచి ఈ మొత్తాన్ని అందజేస్తూ వచ్చారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. 2025–26 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రచారానికిగాను మస్క్ అత్యధికంగా రిపబ్లికన్లకు మొత్తమ్మీద 366 మిలియన్ డాలర్లు, అంటే రూ.3,500 కోట్లు ఇచ్చినట్లయిందని పేర్కొ ంది. 2024 ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారానికి గాను 290 మిలియన్ డాలర్లు, అంటే రూ.2,772 కోట్లు అందించారని కూడా తెలిపింది. -
చిన్నారులపై లైంగిక దోపిడీ.. అమెరికా నుంచి కోట్లలో చెల్లింపులు!
ఫిలిప్పీన్స్‌లో చిన్నారులపై ఆన్లైన్ లైంగిక దోపిడీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ దర్యాప్తు ప్రకారం.. దాదాపు 5 లక్షల మంది చిన్నారులను బలవంతంగా లైంగిక వేధింపులు చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు, లైవ్‌స్ట్రీమింగ్ కంటెంట్ తయారీలో ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కంటెంట్‌ను వీక్షించేందుకు అత్యధికంగా అమెరికా నుంచి డబ్బులు చెల్లిస్తున్నట్లు ఈ దర్యాప్తులో వెల్లడైంది.2020 నుంచి 2022 మధ్య చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ కోసం అమెరికా కొనుగోలుదారులు ఫిలిప్పీన్స్‌కు 70 లక్షల డాలర్లకు పైగా పంపినట్లు సదరు మీడియా సంస్థ పేర్కొంది. అంతేకాదు 2015 నుంచి 2023 వరకు ఈ తరహా కంటెంట్‌ను కొనుగోలు చేసిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉన్నట్లు ఫిలిప్పీన్స్ యాంటీ మనీ లాండరింగ్ కౌన్సిల్ తెలిపింది.చిన్నారుల తల్లులే నిందితులుకుటుంబ సభ్యుల పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని బాలికలను ఈ అకృత్యాల్లోకి నెడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయంలో గతేడాది చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించి అరెస్ట్ అయిన మొత్తం 50 మంది మహిళల్లో 32 మంది బాధిత చిన్నారుల తల్లులేనని సదరు సంస్థ పేర్కొంది.అంతేకాదు బాధితుల్లో ఐదేళ్ల వయసున్న చిన్నారులు కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కొందరు మహిళలు మెసేజింగ్ యాప్‌ల ద్వారా విదేశీ కస్టమర్లతో సంబంధాలు కొనసాగిస్తూ, వారి కోరికల మేరకు చిన్నారులపై లైంగిక దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది.లైంగిక దోపిడీ కట్టడి చర్యలు సరిపోతున్నాయా?చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు ఉన్నాయి. టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అక్రమ విక్రయాలు కొనసాగుతున్నట్లు పరిశోధనలు గుర్తించాయి. ఈ నేరాలను అరికట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో కఠిన చర్యలు, ఆన్లైన్ పర్యవేక్షణతో పాటు బాధిత చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: హౌతీ దెబ్బకు వణుకుతున్న సౌదీ?.. లక్షల కోట్లు బుగ్గిపాలేనా? -
యూఎస్ఏ ప్లేయర్‌ను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఎడమచేతి వాటం పేసర్ తారా నోరిస్‌ను ఆ జట్టు యూపీ వారియర్జ్ నుంచి ట్రేడ్ చేసుకుంది. నోరిస్‌ను ఎంఐ తన పాత ధర రూ.10 లక్షలకే సొంతం చేసుకుంది. ఎంఐ-వారియర్జ్ మధ్య నగదు రూపంలో ఈ ట్రేడ్ జరిగినట్లు తెలుస్తోంది. తొలుత వారియర్జ్ రిటెన్షన్ జాబితాలో చోటు దక్కించుకున్న నోరిస్.. తాజా ఒప్పందంతో ముంబై ఇండియన్స్‌కు మారింది. మినీ వేలానికి ముందు జరిగిన ఈ మార్పు వారియర్జ్, ముంబై ఇండియన్స్ జట్ల కూర్పుపై ప్రభావం చూపనుంది.ఎంఐకు లబ్దినోరిస్ చేరికతో ముంబై ఇండియన్స్‌కు లబ్ది చేకూర్చనుంది. ఇప్పటికే పటిష్టంగా ఉన్న ఆ జట్టు బౌలింగ్ విభాగానికి నోరిస్ రూపంలో మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. 2027 డబ్ల్యూపీఎల్ సీజన్ కోసం జట్ల కూర్పు జరుగుతున్న వేళ నోరిస్ చేరిక ఎంఐకు తప్పకుండా కలిసొచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 'సిక్సర్ల' ప్రపంచ రికార్డు -
అమెరికా రాజకీయ నేతల్లో క్షణక్షణం చావు భయం..
-
సౌదీపై హౌతీల పంజా.. అమెరికా ఎంట్రీ ఖాయమేనా?
పశ్చిమాసియాలో మరో యుద్ధం ముంచుకొస్తోందా? యెమెన్‌లోని హౌతీ రెబల్స్ సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేయడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. రాజధాని రియాద్‌లోని ప్రధాన విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరగడం, మరోవైపు ఎర్ర సముద్రానికి దక్షిణ ప్రవేశ ద్వారమైన బాబ్ అల్-మండేబ్ సమీపంలో పోరు ఉధృతం కావడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయి. ఈ దాడుల్లో అమెరికా పౌరుడు కూడా మరణించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై స్పందించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా నేరుగా రంగంలోకి దిగితే ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉంది.యెమెన్‌లో ప్రభుత్వ దళాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. సౌదీ మద్దతుతో యెమెన్ ప్రభుత్వ దళాలు హౌతీల ఆధీనంలోని ప్రాంతాలపై ఒత్తిడి పెంచుతుండగా.. హౌతీలు సౌదీ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడం వల్ల ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవలి దాడుల్లో ప్రాణనష్టం, గాయాల సంఖ్య పెరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సౌదీపై దాడులు కొనసాగితే యెమెన్‌లో ఇప్పటికే ఉన్న సంఘర్షణ పొరుగు దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.అమెరికా ఏం చేయబోతోంది?ఇప్పటికే ఈ దాడుల్ని ట్రంప్ ఆమోద యోగ్యం కాదని అన్నారు. అయితే అమెరికన్ మృతిపై మాత్రం ఆయన ఇంకా స్పందించాల్సి ఉంది. సౌదీ అరేబియా అమెరికాకు కీలక ప్రాంతీయ భాగస్వామి. ఆ దేశంపై దాడులు పెరిగి, అమెరికా పౌరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే వాషింగ్టన్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. హౌతీలపై ప్రత్యక్ష సైనిక చర్యకు దిగాలా? లేదంటే సౌదీ రక్షణ వ్యవస్థలకు సహకారం అందిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచాలా? అనే అంశాలపై అమెరికా నిర్ణయం కీలకం కానుంది.అమెరికా నేరుగా దాడులకు దిగితే హౌతీలు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశముంది. దాంతో సౌదీతోపాటు ఎర్ర సముద్రం, గల్ఫ్ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారొచ్చు. మరోవైపు, సైనిక చర్యకు బదులుగా దౌత్యపరమైన ఒత్తిడి, రక్షణ సహకారం వంటి మార్గాలను ఎంచుకుంటే ఘర్షణ విస్తరణను అడ్డుకునే అవకాశం ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఈ ప్రాంత భవిష్యత్ పరిణామాలపై ప్రభావం చూపనుంది.బాబ్ అల్-మండేబ్ వద్ద కీలక పోరుఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్‌తో కలిపే బాబ్ అల్-మండేబ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకం. ఈ మార్గం గుండా నౌకలు సూయజ్ కాలువ వైపు ప్రయాణిస్తాయి. ఇక్కడ నౌకాయానానికి అంతరాయం ఏర్పడితే ఆసియా–యూరప్ మధ్య సరుకు రవాణా ఆలస్యమవడంతోపాటు రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. యెమెన్ తీర ప్రాంతాల్లో హౌతీల ప్రభావం, సముద్ర మార్గాలపై దాడుల ముప్పు కారణంగా అంతర్జాతీయంగా ఈ ప్రాంతంపై నిఘా పెరిగింది. సౌదీపై దాడులు, బాబ్ అల్-మండేబ్ వద్ద ఉద్రిక్తతలు ఒకేసారి పెరిగితే సమస్య కేవలం రెండు పక్షాల మధ్య ఘర్షణగా మిగలదు. అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరా, సముద్ర భద్రతపైనా ప్రభావం పడవచ్చు.పాకిస్తాన్, టర్కీ సాయం ఎంతవరకు?సౌదీ అరేబియా తన భద్రత కోసం ప్రాంతీయ భాగస్వాముల సహకారాన్ని కోరే అవకాశం ఉంది. పాకిస్తాన్, టర్కీతో సౌదీకి ఉన్న రక్షణ సంబంధాలు ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అయితే, రక్షణ ఒప్పందాలు ఉన్నంత మాత్రాన ఈ దేశాలు నేరుగా యుద్ధంలోకి దిగుతాయని చెప్పలేం. ఎలాంటి దాడి జరిగితే ఎలాంటి సహకారం అందించాలి? అది రక్షణకే పరిమితమా? లేక ప్రత్యక్ష సైనిక చర్యకూ విస్తరిస్తుందా? అనేది ఆయా దేశాల నిర్ణయాలు, ఒప్పంద నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.సౌదీకి రక్షణ సహకారం పెరిగితే హౌతీల దాడులను అడ్డుకునే సామర్థ్యం మెరుగుపడవచ్చు. అదే సమయంలో, అనేక దేశాలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదమూ ఉంది. అందుకే సైనిక సన్నద్ధతతోపాటు దౌత్యపరమైన చర్చలు కూడా కీలకం కానున్నాయి.పెట్టుబడులు, చమురు మార్కెట్లపై ప్రభావంపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా చమురు మార్కెట్లు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు అప్రమత్తమవుతారు. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో కీలక దేశం కావడంతో అక్కడి భద్రతకు ముప్పు ఏర్పడితే ధరల్లో ఒడిదుడుకులు తలెత్తవచ్చు. ఎర్ర సముద్రం, బాబ్ అల్-మండేబ్ మార్గాల్లో నౌకాయానానికి అంతరాయం కలిగితే సరుకు రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.సౌదీ చేపడుతున్న భారీ అభివృద్ధి ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడులపై కూడా దీర్ఘకాలిక అస్థిరత ప్రభావం చూపవచ్చు. అయితే, దాడులు జరిగినంత మాత్రాన చమురు సరఫరా లేదంటే పెట్టుబడులకు తక్షణమే భారీ నష్టం వాటిల్లుతుందని భావించలేం. దాడుల తీవ్రత, వాటి కొనసాగింపు, కీలక మౌలిక సదుపాయాలకు జరిగే నష్టం వంటి అంశాలే ప్రభావాన్ని నిర్ణయిస్తాయి.యుద్ధం విస్తరిస్తుందా?ప్రస్తుతం ప్రధానంగా గమనించాల్సిన అంశాలు మూడు. సౌదీపై హౌతీల దాడులు కొనసాగుతాయా? అమెరికా ప్రత్యక్ష సైనిక చర్యకు దిగుతుందా? బాబ్ అల్-మండేబ్ వంటి కీలక సముద్ర మార్గాల్లో భద్రతకు ముప్పు పెరుగుతుందా? వీటికి లభించే సమాధానాలే తదుపరి పరిణామాలను నిర్దేశించనున్నాయి. సౌదీపై దాడులకు ప్రతిగా పెద్ద ఎత్తున సైనిక చర్యలు జరిగితే యెమెన్ ఘర్షణ ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. అదే సమయంలో, దౌత్యపరమైన ప్రయత్నాలు, రక్షణ చర్యలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావొచ్చు. ఒక్కో దాడి వెనుక వ్యూహం ఏమిటి? దానికి ప్రతిస్పందనగా ఏ దేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది.BIG BREAKING 🇸🇦 Houthis Launched Another Fresh attack on Riyadh, Saudi Arabia; One Indian k*lled, 11 people injured in this attack; Airport operations have been suspended. #Houthis #DroneAttack #RiyadhAirport #SaudiArabia https://t.co/EywQwa2AJt— Kamalraj Singh (@kamalrajsingh_) October 12, 2026ఇదీ చదవండి: హర్ముజ్‌పై ఊహించని ట్విస్ట్ -
‘అమెరికా కలలు’భారత్ వైపు..
సాక్షి, హైదరాబాద్: భారతీయ విద్యార్థులు అమెరికా ఆశల నుంచి మెల్లగా బయటపడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ రోజుకో నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు భారత్ వైపు చూస్తున్నారు. స్థానికంగా ఉన్న అవకాశాలే మెరుగన్న రీతిలో యోచిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) 70 వేల డాలర్లు చేస్తానంటూ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత అగ్రరాజ్యంలో ఉద్యోగాలు కష్టమన్న భావన విద్యార్థుల్లో బలపడుతోంది. మరోవైపు విదేశీ విద్యార్థులపై యూఎస్‌లో నిఘా పెరుగుతోంది.చదువు కోసమే వచ్చిన విద్యార్థులకు ఇబ్బంది లేదంటున్నారు. కానీ చదువుతూ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారికి ట్రంప్ తాజా నిర్ణయాలతో సమస్యలు తప్పవంటున్నారు. హెచ్1–బీ వీసా పొందిన వారిపైనా కత్తి వేలాడుతోందని ఎన్ఆర్ఐలు అంటున్నారు. ఈ పరిణామాలన్నీ భారత్‌లో ఉన్న తల్లిదండ్రులకు గుబులు పుట్టిస్తున్నాయి.ఆ వర్సిటీలపై దృష్టి2022–23లో భారత్ నుంచి అమెరికాకు 2,68,923 మంది వెళ్తే, 2023–24లో ఈ సంఖ్య 3,31,602కు పెరిగింది. ప్రధానంగా ఐదు యూనివర్సిటీల్లో విద్యార్థులు చేరుతున్నారు. వీటిపైనే అమెరికా అధికారులు ప్రత్యేక ని«ఘా పెట్టినట్టు తెలుస్తోంది. న్యూయార్క్ వర్సిటీ, నార్త్ ఈస్ట్రన్ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియో నిఘా జాబితాలో ఉన్నాయి. వీటి లక్షకుపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్ ఏంజెలిస్ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. కొన్ని వర్సిటీలు వారానికి ఒక క్లాసు కూడా నిర్వహించడం లేదు. విద్యార్థులు మిగతా సమయంలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. ఇలాంటి వారిని వెతికి పట్టుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఓపీటీ చిక్కులుఅమెరికాలో ఎంఎస్ రెండేళ్లల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు (స్కిల్డ్ మాత్రమే) చేసుకునేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ జాబితాలోనూ భారతీయులే ఎక్కువ మంది ఉంటారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం ఉండొచ్చు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు దీన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే ఎంఎస్ పూర్తయిన వెంటనే అక్కడ ఉద్యోగం వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి భారత్‌కు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లేందుకు ఒక్కో విద్యార్థి సగటున రూ. 35 నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేశారు. భారత్ తిరిగి రావడం, ఇక్కడ ఉద్యోగం వెతుక్కోవడం, అప్పు తీర్చడం తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు వాపోతున్నారు.అంత నిఘా ఎందుకో?చదువు కోసం వచ్చిన ప్రతీ విద్యార్థిపై ఏఐ సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. ఆ విద్యార్థి ఎక్కడ నుంచి వచ్చాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? వచ్చాక ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. అలాగే, విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఆ లొకేషన్స్‌లో మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు ఏం ఉన్నాయి? అనే వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు.ఇదిలాఉండగా, కన్సల్టెన్సీలు అడ్డగోలుగా విద్యార్థులను అమెరికాకు పంపుతున్నాయని అమెరికన్ విదేశీ రాయభార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటి వరకూ 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. విద్యార్థి అమెరికాలో చదువుకునేందుకు అవసరమైన మొత్తాన్ని బ్యాంకు నిల్వగా చూపించాలి. దీన్ని కన్సల్టెన్సీలు వివిధ మార్గాల్లో విద్యార్థి ఖాతాలో జమ చేస్తున్నాయి. ఈ వివరాలను అమెరికన్ కాన్సులేట్ సేకరించింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల పూర్తి వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది. దీనిపై రాష్ట్ర స్పెషల్ బ్రాంచీలు కూపీ లాగుతున్నాయి.నిఘా పెరిగింది ఇండియా నుంచి వచ్చిన విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై అమెరికాలో ఆరా తీస్తున్నారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది. భారత్‌లో బయల్దేరేటప్పుడు బ్యాంకుల్లో డబ్బులున్నట్టు చూపిస్తారు. కానీ వచ్చిన వెంటనే బ్యాంకు ఖాతాలో డబ్బులు ఎవరో విత్ డ్రా చేస్తారు. ఇవన్నీ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి,– విజయలక్ష్మి వింధ్యమూరి (అమెరికాలో భారత జాతీయురాలు)ఓపీటీ భారమే రూ. 45 లక్షల అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్ టైం జాబ్ చేసి కొంత తీర్చాను. ఇప్పుడు ఓపీటీ ఎత్తివేస్తామంటున్నారు. ఇదే జరిగితే ఇండియా వెళ్లిపోవాలి. అక్కడా ఉద్యోగం వస్తుందో? రాదో? చెప్పలేం. అప్పు తీర్చే మార్గం కన్పించడం లేదు. – అఖిలేశ్ పూనాటి (అమెరికాలో ఎంఎస్ పూర్తయిన విద్యార్థి)హెచ్1–బీకి తిప్పలేఇక్కడి ఉద్యోగాలు ఇక్కడే అనే నినాదం ఊపందుకుంటోంది. ఇండియానే కాదు ఇతర ప్రాంతాల వారినీ ఎందుకు రప్పించాలనే భావనతో ట్రంప్ వెళ్తున్నారు. కాబట్టి భవిష్యత్‌లో హెచ్1–బీ వీసాలు ఉండకపోవచ్చు. ఇక్కడే పిల్లలను చదివిద్దామని వచ్చాను. ఇప్పుడు వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందే. – మంజులా రాయ్ (అమెరికాకు వెళ్లిన ఎంఎన్సీ ఉద్యోగిని) -
క్యూ2 ఫలితాలు, క్రూడ్ ధరలు కీలకం
న్యూఢిల్లీ: దాదాపు పాతికేళ్ల తర్వాత నమోదైన వరుస ఎనిమిది వారాల సుదీర్ఘ నష్టాల పరంపరకు అడ్డుకట్ట వేస్తూ.. గతవారంలో స్టాక్ మార్కెట్ రికవరీ బాట పట్టింది. అదే సానుకూలతతో ఈ వారం మార్కెట్ ‘అప్రమత్తమైన ఆశాభావంతో ముందడుగు వేసే అవకాశముంది. ముఖ్యంగా కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలు, బ్రెంట్ క్రూడాయిల్ ధరలు, భారత్, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారంలో మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. వీటితో పాటు ట్రెజరీ బాండ్లపై రాబడులు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల తీరుతెన్నులతో పాటు నవరాత్రుల వేళ దేశీయ వినియోగ ట్రెండ్లను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ‘‘దేశీయంగా కార్పొరేట్ ఫలితాల సీజన్ శుభారంభం చేసినప్పటికీ... అంతర్జాతీయ ప్రతికూలతల ప్రభావంతో ఈ వారం భారతీయ ఈక్విటీ మార్కెట్లు పరిమిత శ్రేణిలో (కన్సాలిడేషన్) ట్రేడవ్వొచ్చు. 8 వారాల పతనం తర్వాత మార్కెట్ రికవరీ కావడం దిగువ స్థాయిల్లో లభించిన స్థిరత్వానికి సంకేతం. ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన షేర్లకే పరిమితమయ్యే అవకాశముంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా విశ్లేషించారు. 129 కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు ఈ వారంలో బ్యాంకింగ్, ఐటీ రంగాల దిగ్గజాలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, విప్రోలతో పాటు నెస్లే ఇండియా సహా సుమారు 129 కంపెనీలు తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. టీసీఎస్ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు ప్రకటించి ఐటీ షేర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రో, హెచ్‌సీఎల్ టెక్ ఇచ్చే గైడెన్స్ మార్కెట్ దిశానిర్దేశంలో కీలకం కానుంది. మరోవైపు అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు నిఫ్టీ కదలికలను శాసించనున్నాయి. 100 డాలర్లపైనే చమురు ధర భారత ఈక్విటీ మార్కెట్లకు ముడి చమురు ధరలు ప్రధాన స్థూల ఆర్థిక సవాలుగా పరిణమించాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల పైనే కదలాడుతోంది. దౌత్యపరమైన చర్చలు ఉద్రిక్తతల తగ్గింపునకు కొంత ఆశావహ సంకేతాలిస్తున్నప్పటికీ, హార్మూజ్ జలసంధి వద్ద ఇంధన రవాణాకు అంతరాయం కలిగే ప్రమాదం ఇంకా పొంచి ఉంది. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తీవ్రమై, రూపాయి మరింత బలహీనపడే ప్రమాదముంది.దవ్యోల్బణ డేటా వైపు చూపు నాలుగేళ్ల తర్వాత ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చడం, పరపతి విధానాన్ని కఠినతరం చేసిన నేపథ్యంలో.. సోమవారం విడుదలయ్యే సెప్టెంబర్ సీపీఐ (రిటైల్), 14న వచ్చే డబ్ల్యూపీఐ (హోల్‌సేల్) ద్రవ్యోల్బణ గణాంకాలు అత్యంత కీలకంగా మారాయి. ద్రవ్యోల్బణం అంచనాలను మించితే ఆర్బీఐ మరిన్ని వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపుతుందనే ఆందోళనలతో బ్యాంకింగ్, ఆటో, రియల్టీ వంటి వడ్డీ రేట్ల ఆధారిత రంగాలు ఒత్తిడికి లోనయ్యే వీలుంది. ఇదే వారంలో రాబోయే అమెరికా ద్రవ్యోల్బణ డేటా బలంగా ఉంటే యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ మరింత బలపడి, రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. విదేశీ నిధుల తరలింపు వేగవంతమయ్యే ప్రమాదముంది. అక్టోబర్‌లో రూ.44,166 కోట్ల అమ్మకాలు క్రూడ్ భగ్గుమనడం, అమెరికా డాలర్‌తో పాటు బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో భారీగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్ నెలలో ఇప్పటివరకు (అక్టోబర్ 9 నాటికి) ఎఫ్‌పీఐలు రూ.44,166 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో 2026 లో ఇప్పటివరకు విదేశీ నిధుల మొత్తం నికర ఉపసంహరణ రూ.3.04 లక్షల కోట్లకు చేరింది. కాగా, సెప్టెంబర్ నెలలోనూ ఎఫ్‌పీఐలు రూ.35,861 కోట్ల నికర విక్రయాలు జరిపారు.ఎనిమిది వారాల తర్వాత లాభాలు వరుస విక్రయాల ఒత్తిడితో సతమతమవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌కు గత వారాంతపు రోజైన శుక్రవారం లభించిన రికవరీ ఎంతో ఊరటనిచ్చింది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ షేర్లలో వ్యూహాత్మక కొనుగోళ్లు వెల్లువెత్తాయి. గడిచిన వారం మొత్తం మీద సెన్సెక్స్ 562 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్లు పెరిగాయి. దీంతో స్టాక్ మార్కెట్ పాతికేళ్ల సుదీర్ఘ వరుస ఎనిమిది వారాల నష్టాల పరంపరకు అడ్డుకట్ట పడింది.సాంకేతిక అంశాలు మార్కెట్లో గతవారం రికవరీ కనిపించినప్పటికీ, టెక్నికల్‌గా నిఫ్టీ సూచీ ఇంకా బలహీనంగానే ఉంది. కొనుగోళ్లు కొనసాగితే తక్షణ నిరోధం (రిసిస్టెంట్) 22,600 వద్ద ఉంది. ఈ స్థాయిని అధిగమించే, ఆ తర్వాత 22,800 మరో కీలక నిరోధం ఉంది. ఒకవేళ సూచీ 22,800 స్థాయిని నిలకడగా దాటితే రికవరీ బలపడి 23,000 మార్కు వైపు దూసుకెళ్లే అవకాశముంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయిలో 22,400 స్థాయిని తక్షణ మద్దతుగా పనిచేస్తుంది. ఈ స్థాయిని కోల్పోతే 22,200 మరో తక్షణ మద్దతు ఉంది. ఒకవేళ ఈ స్థాయిని సైతం కోల్పోతే మళ్లీ అమ్మకాల ఒత్తిడి తీవ్రతరమవుతుంది. -
నాడు కత్రినా.. నేడు ఇసాయాస్.. అమెరికన్లకు కునుకు లేకుండా..
అమెరికా తీరాన్ని మరోసారి హరికేన్ వణికించింది. బలమైన గాలులు.. ఇళ్లపై కూలిన చెట్లు.. దెబ్బతిన్న భవనాలు.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. తాగునీటి కొరత.. ఇలా హరికేన్ ఇసాయాస్ ప్రభావంతో ఫ్లోరిడా సహా పలు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ తుపాను కారణంగా నలుగురు మరణించగా, లక్షలాది మంది విద్యుత్ లేక అంధకారంలో చిక్కుకున్నారు. తుపాను బలహీనపడినా.. వరదలు, టోర్నడోల ముప్పు మాత్రం వెంటాడుతోంది. గతంలో అమెరికాను అతలాకుతలం చేసిన ఇయాన్, కత్రినా వంటి హరికేన్లను గుర్తుచేస్తూ తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.2026 అట్లాంటిక్ తుపాను సీజన్లో తొలి హరికేన్‌గా నమోదైన ఇసాయాస్.. ఫ్లోరిడా తీరాన్ని రెండో కేటగిరీ హరికేన్‌గా తాకింది. తీరాన్ని తాకిన తర్వాత బలహీనపడినప్పటికీ, దాని ప్రభావం విస్తృత ప్రాంతాల్లో కనిపించింది. ఫ్లోరిడా, అలబామా, జార్జియా, మిసిసిపీ రాష్ట్రాల్లో సుమారు 6.7 లక్షల మంది విద్యుత్ సరఫరా కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. మరోవైపు, తుపాను ప్రభావం మొదలైన తొలి గంటల్లో దాదాపు 9 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. తుపాను గాలులకు పెన్సకోలాలోని ఓ హోటల్ పైకప్పు దెబ్బతింది. పనామా సిటీ బీచ్‌లో ఎత్తైన భవనం దాదాపు కూలిపోయింది. డెస్టిన్‌లో పడవల షెడ్ ధ్వంసమైంది. చెట్లు ఇళ్లపై కూలడంతో ప్రాణనష్టం సంభవించింది. పెన్సకోలా విమానాశ్రయం దెబ్బతినడంతో వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేశారు. అలబామాలో చెట్లు, విద్యుత్ లైన్లు రహదారులపై పడటంతో ప్రయాణాలపైనా ఆంక్షలు విధించారు.Hurricane Isaias left at least four dead in the US and cut power to nearly 900,000 customers. With homes destroyed, trees downed, and torrential rains, the storm has put southeastern US states at risk of flash floods. https://t.co/Cpd9mB5V3H— IRNA News Agency ☫ (@IrnaEnglish) October 11, 2026గతంలోనూ ఇసాయాస్ బీభత్సం.. ఇసాయాస్ అనే పేరు అమెరికాకు కొత్త కాదు. 2020లోనూ ఇదే పేరుతో వచ్చిన హరికేన్ అమెరికా తూర్పు తీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పట్లో అది నార్త్ కరోలినా తీరాన్ని గంటకు సుమారు 85 మైళ్ల వేగంతో వీచే గాలులతో తాకింది. ఆ తుపాను కారణంగా అమెరికా వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది వినియోగదారులు విద్యుత్ కోల్పోయారు. 39 టోర్నడోలు ఏర్పడగా, అమెరికా సహా ప్రభావిత ప్రాంతాల్లో పది మృతి చెందారు. నష్టం సుమారు 4.8 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అయితే, 2020 ఇసాయాస్, 2026 ఇసాయాస్ వేర్వేరు తుపానులు. అయినప్పటికీ, గత అనుభవాలు తుపాను బలహీనపడిన తర్వాత కూడా విద్యుత్ అంతరాయాలు, వరదలు, టోర్నడోలు ఎంతటి నష్టాన్ని కలిగించగలవో గుర్తుచేస్తున్నాయి.🚨 BREAKING: Fort Walton Beach, Florida. Hurricane 💨🌊 Boats are struggling to stay afloat in rough waters at Fort Walton Beach, Florida, as Hurricane Isaias continues its approach toward landfall. Pray for everyone's peace. 🙏❤✝️ https://t.co/ggaqZvMhdL— vanhoa (@vanhoa2272) October 9, 2026ఇయాన్.. కత్రినా.. అమెరికా చరిత్రలో అత్యంత భయానక తుపానుల్లో 2022లో వచ్చిన హరికేన్ ఇయాన్ ఒకటి. అది నాలుగో కేటగిరీ స్థాయిలో ఫ్లోరిడాను తాకి భారీ విధ్వంసం సృష్టించింది. దాని వల్ల జరిగిన నష్టం సుమారు 119.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఫోర్ట్ మైయర్స్ బీచ్ ప్రాంతంలో సముద్రపు అలల ఉద్ధృతి సుమారు 15 అడుగుల ఎత్తు వరకు చేరింది. ఇక 2005లో వచ్చిన కత్రినా హరికేన్ అమెరికా చరిత్రలో అత్యంత వినాశకరమైన తుపానుల్లో ఒకటిగా నిలిచింది. మిసిసిపీ తీరంలో సముద్రపు అలల ఉద్ధృతి సాధారణ అలల స్థాయికి మించి సుమారు 24 అడుగులకు చేరగా, అమెరికాలో నమోదైన అత్యధిక తుపాను అలల ఉద్ధృతి రికార్డుల్లో కత్రినా 25 నుంచి 28 అడుగుల స్థాయితో నిలిచింది.చమురు ఉత్పత్తికి దెబ్బ.. హరికేన్ ప్రభావంతో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు, సహజ వాయువు ఉత్పత్తి నిలిచిపోయింది. షెల్, చెవ్రాన్ సంస్థలు తమ ఉత్పత్తి కేంద్రాలకు సిబ్బందిని తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించినప్పటికీ.. శనివారం నాటికి చమురు ఉత్పత్తిలో సుమారు 69 శాతం, సహజ వాయువు ఉత్పత్తిలో 57 శాతం నిలిచిపోయాయి. ఇంధన సరఫరాలో అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి గరిష్ఠంగా 40 లక్షల బ్యారెళ్ల ముడిచమురును అత్యవసర మార్పిడి పద్ధతిలో అందించేందుకు ఇంధన శాఖ అనుమతించింది. 🌀🇺🇸Watch: Hurricane #Isaias strikes U.S coast with 200kmph wind gust Severe flooding in Coastal areas🌊 https://t.co/ingQkudOrn— World_Breaking_News03 (@Breaking2003) October 10, 2026ఇదీ చదవండి: పెను సంక్షోభం దిశగా ప్రపంచం.. భారత్‌కూ తప్పని సెగ! -
అమెరికా ‘లేబర్’ షాక్: ఇన్ఫోసిస్ రియాక్షన్ ఇదే..
అమెరికా కార్మిక శాఖ (డీఓఎల్) శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (పర్మ్) కింద కొత్త, పెండింగ్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేయడంపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పందించింది. ఈ నిర్ణయం వల్ల తమ సంస్థపై గణనీయమైన ప్రభావం ఉంటుందని భావించడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ సస్పెన్షన్ కొన్ని కంపెనీలకు వర్తిస్తుందని పేర్కొన్న ఇన్ఫోసిస్.. అమెరికా అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.అమెరికాలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాంఅమెరికా కార్మిక శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇన్ఫోసిస్ పేర్కొంది. అమెరికా అంతటా స్థానిక ఉద్యోగ నియామకాలు, సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణల కేంద్రాల ఏర్పాటులో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని తమ ఉద్యోగులు, క్లయింట్లు, స్థానిక సమాజాల పట్ల సంస్థ కట్టుబడి ఉందని తెలిపింది. అక్కడ అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను పూర్తిస్థాయిలో పాటిస్తామని స్పష్టం చేసింది. అవసరమైతే నిబంధనలకు అనుగుణంగా మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది.వలస నిబంధనల మార్పులపై ఆందోళనఅమెరికాలో వలస నిబంధనల్లో మార్పులు తమ వ్యాపార అంచనాలపై ప్రభావం చూపే అంశాల్లో ఒకటని ఇన్ఫోసిస్ తెలిపింది. ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం పెరుగుతున్న పోటీ, సిబ్బందిని నియమించుకోవడం, కొనసాగించడం, వేతనాల పెరుగుదల, ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం వంటి అంశాలను కూడా ప్రస్తావించింది. ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, సాంకేతిక మార్పులు, సైబర్ భద్రతా సమస్యలు, పెండింగ్ కేసులు, అమెరికా ప్రభుత్వ దర్యాప్తులు, ప్రస్తుత-భవిష్యత్ సుంకాలు సైతం సంస్థ వ్యాపారంపై ప్రభావం చూపే ప్రమాదాలుగా పేర్కొంది.పూర్తి వివరాలు వెల్లడించని కంపెనీలేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల నిలిపివేతకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు ప్రభావితమయ్యాయి, ఈ నిర్ణయం ఎంతకాలం కొనసాగుతుంది, దీని వెనుక కారణాలేమిటనే వివరాలను ఇన్ఫోసిస్ వెల్లడించలేదు. మరోవైపు, ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రభావంపై సంస్థ చేసిన అంచనాలు భవిష్యత్తుకు సంబంధించినవని, వాటిలో అనిశ్చితులు ఉన్నాయని ఫైలింగ్‌లో హెచ్చరించింది. వాస్తవ ఫలితాలు ప్రస్తుత అంచనాలకు భిన్నంగా ఉండవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికతో పాటు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు సమర్పించిన ఇతర పత్రాలను పరిశీలించాలని పెట్టుబడిదారులకు సూచించింది.పర్మ్ అంటే ఏమిటి?అమెరికాలో శాశ్వతంగా పనిచేయడానికి విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డు (Green Card) ప్రక్రియలో ఉపయోగపడే ఉద్యోగ ఆధారిత మార్గాల్లో పర్మ్ ఒకటి. ఈ ప్రక్రియలో సాధారణంగా సంబంధిత ఉద్యోగానికి అర్హులైన అమెరికా కార్మికులు అందుబాటులో లేరని, విదేశీ ఉద్యోగిని నియమించడం వల్ల స్థానిక కార్మికుల వేతనాలు, పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఉండదని యజమాని నిరూపించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోవడం వల్ల కొత్త దరఖాస్తులతో పాటు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, ఇన్ఫోసిస్ విషయంలో ఎంతమేర ప్రభావం ఉంటుందనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.ఇదీ చదవండి: ఐటీ జాబ్ వదిలి.. ఐదింతలు సంపాదన! -
అమెరికాలో కాల్పుల కలకలం 9 మంది మృతి
పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఈరీలో శుక్రవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని గవర్నర్ జోష్ షపిరో శనివారం తెలిపారు. తన 28 ఏళ్ల సర్వీసులో ఇంత దారుణమైన కాల్పుల ఘటనను ఎన్నడూ చూడలేదని పోలీస్ చీఫ్ రిక్ లోరాహ్ చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి బయట ఆ ఇద్దరు మహిళలు అప్పటికే మృతిచెంది ఉన్నారు. అనంతరం డ్రోన్, రోబో సహాయంతో పరిస్థితిని పరిశీలించి పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారు. మొదటి అంతస్తులో ఐదేళ్ల బాలుడు, ఏడాది వయసున్న చిన్నారి మృతదేహాలను గుర్తించారు. మెట్ల మార్గంలో మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించాయి. రెండో అంతస్తులో నిందితుడు మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు.మృతుల ఇతర కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు, ఇంటి బయట హత్యకు గురైన మహిళల సెల్ఫోన్లను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఆ మహిళలకు ఇంట్లో ఏదో జరుగుతోందని ముందే తెలిసి ఉండవచ్చని.. ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు. ఈ ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి.. 12 మంది మృతి! -
అమెరికాలో కాల్పులు.. తొమ్మిది మంది మృతి
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఎరీ నగరంలో నిన్న (శుక్రవారం) సాయంత్రం ఓ ఇంట్లోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ గర్భిణీ తో పాటు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ నిందితుడు తనకు తానే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వివరాలను అక్కడి పోలీసులు వెల్లడించారు.నిన్న అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ఎరీ నగరంలోని పెర్రీ స్ట్రీట్‌లో 700వ బ్లాక్ పరిధిలో ఉన్న ఓ నివాసంలో కాల్పులు జరిగినట్లు అత్యవసర ఫోన్ కాల్స్ రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిగిన ఇంటి బయట ఇద్దరు మహిళల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ పరిసరాల్లో మరికొన్ని మృతదేహాలు కనిపించాయి. తొలుత ఆ ఇద్దరు మహిళలపై కాల్పులు జరిపిన నిందితుడు అనంతరం ఇంట్లోకి ప్రవేశించి, అక్కడ ఉన్న పలువురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు అధికారులు భావిస్తున్నారు. అనంతరం నిందితుడు ఒక రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు ఇంట్లోనే ఉండటంతో పోలీసులు అక్కడ మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు నిందితుడు తనకు తానే తుపాకీతో కాల్చుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు, ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడు ఎవరు? బాధితులతో అతడికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలేంటి? అనే అంశాలపై పోలీసులు ఇంకా స్పష్టతకు రాలేదు. కాల్పుల వెనుక ఉద్దేశాన్ని ఇప్పటివరకు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. నిందితుడికి, మృతులకు మధ్య ఉన్న సంబంధాలపైనా స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు -
జగన్ కీలక నిర్ణయం.. YSRCP అమెరికా కన్వీనర్ గా శివ మేక
-
H-1B, PERMపై కొత్త వివాదం..! JDవాన్స్ కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
-
‘మీతో ఏకీభవిస్తున్నా’.. ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు
సీజేపీ ‘నీట్ నిరసనల’ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత కొంతకాలంగా హస్తిన రాజకీయాల్లో పెద్దగా కనిపించని ఈ ఒడిశా ఎంపీ.. రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి సారించారు. మధ్య మధ్యలో విపక్షాలపై, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న వేళ ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులు స్వదేశానికి తిరిగివస్తే దేశ సాంకేతిక రంగానికి మరింత బలం చేకూరుతుందన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలో భారతీయ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లోనూ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఇచ్చిన పిలుపుపై ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ‘‘మీతో ఏకీభవిస్తున్నా వెంబు గారూ’’ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగం అభివృద్ధిలో భారతీయ ప్రతిభ గణనీయమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను దేశీయ సామర్థ్యాలను పెంచుకునే అవకాశంగా మలుచుకోవాలని సూచించారు.‘‘ప్రతి సవాలూ మన బలాన్ని మరింత పెంచుకోవడానికి, సామర్థ్యాలను విస్తరించుకోవడానికి, దేశంలో మరిన్ని ఆవిష్కరణలకు దోహదపడే అవకాశమే. మన ప్రతిభపై నమ్మకంతో పాటు స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్న నిబద్ధత ఉంటే.. సాంకేతిక రంగ భవిష్యత్తును తీర్చిదిద్దగలం’’ అని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు.I agree with you, @SVembu Ji. Indian talent has made significant contributions to the advancement of technology across the world. Every challenge presents an opportunity to build on this strength, deepen our capabilities and foster greater innovation at home. With confidence in our talent and a commitment to building indigenous capabilities, we can help shape the future of technology. 🇮🇳— Dharmendra Pradhan (@dpradhanbjp) October 9, 2026‘అమెరికాకు ఇక మనం అక్కర్లేదంటున్నారు’అమెరికాలో వీసాలపై పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలని శ్రీధర్ వెంబు అంతకుముందు పిలుపునిచ్చారు. ‘‘అమెరికా సాంకేతిక పురోగతికి భారతీయులు ఎంతో కీలకమైన సహకారం అందించారు. అయినప్పటికీ అమెరికాలోని పెద్ద వర్గం ఇప్పుడు మనల్ని కోరుకోవడం లేదు’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితిని కొత్త భవిష్యత్తుకు నాందిగా మలుచుకోవాలని, భారతీయ నిపుణులు తిరిగివచ్చి దేశాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని కోరారు.గ్రీన్‌కార్డు ప్రక్రియపై అనిశ్చితిఅమెరికాలోని పలు సాంకేతిక సంస్థలకు సంబంధించిన శాశ్వత నివాస అనుమతుల ప్రక్రియపై ఆంక్షలు, సస్పెన్షన్ల వార్తలు భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన పెంచాయి. ముఖ్యంగా పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) కార్యక్రమానికి సంబంధించిన పరిణామాలు చర్చకు దారితీశాయి. అమెరికాలో ఉద్యోగదాతల ద్వారా గ్రీన్‌కార్డు పొందే ప్రక్రియలో ఇది కీలకమైన దశ. ఈ పరిణామాలతో అక్కడ పనిచేస్తున్న విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయుల శాశ్వత నివాస ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. అయితే పీఈఆర్ఎం ప్రక్రియపై ఆంక్షలు విధించడం వల్ల ఇప్పటికే ఉన్న హెచ్-1బీ వీసాలన్నీ వెంటనే రద్దవుతాయని కాదు. కానీ, గ్రీన్‌కార్డు కోసం ముందుకు సాగే ప్రక్రియపై మాత్రం ప్రభావం పడే అవకాశం ఉంది.స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలపై చర్చఅమెరికా సాంకేతిక రంగంలో భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. వారి అనుభవం, నైపుణ్యాలను దేశీయ పరిశ్రమల అభివృద్ధికి వినియోగించుకోవాలన్న చర్చ మరోసారి ముందుకొచ్చింది. విదేశాల్లో స్థిరపడిన ప్రతిభావంతులు స్వదేశానికి వస్తే పరిశోధన, ఆవిష్కరణలు, కొత్త సాంకేతిక సంస్థల అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు తగిన ఉద్యోగావకాశాలు, పరిశోధన సదుపాయాలు, పారిశ్రామిక వాతావరణం కూడా అవసరం. శ్రీధర్ వెంబు చేసిన పిలుపునకు ధర్మేంద్ర ప్రధాన్ మద్దతు తెలపడం.. భారతీయ ప్రతిభను దేశ అభివృద్ధికి ఎలా వినియోగించుకోవాలన్న చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. స్వదేశంలోనే ప్రపంచస్థాయి సాంకేతిక ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.2026 మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు వెలుగుచూడటంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మే 12న పరీక్షను రద్దు చేశారు.సీబీఐ విచారణకు ఆదేశించినప్పటికీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేశాయి. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఆధ్వర్యంలో ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసనలు ప్రారంభమయ్యాయి. వారాలపాటు సాగిన ఆందోళనలు, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం వచ్చిన డిమాండ్లు, విపక్షాల నుంచి కూడా ప్రధాన్ రాజీనామా డిమాండ్.. కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు, దేశ ఐక్యతను దృష్టిలో ఉంచుకుని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జులై 25న ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు.ఇదీ చదవండి: జెన్‌జీకి భయపడే ఎమర్జెన్సీ విధింపు! -
నోబెల్ కమిటీ కన్నెర్ర.. డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్!
ఓస్లో: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని దక్కించుకోవాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొలాల్డ్ ట్రంప్ ఆశలు అడియాశలయ్యాయి. ట్రంప్ కల కలగా మిగిలింది. ప్రపంచ దేశాల్లో శాంతి కోసం పాటు పడుతున్న తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ఓవల్ ఆఫీస్‌లో హుకుం జారీచేసిన ట్రంప్‌కు నోబెల్ కమిటీ కన్నెర్ర చేసింది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు, భారతీయ తమిళ సంతతికి చెందిన నవనీతమ్ నవీ పిళ్లైని ఎంపిక చేసింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించింది.అంతర్జాతీయ చట్టాలు పటిష్టం కావడంలో, ప్రపంచ శాంతి స్థాపనలో, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆమె దశాబ్దాలుగా అందించిన అమూల్యమైన సేవలను నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తించి ఈ అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టింది. నవీ పిళ్లై ఈ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని దక్కించుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుండగా.. నవీ పిళ్లైని చూసి భారత్ గర్వపడుతోంది.ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇటీవల తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలనే ఆశను ట్రంప్ బహిరంగంగా బయటపెట్టారు. తాను అనేక వివాదాలను, యుద్ధాలను పరిష్కరించానని, చరిత్రలో ఎవరూ చేయని విధంగా శాంతి స్థాపనకు కృషి చేశానని బహిరంగంగానే ప్రకటించుకున్న ఆయన, తనకు ఈసారైనా నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని గట్టిగా కోరారు.ఒకవేళ తనకు ఇవ్వకపోతే అది నార్వేజియన్ నోబెల్ కమిటీకి కూడా పెద్ద అవమానమని, కమిటీ తనను విస్మరిస్తే వారి చరిత్రాత్మక తప్పిదమవుతుందని ఇటీవల ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ట్రంప్ అంచనాలు తలకిందులవుతూ నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటన వెలువడింది. అందరూ ఊహించినట్లుగానే ట్రంప్ ఆశలు అడియాశలయ్యాయి.ఇదీ చదవండి : నవీ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి -
అందుకే.. అమెరికా విడిచి వచ్చేయండి!
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు గ్రీన్ కార్డ్ విషయంలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ వంటి ప్రముఖ కంపెనీలకు సంబంధించిన 'పీఈఆర్ఎమ్' (పెర్మనెంట్ లేబర్ సరిఫికేషన్ ప్రోగ్రామ్) ప్రక్రియపై అమెరికా కార్మిక శాఖ ఆంక్షలు విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) స్పందిస్తూ.. అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చి, దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.పీఈఆర్ఎమ్ ప్రక్రియగ్రీన్ కార్డ్ అంటే.. అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు అనుమతించే హోదా. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న చాలామంది భారతీయులు భవిష్యత్తులో గ్రీన్ కార్డ్ పొందాలని ఆశిస్తుంటారు. అయితే.. ఈ ప్రక్రియలో పీఈఆర్ఎమ్ అనే దశ చాలా కీలకం. దీని ప్రకారం, ఒక విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా నియమించుకునే ముందు, ఆ ఉద్యోగానికి సరైన అర్హతలున్న అమెరికా ఉద్యోగులు అందుబాటులో లేరని యజమాని నిరూపించాల్సి ఉంటుంది.అమెరికా కార్మిక శాఖ ఆరోపణల ప్రకారం.. కొన్ని కంపెనీలు పీఈఆర్ఎమ్ విధానాన్ని సక్రమంగా ఉపయోగించలేదనే అనుమానాలు ఉన్నాయి. అందువల్ల కొత్త దరఖాస్తులను స్వీకరించకపోవడం, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే.. ఈ చర్య వల్ల ఆ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల H-1B వీసాలు ఆటోమేటిక్‌గా రద్దు కావు. ప్రధానంగా గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఉన్నవారికి ఆలస్యం, అనిశ్చితి ఎదురయ్యే అవకాశం ఉంది.భారతీయుల పట్ల వ్యతిరేక భావనఅమెరికా సాంకేతిక అభివృద్ధిలో భారతీయులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. భారతీయ ఇంజినీర్లు, సాఫ్ట్వేర్ నిపుణులు, పరిశోధకులు తమ ప్రతిభతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సాంకేతిక రంగానికి గణనీయమైన సేవలు అందించారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. ఇంతటి సేవలు అందించినప్పటికీ అమెరికాలోని కొంతమంది భారతీయుల పట్ల వ్యతిరేక భావన పెరుగుతోందనే ఆందోళనను శ్రీధర్ వెంబు వ్యక్తం చేశారు.కష్టపడి సంపాదించిన నైపుణ్యాలను భారతదేశ అభివృద్ధికి ఉపయోగించాలని, దేశంలోనే కొత్త సంస్థలను స్థాపించి సాంకేతిక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని వెంబు పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: భారత్ స్టార్‌లింక్ పంచాయితీలో బిగ్ ట్విస్ట్!భారతదేశంలోనే మంచి కంపెనీలను స్థాపించి, కొత్త ఉద్యోగాలను సృష్టించి, ప్రపంచ స్థాయిలో పోటీపడే సాంకేతిక సంస్థలను నిర్మించాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో సంపాదించిన అనుభవం, పరిజ్ఞానం మన దేశానికి ఉపయోగపడితే భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వెంబు పేర్కొన్నారు.Indians have made a major contribution to America's technological prowess. Yet, a big part of America no longer wants us. Indians who are on a visa in the US face the painful prospect of uprooting the life you have built with hard work. Let this be the birth pains of a bold new future. Come back, let's build India 🙏— Sridhar Vembu (@svembu) October 9, 2026 -
పొరపాటున కూడా ‘ఏఐ’ అనొద్దు.. అన్నారో ఇక అంతే!: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధస్సు(AI-ఏఐ) అనే పదానికి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనాలని సూచించారు. కాదని పాత పదాన్ని ఉపయోగించేవారిని శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఏం చేస్తారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ఏఐపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ పేరు మార్పు ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆర్టిఫిషియల్’ అనే పదం ఈ సాంకేతికతను తక్కువ చేసి చూపిస్తోందని, ప్రస్తుత సాంకేతిక సామర్థ్యాలను ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదమే బాగా వివరిస్తుందని ఆయన వాదిస్తున్నారు. సెప్టెంబర్ 29న ఆయన సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం.. అమెరికా ప్రభుత్వ విభాగాలు అధికారిక సమాచారంలో ఏఐ(AI), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదాలకు బదులుగా ఎస్ఐ(SI), సూపర్ ఇంటెలిజెన్స్ పదాలను ఉపయోగించాలి.మస్క్ కూడా ఓకే అన్నారు!ట్రంప్ ఆలోచనకు ఆయన సన్నిహితుడు, స్పేస్ఎక్స్ ఏఐ విభాగం అధిపతి ఎలాన్ మస్క్ కూడా మద్దతు పలికారు. తన సంస్థ పేరును ‘స్పేస్ఎక్స్ఏఐ’ నుంచి ‘స్పేస్ఎక్స్ఎస్ఐ’గా మార్చుతారా? అని ఓ ఎక్స్ వినియోగదారు అడగ్గా.. ‘అవును, ఆ మార్పు చేస్తాం’ అని మస్క్ బదులిచ్చారు. అయితే, పేరు మార్పునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.విమర్శలకు సమాధానంగానే.. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్న కొద్దీ దాని భద్రత, దుర్వినియోగం, నియంత్రణపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. ప్రభుత్వ వెబ్సైట్లు, కంపెనీల వ్యవస్థలపై ఏఐ ఆధారిత దాడుల ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ సాంకేతికతపై ప్రజల్లో భయాలు, వ్యతిరేకత పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో దాని పేరును సానుకూలంగా మార్చడం ద్వారా ప్రజల దృష్టిని దాని అవకాశాలవైపు మళ్లించాలని ట్రంప్ భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వెబ్సైట్లోనూ మార్పులుట్రంప్ ఆదేశాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ ఏఐ వెబ్సైట్లోనూ ‘SI’ అనే పదాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు. అయితే వెబ్సైట్ చిరునామా మాత్రం ‘AI.gov’గానే ఉంది. మరోవైపు, వైట్‌హౌస్‌లోని కొన్ని వెబ్పేజీల్లో ఇప్పటికీ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదం కనిపిస్తుండటం గమనార్హం.ఏఐపై నియంత్రణ వద్దు..అమెరికా ఏఐ రంగంలో ముందంజలో ఉందని, చైనాతో పోటీలో వెనుకబడకుండా ఈ సాంకేతికత అభివృద్ధిని వేగవంతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ రంగంలోని కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించగలవని ఆయన గతంలో పేర్కొన్నారు. అయితే ఏఐ భద్రతపై ప్రభుత్వ నియంత్రణలు అవసరమనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. పేరును మార్చడం వల్ల సాంకేతికతపై ఉన్న భద్రతా సందేహాలు తొలగిపోతాయా? లేదంటే ఇది కేవలం ప్రచార వ్యూహంగానే మిగిలిపోతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: మిడ్ టర్మ్‌లో ట్రంప్‌కు ఘోర పరాభవం తప్పదా? -
లైవ్‌లోనే మరణశిక్ష.. ట్రంప్ సర్కార్ ఎందుకిలా?
అమెరికాలో సంచలనం రేపిన ఓ సైనిక స్థావరంపై కాల్పుల కేసులో ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2009లో టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో 13 మందిని కాల్చి చంపిన మాజీ ఆర్మీ మానసిక వైద్యుడు నిడాల్ హసన్‌కు మరణశిక్ష అమలు చేసే ముహూర్తం ఖరారు చేశారు. అంతేకాదు.. అతడిని ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్చి చంపే ప్రక్రియను లైవ్‌స్ట్రీమింగ్ చేయనున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. నిడాల్ హసన్‌కు డిసెంబర్ 3, 2026న గురువారం మధ్యాహ్నం 1 గంటకు అమెరికా సెంట్రల్ టైమ్ ప్రకారం (భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 4న అర్ధరాత్రి 12:30 గంటలకు) మరణశిక్ష అమలు చేయనున్నారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో ఫైరింగ్ స్క్వాడ్(తుపాకీతో కాల్చి చంపడం) ద్వారా శిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. అమెరికాలో మరణశిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి కానుంది. అయితే.. ఈ నిర్ణయం వెనుక శిక్ష తీవ్రతను ప్రజలకు చాటాలనే ఉద్దేశం ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అదే సమయంలో లైవ్ టెలికాస్టింగ్పై న్యాయపరమైన ప్రశ్నలతోపాటు నైతిక చర్చ కూడా మొదలైంది.రక్షణ మంత్రి హెగ్సెత్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇలాంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఫోర్ట్ హుడ్‌లో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు శిక్ష అమలు చేయాలని నిర్ణయించడం కూడా యాదృచ్ఛికం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 2009లో హసన్ కాల్పులకు తెగబడిన రోజు, సమయం, అదే స్థావరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసలు నిడాల్ హసన్ ఎవరు?నిడాల్ హసన్ (56) గతంలో అమెరికా సైన్యంలో మానసిక వైద్యుడిగా పనిచేశారు. 2009 నవంబర్ 5న టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో ఉన్న వైద్య కేంద్రంలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. మృతుల్లో గర్భిణీ సైనికురాలు కూడా ఉన్నారు. కాల్పుల సమయంలో హసన్ సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ ఉపయోగించినట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ దాడి జరిగినప్పుడు హసన్ మరికొద్ది వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు విధులపై వెళ్లాల్సి ఉంది. అమెరికా ముస్లిం దేశాల్లో చేపట్టిన యుద్ధాలకు ప్రతీకారంగానే దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారని వార్తా కథనాలు తెలిపాయి. అరెస్టు చేసే సమయంలో పోలీసులు కాల్పులు జరపడంతో హసన్ పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు. అప్పటి నుంచి వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.2013లోనే మరణశిక్ష విధింపుఈ కేసులో సైనిక న్యాయస్థానం 2013 ఆగస్టులో హసన్‌ను దోషిగా తేల్చింది. ముందస్తు ప్రణాళికతో హత్యలు చేయడం, హత్యాయత్నాలకు పాల్పడటం కలిపి 45 అభియోగాల్లో ఆయన దోషిగా తేలారు. అనంతరం సైనిక జ్యూరీ మరణశిక్ష విధించాలని సిఫార్సు చేసింది. అప్పటి నుంచి ఆయన మరణశిక్ష ఖైదీగా ఉన్నారు.అమెరికా సైనిక చట్టాల ప్రకారం సైనికుడికి మరణశిక్ష అమలు చేయడానికి అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి. రక్షణ మంత్రి హెగ్సెత్ సిఫార్సు మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా శిక్ష అమలుకు ఆమోదం తెలిపినట్లు పెంటగాన్ వెల్లడించింది. డిసెంబర్ 3న టెక్సాస్‌లోని అదే ఫోర్ట్ హుడ్ స్థావరంలో మధ్యాహ్నం ఒంటి గంటకు శిక్ష అమలు చేయాలని సైన్యం ప్రకటించింది.అమెరికా చరిత్రలోనే అరుదైన పరిణామంఅమెరికాలో మరణశిక్షలను టెలివిజన్‌లో ప్రసారం చేయాలంటూ గతంలో మీడియా సంస్థలు ప్రయత్నించినప్పటికీ, కోర్టుల ద్వారా అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడు సైనిక స్థావరంలో అమలు చేయబోయే శిక్షను లైవ్‌స్ట్రీమింగ్ చేయాలన్న నిర్ణయం చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలకు దారితీస్తోంది. అమెరికాలో చివరిసారిగా చట్టబద్ధంగా బహిరంగంగా మరణశిక్ష అమలు చేసింది 1936లో. అప్పట్లో వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఉరిశిక్ష అమలు చేశారు. అప్పటి నుంచి అమెరికాలో మరణశిక్షలు సాధారణంగా ప్రజలకు కనిపించకుండా, నిర్దిష్ట ప్రదేశాల్లోనే అమలు చేస్తున్నారు.ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా అమెరికా సైన్యం చివరిసారిగా 1945లో మరణశిక్ష అమలు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనిక విధుల నుంచి పారిపోయిన ఎడ్డీ స్లోవిక్ను ఫ్రాన్స్‌లో కాల్చి చంపారు. అయితే, అమెరికా సైన్యంలో చివరిసారిగా మరణశిక్ష అమలైంది 1961లో. ఆ సందర్భంలో జాన్ బెన్నెట్‌కు ఉరిశిక్ష విధించారు. అందువల్ల హసన్‌కు శిక్ష అమలైతే, 1945 తర్వాత అమెరికా సైన్యంలో ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష విధించిన తొలి వ్యక్తిగా ఆయన నిలుస్తారు.న్యాయ నిపుణుల అభ్యంతరాలుఈ నిర్ణయంపై న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. యేల్ లా స్కూల్లో ఉపన్యాసాలు ఇచ్చే సైనిక న్యాయ నిపుణుడు యూజీన్ ఫిడెల్.. మరణశిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయడం అత్యంత అసాధారణమని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అమెరికా సుప్రీంకోర్టు ఇప్పటివరకు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదని తెలిపారు. హసన్ తన మరణాన్ని ప్రజలకు ప్రదర్శించడాన్ని అడ్డుకోవాలనుకుంటే ఫెడరల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.సైనిక న్యాయ చరిత్రకారుడు జోనాథన్ లూరీ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. మరణశిక్షను బహిరంగంగా చూపించడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుందనే సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం శిక్షను ప్రజలకు చూపించడం ద్వారా నేరాలపై భయం కలిగించాలని భావిస్తున్నప్పటికీ, అది అవసరమా అనే చర్చ మొదలైంది.మరణశిక్ష విధానాలపై మళ్లీ చర్చప్రస్తుతం అమెరికాలో కొన్ని రాష్ట్రాలు ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష అమలుకు అనుమతిస్తున్నాయి. డెత్ పెనాల్టీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రకారం.. కనీసం ఐదు రాష్ట్రాల్లో ఈ విధానం చట్టబద్ధంగా ఉంది. 2025లో దక్షిణ కరోలినా 15 ఏళ్ల విరామం తర్వాత ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. మరోవైపు, ప్రాణాంతక ఇంజెక్షన్ల కోసం అవసరమైన మందులు లభించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఫైరింగ్ స్క్వాడ్, కరెంట్ షాకివ్వడం, విషవాయువుతో ఊపిరాడకుండా చేయడం వంటి పద్ధతులను కూడా చేర్చింది. ఇటీవల టెన్నెసీలో క్రిస్టా పైక్ అనే మహిళకు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేసే ప్రయత్నం విఫలమవడం కూడా ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఇంజెక్షన్ ప్రక్రియలో సమస్యలు తలెత్తడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధమైన మరణశిక్షలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అత్యంత అరుదైన విషయం. ఇటీవలి కాలంలో బహిరంగ మరణశిక్షలు అమలు చేసిన దేశాలుగా ఇరాన్, తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా సైన్యం కూడా ఈ దిశగా అడుగువేస్తుండటంతో.. నేరాలకు శిక్ష విధించే విధానం, దాని ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనే అంశాలపై అంతర్జాతీయంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి.. 13 మందిని చంపిన కేసులో నిడాల్ హసన్‌కు మరణశిక్ష విధించడం కొత్త విషయం కాదు. కానీ ఆ శిక్షను ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా అమలు చేయడంతోపాటు ప్రజలు ప్రత్యక్షంగా చూడగలిగేలా ప్రసారం చేయాలన్న నిర్ణయమే ఇప్పుడు అమెరికాలో కొత్త వివాదానికి కేంద్రంగా మారింది.ఇదీ చదవండి: ఎన్నారైలే టార్గెట్.. ట్రంప్ బిగ్ స్కెచ్ -
పిల్లోడు కాదు...టెక్నాలజీ పిడుగు!
అమెరికాలో హైస్కూలు స్థాయిలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేయటం, కాలేజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘స్కూల్ అసెస్మెంట్ టెస్ట్’ (సాట్)లో తెనాలికి చెందిన ప్రవాస భారతీయ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆశ్రిత్ తాళ్లూరి మొత్తం 1600 మార్కులకు 1600 సాధించటమేకాదు, 9వ తరగతి చదువుతున్న ఆశ్రిత్, ఖాళీ సమయంలో చార్టర్డ్ విమానం నడపటంలో శిక్షణతోటు పలు క్రీడల్లోనూ ప్రతిభను కనబరుస్తూ ‘టెక్నాలజీ పిడుగు’ అనిపించు కుంటున్నాడు.తెనాలిలోని గంగానమ్మపేటకు చెందిన ఆయుర్వేద ‘వైద్యవిద్యాన్ ’ తాళ్లూరి సుబ్బారావు, పార్వతమ్మల మనవడు ఆశ్రిత్. తల్లిదండ్రులు రామ నరేష్, తరిణి. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. 2008లో అమెరికా వెళ్లి జార్జియాలోaని అట్లాంటాలో స్థిరపడ్డారు. వారి ఇద్దరు కుమారుల్లో రెండోవాడు ఆశ్రిత్. కంప్యూటర్ సైన్స్ ఏఐ, వైద్యం, వ్యవస్థాపనపై బలమైన ఆసక్తి కలిగిన ఆశ్రిత్ సైన్స్ ఒలంపియాడ్, చెస్, ఏఐ ఇన్ మెడిసిన్, ఇన్వెస్ట్మెంట్ ఒలంపియాడ్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో మిడిల్ స్కూల్లో ఉన్నపుడే పద్నాలుగున్నర క్రెడిట్స్‌ను పూర్తి చేయగలిగాడు. దీనివల్ల హార్వర్డ్, రైస్ యూనివర్శిటీల్లో కాలేజి స్థాయి వేసవి ప్రోగ్రామ్స్‌ను చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ‘హెల్త్ సెన్స్’, ‘సెరిబ్రో ఏజెస్’ అనే కంపెనీలకు ఆశ్రిత్ సీఈవోగా, హారిజన్ స్టెమ్‌కు చాప్టర్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. తెలుగు, ఇంగ్లిష్‌తోపాటు స్పానిష్ భాషల్లో పట్టు కలిగిన ఆశ్రిత్ చెస్, తైక్వాండో సాధన చేస్తున్నాడు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలిఇదీ చదవండి: Success Story: ఒత్తిడి తెచ్చిన ముప్పుకి స్టార్టప్‌కి అమ్మేశాడు! కట్‌చేస్తే ఏకంగా రూ. 8వేల కోట్లు.. -
భారత సంతతి ఓటర్లపై భారీ స్కెచ్?
అమెరికాలో ఉన్న విదేశీయులపై ట్రంప్ అక్కసు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో కారణంతో తరచుగా వారిని వేదిస్తూ తరచుగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అదే భారతీయులపై ఆ అక్కసు మరింత అధికంగా ఉంటుంది. అయితే త్వరలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ట్రంప్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మధ్యంతర ఎన్నికల్లో తనకు ఓటు వేయరనే భయంతో ఏకంగా ఓట్ల తొలగింపు చేపడుతున్నట్లు సమాచారం.అమెరికాలో దాదాపుగా 21 లక్షల మంది భారతీయ-అమెరికన్ ఓటర్లు ఉన్నారు. అయితే ట్రంప్ భారతీయులపై చేసే తల బిరుసు వ్యాఖ్యలు, తదితర కారణాల రీత్యా వారు తొలుత నుంచి ప్రత్యర్థి అయిన డెమోక్రటిక్ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యంతర ఎన్నికలలో భారతీయ- అమెరికన్ ఓట్లను పెద్దఎత్తున తొలగింపు చేస్తున్నట్లు సమాచారం. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న 26 రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మందికి పైగా భారత సంతతి ఓటర్ల పేర్లను తొలగించినట్లు తెలుస్తోంది.ఓటర్ల జాబితా ఎందుకు తనిఖీ ?అమెరికాలో, ఓటు వేయడానికి అనర్హులైన వారి పేర్లను తొలగించడానికి ట్రంప్ ప్రభుత్వం ఓటర్ల జాబితాలను తనిఖీ చేస్తోంది. ఇది ఎన్నికల మోసాన్ని నివారించడంతో పాటు, ఓటింగ్ ప్రక్రియను మరింత సురక్షితం చేస్తుందని కారణాలు చెబుతోంది. ట్రంప్ "సేవ్ అమెరికా యాక్ట్" ప్రకారం యూఎస్ కాంగ్రెస్ దిగువ సభ ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం, ఓటర్లుగా నమోదు చేసుకునేవారు తమ యూఎస్ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి జనన ధృవీకరణ పత్రం లేదా పాస్‌పోర్ట్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.ఓటు వేయడానికి గుర్తింపు పత్రాలు సమర్పించే నిబంధనలను కూడా కఠినతరం చేయనున్నారు. ఈ నిబంధనలు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి, అలాగే పోస్టల్ ఓటింగ్‌కు కూడా వర్తిస్తాయి. మరోవైపు, ఈ బిల్లును వ్యతిరేకించేవారు, జనన ధృవీకరణ పత్రాలు లేదా పాస్‌పోర్ట్‌లు లేకపోయినా, కఠినమైన పత్రాల నిబంధనలు అర్హులైన పౌరులను ఓటు వేయకుండా నిరోధించగలవని అంటున్నారు. ఈ చర్యలతో ట్రంప్ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని డెమోక్రటిక్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.70 శాతం మంది అమెరికన్లు అసంతృప్తికాగా ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన ప్రజాదరణ తగ్గుతోంది. మధ్యంతర ఎన్నికలలో ఆయన మద్దతు తమకు నష్టం కలిగిస్తుందని పార్టీ నాయకులు భయపడుతున్నారు.నవంబర్ ఎన్నికలకు ముందు, చాలా మంది రిపబ్లికన్ అభ్యర్థులు ట్రంప్ నుండి తమను తాము దూరం చేసుకుంటున్నారు. కొందరు తమ ప్రచార వెబ్సైట్ల నుండి ట్రంప్ ,అతని "అమెరికా ఫస్ట్" ఎజెండా గురించిన ప్రస్తావనను పూర్తిగా తొలగించారు. కొంతమంది నాయకులు అతనితో కలిసి వేదిక పంచుకోవడానికి కూడా దూరంగా ఉంటున్నారు.ఏపీ-ఎన్‌ఓఆర్‌సి సర్వే ప్రకారం, కేవలం 30% మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ పనితీరుతో సంతోషంగా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థపై ఆయన ఆమోద రేటింగ్ 26%గా ఉంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో ఆయన ఆమోద రేటింగ్ కేవలం 17% మాత్రమే. 65% కంటే ఎక్కువ మంది అమెరికన్లు పెరుగుతున్న ధరలకు ట్రంప్ విధానాలనే నిందిస్తున్నారు.2024 అధ్యక్ష ఎన్నికలలో2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన ప్రజలలో సుమారు 65% మంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు ఓటు వేశారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఈ సారి కూడా అలా జరిగితే తనపై ఉన్న వ్యతిరేకత బట్టబయలవుతుందని ట్రంప్ ఓట్లు తొలగింపు చేపడుతున్నట్లు తెలుస్తోంది.మధ్యంతర ఎన్నికలు ఎందుకు?సెనేట్ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. అయితే అందరి పదవీకాలం ఒకేసారి ముగియకుండా, ప్రతి రెండేళ్లకు మూడో వంతు (1/3rd) స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగేలా రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు. అంటే, అమెరికా అధ్యక్షుడికి 4 ఏళ్ల కాలపరిమితి ఉన్నప్పటికీ, దేశ చట్టాలను రూపొందించే పార్లమెంట్ (కాంగ్రెస్) సభ్యుల పదవీకాలాలు మాత్రం రెండేళ్లకే ముగిసిపోతుంటాయి. అందువల్ల అధ్యక్ష ఎన్నికలకు మధ్యలో ఈ ఎన్నికలు జరగడం వల్ల వీటిని "మధ్యంతర ఎన్నికలు" అని పిలుస్తారు.మెజారిటీ నిలుపుకుంటారా? ఈ ఎన్నికలు రాబోయే రెండేళ్లలో యూఎస్ కాంగ్రెస్‌లో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో నిర్ణయిస్తాయి. సెనేట్‌లో 100 మంది సభ్యులు ఉంటారు. ఈసారి, 35 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రతినిధుల సభలో 435 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం, రిపబ్లికన్ పార్టీ సెనేట్‌లో 53 స్థానాలను, ప్రతినిధుల సభలో 218 స్థానాలను కలిగి ఉంది.ఈ ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఓడిపోతే, కాంగ్రెస్‌లో చట్టాలను ఆమోదింపజేయడం ఆయనకు చాలా కష్టమవుతుంది. ఆయన తనకు నచ్చిన ఏ బిల్లునూ నేరుగా చట్టంగా మార్చలేరు.ఇదీ చదవండి: అస్సాంలో రోడ్డు ప్రమాదం -
హెచ్-1బీ వీసాలపై వాన్స్ ఆగ్రహం.. మైక్రోసాఫ్ట్‌పై గురి!
హెచ్-1బీ వీసా విధానాన్ని తప్పుడు దోవలో వినియోగించుకుంటూ అమెరికన్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారంటూ ఐటీ దిగ్గజ కంపెనీలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి.. వారి స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీయులతో పనిచేయించుకుంటున్నారని ఆరోపించారు. పైగా విదేశీ ఉద్యోగులను ‘వెట్టి చాకిరీ చేసే బానిసలు’గా ఉపయోగించుకోవడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌నే లక్ష్యంగా చేసుకుని ఆయన విరుచుకుపడ్డారు. గత ఏడాది 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించగా.. అదే సమయంలో 6,300 హెచ్-1బీ వీసాలు పొందిందని వాన్స్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటూ, విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియలో మైక్రోసాఫ్ట్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.ఒక్కో ఉద్యోగికి బదులుగా..మైక్రోసాఫ్ట్ అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ.. విదేశీ ఉద్యోగుల నియామకాలను కొనసాగించడంపై వాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది సంస్థ 6,000 మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించిందని, అదే సమయంలో 6,300 హెచ్-1బీ వీసాలు పొందిందని, దాదాపు 3,000 గ్రీన్‌కార్డుల ప్రక్రియలకు సంబంధించిన ప్రయోజనాలు పొందిందని చెప్పారు.“మైక్రోసాఫ్ట్ గొప్ప అమెరికన్ సంస్థే. కానీ అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకోలేరు” అని వాన్స్ వ్యాఖ్యానించారు. లెక్కలు చూస్తే.. తొలగించిన ప్రతి అమెరికన్ ఉద్యోగికి బదులుగా 1.5 మంది విదేశీ ఉద్యోగులను తీసుకున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఇలాంటి విధానాన్ని అమెరికా ఇంతకాలం అనుమతించడం సిగ్గుచేటని విమర్శించారు.అతితక్కువ వేతనాలతో.. హెచ్-1బీ వీసాలపై అమెరికాకు వస్తున్న ఉద్యోగులు, ముఖ్యంగా ఔట్సోర్సింగ్ సంస్థల ద్వారా నియమితులవుతున్నవారు, తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని వాన్స్ ఆరోపించారు. ఉద్యోగం కోల్పోతే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండటంతో కొందరు విదేశీ ఉద్యోగులు యజమానులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ కారణంగానే వారిని ‘ఫారిన్ ఇండెంచర్డ్ సర్వెంట్స్’గా అభివర్ణించారు. హెచ్-1బీ విధానం నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడానికి ఉద్దేశించిందని, అమెరికన్లను తక్కువ వేతనాలతో విదేశీయులతో భర్తీ చేయడానికి కాదని వాన్స్ వాదించారు.మైక్రోసాఫ్ట్ వివరణ ఇదీ..అయితే వాన్స్ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాలకు సంబంధించి తాము చేసిన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం ఇప్పటికే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వీసాల పొడిగింపు లేదంటే హోదా మార్పుల కోసమేనని తెలిపింది. అవన్నీ కొత్తగా విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి చేసిన దరఖాస్తులు కావని స్పష్టం చేసింది. అమెరికాలో తమ ఉద్యోగుల్లో అత్యధికులు అమెరికన్లేనని, హెచ్-1బీ ఉద్యోగులకు కూడా సమానమైన పనికి ఇతర ఉద్యోగులతో పోల్చదగిన వేతనాలు చెల్లిస్తున్నామని సంస్థ పేర్కొంది. వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుందన్నది, ఈ చర్యలపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.గ్రీన్‌కార్డు దరఖాస్తులపై నిలిపివేతమైక్రోసాఫ్ట్తో పాటు అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, క్యాప్‌జెమినీ సంస్థలను కూడా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియ నుంచి నిలిపివేస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. ఈ సంస్థలకు సంబంధించిన కొత్త దరఖాస్తులను స్వీకరించబోమని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ప్రాసెస్ చేయబోమని అధికారులు తెలిపారు. ఈ చర్య అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులకు యజమాని ద్వారా గ్రీన్‌కార్డు పొందే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. అమెరికన్ ఉద్యోగులకు నష్టం కలగకుండా విదేశీ ఉద్యోగులను నియమిస్తున్నారా అనే అంశాన్ని ఈ ప్రక్రియలో పరిశీలిస్తారు.విదేశీ ఉద్యోగుల నియామకాలపై నిబంధనలను కఠినతరం చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ వైఖరికి అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, భారతీయ ఐటీ రంగానికి చెందిన సంస్థలపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు తదుపరి పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు.ఇటు నాదెళ్లకు ట్రంప్ సన్మానం!హెచ్-1బీ వీసాలపై జేడీ వాన్స్ మైక్రోసాఫ్ట్‌ను విమర్శించిన రోజే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్లను సత్కరించారు. సాంకేతిక రంగంలో విశేష కృషికి గుర్తింపుగా నాదెళ్లకు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పురస్కారాన్ని అందించారు. మైక్రోసాఫ్ట్ అభివృద్ధిలో, క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో ఆయన పోషించిన పాత్రను ప్రశంసించారు.#WATCH | US President Donald Trump presents the National Medal of Technology and Innovation to Microsoft CEO & Chairman Satya Nadella at the 'A New Golden Age' summit in Washington. (Source: The White House) https://t.co/nUwCYMeXOT— ANI (@ANI) October 8, 2026ఒకవైపు అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులతో భర్తీ చేస్తున్నారంటూ మైక్రోసాఫ్ట్‌పై వాన్స్ విమర్శలు.. మరోవైపు అదే సంస్థ సీఈవోకు ట్రంప్ నుంచి పురస్కారం! ఇలా ఒకే రోజు చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. -
భారత ఐటీ సంస్థలకు అమెరికాలో భారీ షాక్
-
గ్రీన్‌కార్డ్ ఆశలకు షాక్
వాషింగ్టన్: ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని, మైక్రోసాఫ్ట్, అడోబ్ కంపెనీలలో పనిచేస్తున్న హెచ్–1బీ వీసా కలిగిన ఉద్యోగులు శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్కార్డ్కు దరఖాస్తు చేయడాన్ని యూఎస్ ప్రభుత్వం నిషేధించింది. ఈ అంశాన్ని యూఎస్ కార్మిక మంత్రి కీత్ శాండర్లింగ్ ప్రకటించగా.. యూఎస్ యాంటీఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మద్దతు పలికారు.కొన్ని భారీ ఐటీ సోర్సింగ్ కంపెనీ ఉద్యోగులకు పెర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కీత్ పేర్కొన్నారు. ఈ కంపెనీల నుంచి కొత్తగా లేదా పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డ్ దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. 2009 నుంచి చూస్తే కేవలం 3 కంపెనీలు 30 లక్షలమంది విదేశీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఈ కంపెనీలు 2,30,000 హెచ్–1బీ వీసా అనుమతులు పొందడం సహా లక్షకు పైగా గ్రీన్ కార్డులను సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. వెరసి అమెరికన్ల నుంచి లక్షల కొద్దీ ఉద్యోగాలను లాగేసుకున్నట్లు వ్యాఖ్యానించారు. -
భారత ఐటీ కంపెనీలకు అమెరికా షాక్! కార్మిక శాఖ చర్యలు
భారత ఐటీ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినితో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను అమెరికా కార్మిక శాఖ పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (PERM) నుంచి సస్పెండ్ చేసింది. అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ అక్టోబర్ 8న ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సస్పెన్షన్‌కు ప్రధాన కారణంగా పలు సంస్థలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తులు, హెచ్-1బీ, విదేశీ ఉద్యోగుల నియామక వ్యవస్థ దుర్వినియోగంపై ఉన్న ఆరోపణలను అధికారులు ప్రస్తావించారు.ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు పొందే ప్రక్రియలో పీఈఆర్ఎం అనేది కీలక దశ. విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా నియమించేందుకు ముందు, ఆ ఉద్యోగానికి తగిన అర్హత కలిగిన అమెరికన్ ఉద్యోగి అందుబాటులో లేడని యజమాని నిరూపించాల్సి ఉంటుంది. తాజా నిర్ణయం ప్రకారం ప్రభావిత కంపెనీలకు సంబంధించి కొత్త పీఈఆర్ఎం దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా నిలిపివేస్తామని సోండర్లింగ్ తెలిపారు.మైక్రోసాఫ్ట్‌పై ప్రత్యేక ఆరోపణలుఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌పై అమెరికా అధికారులు ప్రత్యేకంగా ఆరోపణలు చేశారు. 2025లో కంపెనీ సుమారు 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని, అదే సమయంలో 6,000కు పైగా హెచ్-1బీ వీసాలకు ఆమోదం పొందిందని సోండర్లింగ్ పేర్కొన్నారు. అలాగే 3,682 పీఈఆర్ఎం దరఖాస్తులు దాఖలయ్యాయని, వాటిలో దాదాపు 1,000 దరఖాస్తులు తొలగించిన అమెరికన్ ఉద్యోగులతో సమానమైన ఉద్యోగాలకు సంబంధించినవని ఆయన ఆరోపించారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా హెచ్-1బీ వ్యవస్థలో అక్రమాలు, దుర్వినియోగం చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు అడోబ్పై కూడా పలు ఫెడరల్ దర్యాప్తులు కొనసాగుతున్నందున పీఈఆర్ఎం కార్యక్రమం నుంచి వాటిని సస్పెండ్ చేసినట్లు కార్మిక శాఖ తెలిపింది.భారత ఐటీ ఉద్యోగులపై ప్రభావం ఎంత?ఈ నిర్ణయం ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్ నిపుణులపై దృష్టిని పెంచుతోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు, అర్హులైన విదేశీ ఉద్యోగుల కోసం గ్రీన్‌కార్డు స్పాన్సర్షిప్ ప్రక్రియను కూడా ఉపయోగిస్తున్నాయి. పీఈఆర్ఎంపై సస్పెన్షన్ కొనసాగితే, ఈ కంపెనీల ద్వారా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగులకు ప్రక్రియ ఆలస్యం కావచ్చు. అయితే ఇప్పటికే మంజూరైన గ్రీన్‌కార్డులు లేదా హెచ్-1బీ వీసాలు ఆటోమేటిక్‌గా రద్దవుతాయని ఈ నిర్ణయం అర్థం కాదు.ఈ పరిణామానికి ముందు సెప్టెంబర్‌లోనే కాగ్నిజెంట్‌కు సంబంధించిన పీఈఆర్ఎం దరఖాస్తులను అమెరికా కార్మిక శాఖ నిలిపివేసింది. ఆ సమయంలో జరిగిన పరిణామాలను విస్తృతమైన వీసా, కార్మిక వ్యవస్థ దర్యాప్తులో భాగంగా అధికారులు వివరించారు. ఇప్పుడు మరిన్ని ప్రధాన ఐటీ సంస్థలను చేర్చడంతో అమెరికాలోని టెక్నాలజీ రంగంలో విదేశీ ఉద్యోగుల నియామకం, హెచ్-1బీ వినియోగం, గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌పై ప్రభుత్వ పరిశీలన మరింత కఠినమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. -
నోబెల్ కోసం ట్రంప్ ఆరాటం.. ‘నాకంటే ఎవరు చేశారు?’
ఒకవైపు ప్రపంచ వేదికపై యుద్ధాలు.. మరోవైపు శాంతి బహుమతి కోసం పోటీ. గన్ మోతలు వినిపిస్తున్న వేళ.. తన దౌత్య విజయాలనే కవచంగా చేసుకుని మరోసారి నోబెల్ శాంతి బహుమతి కోసం తన వాదనను తెరపైకి తెచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ‘నేను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాను.. ఇంతకుముందు ఏ అధ్యక్షుడూ ఇలా చేయలేదు’ అంటూ వైట్‌హౌస్ వేదికగా తన రికార్డును మరోసారి గుర్తుచేశారు. అంతేకాదు.. మరో వివాదానికి త్వరలోనే పరిష్కారం చూపే అవకాశం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్.. ‘నేను చేసిన పనులు ఇంతకుముందు ఎవరూ చేయలేదు. గొప్పలు చెప్పుకోవడం కాదు.. వాస్తవాలు చెబుతున్నాను. నేను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాను’ అని అన్నారు. అయితే ఆయన మాటల్లో శాంతి బహుమతిపై ఆశ కూడా దాగి ఉంది. గతంలో పలుమార్లు తనకు నోబెల్ రావాల్సిందేనని చెప్పిన ట్రంప్.. ఈసారి కూడా తన దౌత్య రికార్డునే ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. కాగా, ట్రంప్ నోబెల్ ఆకాంక్షలకు ఏళ్ల చరిత్ర ఉంది. తొలి అధ్యక్ష పదవీకాలం నుంచే ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. 2018లో కొందరు నార్వే రాజకీయ నాయకులు ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఆ తర్వాత కూడా ట్రంప్ తనకు ఈ గౌరవం రావాల్సిందేనని పలుమార్లు వ్యాఖ్యానించారు. 2025లో ఏకంగా ‘నాకు నాలుగైదు సార్లు నోబెల్ రావాల్సింది’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.‘8 యుద్ధాలు’.. ట్రంప్ చెప్పే జాబితా ఇదే.. తన దౌత్య విజయాలను వివరించేటప్పుడు ట్రంప్ పలు అంతర్జాతీయ వివాదాలను ప్రస్తావిస్తున్నారు. భారత్-పాకిస్తాన్, ఇజ్రాయెల్-ఇరాన్, కంబోడియా-థాయ్‌లాండ్, సెర్బియా-కొసోవో, రువాండా-డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్-ఇథియోపియా, అర్మేనియా-అజర్బైజాన్ తదితర అంశాల్లో అమెరికా పాత్రను ఆయన తన విజయాలుగా చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ చెప్పే ‘ఎనిమిది యుద్ధాలు’ అన్న లెక్కపై ఫ్యాక్ట్ చెకర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తావిస్తున్న కొన్ని ఘటనలు అధికారికంగా యుద్ధాలే కావని, అలాగే ఒక్కో వివాదంలో అమెరికా పాత్ర కూడా ఒకేలా లేదని వారు చెబుతున్నారు.ఖండించిన భారత్.. ఇదిలా ఉండగా.. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గతంలోనే స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా జోక్యం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్, పాకిస్తాన్ మధ్య నేరుగా అవగాహన కుదిరిందని స్పష్టం చేసింది. అయినా ట్రంప్ మాత్రం భారత్-పాక్ ఉద్రిక్తతల పరిష్కారంలో అమెరికా పాత్ర ఉందన్న తన వాదనను కొనసాగిస్తున్నారు.మిత్రుల నుంచి కూడా మద్దతు.. ట్రంప్ నోబెల్ ఆశలకు ఆయన ఒక్కరే ప్రచారం చేసుకోవడం లేదు. రిపబ్లికన్ ప్రతినిధి క్లాడియా టెన్నీ 2026లో మరోసారి ఆయన పేరును నామినేట్ చేశారు. ఇజ్రాయెల్, పాకిస్తాన్, కంబోడియా నేతలు కూడా ట్రంప్ పేరును ప్రతిపాదించినట్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే నామినేషన్ వచ్చిందంటే నోబెల్ కమిటీ ఆ అభ్యర్థిని సమర్థించినట్లు మాత్రం కాదు. 2026 శాంతి బహుమతికి మొత్తం 287 మంది అభ్యర్థులు పరిశీలనలో ఉన్నారు.ట్రంప్‌నకు అడ్డంకి.. ట్రంప్ నోబెల్ కలకు అసలు పరీక్ష ఎక్కడ ఉందంటే.. ప్రస్తుతం ప్రపంచం చూపు ఇరాన్‌వైపే ఉంది. తాను శాంతి స్థాపకుడినని చెబుతున్న ట్రంప్ పాలనలోనే ఇరాన్‌తో తీవ్ర ఘర్షణ కొనసాగుతోంది. దీంతో ఆయన దౌత్య రికార్డుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాలు ఆపానంటూ మరోసారి తన రికార్డును ప్రపంచం ముందు పెట్టారు. మరి ఈసారి నోబెల్ తలుపు ట్రంప్ కోసం తెరుచుకుంటుందా? లేక ఆయన ‘శాంతి పిలుపు’ మరోసారి ప్రకటనలకే పరిమితమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఇరాన్‌పై మరో ట్విస్ట్.. ట్రంప్‌కు కొత్త టెన్షన్ -
యూఎస్, యూరప్‌లో విస్తరణ
మిలన్(ఇటలీ): స్పెషాలిటీ కెమికల్ కంపెనీ అనుపమ్ రసాయన్ తాజాగా ఫార్మాస్యూటికల్స్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకు ఇటీవలే కొనుగోలు చేసిన బ్లిస్ జీవీఎస్ ఫార్మా సహకరించనున్నట్లు కంపెనీ సీఈవో గోపాల్ అగర్వాల్ పేర్కొన్నారు. వెరసి మూడేళ్లలో ఫార్మా నుంచి ఆదాయంలో మూడో వంతు సాధించనున్నట్లు అంచనా వేశారు. బ్లిస్ జీవీఎస్ ద్వారా తుది ఔషధాలు(ఫినిషిడ్ డోసేజీ)తోపాటు.. కాంట్రాక్ట్ తయారీ (సీడీఎంవో) సర్వీసులను సైతం అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో యూఎస్, యూరప్‌లలో ఫార్మా కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం స్వేచ్చా సప్లై చైన్‌కు కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రస్తావించారు. ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల ఫార్మాస్యూటికల్ బిజినెస్ టు బిజినెస్ సదస్సు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో గోపాల్ కంపెనీ ప్రణాళికలు వెల్లడించారు. గుజరాత్ నుంచి ఆగ్రోకెమికల్స్ సరఫరాదారుగా ప్రారంభమైన లిస్టెడ్ కంపెనీ అనుపమ్ రసాయన్ గత ఐదేళ్లలో ఫార్మాలోకి ప్రవేశించడం ద్వారా రూ. 300 కోట్ల అమ్మకాలు సాధిస్తోంది. ప్రధానంగా చైనా దిగుమతులకు పోటీగా కీ స్టారి్టంగ్ మెటీరియల్స్(కేఎస్ఎంలు) తయారు చేస్తోంది. వెరసి ప్రస్తుతం ఫార్మా విభాగం ద్వారా ఆదాయంలో 20 శాతంవరకూ అందుకుంటోంది. బ్లిస్ జీవీఎస్తో స్పీడ్ ఫార్మా కంపెనీ బ్లిస్ జీవీఎస్ను రూ. 1,750 కోట్లకు అనుపమ్ రసాయన్ సొంతం చేసుకుంది. తద్వారా ఫినిష్డ్ డోసేజీ సామర్థ్యాలను అందిపుచ్చుకుంది. దీంతో ఒకే గొడుగుకింద కేఎస్ఎంలు, ఇంటరి్మడియెట్స్, ఏపీఐ, ఫార్ములేషన్లు రూపొందించగల కంపెనీగా ఆవిర్భవించినట్లు గోపాల్ వివరించారు. తొలుత యూఎస్‌లో విస్తరించడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. తదుపరి యూరప్, జపాన్లవైపు దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. ఆఫ్రికాలో అత్యధికంగా బిజినెస్ నిర్వహిస్తున్న బ్లిస్ కేవలం 30 శాతం సామర్ధ్యాన్నే వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో రెండేళ్లలో 70–80 శాతానికి సామర్థ్య వినియోగాన్ని పెంచుకునే వీలున్నట్లు తెలియజేశారు. బ్లిస్ ప్లాంట్లు ఇప్పటికే యూఎస్ ఎఫ్‌డీఏ, ఈయూ జీఎంపీ సరి్టఫికేషన్లు కలిగి ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని ప్రొడక్టులకు అనుమతులు సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఈ ఏడాది యూఎస్‌లో సీడీఎంవో, తయారీ అమ్మకాలు ప్రారంభం కాన్నుట్లు తెలియజేశారు. గతేడాది(2025–26)లో బ్లిస్ రూ. 1,000 కోట్ల ఆదాయం అందుకున్నట్లు ప్రస్తావించారు. ఈ ఏడాది రూ. 1,200–1,300 కోట్ల టర్నోవర్‌కు వీలున్నట్లు అంచనా వేశారు. బ్లిస్ జీవీఎస్ లిస్టెడ్ కంపెనీ కావడంతో ఆదాయ అంచనాలు ప్రకటించలేమని, గత ఆరు నెలల్లో 23–24 శాతం నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు సాధించినట్లు వెల్లడించారు. అనుపమ్ వివిధ దశలలో ఉన్న 90–100 మాలిక్యూల్స్‌ను కలిగి ఉంటే, అనుబంధ సంస్థలు బ్లిస్, జేహాక్, టాన్ఫాక్ సైతం 60–70 మాలిక్యూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఏడాదికి 8–10 ప్రొడక్టులను వాణిజ్య ప్రాతిపదికన ప్రవేశపెడుతున్నట్లు తెలియజేశారు. బ్లిస్ 4–5 ప్రొడక్టులను విడుదల చేయనున్నదని, దీంతో ఆగ్రోకెమికల్స్ వృద్ధిని ఫార్మా విభాగం అధిగమించనున్నట్లు తెలియజేశారు. -
అమెరికాలో కశ్మీరీ దర్శకుడి అరెస్ట్
వాషింగ్టన్: కశ్మీరీ సినిమా దర్శకుడు అరాఫత్ షేక్‌ను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వాషింగ్టన్లో సెపె్టంబరు 24న అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 2019 నుంచి విద్యార్థి వీసాతో అమెరికాలోనే ఉంటున్న ఈయనను వాషింగ్టన్‌లోని డుల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగీ దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని మద్దతుదారులు తెలిపారు. ప్రఖ్యాత దర్శకురాలు తారా దొరబ్జీతో కలిసి వాషింగ్టన్‌లోని బస్బాయ్స్ అండ్ పోయెట్స్లో ‘ఆర్ట్స్ యాస్ రెసిస్టెన్స్’’ అన్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తూండగా ఈ ఘటన జరిగింది. అరాఫత్ జార్జియా స్టేట్ యూనివర్శిటీలో సినిమాలపై విద్యనభ్యసిస్తున్నారు. 2020లో శరణార్థి హోదా కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ కోసం చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. అరాఫత్ అమెరికాలో నివసించేందుకు అనుమతులు ఉన్నాయని, ఇందుకు తగ్గట్టుగా వర్జీనియాలోని అలెగ్జాండియాలో నివసిస్తున్నారని ఆయన విడుదల కోరుతూ మొదలైన ఆన్లైన్ కార్యక్రమం ‘ఫ్రీ అరాఫత్ షేక్’ తెలిపింది. అరెస్టు సమయంలో పెండింగ్‌లో ఉన్న ఇమ్మిగ్రేషన్ పత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోలేదని, తెలుస్తోంది. ‘కాషాయ సామ్రాజ్యం’ పేరుతో అరాఫత్ తీసిన మొదటి సినిమా కశ్మీర్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో కుటుంబాల అనుభవాలను తెరకెక్కించింది. ఈ సినిమా షికాగో ఫిల్మ్‌మేకర్స్ అవార్డుతోపాటు ఎల్ఏ ఫిల్మ్ అండ్ డాక్యుమెంటరీ అవార్డు పొందింది. అలాగే మెల్బోర్న్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, వేక్ ఫారెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, అనటోలియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకుంది కూడా. -
చావు కోరల్లోంచి బయటపడి...స్పృహలోకి వచ్చిన క్రిస్టా పైక్
నాషవిల్లే: హత్య కేసులో పడిన శిక్షను అమలు చేసే క్రమంలో చావుతప్పిన క్రిస్టా పైక్ పరిస్థితి మెరుగవుతోంది. రెండు విషపు ఇంజెక్షన్లు ఇచ్చినా మరణించకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. చికిత్స తరువాత యాభై ఏళ్ల క్రిస్టా స్పృహలోకి వచ్చింది. మరణశిక్ష అమల్లో జరిగిన పొరబాట్లపై మరింత సమాచారం కోరుతూ క్రిస్టా తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. 1995లో క్లాస్మేట్ కొలీన్ స్లెమ్మర్‌ను కత్తితో పొడిచి చంపిన నేరానికి గాను క్రిస్టాకు మరణశిక్ష పడింది. వాయిదాలు, అప్పీళ్ల తరువాత గత నెల 30న శిక్ష అమలుకు తీర్మానించారు. ఇందులో భాగంగా పెంటోబార్బిటాల్ అనే విషపు ఇంజెక్షన్లు ఒకదాని తరువాత ఒకటి ఇచ్చారు. అయినాసరే.. ఆమె మరణించకపోగా... గురకపెడుతూ కనిపించింది. ఇలా విషానికి లొంగని ఒకే ఒక వ్యక్తి క్రిస్టానేని అంటున్నారు. ‘‘అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో క్రిస్టా మళ్లీ స్పృహలోకి వచ్చారు. మాట్లాడుతున్నారు. వైద్యం అందుతోంది’’ అని ఆమె తరఫు న్యాయవదులు తెలిపారు. అయితే పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పట్టవచ్చునని వారు చెప్పారు. క్రిస్టా చేతులు కాలిపోయి బొబ్బలెక్కాయని తెలిపారు. మరణశిక్ష ఎందుకు విఫలమైందన్న విషయంపై విచారించేందుకు వీలుగా క్రిస్టాకు ఇచ్చిన మందుల వివరాలన్నీ భద్రపరచాలని కోరుతూ వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ఇదే అంశంపై టెన్నసీ గవర్నర్ బిల్లీ సమగ్రమైన విచారణకు ఆదేశించడం గమనార్హం. విషపు ఇంజెక్షన్ ఆమె రక్తంలోకి కాకుండా... చర్మం పైపొరలోని కణజాలంలోకి చేరడం వల్లనే ఆమె మరణించకుండా ఉంటుందని నిపుణులు కొందరు అభిప్రాయపడ్డారు. -
విదేశీ విద్యార్థులపై మరో పిడుగు
వాషింగ్టన్: అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటూనే ఖర్చుల కోసం ఏదైనా ఉద్యోగం చేసుకోవాలన్నది విదేశీ విద్యార్థుల ఆకాంక్ష. అయితే, ఇందుకు పలు షరతులు ఉంటాయి. యూనివర్సిటీ బయట ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఉండదు. విదేశీ విద్యార్థులకు పనులు చేసుకొనే అవకాశం కల్పిస్తూనే, వారి నుంచి రుసుము వసూలు చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. చదువుకుంటూనే పని చేసుకోవచ్చు. కానీ, ప్రభుత్వానికి 70,000 డాలర్ల రుసుమును వారిని చేర్చుకున్న విద్యాసంస్థలే చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం బుధవారం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిప్రకారం.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) అని పిలిచే కార్యక్రమంలో పాల్గొనే ప్రతి విద్యారి్థకి గాను సంబంధిత విద్యా సంస్థలే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా విదేశీ విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నప్పుడు లేదా ఆ తర్వాత తమ ప్రధాన సబ్జెక్టుకు సంబంధించిన ఉద్యోగాల్లో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. సాధారణంగా విదేశీ విద్యార్థులు అమెరికాలో పట్టభద్రులైన తర్వాత ఒక సంవత్సరం పాటు పని చేయడానికి అర్హులు. కొన్ని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్ర ప్రధాన కోర్సులు చదివిన వారు అదనంగా మరో రెండు సంవత్సరాలకు అర్హులు. నూతన ప్రతిపాదన ప్రకారం.. ప్రతి కొత్త విద్యార్థి తొలి దరఖాస్తు కోసం విద్యాసంస్థలు 70,000 డాలర్లు, ప్రతి పునరుద్ధరణకు 30,000 డాలర్ల రుసుమును అమెరికా ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా అమెరికా వర్సిటీలను నిరుత్సాహపర్చాలన్నదే ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది. ట్యూషన్ ఫీజు ఆదాయం కోసం విదేశీ విద్యార్థులను భారీగా చేర్చుకునే అమెరికా వర్సిటీలకు ఇది ఒక ఎదురుదెబ్బ అవుతుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల రాకపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. -
ఇరాన్‌తో యుద్ధం.. తలపట్టుకుంటున్న ట్రంప్?
ఇరాన్‌తో అమెరికా యుద్ధం మెుదలు పెట్టి దాదాపు ఎనిమిది నెలల పుర్తికావస్తోంది. అయినప్పటికీ యుద్దం ముగింపు విషయంలో ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధం కారణంగా అమెరికా పెద్దఎత్తున నష్టపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. వాషింగ్టన్కు చెందిన ఆధునాతన ఫైటర్ జెట్లతో పాటు ఇతర డ్రోన్లు తదితర యుద్ధసామాగ్రి కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. వీటి విలువ మూడు బిలియన్లకుపైగా అమెరికా డాలర్లని నివేదిక పేర్కొంది.ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి భారీ స్థాయిలో విమాన నష్టం జరిగినట్లు తాజాగా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ (CRS) నివేదిక వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు చెందిన కనీసం 81 సైనిక విమానాలు, డ్రోన్లు ధ్వంసం కావడం లేదా దెబ్బతినడం జరిగిందని నివేదిక పేర్కొంది. ఈ నష్టాల విలువ దాదాపు 3.3 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాలైన F-35A, F-15E, అలాగే భారీ సంఖ్యలో MQ-9 Reaper డ్రోన్లు సైతం ఇందులో ఉన్నాయి.అయితే, కొన్ని సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికీ రహస్యంగా ఉండటం, యుద్ధం కొనసాగుతుండటం, కొన్ని ఘటనలకు బాధ్యతను ఖచ్చితంగా నిర్ధారించడం కష్టంగా ఉండటంతో ఈ సంఖ్యలు భవిష్యత్తులో మారే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే దెబ్బతిన్న కొన్ని విమానాలను మరమ్మతులు చేసి తిరిగి సేవల్లోకి తీసుకురావచ్చని పేర్కొంది.నివేదిక ప్రకారం అమెరికా 12 F-15E యుద్ధ విమానాలు, ఒక F-35A ఫైటర్, రెండు A-10 గ్రౌండ్-అటాక్ విమానాలు, ఏడు KC-135 ఇంధన సరఫరా విమానాలను కోల్పోయింది. ఒక్కో F-15 విమానం విలువ 30 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక F-35A అత్యాధునిక ఐదో తరం యుద్ధ విమానాల్లో ఒకటి కాగా, దాని విలువ 92 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని నివేదిక పేర్కొంది.F-15E విమానాల నష్టాల్లో కొన్ని ఘటనలు ప్రత్యేకంగా నమోదయ్యాయి. మార్చి 2న కువైట్ గగనతలంలో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్ ఘటనలో మూడు F-15E విమానాలు కూలిపోయాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరో F-15E విమానం ఇరాన్‌పై జరిగిన చర్యలో కూలిపోయింది. మరోవైపు, సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జోర్డాన్‌లోని మువాఫాక్ అల్-సాల్టీ ఎయిర్ బేస్‌పై జరిగిన ఇరాన్ వైమానిక దాడుల్లో కనీసం మరో ఎనిమిది F-15E విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అని నివేదిక తెలిపింది.యుద్ధంలో అమెరికాకు కలిగిన నష్టాల్లో భారీ వాటా డ్రోన్లదే. మొత్తం 45 MQ-9 Reaper మల్టీ-రోల్ అన్‌క్రూడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది. ఒక్కో MQ-9 Reaper విలువను సుమారు 30 నుంచి 50 మిలియన్ డాలర్ల మధ్యగా అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ఒక MQ-4C Triton హై-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ డ్రోన్, మూడు MQ-1 మల్టీ-రోల్ అన్‌క్రూడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అమెరికా కోల్పోయింది.ఈ నష్టాల కారణంగా అమెరికా సైనిక సామర్థ్యాలపై ఆర్థిక భారం కూడా గణనీయంగా పెరిగింది. విమానాలు, డ్రోన్ల నష్టంతో పాటు ఇరాన్ యుద్ధంలో అమెరికా ఉపయోగించిన ఆయుధాల వ్యయం కూడా భారీగా పెరిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అంచనా ప్రకారం, యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాల ఖర్చు కేవలం నెలకు పైగా వ్యవధిలో 21.7 బిలియన్ డాలర్ల నుంచి 28.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఆయుధాల వ్యయం మాత్రమే 6 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు లెక్కలు సూచిస్తున్నాయి.అయితే, ఇవి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమేనని CRS నివేదిక స్పష్టం చేసింది. యుద్ధ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విమానాలు, డ్రోన్ల నష్టం సంఖ్య, వాటి ఆర్థిక విలువ భవిష్యత్తులో మరింత మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ అరెస్ట్ -
ప్రమాదకరమైన వైరస్ అప్పుడు చైనా.. ఇప్పుడు రష్యా
-
షాకింగ్ : 40 మంది అమెరికా పౌరసత్వం రద్దు
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ సహా 40 మంది పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికాలో రంగం సిద్ధమైంది. విదేశీ ప్రభుత్వాల ఏజెంట్‌గా పని చేయడం, హత్య వంటి నేరాల్లో దోషులుగా తేలడంతో వీరి పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు న్యాయశాఖ తెలిపింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న 40 మంది వ్యక్తులపై, పలు యు.ఎస్. జిల్లా కోర్టులలో పౌరసత్వాన్ని రద్దు చేసే చర్యలను దాఖలు చేసినట్లు న్యాయ శాఖ ప్రకటించింది. 2026 ఆగస్టు 21 నుంచి అక్టోబర్ 2 మధ్య దాఖలైన ఈ ఫిర్యాదులు, ట్రంప్ పరిపాలనలో ఒకే కాలంలో దాఖలైన అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులను సూచిస్తున్నాయి.అమెరికాలోకి ప్రవేశించేందుకు, పౌరసత్వాన్ని పొందేందుకు తప్పుడు గుర్తింపు పత్రాలు చూపినందుకు కాలిఫోర్నియాకు చెందిన బల్విందర్ సింగ్‌పై వేటు పడనుంది. న్యాయ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బల్విందర్ సింగ్ 1992లో ఇమ్మిగ్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2003లో ఇంకో గుర్తింపుతో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసి స్వీకరించాడు కూడా. వేలిముద్రలు ద్వారా ఈ రెండు దరఖాస్తులను బల్విందర్ సింగ్ చేసినట్లు స్పష్టమైంది. 2009లో రెండో గుర్తింపు ఆధారంగా బల్విందర్ సింగ్ నాచురలైజేషన్ మార్గంలో అమెరికా పౌరుడు అయ్యాడు. అయితే కనీసం ఏడు సందర్భాల్లో అతడు తన గుర్తింపు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చాడని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడని, ఇది అతడి నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని న్యాయ శాఖ తెలిపింది. బల్విందర్ సింగ్‌తోపాటు జిన్చావ్ వీని చైనా తరఫున గూఢచర్యానికి పాల్పడ్డ కారణంగా పౌరసత్వం రద్దు చేయనున్నారు. చైనాలో పుట్టి 2021లో అమెరికాలో నావికా దళంలో చేరిన ఇతడు 2022 నుంచే గూఢచర్యానికి పాల్పడ్డాడని, మిలటరీ రహస్యాలను చైనాకు అందించాడని న్యాయ శాఖ తెలిపింది. అమెరికా రక్షణ దళాల్లో పనిచేస్తున్నందుకు ఇతడికి పౌరసత్వం కూడా చాలా తొందరగా లభించిందని తెలిపారు.ఇదీ చదవండి: రూ. 60 లక్షలు : థాయ్ మహిళ-యూపీవాలా సోషల్ మీడియా లవ్పౌరసత్వంపై వేటు పడనున్న ఇతరుల్లో పాకిస్థాన్, మెక్సికో, కంబోడియా, నేపాల్, అఫ్ఘనిస్తాన్లకు చెందిన వారు ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇంత మందిపై ఒకేసారి డీనాచురలైజేషన్ ప్రక్రియ నడవడం ఇదే మొదటిసారి. అమెరికాలో కొంతకాలం జీవించిన తరువాత అతడికి పౌరుడిగా గుర్తించడాన్ని నాచురలైజేషన్ అంటారు. అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం ఈ నాచురలైజేషన్ ప్రక్రియ చట్టవిరుద్ధంగా జరిగినట్లు రుజువైతే రద్దు చేయవచ్చు. ఇదీ చదవండి: నో షూస్, నో సూట్..1600 మీటర్ల రన్, అదీ చీరలో -
BIG ALERT: మల్ళీ లాక్ డౌన్ స్టార్ట్ ?
-
రోదసిలో శాంతి మంత్రం.. ఐఎస్ఎస్కి నోబెల్ శాంతి?
నోబెల్ సీజన్ వచ్చేసింది. ఇప్పటికే వైద్య, భౌతికశాస్త్రాల్లో విజేతల పేర్లు ప్రకటించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్-ఐఎస్ఎస్) ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ బరిలోకి దిగుతోంది. ఐఎస్ఎస్... ఎల్లలు లేని ప్రపంచం. విశ్వంలో మానవాళి సృష్టించిన ‘త్రిశంకు స్వర్గం’. స్వర్గం అన్నాక వైరం, వైషమ్యాలకు తావుండదు కదా! అంతరిక్ష కేంద్రంలో మిత్రదేశాలే కాదు... శత్రుదేశాల వ్యోమగాములు కూడా నేస్తాలుగా మెలుగుతారు. అందులో గడిపినంత కాలం వారు విశ్వమానవులు. సౌభ్రాతృత్వం, పరస్పర సహకారం వెల్లివిరుస్తాయి. అక్కడ మనస్పర్థలు, వివాదాలు, తగాదాలు, యుద్ధాలకు చోటు లేదు. అక్కడ దేశాలు, జాతీయత భేదాలు ఉండవు. అందరిదీ ఒకటే మతం, ఒకటే దేశం, వసుధైక కుటుంబం.అంతరిక్ష కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా ఇదే సత్సంప్రదాయం, సంస్కృతి పరిఢవిల్లుతున్నాయి. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి కోసం 79 సంస్థలు సహా మొత్తం 287 మంది అభ్యర్థుల నుంచి నార్వీజియన్ నోబెల్ కమిటీకి ప్రతిపాదనలు అందాయి. నామినీల్లో సంస్థల పేర్లే నాలుగో వంతుకు పైగా ఉండటం విశేషం. వ్యక్తులు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ సంస్థలే కాకుండా... యుద్ధాలు, ప్రకృతి విపత్తుల వేళ ఆపన్నహస్తం సాచే మానవతా గ్రూపుల పేర్లు కూడా అందులో ఉన్నాయి. కానీ విజేత ఎంపిక విషయంలో చివరి నిమిషంలో అనూహ్యంగా ఐఎస్ఎస్ పేరు తెరపైకి వస్తోంది.పీస్ ప్రైజ్ కోసం ప్రస్తుతం పోటీపడుతున్న వారి పేర్లను నోబెల్ కమిటీ ఇంతవరకు ప్రచురించలేదు. దాంతో నామినీలకు సంబంధించి అధికారికంగా ‘కుదించిన జాబితా’, అందులోని పోటీదారుల పేర్లు బయటకి తెలియరాలేదు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 9న (శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు నార్వేలోని ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతి విజేత పేరు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు తమ వేళ్లను పైకి అంతరిక్ష కేంద్రం వైపు చూపుతున్నారు! ఐఎస్ఎస్ ఏ ఒక్క దేశం సొత్తు కాదు. అది అమెరికా, రష్యా, కెనడా, జపాన్, యూరప్ దేశాల ఉమ్మడి ఆస్తి. పలు దేశాల పరస్పర సహకారానికి చిరునామా. భూమ్మీద ఉద్రిక్తతలు పెచ్చరిల్లే, యుద్ధాలు జరిగే దేశాల ఆస్ట్రోనాట్లు-కాస్మోనాట్లు సైతం అవేమీ పట్టనట్టు భూకక్ష్యలోని అంతరిక్ష కేంద్రంలో సంయమనంతో వ్యవహరిస్తూ పరిశోధనల్లో నిమగ్నమవుతారు.రేసులో ట్రంప్, కార్నీ, కులేబా, ఐసీసీ! నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ, ఉక్రెయిన్ బాలల హక్కుల ఉద్యమకారుడు మైకోలా కులేబాతోపాటు సేవ్ ద చిల్డ్రన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్స్ (సూడాన్), కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్, అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే), అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఇంటెర్నేషనల్ క్రిమినల్ కోర్టు- ఐసీసీ) పోటీ పడుతున్నాయి. వీటిలో ధర్మ సంస్థాపన-శాంతిస్థాపన దిశగా ఐసీసీ పెద్దగా పొడిచిందేమీ లేకపోయినా కాస్తోకూస్తో వీర-శూరత్వాలు ప్రదర్శించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు రాజకీయ నేతలపై ఐసీసీ అరెస్టు వారంట్లు జారీ చేసింది. -జమ్ముల శ్రీకాంత్.(Courtesy: Associated Press) -
ఇరాన్‌పై బిగ్ ట్విస్ట్.. ట్రంప్, వాన్స్ సంచలన వ్యాఖ్యలు
ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇరాన్-అమెరికా యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరుగుతున్న వేళ.. టెహ్రాన్ నాయకత్వంపై అమెరికా చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇరాన్లో అసలు నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో స్పష్టంగా తెలియడం లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు మరుసటి రోజే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందిస్తూ.. ‘ఇరాన్‌ను ఎవరు నడుపుతున్నారో ఎవరికీ తెలియదు’ అని అన్నారు. దీంతో యుద్ధం కంటే ఇప్పుడు ఇరాన్ అధికార వ్యవస్థపై అమెరికా వ్యక్తం చేస్తున్న సందేహాలే అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో అమెరికా చర్చలు జరుపుతోందని తెలిపారు. అయితే, దేశంలో వాస్తవంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికి ఎంతవరకు ఉందో స్పష్టంగా తెలియడం లేదని అన్నారు. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో నిర్ణయాలు ఎవరు?.. ఎలా తీసుకుంటారో పూర్తిగా అర్థం చేసుకోవడం అమెరికాకు సవాలుగా మారిందని వాన్స్ వ్యాఖ్యానించారు.వాన్స్ వ్యాఖ్యలపై మరుసటి రోజే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌తో చర్చలు, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై అమెరికా ముందుకు వెళ్తున్నప్పటికీ.. ‘అతిపెద్ద సమస్య ఏమిటంటే.. ఇరాన్‌ను ఎవరు నడుపుతున్నారో ఎవరికీ తెలియదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ దాదాపు ఒకే రకమైన సందేహాలను వ్యక్తం చేయడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్ సీరియస్.. ఇదిలా ఉండగా.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ విషయంలోనూ గత కొంతకాలంగా అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. యుద్ధం సమయంలో ఆయన ప్రజల ముందుకు రాకపోవడం, ఆయన ప్రస్తుత పరిస్థితి, ఆచూకీపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్ మాత్రం ఈ వాదనలను ఖండిస్తోంది. మొజ్తబా ఖమేనీనే దేశ సుప్రీం లీడర్‌గా కొనసాగుతున్నారని, ఆయన దేశాన్ని నడిపిస్తున్నారని స్పష్టం చేస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ కూడా అమెరికా వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అమెరికా అధికారులకు తమ ఇరానియన్ ప్రతినిధులు ఎవరన్నది, దేశ నిర్ణయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్నది తెలుసని చెప్పారు. అసలు సమస్య ఇరాన్లో నాయకత్వం లేదా నిర్ణయ వ్యవస్థలో లేదని.. అమెరికా అధికారుల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు, గందరగోళమైన సందేశాలేనని ఆయన ఆరోపించారు.ఇదిలా ఉంటే.. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ తన అణు కార్యక్రమంపై కూడా కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వాన్స్ స్పష్టం చేశారు. అమెరికా డిమాండ్లను అంగీకరించాలంటే ఇరాన్ తన అణు ఇంధన శుద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అంటే శాంతి చర్చల్లో కేవలం యుద్ధ విరమణ మాత్రమే కాకుండా.. ఇరాన్ అణు కార్యక్రమం కూడా ప్రధాన అంశంగా మారింది. ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో వాన్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. తానే ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నానని చెప్పేందుకు ఆయన నిరాకరించారు. గతంలో వాన్స్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ.. అది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు మరోసారి చర్చలు మొదలైన నేపథ్యంలో ఇరాన్ నాయకత్వంపై అమెరికా సందేహాలు, అణు శుద్ధి సామర్థ్యంపై అమెరికా డిమాండ్లు కీలకంగా మారాయి. ఇదీ చదవండి: రష్యాలో కొత్త వైరస్ కలకలం.. భారత్‌కు ముప్పు ఉందా? -
కెనడా కాల్పుల కేసులో అనూహ్య మలుపు
బ్రిటిష్ కొలంబియా: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో 2026 ఫిబ్రవరిలో జరిగిన టంబ్లర్ రిడ్జ్ సామూహిక కాల్పుల ఘటనలో మరో వ్యక్తిపై కేసు నమోదైంది. కాల్పులకు పాల్పడిన 18 ఏళ్ల జెస్సీ వాన్ రూట్సెలార్కు సలహాలు ఇవ్వడంతోపాటు, దాడికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు డబ్బులు పంపినట్లు 30 ఏళ్ల అమెరికా పౌరుడు జేమ్స్ కోడి బ్రయంట్‌పై ఆరోపణలు వచ్చాయి. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.అమెరికా ప్రాసిక్యూటర్ల ప్రకారం.. వాన్ రూట్సెలార్, బ్రయంట్లు 2025 ఆగస్టు నుంచి డిస్కార్డ్ ద్వారా పరస్పరం మాట్లాడుకున్నారు. పలువురిని హత్య చేయాలనే తన ప్రణాళికను వాన్ రూట్సెలార్ బ్రయంట్‌కు చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలిసినప్పటికీ బ్రయంట్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. విదేశాల్లోని వ్యక్తులను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు బ్రయంట్‌పై అభియోగం నమోదైంది.ప్రాసిక్యూటర్ల ఆరోపణల ప్రకారం.. పాఠశాలపై దాడికి ముందు బ్రయంట్, వాన్ రూట్సెలార్కు పలు విధాలుగా సహకరించాడు. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేలా ఎలా దాడి చేయాలి? ఎలాంటి తుపాకులను ఉపయోగించాలి? అనే అంశాలపై వ్యూహాత్మక సలహాలు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా దాడికి అవసరమని వాన్ రూట్సెలార్ కోరిన కొన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంపినట్లు తెలిపారు.దాడిలో జరిగిన హత్యలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కూడా బ్రయంట్ అంగీకరించినట్లు అమెరికా అధికారులు ఆరోపించారు. వాన్ రూట్సెలార్ చేసిన లైవ్‌స్ట్రీమ్‌ను రికార్డు చేసి ప్రసారం చేయడానికి బ్రయంట్ సహకరించాడని పేర్కొన్నారు. అయితే ఆ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైన కొన్ని సెకన్లకే నిలిచిపోయిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఈ కేసులో బ్రయంట్ దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశం ఉందని అమెరికా అటార్నీ కార్యాలయం తెలిపింది. మరోవైపు టంబ్లర్ రిడ్జ్ పాఠశాలలో కాల్పులకు పాల్పడిన వాన్ రూట్సెలార్.. పోలీసులు పాఠశాలలోకి ప్రవేశించే సమయంలో తనకు తానే కాల్చుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రభుత్వం కూడా ఓపెన్ఏఐపై అమెరికా ఫెడరల్ కోర్టులో గతంలో దావా వేసింది. ఘటనకు ముందు సంబంధిత చాట్‌జీపీటీ ఖాతాలోని ఆందోళనకరమైన సంభాషణలపై అధికారులను అప్రమత్తం చేయడంలో సంస్థ విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. ఇదీ చదవండి: సుప్రీం షాక్ దరిమిలా.. జ్ఞానేశ్‌ను ప్రభుత్వం ఏం చేయనుంది? -
ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు మతం, వలసలను ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అదే సమయంలో.. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్, శాన్‌డియాగో నగరాలను ఇరాన్ ‘‘తుడిచిపెట్టేసుకోవచ్చు’’ అన్నట్లు మాట్లాడిన తీరుపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రాన్స్‌లో స్టూడెంట్స్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు.. ‘‘ఇది పాఠశాలల సమస్య కాదు.. ఫ్రాన్స్‌ను ఇస్లాం ఆక్రమించుకోవాలని చూస్తోంది’’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా తీవ్ర దుమారం రేగింది. ఫ్రాన్స్‌లో సెప్టెంబర్ చివరి నుంచి హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలల ప్రవేశ ద్వారాలను విద్యార్థులు దిగ్బంధించారు. మెరుగైన విద్యా వసతులు, ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించడం, అధిక విద్యార్థులతో కిక్కిరిసిన తరగతులను తగ్గించడం, పాడైపోయిన పాఠశాల భవనాలను బాగుచేయడం వంటి డిమాండ్లు వాటిల్లో ఉన్నాయి. వేడిని తట్టుకోలేని భవనాలు, అధిక పని భారం, సిబ్బంది కొరతపైనా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆందోళన క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. అక్టోబర్ 6న ఒక్కరోజే దాదాపు 2.56 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యూనియన్లు మాత్రం ఈ సంఖ్య 4.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిరసనలకు మద్దతుగా రోడ్డెక్కారు. ఘర్షణలతో ఉద్రిక్తతఅయితే కొన్ని ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలు, అల్లర్ల నియంత్రణకు ఉపయోగించే ఆయుధాలను ప్రయోగించారు. కొన్ని చోట్ల నిరసనకారులు రాళ్లు విసరడం, వాహనాలు, బస్ షెల్టర్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు జరిగాయి.ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆందోళనలు మొదలైనప్పటి నుంచి 215 మంది విద్యార్థులు, 715 మంది పోలీసులు గాయపడ్డారు. 5,000 మందికిపైగా అరెస్టయ్యారు. వారిలో 87 శాతం మంది మైనర్లే. 24 పాఠశాలలు ధ్వంసం లేదా అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. ఇటు పోలీసుల చర్యలపైనా విమర్శలు వస్తున్నాయి. ఓ 15 ఏళ్ల విద్యార్థి పోలీసుల స్టన్ గ్రెనేడ్ కారణంగా చేతిని కోల్పోయాడు. మరో 14 ఏళ్ల బాలుడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం ఫ్రాన్స్ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రవర్తనపై పలు అంతర్గత విచారణలు కూడా ప్రారంభమయ్యాయి. ‘ఇది ఇస్లాం ఆక్రమణ’.. ట్రంప్ వ్యాఖ్యఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అసలు వివాదానికి కారణమైంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. ‘‘ఇది అదుపు తప్పిన భారీ వలసల ఫలితం. ఇది పాఠశాలల గురించి కాదు.. ఒకప్పుడు గొప్ప దేశమైన ఫ్రాన్స్‌ను ఇస్లాం ఆక్రమించుకోవాలని చూస్తోంది’’ అంటూ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో రాశారు. అయితే ఫ్రాన్స్‌లో విద్యార్థులు చేస్తున్న ప్రధాన డిమాండ్లకు, ట్రంప్ చెప్పిన ‘‘ఇస్లాం ఆక్రమణ’’కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు నిరసనలపై వచ్చిన తాజా వివరాల్లో ఎలాంటి ఆధారం కనిపించడం లేదు. విద్యార్థులు ప్రధానంగా విద్యా వ్యవస్థలోని సమస్యలపైనే ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు.ట్రంప్, ఆయన మద్దతుదారులు మాత్రం యూరప్‌లో వలసలు, భద్రత, సామాజిక సమస్యలను అనుసంధానిస్తూ చాలాకాలంగా ప్రచారం చేస్తున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఫ్రాన్స్ పరిణామాలను కూడా వలస వ్యతిరేక రాజకీయ ప్రచారానికి ఉపయోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.అమెరికాలోనూ మరో మాట.. ఇదే సమయంలో ఇరాన్ యుద్ధంపై ట్రంప్ చేసిన మరో వ్యాఖ్య అమెరికాలో కలకలం రేపింది. నెబ్రాస్కాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా అమెరికాలో ఇంధన ధరలు పెరగడం దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు చెల్లించే ‘‘చిన్న మూల్యం’’ అని అన్నారు. ఆ తర్వాత.. ‘‘వాళ్లు ఒక నగరాన్ని తుడిచిపెట్టేయొచ్చు. లాస్ ఏంజెల్స్‌ను తుడిచేయనివ్వండి. శాన్‌డియాగోను తుడిచేయనివ్వండి’’ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సభలో కొందరు మద్దతుదారులు చప్పట్లు కొట్టారు. ట్రంప్ వ్యాఖ్యలపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ను ‘‘ప్రమాదకరమైన, మతిభ్రమించిన వ్యక్తి’’ అంటూ విమర్శించారు. లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్.. అధ్యక్షుడి వ్యాఖ్యలు నగర భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని అన్నారు. శాన్‌డియాగో మేయర్ టాడ్ గ్లోరియా.. తమ నగరం ‘‘యుద్ధంలో త్యాగం చేయాల్సిన వస్తువు కాదు’’ అంటూ మండిపడ్డారు. వైట్‌హౌస్ వివరణ ఇదీ..అయితే ట్రంప్ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలను వైట్‌హౌస్ తోసిపుచ్చింది. ట్రంప్ ఉద్దేశం అమెరికా నగరాలపై ఇరాన్ దాడిని కోరుకోవడం కాదని స్పష్టం చేసింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడం వల్లే లాస్ ఏంజెల్స్, శాన్‌డియాగో వంటి అమెరికా నగరాలు సురక్షితంగా ఉన్నాయని ఆయన చెప్పాలనుకున్నారని వివరించింది. అయినా అధ్యక్షుడి నోట ‘‘లాస్ ఏంజెల్స్‌ను తుడిచేయనివ్వండి.. శాన్‌డియాగోను తుడిచేయనివ్వండి’’ అనే మాటలు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా యుద్ధం, ఇంధన ధరలు, అమెరికా మధ్యంతర ఎన్నికలు కీలకంగా మారిన సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.ఇదీ చదవండి: ఇరాన్ దెబ్బకు షాకింగ్ డెసిషన్ తీసుకున్న ట్రంప్ -
అమెరికాలో నిరుద్యోగ తాండవమే!
విస్తృతమవుతున్న ఏఐ భయాలతో ప్రపంచమంతా కలవరపడుతోంది. ఓ వైపు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. ఏఐతో ఏమౌతుంతోనని ఇప్పటికే వణికిపోతుంటే.. ముందుంది అసలు ముప్పు అంటూ ప్రముఖ ఆర్థికవేత్త చేసిన హెచ్చరిక ఇప్పుడు అమెరికాను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.కృత్రిమ మేధ (AI) వినియోగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా ఉద్యోగ మార్కెట్‌పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత డారన్ అసెమోగ్లు తీవ్ర హెచ్చరిక చేశారు. ప్రస్తుత విధానాల్లో మార్పులు లేకపోతే, వచ్చే పదేళ్లలో అమెరికాలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఇటీవల సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసెమోగ్లు ఈ వ్యాఖ్యలు చేశారు.అసెమోగ్లు అభిప్రాయం ప్రకారం.. గత పారిశ్రామిక విప్లవాలతో పోలిస్తే ఏఐ పరిణామం అసాధారణ వేగంతో సాగుతోంది. పారిశ్రామిక విప్లవం తొలి దశ విస్తరించడానికి దశాబ్దాలు పట్టగా, ఇప్పుడు ఏఐ ఆధారిత మార్పులు కేవలం ఒకటి, రెండేళ్ల వ్యవధిలోనే అనేక రంగాలను ఒకేసారి ప్రభావితం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మానవులు చేసే పనులను నేరుగా ఆటోమేట్ చేసే దిశలో ఏఐ అభివృద్ధి సాగితే ఉద్యోగాలపై ఒత్తిడి మరింత పెరుగుతుందని హెచ్చరించారు.‘కొత్త ఉద్యోగాలు వస్తాయి’ నిజమే కానీ..ఏఐ అభివృద్ధితో కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయని అసెమోగ్లు అంగీకరించారు. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం, వాటి పనితీరును మెరుగుపరచడం వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే ఏఐ వల్ల కోల్పోయే ఉద్యోగాలతో పోలిస్తే ఈ కొత్త నియామకాలు చాలా తక్కువగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఏఐని మానవుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా అభివృద్ధి చేయాలని, వారిని పూర్తిగా భర్తీ చేసే సాంకేతికతగా కాకుండా చూడాలని సూచించారు.అమెరికన్లలోనూ పెరుగుతున్న ఆందోళనఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గుతాయన్న భయం కేవలం ఆర్థికవేత్తలకే పరిమితం కాలేదు. 2026 జూన్‌లో నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది అమెరికన్లు వచ్చే 20 ఏళ్లలో ఏఐ వల్ల అమెరికాలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 2024లో ఇదే అభిప్రాయం 64 శాతం మందిలో ఉండగా, రెండేళ్లలో ఆ వాటా 7 శాతం పెరిగింది. కేవలం 5 శాతం మంది మాత్రమే ఏఐ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని భావించారు.ఈ నేపథ్యంలో ఏఐపై విధానపరమైన స్పందన అవసరమని అసెమోగ్లు సూచిస్తున్నారు. సాంకేతికతను అడ్డుకోవడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూనే, మానవులను మరింత ఉత్పాదకంగా మార్చే ఏఐ అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన అంటున్నారు. అదే సమయంలో నిజమైన ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించేలా పన్ను విధానాలను మార్చడం వంటి చర్యలను కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని సూచించారు.డారన్ అసెమోగ్లు 2024లో సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ. రాబిన్సన్లతో కలిసి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. సమాజంలోని సంస్థలు ఎలా ఏర్పడతాయి, అవి దేశాల సుసంపన్నతను ఎలా ప్రభావితం చేస్తాయన్న అంశంపై చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం లభించింది.ఇదీ చదవండి: చైనాలో భారీగా మూతపడిన బ్యాంకులు -
ఇంట్లో టేబుల్‌పై బాంబు.. ఎన్నో ఏళ్లుగా గుర్తించలేకపోయిన వ్యక్తి
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన స్టీవ్ మార్టిన్ అనే వ్యక్తి తన ఇంట్లో ఎన్నో ఏళ్లుగా పేపర్‌వెయిట్‌గా ఉపయోగిస్తున్న వస్తువు సాధారణ పాత వస్తువు కాదని, 160 ఏళ్లకు పైగా నాటి సజీవ పేలుడు పదార్థం అని తేలింది. అమెరికా అంతర్యుద్ధం కాలానికి చెందిన ఆర్టిలరీ షెల్‌ను ఆయన ప్రమాదం లేని నకిలీ గుండుగా భావించారు. అయితే సైనిక అనుభవం ఉన్న ఓ వ్యక్తి దాన్ని పరిశీలించి అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది.అటాస్కోసా కౌంటీకి చెందిన మార్టిన్‌కు ఈ వస్తువు ఆయన కుమారుడి ద్వారా లభించింది. ఆయన కుమారుడు చేపలు పడుతుండగా దాన్ని గుర్తించాడు. సుమారు 20 పౌండ్ల బరువున్న ఈ వస్తువును మార్టిన్ పనిమీద ఉన్న బల్లపై పేపర్‌వెయిట్‌గా పెట్టుకున్నారు. ఇంటికి వచ్చిన అతిథులు కూడా దాన్ని తరచూ చేతిలోకి తీసుకుని పరిశీలించేవారు. ఇది పేలని పాత సైనిక వస్తువు మాత్రమేనని మార్టిన్ సహా అందరూ భావించారు.అసలు నిజం గుర్తింపు అయితే సైనిక నేపథ్యం ఉన్న ఓ ట్రక్ డ్రైవర్ దాన్ని చూసి అనుమానించాడు. అది నిజమైన ఆర్టిలరీ గుండును పోలి ఉందని, అందులో పేలుడు పదార్థం ఉండే అవకాశం ఉందని మార్టిన్‌ను హెచ్చరించాడు. దీంతో ఆయన అటాస్కోసా కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అధికారులు జాయింట్ బేస్ శాన్ ఆంటోనియో-లాక్లాండ్ నుంచి పేలుడు పదార్థాల నిర్వీర్య బృందాన్ని రప్పించారు.నిపుణులు దాన్ని పరిశీలించి ప్యారట్ రౌండ్‌గా గుర్తించారు. అంటే అమెరికా అంతర్యుద్ధం కాలంలో ఉపయోగించిన ప్యారట్ తుపాకీ కోసం రూపొందించిన పేలుడు ఆర్టిలరీ గుండు. 160 ఏళ్లకు పైగా గడిచినా అది ఇంకా పేలే సామర్థ్యంతోనే ఉందని నిపుణులు నిర్ధారించారు.ప్రమాదాన్ని నివారించేందుకు ఆ గుండును శాన్ ఆంటోనియోకు ఉత్తరంగా ఉన్న క్యాంప్ బులిస్లోని పేలుడు పదార్థాల శిక్షణ ప్రాంతానికి తరలించి సురక్షితంగా పేల్చివేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పాత సైనిక ఆయుధాలు చారిత్రక వస్తువుల్లా కనిపించినప్పటికీ, వాటిలో ప్రమాదకర పేలుడు పదార్థాలు మిగిలి ఉండే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. -
భారత్‌లో ఎన్నికలట!.. సోయి లేకుండా ట్రంప్ పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా సందేశాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పరిశీలిస్తుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఎన్నికల వ్యవస్థను విమర్శించే క్రమంలో.. భారత్‌ను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తితో పాటు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రంప్‌ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో.. 125 మిలియన్ల మంది ఈరోజు భారత్ అధ్యక్ష ఎన్నికల తొలి దశలో ఓటేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు ఫలితాలు వచ్చాయి అని రాశారు. అయితే ఆ రోజు మన దేశంలో ఎలాంటి ఎన్నికలు జరగలేదు కదా!. పైగా మన దేశంలో అధ్యక్షుడు(రాష్ట్రపతి)ని జనాలు కాదు కదా ఎన్నుకునేది. అయితే ఆయన పేర్కొన్న 125 మిలియన్ల ఓట్ల సంఖ్య కూడా మరో దేశంలో జరిగిన ఎన్నికల గణాంకాలకు దగ్గరగా ఉండటం ఇప్పుడు అసలు ట్విస్ట్‌గా మారింది.ట్రంప్ పేర్కొన్న 125 మిలియన్ల సంఖ్య ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో(తొలి దశ) మొత్తం 125,272,513 చెల్లుబాటు అయ్యే ఓట్లు నమోదయ్యాయి. సో.. ఈ సంఖ్య ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్న 125 మిలియన్లకు అత్యంత దగ్గరగా ఉంది. దీంతో బ్రెజిల్ ఎన్నికల గణాంకాలను భారత్‌కు ఆపాదిస్తూ ట్రంప్ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా భారత్‌లో రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష ప్రజా ఓటుతో జరగదన్న విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ ట్రంప్ పోస్ట్‌పై సెటైర్లు వేస్తున్నారు.బ్రెజిల్లో ఏం జరిగింది?అక్టోబర్ 4న బ్రెజిల్లో అధ్యక్ష ఎన్నికల తొలి దశ పోలింగ్ జరిగింది. ఇందులో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, సెనేటర్ ఫ్లావియో బొల్సొనారో(మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కొడుకు) రెండో దశకు చేరుకున్నారు. దాదాపు పూర్తి ఫలితాల ప్రకారం ఫ్లావియో బొల్సొనారోకు 47.03 శాతం, లులాకు 45.16 శాతం ఓట్లు వచ్చాయి. ఎవరికీ 50 శాతానికి పైగా ఓట్లు రాకపోవడంతో అక్టోబర్ 25న రెండో దశ పోలింగ్ జరగనుంది.భారత అధ్యక్షుడి ఎన్నిక ఎలాగంటే.. భారత్‌లో రాష్ట్రపతిని ప్రజలు నేరుగా ఓటు వేసి ఎన్నుకోరు. ఎన్నికైన ఎంపీలు, రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభల్లోని ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియలో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు విధానాన్ని, రహస్య బ్యాలెట్‌ను ఉపయోగిస్తారు.అంటే బ్రెజిల్, అమెరికా వంటి దేశాల్లో జరిగే ప్రత్యక్ష ప్రజా ఓటుతో అధ్యక్షుడిని ఎన్నుకునే విధానానికి భారత్ రాష్ట్రపతి ఎన్నిక పూర్తిగా భిన్నం. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రస్తావించిన ‘‘భారత్ అధ్యక్ష ఎన్నికల తొలి దశ’’ అన్న విషయమే వాస్తవ పరిస్థితికి సరిపోలడం లేదు.అమెరికా ఎన్నికలపైనా ట్రంప్ విమర్శలుభారత్ ఎన్నికలను ప్రస్తావించిన ట్రంప్.. ఇదే పోస్టులో అమెరికా ఎన్నికల వ్యవస్థపైనా విమర్శలు చేశారు. డెట్రాయిట్, ఫిలడెల్ఫియా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు వారాలు పడుతున్నాయని పేర్కొన్నారు. ‘‘వోటింగ్ ఇన్ అమెరికా ఈజ్ కరప్ట్’’ అంటూ ఆరోపించారు. గతంలో భారత్ ఎన్నికలపై ప్రశంసలుఇదిలా ఉండగా.. ట్రంప్ గతంలో మాత్రం భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించారు. ఆగస్టులో అమెరికాలో ఓటర్ గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలన్న వాదనకు మద్దతుగా భారత్‌లోని ఓటర్ కార్డు వ్యవస్థను ఉదాహరణగా పేర్కొన్నారు. భారత్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఓటు వేసినా పోస్టల్ బ్యాలెట్ వినియోగం చాలా తక్కువగా ఉందని అప్పట్లో వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: అమెరికాకు ఆ రెండు దేశాల నుంచి బిగ్ చాలెంజ్! -
మరిన్ని ఆంక్షల వేళ.. ఇరాన్లో అనూహ్య పరిణామం!
అమెరికా ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనంతో చమురు ఎగుమతులు, ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇరాన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ చమురు మంత్రి మొహ్సెన్ పాక్నెజాద్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించినప్పటికీ.. దీని వెనక వ్యవహారం వేరే ఉందన్న చర్చ ఇప్పుడు జోరుందుకుంది. రాజీనామా ప్రకటన తర్వాత.. ఇరాన్ అధ్యక్ష రాయబార కార్యాలయంలో హైడ్రామా నడిచింది. పాక్నెజాద్ను పునరాలోచన చేయాలని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కోరారు. అయినప్పటికీ పాక్నెజాద్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో చివరకు రాజీనామాను ఆమోదించారు. ఆ వెంటనే నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (NIOC) చీఫ్ హమీద్ బోవర్డ్ను తాత్కాలిక చమురు మంత్రిగా నియమించారు. అమెరికా గురి వల్లే..ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు. ప్రస్తుతం అమెరికా ఆంక్షలు, నౌకల రాకపోకలపై ఆంక్షలతో ఆ రంగంపైనే తీవ్ర ప్రభావం పడుతోంది. ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమయ్యే ముందు హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ ముడిచమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు జరిగేది. తర్వాత హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం, ఆ దేశానికి చమురు ద్వారా వచ్చే ఆదాయం, విదేశీ మారకద్రవ్య ప్రవాహాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల లక్ష్యంగా ఉంది. దీనివల్ల టెహ్రాన్‌తో పాటు ఇతర నగరాల్లో పెట్రోల్ కోసం పొడవాటి క్యూలు కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.రికార్డు స్థాయికి ఇరాన్ కరెన్సీ పతనంఅమెరికా ఒత్తిడితో పాటు ఇరాన్ ఆర్థిక పరిస్థితి కూడా మరింత దిగజారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ తాజాగా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఒక డాలర్‌కు సుమారు 26.88 లక్షల రియాళ్లకు చేరినట్లు సమాచారం. గత ఏడాది కాలంలో రియాల్ విలువ సగానికి పైగా పడిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం 70 శాతాన్ని దాటినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. నిత్యావసర వస్తువులు, ఇళ్ల ఖర్చులు సామాన్యులపై భారంగా మారుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం మార్చి 21 నుంచి జూన్ 20 మధ్య ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఏడాది ప్రాతిపదికన 10.1 శాతం కుదించుకుంది. ఇదే సమయంలో చమురు, గ్యాస్ రంగ కార్యకలాపాలు ఏకంగా 26.4 శాతం తగ్గినట్లు సమాచారం.బోవర్డ్ చేతిలో కీలక బాధ్యతఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక చమురు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న హమీద్ బోవర్డ్పై కీలక బాధ్యతలు పడనున్నాయి. ఆయన ఇప్పటికే ప్రభుత్వ రంగంలోని నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. చమురు ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని కొనసాగించడం, అమెరికా ఆంక్షలు–దిగ్బంధనాన్ని ఎదుర్కొంటూ ఇంధన రంగాన్ని నడిపించడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి.పాక్నెజాద్ మాత్రం రాజీనామాకు ముందు చమురు ఆదాయాలపై ప్రజలకు భరోసా ఇచ్చారు. తాము ఇప్పటికే విక్రయించిన చమురుకు సంబంధించిన ఆదాయం వస్తూనే ఉందని, అది కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.అమెరికా నుంచి మరిన్ని ఆంక్షలుమరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతోంది. శుక్రవారం అమెరికా ట్రెజరీ ఇరాన్‌కు చెందిన రైలు, ఆటోమొబైల్ రంగాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలు ప్రకటించింది. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా తెలిపింది. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. యుద్ధానికి నిధులు సమకూర్చుకునే టెహ్రాన్ సామర్థ్యాన్ని తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. ఇరాన్ మిగిలిన చమురు ఆదాయ మార్గాలను కూడా కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చమురు ధరలు తగ్గుతున్నాయని శనివారం వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యాలను దాదాపుగా వదులుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం ఎనిమిదో నెలలోకి ప్రవేశించింది. అయితే పాక్నెజాద్ రాజీనామాకు అమెరికా ఆంక్షలు లేదంటే యుద్ధ పరిస్థితులే కారణమని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అయినప్పటికీ దేశంలోని కీలకమైన చమురు రంగంపై అమెరికా ఒత్తిడి పెరుగుతున్న సమయంలోనే మంత్రి మారడం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: నిరసన వెంటనే తుపాకీ పట్టారే! -
కొత్తగా ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్’
వాషింగ్టన్: కృత్రిమ మేధ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టే లక్ష్యంగా సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రకటించారు. జాతీయ నిఘా డైరెక్టర్ జే క్లేటన్ ఈ ఫోర్స్‌కు సారథ్యం వహిస్తారన్నారు. కృత్రిమ మేధను సూపర్ ఇంటెలిజెన్స్‌గా పిలవాలంటూ ట్రంప్ కోరుతుండటం తెల్సిందే. సూపర్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికాను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న అమెరికా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులు, సామాజిక సంస్థలు, మత సంఘాలు, కీలక మౌలిక వనరుల కంపెనీలు, ఏఐ సంస్థలను ఈ ఫోర్స్ సమన్వయం చేసుకుంటుందని ట్రంప్ వివరించారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చైర్మన్ ఫెర్గుసన్, పెంటగాన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైకేల్ తదితరులతో కూడిన ఈ ఫోర్స్ ఏఐతో తలెత్తే ముప్పు, అవకాశాలపై 120 రోజుల్లోగా అధ్యక్షుడు ట్రంప్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్కు నివేదిక అందజేయనుంది. గత వారం అమెరికాలోని అగ్రగామి టెక్ కంపెనీల అధినేతలు వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమై తాము అభివృద్ధి చేసే ఏఐ సంబంధిత సాంకేతికతలపై స్వయం పర్యవేక్షణ చేపడతామంటూ అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ వివరాలను ట్రూత్ సోషల్‌లో వెల్లడించటం గమనార్హం. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం..
ఖమ్మం రూరల్/మరిపెడ: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి సింహాద్రినగర్ నివాసి దారం సుప్రియ (30) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన దారం శ్రీనివాస్, జ్యోతి దంపతులు కుటుంబంతో కలిసి సింహ్రాద్రినగర్లో నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సుప్రియకు మహబూబాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రంజిత్‌తో వివాహం జరిగింది. వీరు అమెరికాలోని ముస్సోరి రాష్ట్రంలో నివాసం ఉంటుండగా, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.సుప్రియ శనివారం తన స్నేహితురాలితో కలిసి కారులో రెస్టారెంట్‌కు వెళ్లి వస్తుండగా ఎదురుగా వచి్చన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు ఆమె మృతి వార్త తెలియడంతో తండ్రి శ్రీనివాస్, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, సుప్రియ కుటుంబ సభ్యులను సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తదితరులు పరామర్శించారు. సుప్రియ మృతదేహం అమెరికా నుంచి మంగళవారం వచ్చే అవకాశం ఉంది. -
7 షరతులు ఓకే చెప్పండి.. లేదా?
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ మరోసారి ఝలక్ ఇచ్చింది. ఇరాన్ విధించిన ఏడు షరతులను నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధిని ఎట్టిపరిస్థితుల్లో తిరిగి తెరవబోయేది లేదని తెలిపింది. ఈ ఏడు షరతులు జూన్‌లో ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం అనగా.. ఇస్లామాబాద్ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) ఆధారంగా ఉన్నాయని ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ స్పీకర్ కీలక ప్రకటన విడుదల చేశారు.మహమ్మద్ గాలిబాఫ్ మాట్లాడుతూ, "ఇరాన్ వైఖరి “పూర్తిగా స్పష్టంగా, దృఢంగా” ఉంది. అమెరికా ఈ ఏడు షరతులను అమలు చేసే వరకు హోర్ముజ్ జలసంధి తెరవడం జరగదు. ఒకవైపు అమెరికా బహిరంగంగా ఒక రకమైన సందేశాలు ఇస్తూనే, మరోవైపు మధ్యవర్తి ద్వారా వేరే ప్రతిపాదనలు పంపుతోంది. ఇకపై చర్చల్లో జాప్యాన్ని లేదా అమెరికా ఏకపక్ష డిమాండ్లను ఇరాన్ అంగీకరించదు". అని అన్నారు. ఇరాన్ నుంచి వచ్చిన దౌత్య ప్రతిపాదనకు అమెరికా ఇచ్చిన సమాధానం కొన్ని రోజుల క్రితమే తమకు అందిందని ఆయన తెలిపారు.ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా అంగీకరిస్తే, ఏడు రోజుల్లో హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టెహ్రాన్‌లో విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో అరాఘ్చీ ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గాన్ని తిరిగి తెరవడానికి అమెరికా అంగీకరించాల్సిన షరతులను ఇరాన్ ఇప్పటికే స్పష్టంగా తెలియజేసిందని ఆయన అన్నారు.అమెరికా దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలని ఇరాన్ ఆశిస్తోందని అరాఘ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అమెరికా మళ్లీ సైనిక చర్యల వైపు వెళితే, దానికి ప్రతిస్పందించేందుకు ఇరాన్ గతంలో కంటే “మరింత సిద్ధంగా ఉంది” అని హెచ్చరించారు. వారు సైనిక పరిష్కారాల వైపు వెళితే, మేము గతంలో కంటే మరింత సిద్ధంగా ఉన్నాం అని అరాఘ్చీ పేర్కొన్నారు.ప్రస్తుతం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఖతార్ మధ్యవర్తిత్వంతో ఏడు రోజుల విశ్వాస నిర్మాణ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. జూన్‌లో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని మరింత విస్తృత రూపంలో పునరుద్ధరించడంతో పాటు, ఇరాన్ అణు కార్యక్రమం హర్ముజ్ జలసంధికి సంబంధించిన అంశాలపై చర్యలు తీసుకోవడం ఈ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం.అయితే.. ఓవైపేమో ఇరాన్ అమెరికాతో ఒప్పందం కోసం యత్నిస్తుంటే మరోవైపేమో అమెరికన్లు, ఇజ్రాయెల్ దేశస్థులపై దాడులు తీవ్ర కలకలం రేవుతున్నాయి. ఇటీవలే దుబాయి నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ప్లై దుబాయ్ విమానాన్ని కో ఫైలట్ హమాం అల్ హమామి కూల్చే యత్నం చేయగా భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహాసాలతో ఈ ఫ్లైట్‌ను కాపాడిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి దాడులు మరికొన్ని చేయాలని ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా పిలుపునిచ్చింది. తన మద్ధతుదారులు ప్రారంభించిన అల్బయాన్ పత్రికలో ఈ ప్రకటన విడుదల చేసింది దీంతో వాతావరణం ఆందోళన కరంగా మారింది. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి మృతి
ఖమ్మం రూరల్/మరిపెడ: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి సింహాద్రినగర్ నివాసి దారం సుప్రియ (30) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన దారం శ్రీనివాస్, జ్యోతి దంపతులు కుటుంబంతో కలిసి సింహ్రాద్రినగర్లో నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.పెద్ద కుమార్తె సుప్రియకు మహబూబాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రంజిత్‌తో వివాహం జరిగింది. వీరు అమెరికాలోని ముస్సోరి రాష్ట్రంలో నివాసం ఉంటుండగా, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. సుప్రియ శనివారం తన స్నేహితురాలితో కలిసి కారులో రెస్టారెంట్‌కు వెళ్లి వస్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది.భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు ఆమె మృతి వార్త తెలియడంతో తండ్రి శ్రీనివాస్, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, సుప్రియ కుటుంబ సభ్యులను సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తదితరులు పరామర్శించారు. సుప్రియ మృతదేహం అమెరికా నుంచి మంగళవారం వచ్చే అవకాశం ఉంది. ఇదీ చదవండి: రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కున్న వృద్ధుడు -
1894లో తీసుకున్నాడు.. 2026లో ఇచ్చేశాడు.. అసలేం జరిగిందంటే?`
లైబ్రరీలో ఎవరైనా పుస్తకం రెండు రోజులు ఆలస్యంగా ఇస్తారు. లేదా రెండు వారాలు! కానీ అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్‌లో ఓ వ్యక్తి మాత్రం ఏకంగా శతాబ్దం దాటాక రిటర్న్ చేశారు. అసలు ఏమైందంటే?1894 సెప్టెంబర్‌లో తీసుకున్న మ్యాగజైన్ ను తాజాగా లైబ్రరీకి తిరిగి ఇచ్చారు. అంటే దాదాపు 132 ఏళ్ల తర్వాత! ఆ మ్యాగజైన్ ‘ది సెంచరీ ఇలస్ట్రేటెడ్ మంత్లీ’. ఇన్నేళ్లు అది తన ఇంట్లో ఎలా చేరిందో తనకే తెలియదని జాన్ అనే వ్యక్తి లైబ్రేరియన్లకు చెప్పారు. ఇటీవల లైబ్రరీలో పాత బకాయిల ఫైన్ మాఫీ చేస్తున్నారని తెలుసుకుని, వెంటనే మ్యాగజైన్ ను తిరిగి ఇచ్చేశారు.లేకపోతే 48,220 రోజుల ఆలస్యానికి 12,055 డాలర్ల ఫైన్ పడేది! అదృష్టవశాత్తూ లైబ్రరీ ప్రస్తుతం ఓవర్‌డ్యూ ఫైన్లను నిలిపివేసింది. దీంతో జాన్ జేబుకు భారీ ఊరట! అయితే ఈ మ్యాగజైన్ ను మళ్లీ చదవడానికి షెల్ఫ్‌లో పెట్టలేదు. భవిష్యత్తులో దీనిని ప్రత్యేక ప్రదర్శనలో ఉంచే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి లైబ్రరీకి వచ్చిన ఈ లేట్ రిటర్న్ మరో అద్భుతంగా చరిత్రలో నిలిచిపోనుంది!ఇదీ చదవండి: తొంభైలోనూ తొణకని కండలు -
విదేశాల్లోని భారతీయుల జాబితా ఇదే..
ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రవాస శక్తిగా భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మాతృదేశం దాటి సుదూర తీరాల్లో స్థిరపడిన కోట్లాది మంది భారతీయులు నేడు వివిధ దేశాల ఆర్థిక, సాంకేతిక, సామాజిక విభాగాల్లో దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఉన్నత సాంకేతిక కేంద్రాల నుంచి గల్ఫ్ దేశాల నిర్మాణ, సేవా రంగాలు, ఆసియా-ఆఫ్రికా దేశాల చారిత్రక వర్తక కేంద్రాల వరకు భారతీయుల పాత్ర విశిష్టమైనది. విదేశాంగ శాఖ సేకరించిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల వివరాలు చూద్దాం.భారత విదేశాంగ శాఖ సేకరించిన అధికారిక గణాంకాల ప్రకారం అత్యధికంగా భారతీయులు నివసిస్తున్న టాప్-10 దేశాల జాబితా కింది విధంగా ఉంది.ఇదీ చదవండి: నేలవాలిన అపరంజి ధరలుస్థానందేశంప్రవాస భారతీయులు1అమెరికా6.1 మిలియన్లు (61 లక్షలు)2యూఏఈ4.3 మిలియన్లు (43 లక్షలు)3కెనడా3.2 మిలియన్లు (32 లక్షలు)4మలేషియా 2.9 మిలియన్లు (29 లక్షలు)5సౌదీ అరేబియా 2.8 మిలియన్లు (28 లక్షలు)6మయన్మార్ 2.0 మిలియన్లు (20 లక్షలు)7దక్షిణాఫ్రికా1.8 మిలియన్లు (18 లక్షలు)8శ్రీలంక1.6 మిలియన్లు (16 లక్షలు)9యునైటెడ్ కింగ్డమ్ 1.3 మిలియన్లు (13 లక్షలు)10కువైట్ 1.0 మిలియన్ (10 లక్షలు) -
‘క్లాడ్’కు ఆధునిక వివేకానందుని నైతిక శిక్షణ
శాన్ ఫ్రాన్సిస్కో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధి మానవాళిని అద్భుతాల వైపు నడిపిస్తున్నప్పటికీ, అది నియంత్రణ తప్పుతుందేమోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోంది. సాంకేతికత ఎంత వేగంగా దూసుకెళ్తున్నా, సరైన నైతిక పునాదులు లేకపోతే ప్రమాదకరమని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో ఏఐకి సరికొత్త దిశానిర్దేశం చేసేందుకు ప్రపంచంలోని అగ్రగామి సంస్థలు ఆధ్యాత్మిక, తత్వశాస్త్రం వైపు అడుగులు వేస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్, ‘ఇంటర్నెట్ యుగపు స్వామి వివేకానంద’గా పేరొందిన వేదాంత గురువు స్వామి సర్వప్రియానందను తమ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. తమ అత్యాధునిక మోడల్ ‘క్లాడ్’ (Claude)కు శిక్షణ ఇచ్చే విధానాలు, సాంకేతికతలో నైతిక విలువల రూపకల్పన, భవిష్యత్తులో ఏఐ మానవుల తరహా చేతనను సాధించగలదా అనే అంశాలపై ఆయనతో విస్తృతంగా చర్చించారు.సంస్థతో కుదిరిన నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్ (ఎనడీఏ)కారణంగా సమావేశంలోని పూర్తి వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ, పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఈ మేధోమథనంలో సంస్థ వ్యవస్థాపకులలో ఒకరితో పాటు వివిధ మతాల ఆధ్యాత్మికవేత్తలు, మానసిక నిపుణులు, వైద్యులు పాల్గొని తమ విలువైన ఆలోచనలను అందించారని ఆయన తెలిపారు.కేవలం గణిత అల్గారిథమ్‌లు, డేటాతోనే కాకుండా మానవీయ కోణాన్ని అర్థం చేసుకునేలా ఏఐని తీర్చిదిద్దడమే ఈ సమాలోచనల అసలు ఉద్దేశం. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలను బాధ్యతాయుతంగా, మానవ సంక్షేమానికి అనుకూలంగా మలచాలంటే పురాతన తాత్విక జ్ఞానం ఎంతో అవసరమని సిలికాన్ వ్యాలీ దిగ్గజాలు గుర్తించడాన్ని ఈ పరిణామం స్పష్టంగా తెలియజేస్తోంది.ఇదీ చదవండి: అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి -
అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి
ఒహాయో: అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఒక హిందూ దేవాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. రిచ్మండ్ హైట్స్ ప్రాంతంలోని శ్రీ స్వామినారాయణ్ వడ్తాల్ ధామ్ హిందూ ఆలయంపై దుండగులు ఇటుకలు విసరడంతో ఆలయం కిటికీలు, తలుపులు, అద్దాలు పగిలి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ దాడిని హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది. ⚠️Hindu temple attacked in Ohio today| At 1:30 PM today, the Shree Swaminarayan Vadtal Dham Hindu Mandir in Richmond Heights, Ohio was attacked by perpetrator(s) who threw bricks at the temple causing significant damage. Surveillance video is available and being reviewed by authorities. The @FBI @CivilRights are being alerted. HAF is in touch with temple leaders and offering all assistance. This possible hate crime comes at a time of unprecedented hate & vitriol directed at the Hindu American community, and we ask that law enforcement make apprehending the perpetrator(s) a top priority. We also call on our nation’s elected leaders & government agencies to publicly & unequivocally condemn hateful rhetoric against Indian and Hindu American communities.— Hindu American Foundation (@HinduAmerican) October 3, 2026రంగంలోకి ఎఫ్‌బీఐ విభాగంఈ ఘటనకు సంబంధించిన సర్వైలెన్స్ (సీసీటీవీ) వీడియో ఆధారంగా దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. ఈ దాడికి సంబంధించిన సమగ్ర వివరాలను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)కి చెందిన సివిల్ రైట్స్ యూనిట్‌కు కూడా అందించినట్లు అధికారులు తెలిపారు. ఆలయ నిర్వాహకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అన్ని రకాల న్యాయ, సహాయ సహకారాలు అందిస్తున్నామని సంస్థ స్పష్టం చేసింది.నిందితుల అరెస్ట్‌కు డిమాండ్ఈ దాడిని విద్వేషపూరిత నేరం (హేట్ క్రైమ్)గా పరిగణించి, నిందితులను తక్షణమే పట్టుకోవాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ దర్యాప్తు సంస్థలను డిమాండ్ చేసింది. అమెరికాలో ఇటీవల హిందూ అమెరికన్ సమాజంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు, విద్వేషం పెరుగుతున్నదని పేర్కొంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు భారతీయ, హిందూ సమాజాలపై జరుగుతున్న ద్వేషపూరిత దాడులను బహిరంగంగా ఖండించాలని కోరింది. మహాత్మా గాంధీ జయంతి రోజే, ఒహాయోలో అధికారికంగా ప్రకటించిన ‘హిందూ హెరిటేజ్ మంత్’ ప్రారంభమైన రోజే ఈ దాడి జరగడం గమనార్హం.ఇదీ చదవండి: 24 గంటల్లో రెండు ఎన్కౌంటర్లు.. నిందితులకు గాయాలు -
H-1B వీసాలపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు!
యూఎస్‌లో విదేశీలు ఉద్యోగాలు చేసేందుకు ఉపయోగించే హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత హెచ్1బీ వ్యవస్థ పూర్తిగా లోపభూయిష్టంగా మారిందని, అవసరమైతే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయడానికి తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా.. అమెరికన్ ఉద్యోగుల స్థానంలో, తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించేందుకు కొన్ని కంపెనీలు ఈ వీసా విధానాన్ని ఉపయోగిస్తున్నాయని ఆయన ఆరోపించారు.అమెరికన్ ఉద్యోగాలపై ప్రభావంఒక అమెరికన్ అకౌంటెంట్‌కు ఏడాదికి 60 వేల డాలర్లు చెల్లించే కంపెనీ, అదే పనిని 45 వేల డాలర్లకు విదేశీ ఉద్యోగితో చేయించుకుంటే అది అత్యుత్తమ ప్రతిభను తీసుకురావడం కాదని వాన్స్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలాంటి విధానం అమెరికన్ల ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే.. హెచ్1బీ ద్వారా అధిక నైపుణ్యాలు ఉన్న విదేశీ నిపుణులను తీసుకురావడాన్ని తాను వ్యతిరేకించడం లేదని వివరించారు.ఇదే సమయంలో హెచ్1బీ దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజు విధించడాన్ని వాన్స్ సమర్థించారు. తక్కువ ఖర్చుతో విదేశీ ఉద్యోగులను నియమించుకునే ఉద్దేశంతో.. కంపెనీలు హెచ్1బీను ఉపయోగించకుండా నిరోధించడమే ఈ భారీ ఫీజు లక్ష్యమని చెప్పారు. అలాగే.. అమెరికా ప్రభుత్వం హెచ్1బీ ఎంపికలో అధిక జీతాలు వచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, దరఖాస్తు చేస్తున్న కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించాయా? లేదా?.. అనే విషయాన్ని కూడా పరిశీలించేలా నిబంధనలను కఠినతరం చేస్తోంది.జేడీ వాన్స్ వ్యాఖ్యలపై ఆసక్తిహెచ్1బీ వీసాలు ఐటీ నిపుణులకు ఎంతో ముఖ్యమైనవి కావడంతో.. జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్‌లో కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లేదా అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ టెక్ నిపుణులపై భవిష్యత్తులో ఈ నిబంధనల ప్రభావం ఎలా ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు కూడా హెచ్1బీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. దానిపై ప్రభుత్వం మరింత కఠినమైన నియంత్రణలు తీసుకొస్తోంది.ఇదిలా ఉండగా.. కొన్ని H-1B దరఖాస్తులపై విధించిన లక్ష డాలర్ల ఫీజుపై అమెరికా కోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లు కూడా కొనసాగుతున్నాయి. ఫీజును అమలు చేసే సమయంలో ప్రభుత్వం అనుసరించాల్సిన పరిపాలనా ప్రక్రియలను పాటించలేదనే వాదనలు కోర్టుల్లో వినిపించాయి. దీంతో.. ఫీజు అమలుపై న్యాయపరమైన ఆంక్షలు వచ్చాయి.ఇదీ చదవండి: గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది? -
రెండు విషపు సూదులు.. అయినా చావలేదు!
‘తానొకటి తలిస్తే.. దైవం ఇంకొకటి తలచిందంటారు’’ క్రిస్టా పైక్ విషయంలో ఇది మరోసారి రుజువైంది. ఎంత విచిత్రం కాకపోతే... ముప్ఫై ఏళ్ల నాటి హత్యకు మరణశిక్ష పడటం ఏమిటి?. చంపేద్దామని... ఒకటి కాదు, రెండు... విషపు సూదులు గుచ్చినా పైక్ నిక్షేపంగా... గురకపెడుతూ కనిపించడం ఏమిటి? నిజంగా విడ్డూరమే!. అగ్రరాజ్యం అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో మరణ శిక్షల అమలు కొనసాగుతూనే ఉంది. ఈ విషయం కొత్త కాదు కానీ... చట్టం విధించిన శిక్ష అమలు చేయడం బెడిసికొట్టడం మాత్రం ఇదే మొదటిసారి అయి ఉంటుంది. యాభై ఏళ్ల క్రిస్టా పైక్ సుమారు 31 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నారు. టెన్నిసీ రాష్ట్రంలోని నాక్స్‌విల్లేలో 1995లో కొల్లీన్ స్లెమ్మర్ అనే 19 ఏళ్ల యువకుడి హత్య పెను సంచలనం సృష్టించింది. ఈ నేరానికి గాను క్రిస్టాకు అతిపిన్న వయసులోనే మరణ శిక్ష పడింది కూడా. అయితే కేసు స్టేట్, ఫెడరల్ కోర్టుల్లో అప్పీళ్లకు వెళ్లడం, క్రిస్టా మానసిక పరిస్థితి బాగా లేదని, చిన్నప్పటి అనుభవాల కారణంగానే ఆమె హింసకు పాల్పడిందని న్యాయవాదులు ప్రతి దశలోనూ వాదించడం, మరికొన్ని కారణాల వల్ల క్రిస్టాకు పడ్డ మరణ శిక్షను అమలు చేయడం ఇప్పటివరకూ వీలు కాలేదు. అన్ని రకాల అప్పీళ్లు ముగిసిన నేపథ్యంలో సెపె్టంబరు 30వ తేదీ బుధవారం రాత్రి విషపు ఇంజెక్షన్లు ఇచ్చి మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. నాష్‌విల్లేలోని రివర్‌బెండ్ మ్యాక్సిమమ్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్లో ఇందుకు తగ్గ ఏర్పాట్లూ జరిగాయి కానీ... అధికారులు క్రిస్టా పైక్‌కు రెండు ఇంజెక్షన్లయితే ఇచ్చారు కానీ... ఆమె గుండె ఆగిపోలేదు. కొట్టుకుంటూనే ఉంది. మరణాన్ని ధ్రువీకరించేందుకు దగ్గరకు వెళ్లిన సాక్షులకు ఆమె పెడుతున్న గురక కూడా వినిపించిందట. బిత్తరపోయిన అధికారులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కచ్చితమైన సమాచారం ఏదీ లేనప్పటికీ బతికే ఉందని మాత్రం తెలిసింది. అయితే... ఈ వ్యవహారమిప్పుడు రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతోంది. చచ్చినంత పనై బతికిపోయిన క్రిస్టాపై మరోసారి మరణ శిక్ష అమలు చేస్తారా? ఇలా చేయడం నైతికంగా సరైందేనా? అని న్యాయ నిపుణులు, మానవ హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా మరణశిక్ష అమలు విఫలం కావడం రాజ్యాంగ పరమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని ఒక న్యాయవాది వ్యాఖ్యానించారు. – టెన్నిసీ -
ధరల మంట ట్రంప్ పుణ్యమే
వాషింగ్టన్: మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్‌నకు ఎదురు గాలులు వీస్తున్నాయి. పెట్రోలు, డీజిళ్లతోపాటు నిత్యావసరాల ధరలు కూడా పైపైకి ఎగబాకుతూండటతో ట్రంప్ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కువవుతోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్, షికాగో యూనివర్శిటీ పరిశోధన కేంద్రం ‘నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్లు’సంయుక్తంగా (ఏపీ–ఎన్ఓఆర్సీ)నిర్వహించిన తాజా సర్వేలోనూ ఈ విషయం స్పష్టమైంది. ధరల పెరుగుదలకు ట్రంప్ విధానాలే కారణమని అత్యధికులు భావిస్తున్నారు. దీంతో ఈ అసంతృప్తి ప్రభావం కాస్తా వచ్చే నెలలో జరిగే మధ్యంతర ఎన్నికలపై పడనుందని అధికార రిపబ్లికన్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక విధానాలపై ట్రంప్ అప్రూవల్ రేటింగ్ గత ఏడాది మార్చితో పోలిస్తే ఏకంగా 14 శాతం వరకూ తగ్గిపోయినట్లు ఈ సర్వే తెలిపింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయానికి వస్తే దాదాపు 60 శాతం రిపబ్లికన్లే ట్రంప్ తీరుపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల విషయానికి వస్తే ఏపీ–ఎన్ఓఆర్సీ సర్వే ప్రకారం 65 శాతం అమెరికన్లకు ట్రంప్ వైఖరి ఏమాత్రం నచ్చడం లేదు. జీవన వ్యయం విషయంలో ట్రంప్ విధానాలు ఓకే అంటున్న వారు.. 17 శాతం మంది ఉండగా.. స్థూలంగా ఆర్థిక విధానాలు ఫర్వాలేదన్న వాళ్లు 26 శాతం మంది మాత్రమే. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ దూకుడు, ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతూండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తరువాత ఇవి అత్యంత కనిష్టమైన రేటింగ్స్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికలు కీలకం కానున్నాయి. కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల పట్టు కొనసాగుతుందా? లేదా అన్నది ఈ ఎన్నికలతో తేలనుంది. మరోవైపు ట్రంప్ తన ఎన్నికల ప్రచారాన్ని కూడా దూకుడుగానే మొదలుపెట్టారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తానే పోటీలో ఉన్నానని అనుకోండని పిలుపునిచ్చారు కూడా. అయితే ఈ ఎత్తుగడ అంత మంచి ఫలితాలిచ్చే అవకాశాలు లేవని, రిపబ్లికన్లలోనే ట్రంప్ తీరు, పాలనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఈ సర్వే ద్వారా తెలిసింది. ‘‘మా అధ్యక్షుడు దేశానికి సాయం చేస్తాడని అనుకున్నాం. ఇప్పటివరకైతే ఆర్థిక విషయాల్లో కానీ.. ఇతరాల్లో కానీ ఆయన చేసిందేమీ లేదు. మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ అన్నాడు కానీ.. ఆ దిశగా జరిగిన ప్రయత్నాలేవీ లేవు’’అని రాబర్ట్ గాల్ట్ అనే 66 ఏళ్ల పెన్సెల్వేనియా వ్యక్తి చేసిన వ్యాఖ్య పరిస్థితికి అద్దం పడుతోంది. ట్రంప్ దృష్టి ఎక్కడో ఉంది... ఇరాన్‌తో యుద్ధం విషయంలో 69 శాతం అమెరికన్లు ట్రంప్‌పై గుర్రుగా ఉంటే దాదాపు 28% మంది మాత్రమే ఒకే అంటున్నారు. వివిధ దేశాలతో వాణిజ్య, టారిఫ్‌లు విధించడంలో ట్రంప్ ‘‘మితిమీరి’’వ్యవహరిస్తున్నారని 64% మంది భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 58 శాతం మంది మాత్రమే ఈ రకమైన అభిప్రాయం కలిగి ఉండేవారు. ఆసక్తికరంగా సుమారు 67 శాతం మంది రిపబ్లికన్లు అధిక ధరలకు ట్రంప్ చేతుల్లో లేని విషయాలే కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం చాలా కష్టం అని విస్కాన్సిన్కు చెందిన ట్రంప్ మద్దతుదారు ఫ్రెడ్ న్యూమన్ (51) అభిప్రాయపడ్డారు. ట్రంప్ టారిఫ్ విధానాలు, ఇరాన్‌తో యుద్ధం కూడా అవసరమైనవేనని అంటున్నారు. నిత్యావసరాల ధరలు పైపైకి... అమెరికాలో కొన్ని నెలలుగా నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నెలవారీ వెచ్చాలు, పెట్రోలు, డీజిళ్ల ధరలపై సగం మంది అమెరికన్లు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం ఈ సంఖ్య 39 శాతంగా ఉండేది. అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోవడంతో డబ్బులు ఏమాత్రం మిగలడం లేదని, గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదని, కాలిఫోర్నియాకు చెందిన పెడ్రో శాంచెజ్ వ్యాఖ్యానించారు. అయోవాలోని ఫెయిర్‌ఫ్యాక్స్‌కు చెందిన బెథనీ లెనికా (41) మాట్లాడుతూ....‘‘ఈ వారం ఒకలా (ధరలు) ఉంటే మరుసటి వారం ఇంకోలా ఉంటున్నాయి. ఖర్చులకు తగ్గట్టు ఆదాయం ఎలాగూ పెరగదు’’అని అన్నారు. రిపబ్లికన్ పార్టీ వైపే మొగ్గు చూపే లెనికా ‘‘పరిస్థితులు మారినట్టు కనిపించడం లేదు’’అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
95 ఏళ్ల వయసులో డిగ్రీ.. 98 ఏళ్లకు మాస్టర్స్..!
నేర్చుకోవాలన్న జిజ్ఞాస ముందు వయసు అడ్డంకి కాదు పలువురు నిరూపించారు. ఎంతో మంది వయసు మళ్లాక చదివి చూపించారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే బామ్మ అత్యంత విభిన్నం. ఎందుకంటే ఆమె ఘనతకు యావత్తు ప్రపంచమే ఆశ్చర్యపోతూ..ఆ బామ్మను ఓ అద్భుతంగా కీర్తిస్తుంది. ఆ బామ్మే అమెరికాకు చెందిన నోలా ఓక్స్ . ఆమె తన మనవరాల అలెగ్జాండ్రాతో కలసి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె మహామాంద్య సమయంలో కళాశాలలో చేరి డిగ్రిని ప్రారంభించి మధ్యలోనే వదిలేసింది. ఆ తర్వాత దశాబ్దాల కాలంపాటు బోధన, వ్యవసాయం, కుటుంబం వంటి బాధ్యతలతో మగ్గిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు తరగతి గదులకు వచ్చి..మధ్యలో వదిలేసిన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. అది కూడా 95 ఏళ వయసులో తిరిగి కశాలకు వెళ్లడం విశేషం. ఆమె ఏప్రిల్ 19, 1930న ఫోర్ట్ హేస్ స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్లకు అదే కాలేజ్‌లో చేరి డిగ్రీని పూర్తి చేయాలని భావించడం విశేషం. ఆమె వెర్నన్ ఓక్స్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కాన్వాస్లోని గ్రామీణ పాఠశాల్లో బోధిస్తూ..ఓ పక్క కుటుంబం, వ్యవసాయాన్ని చూసుకుంటూ ఉండేది. ఆ నేపథ్యంలోనే చదువుకి విరామం ఇచ్చేసింది. అలా దశాబ్దాలు గడిచిపోయాయి. భర్త మరణంతో ఓక్స్ తిరిగి చదవాలనుకుంది. అసంపూర్తిగా వదిలేని డిగ్రీని పూర్తి చేయాలని అదే కాలేజ్‌కి వచ్చింది. అయితే తరగతి గదులకు వెళ్తున్నప్పుడూ.. తన చుట్టూ ఉన్నవాళ్లంతా మనవళ్లు, మనవరాళ్ల వయసు ఉన్న వాళ్లే అయినా..దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదని అంటోంది. కేవలం డిగ్రిని పూర్తి చేయాలన్న లక్ష్యానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. అలా ఓక్స్ బామ్మ తన మనవరాలైన 21 ఏళ్ల అలెగ్జాండ్రాతో కలిసి ఒకేసారి బ్యాచిలర్ డిగ్రీని అందుకుందామె. అంతేగాదు ఈ బామ్మ ఓక్స్నే ప్రపంచంలోనే అత్యంత వయసు పైబడిన కళాశాల గ్రాడ్యుయేట్‌గా నిలవడం విశేషం. అక్కడితో ఆమె నేర్చుకునే ప్రయాణం ముగిసిపోలేదు. 98 ఏళ్ల వయసులో ఫోర్ట్ హేస్ స్టేట్ యూనివర్సిటీ నుంచి లిబరల్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీని కూడాపూర్తి చేసింది. అలా ఆమె వందేళ్లు వచ్చే వరకు తరగతి గదులకు హాజరవుతూనే ఉంది. సుమారు ఏడేళ్లపాటు చదువుని కొనసాగిస్తూనే ఉంది. ఆ తర్వాత తన వ్యవసాయ పనులకు తిరిగి వచ్చేసింది. అంతేగాదు కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకోవడానికే ఇష్టపడింది. అలాగే వయసు రీత్యా పెద్దదాన్ని అని ప్రత్యేక సౌకర్యాలను కూడా కోరకుండా..కాలేజ్ నియమ నిబంధనలకు లోబడే చదువు సాగించడం విశేషం. ఇక ఓక్స్ 2016లో 105 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచింది. అంతేగాదు ఆమె పేరు అమెరికన్ ఉన్నత విద్యలోని అత్యంత అసాధారణ పట్టభ్రద్రుల జాబితాల్లో చోటు దక్కించుకుంది. నిజానికి 77 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని చవిచూసిన అనంతరం మధ్యలో వదిలేసిన డిగ్రీని తిరిగి పూర్తి చేసిన ఓ బామ్మ కథ ఇది. ఇదీ చదవండి: కనుల కంటే ఎక్కువ విజన్..! ఎవరీ రజనీ గోపాలకృష్ణ) -
క్రిస్టా కేసులో ఊహకందని మలుపులు.. ఆఖరికి ఉరిశిక్ష ఖరారు!
అమెరికాలో 1995లో సహ విద్యార్థి కొలీన్ స్లెమ్మర్‌ను హత్య చేసిన కేసులో క్రిస్టా పైక్ ఉరిశిక్ష అమలుకు మార్గం సుగమమైంది. ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమెరికా సుప్రీంకోర్టు బుధవారం రాత్రి రద్దు చేసింది. దీంతో పైక్‌కు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. 50 ఏళ్ల పైక్‌కు నాష్‌విల్లేలోని రివర్‌బెండ్ మాగ్జిమమ్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్లో ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. అది అమలైతే.. గడచిన 200 ఏళ్లలో టెన్నెస్సీ స్టేట్‌లో ఉరిశిక్ష అమలయ్యే తొలి మహిళగా పైక్ నిలువనుంది.తాత్కాలికంగా నిలిపిన ఆరో సర్క్యూట్ కోర్టుపైక్ కేసులో కొత్త వాదనలను ఆమె న్యాయవాదులు ముందుకు తెచ్చిన నేపథ్యంలో వాటిని పరిశీలించేందుకు అమెరికా ఆరో సర్క్యూట్ అప్పీళ్ల కోర్టు ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే సుప్రీంకోర్టు ఆ నిలుపుదల ఆదేశాన్ని రద్దు చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై న్యాయమూర్తులు సోనియా సోటోమేయర్, ఎలెనా కాగన్, కేతాంజి బ్రౌన్ జాక్సన్ అసమ్మతి వ్యక్తం చేశారు. ఆరో సర్క్యూట్ కోర్టు తన సాధారణ న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా పైక్ వాదనలను పరిశీలించే అవకాశాన్ని సుప్రీంకోర్టు నిర్ణయం అడ్డుకుంటోందని సోటోమేయర్ తన అసమ్మతి అభిప్రాయంలో పేర్కొన్నారు.చిన్ననాటి వేధింపులపై న్యాయవాదుల వాదనపైక్ అసలు విచారణ సమయంలో ఆమె తరఫు న్యాయవాదులు చిన్ననాట ఆమె ఎదుర్కొన్న తీవ్రమైన వేధింపులు, నిర్లక్ష్యం, మానసిక గాయాలకు సంబంధించిన ఆధారాలను తగినంతగా సమర్పించలేదని న్యాయవాదులు వాదించారు. ఆ వివరాలను జ్యూరీ ముందుంచి ఉంటే ఆమెకు మరణశిక్ష విధించాలన్న నిర్ణయం ప్రభావితమయ్యే అవకాశం ఉండేదని తెలిపారు. టెన్నెస్సీ గవర్నర్ బిల్ లీ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడానికి ముందు పైక్ రాసిన లేఖలో.. తనకు చావంటే భయం లేదని, అయితే ఉరిశిక్ష ప్రక్రియపై ఆందోళనగా ఉందని పేర్కొంది. తనకు మద్దతుగా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.కొలీన్ స్లెమ్మర్ హత్య కేసు1995 నుంచి పైక్ జైలులో ఉంది. తన మాజీ సహ విద్యార్థిని కొలీన్ స్లెమ్మర్‌ను హత్య చేసిన కేసులో ఆమెకు మరణశిక్ష విధించారు. కోర్టు రికార్డుల ప్రకారం.. పైక్, స్లెమ్మర్ టెన్నెస్సీలోని నాక్స్విల్లే జాబ్ కార్ప్స్ సెంటర్లో విద్యార్థులుగా ఉన్నారు. పైక్‌కు అప్పటికి 18 ఏళ్లు, స్లెమ్మర్కు 19 ఏళ్లు. పైక్ అప్పటి ప్రియుడు టడరిల్ షిప్, మరో స్నేహితురాలు షడోల్లా పీటర్సన్ కూడా దాడి భాగస్వాములని కోర్టు రికార్డులు పేర్కొన్నాయి. పైక్తో స్లెమ్మర్ సంబంధాలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.హత్య కేసులో సుదీర్ఘ విచారణస్లెమ్మర్ మరణానికి సంబంధించిన పరిస్థితులు పైక్ మరణశిక్ష కేసులో కీలక అంశంగా మారాయి. అసలు విచారణలో ప్రాసిక్యూటర్లు, జ్యూరీ సభ్యులు, అనంతరం కేసును పరిశీలించిన న్యాయమూర్తులు ఈ హత్యను అత్యంత క్రూరమైనదిగా అభివర్ణించారు. యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీ క్యాంపస్‌లోని అటవీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు విచారణ రికార్డులు పేర్కొన్నాయి. స్లెమ్మర్ మృతదేహం లభ్యమైనప్పుడు ఆమె పుర్రెలో కొంత భాగం కనిపించలేదని రికార్డులు తెలిపాయి. ఆమె నుదురు, ఛాతీపై పెంటాగ్రామ్ గుర్తులు చెక్కినట్లు కూడా పేర్కొన్నారు. ఒక సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. స్లెమ్మర్ పుర్రెలో కనిపించని భాగాన్ని తాను తీసుకుని జ్ఞాపకంగా ఉంచుకున్నట్లు పైక్ చెప్పింది.1996లో మరణశిక్ష1996లో పైక్‌కు మరణశిక్ష విధించారు. స్లెమ్మర్ హత్య జరిగినప్పుడు షిప్‌కు 17 ఏళ్లు కావడంతో అతడికి మరణశిక్ష విధించే అర్హత లేదు. అతడికి జీవిత ఖైదు విధించారు. గతేడాది అతడి పెరోల్ తిరస్కరణకు గురైంది. 2031 చివర్లో అతడి కేసును మరోసారి పరిశీలించే అవకాశం ఉంది. పైక్‌పై వాంగ్మూలం ఇచ్చిన పీటర్సన్‌కు పరిశీలనలో విడుదల లభించింది.పైక్ వయసుపైనా న్యాయపరమైన వాదనలుపైక్ న్యాయవాదులు ఏళ్లుగా అనేక అప్పీలు దాఖలు చేస్తూ ఆమె దోష నిర్ధారణ, మరణశిక్ష రెండింటినీ సవాలు చేస్తున్నారు. ఆధునిక ప్రమాణాల ప్రకారం ఈ కేసును పరిశీలిస్తే తీర్పు భిన్నంగా ఉండే అవకాశం ఉందని వారు వాదించారు. పైక్‌కు 1996లో 20 ఏళ్ల వయసులో మరణశిక్ష విధించారు. నేరం జరిగినప్పుడు ఆమె వయసు 18 ఏళ్లు కావడం కూడా న్యాయపరమైన వాదనల్లో కీలక అంశంగా మారింది. స్లెమ్మర్ హత్య జరిగినప్పుడు పైక్ కొన్ని నెలలు మాత్రమే చిన్న వయసులో ఉండి ఉంటే, టెన్నెస్సీ చట్టం ప్రకారం ఆమెకు మరణశిక్ష విధించే అవకాశం ఉండేది కాదని ఆమె న్యాయవాదులు తెలిపారు.వేధింపులు, మానసిక ఆరోగ్యంపై వాదనలుపైక్ చిన్నతనంలో లైంగిక వేధింపులు, విడిచిపెట్టడం, నిర్లక్ష్యాన్ని ఎదుర్కొందని ఆమె న్యాయవాదులు తెలిపారు. అలాగే ఆమెకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ), బైపోలార్ డిజార్డర్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయని, పుట్టుకతోనే మెదడుకు సంబంధించిన నష్టం కూడా ఉందని వారు పేర్కొన్నారు. అసలు విచారణలో ఆమె తరఫు న్యాయవాదులు ఈ చరిత్రను జ్యూరీకి తగినంతగా వివరించలేదని వాదించారు.జైలులో మారిపోయానన్న పైక్18 ఏళ్ల వయసులో ఉన్న పైక్, దశాబ్దాలుగా జైలులో ఉన్న ప్రస్తుత పైక్ మధ్య తేడాను కూడా ఆమె న్యాయవాదులు ప్రస్తావించారు. క్షమాభిక్ష పిటిషన్లో పైక్ స్లెమ్మర్ మరణానికి సంబంధించిన తన చర్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఆ ఘటన వల్ల ఒక తల్లి తన కుమార్తెను, ఒక కుటుంబం తమ సోదరిని, స్నేహితులు తమ స్నేహితురాలిని కోల్పోయారని తాను అర్థం చేసుకున్నట్లు పేర్కొంది. జైలులో ఉన్న సంవత్సరాల్లో పైక్ పూర్తిగా మారిపోయిందని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రస్తుతం ఆమె 50 ఏళ్ల వయసులో పశ్చాత్తాపం కలిగిన మహిళగా, మానసిక ఆరోగ్యానికి తగిన చికిత్స పొందుతూ, జైలులోని ఇతర మహిళలకు సహాయం చేస్తున్నదని చెప్పారు.చివరి దశలో సుప్రీంకోర్టు జోక్యంపైక్ ఉరిశిక్షకు కొన్ని గంటల ముందు ఈ న్యాయపరమైన వివాదం తుది దశకు చేరింది. ఆమె న్యాయవాదులు చేసిన కొత్త వాదనలను పరిశీలిస్తున్న సమయంలో ఆరో సర్క్యూట్ కోర్టు ఉరిశిక్షపై తాత్కాలిక నిలుపుదల విధించింది. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ నిలుపుదల ఆదేశాన్ని రద్దు చేసింది. దీంతో టెన్నెస్సీ రాష్ట్రం క్రిస్టా పైక్ ఉరిశిక్షను అమలు చేసేందుకు మార్గం ఏర్పడింది.ఇదీ చదవండి: ‘2027లో బంగారం’.. షాకిస్తున్న బాబా వంగా అంచనాలు! -
ఇథియోపియాలో ముగ్గురు గుజరాతీలు గల్లంతు?
మెహసానా: అక్రమంగానైనా సరే.. అమెరికా వెళ్లాలనుకున్న ఆ ముగ్గురు గుజరాతీలకు ఎదురుదెబ్బ తగిలింది. కుటుంబాలతో కలిసి సెప్టెంబరు 20న గుజరాత్‌లోని మెహసానా నుంచి బయలుదేరిన వీరు రెండు రోజుల తరువాత ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలో గల్లంతయ్యారు. కిడ్నాప్‌నకు గురయ్యారని, విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ.కోటి డిమాండ్ చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్కరి కోసం ఏజెంట్లకు ఇప్పటికే రూ.75 లక్షల చొప్పున చెల్లించామని ఇక కిడ్నాపర్లకు ఇచ్చేందుకు మావద్ద చిల్లిగవ్వ కూడా లేదని వాపోతున్నారు. ఎలాగైనా సరే ఆ ముగ్గురిని స్వదేశానికి తిరిగి రప్పించాలని ప్రభుత్వాన్ని అభ్యరి్థస్తున్నారు. ఇథియోపియాలో సెప్టెంబరు 22వ తేదీ నుంచి గల్లంతైన వారిని రిత్విక్ జన్సారీ, మమతా చావ్డా, మయూరీలుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారు. మెహసానాలోని ఓ ఏజెంట్ ద్వారా అమెరికా వెళ్లాలని ప్లాన్ చేశారు వీరు. ఆ ఏజెంట్ వడోదరలో తనకు తెలిసిన మరో మధ్యవర్తికి బాధ్యతలు అప్పగించారు. అమెరికా చేర్చేందుకు ఒకొక్కరికి రూ.75 లక్షలు చెల్లించేట్లు ఒప్పందం కుదిరిందని మమత తండ్రి కిరీట్భాయ్ చౌహాన్ తెలిపారు. అయితే ఇథియోపియాకు చేరుకున్న తర్వాత వీరిని బందీలుగా ఉంచి, విడుదలకు రూ.కోటి డిమాండ్ చేశారని ఆరోపించారు. కిడ్నాపర్ల డిమాండ్‌ను రిత్విక్ తాత కనూభాయ్ జన్సారి కూడా ధ్రువీకరించారు. రూ.కోటి ‘విమోచన్’ సొమ్ములో రూ.60 లక్షలు చెల్లించామని కూడా చెప్పారు. మరిన్ని వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. ఈ ముగ్గురి గురించి పోలీసుల వద్ద మిస్సింగ్ కంప్లయింట్ నమోదైంది. మమత తండ్రి ఫిర్యాదు చేసినట్లు లాంఘ్నజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ.ఎం. గెహ్లోట్ తెలిపారు. మమత భర్త చిరాగ్ కుమార్ విద్యార్థి వీసాపై ఆరు నెలల క్రితం అమెరికాకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మమత వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను అక్రమ మార్గంలో అమెరికాకు పంపేందుకు మధ్యవర్తులను సంప్రదించారని ఇన్స్పెక్టర్ వివరించారు. మమత, రుత్విక్, మయూరిలు ముగ్గురు సెపె్టంబర్ 20న బయలుదేరారని, సెపె్టంబర్ 22న కిరీట్భాయ్ తన కుమార్తె మమతతో మాట్లాడారని, ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదని ఇన్స్పెక్టర్ గెహ్లోట్ తెలిపారు. -
జైశంకర్ నిర్మొహమాటం
సంక్షోభ కాలంలో తటస్థంగా ఉండటం, మర్యాదలు పాటిస్తూ మంచితనం ఒలకబోయటం కుదరదు. అది అవతలిపక్షానికే లబ్ధి చేకూరుస్తుంది. అమెరికా తీరుపై దౌత్య మార్గాల్లో మన దేశం లోగడ అసంతృప్తి తెలిపిందా అన్నది తెలియదుగానీ... తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ నిర్మొహమాటంగా మాట్లాడారు. న్యూయార్క్‌లో సోమవారం జరిగిన ఆసియా సొసైటీ పాలసీ ఇనిస్టిట్యూట్(ఏఎస్పీఐ) సదస్సులో మన వైఖరేమిటో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏలుబడిలో కొచ్చాక మనతో తేడాగా ప్రవర్తిస్తున్నారు. భారత్‌వంటి అతి పెద్ద మార్కెట్ కావాలి. తన ఉత్పత్తులు నచ్చిన ధరకు విక్రయించుకోవాలి. లాభాలు గడించాలి. అదే సమయంలో పాకిస్తాన్‌తో అంటకాగుతూ, ఆకాశానికెత్తుతారు. దాన్ని బుజ్జగిస్తారు. రోగికి పత్యం రుచించనట్టు మనం చెప్పేది ఆయనకు నచ్చదు. నిజానికి ఇది ట్రంప్‌కు మాత్రమే పరిమితమైన వింత కాదు. ఆయన ముందున్న పాలకులు... వారే పార్టీ వారైనా ఇలాగే ప్రవర్తించారు. కాకపోతే దౌత్య మర్యాదలు పెద్దగా తెలియని, ఖాతరుచేయని మనిషి గనుక ట్రంప్ బాహాటంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని భారత్... తనతో కాక నాటి సోవియెట్ యూనియన్‌తో సన్నిహితంగా మెలగటం అమెరికాకు కంటగింపైంది. అందుకు విరుగుడుగా పాకిస్తాన్‌ను చేరదీసింది. భారత్, పాక్మధ్య జరిగిన నాలుగు ప్రధాన యుద్ధాల్లోనూ, ఘర్షణల్లోనూ దాని పరోక్ష హస్తం ఉంది. నిజమైన మిత్రదేశంతో ఎలా మెలగాలో అమెరికాకు ఏనాడూ తెలియదు.ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్రపై స్పష్టమైన సమాచారం ఉన్నా కంటితుడుపు చర్యగా దానికి విడుదల చేయాల్సిన నిధుల్ని ఆపినట్టు నటించటం, కొన్నాళ్లకే ఏదో ఒక సాకుతో విడుదల చేయటం దశాబ్దాలుగా రివాజైంది. ఆయుధ సామగ్రి విషయంలోనూ అంతే. ఉగ్రవాద చేష్టలతో ఆర్థికవ్యవస్థ సర్వనాశనమై దివాళా స్థితిలో పడిన పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఆదుకోవాల్సిందే. కానీ అందుకు షరతులుండాలి. ఆ నిధుల్ని ఉగ్రవాదానికి ఊతమందించటానికి మళ్లించకూడదు. ఇందువల్ల మనకొస్తున్న ఇబ్బందులేమిటో అమెరికాకు పట్టదు. అలాగే వాణిజ్య ఒప్పందం పేరిట తాను విధించే షరతులు స్థానిక వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేకూర్చగల నష్టం దానికి లెక్కలేదు. ఈ విషయంలో భారత్ అభ్యంతరాలు ఆయన బేఖాతరు చేస్తారు. అంతా తన నిర్దేశానుసారం అమలు కావాల్సిందేనన్నది ట్రంప్ పట్టుదల. వాణిజ్య ఒప్పందం ఖరారైపోయిందంటూ పలుమార్లు ఆయన ఏకపక్షంగా ప్రకటించారు. మొన్న ఫిబ్రవరిలో సైతం ఇక సంతకాలే తరవాయి అన్నారు. కానీ భారత్‌నుంచి స్పందన లేకపోవటంతో అదనపు సుంకాలు విధించారు. ఈ బాపతు సుంకాలకు కోర్టులో చుక్కెదురైంది. కానీ అధిక సుంకాల పాటపాడుతూ బెదిరించడం మానుకోలేదు. మరోపక్క ఉగ్రవాదంవల్ల భారత్ నష్టపోతున్న వైనం తెలిసినా పాక్‌ను కట్టడి చేయరు. మనపట్ల సహానుభూతి చూపటం ధర్మమనుకోరు.భారత్–పాక్‌ల వైరం సంగతలా వుంచి ప్రపంచం ఇంతటి సంక్లిష్ట స్థితికి చేరుకోవటంలో అమెరికా పాత్ర ఎవరికీ తెలియంది కాదు. ఇరాన్‌పై అమెరికా దుందుడుకు చర్యలవల్ల హార్మూజ్ జలసంధిలో రవాణా నిలిచిపోయింది. ఉక్రెయిన్ను యూరప్ దేశాలద్వారా రెచ్చగొట్టి రష్యాను యుద్ధంలోకి నెట్టింది కూడా అమెరికాయే. ఈ రెండు పరిణామాల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింది. ముడి చమురు, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా నిలిచిపోయి ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో పడ్డాయి. చాలా దేశాల ఆర్థికవ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి సూపర్ ఎల్‌నినో రూపంలో వచ్చిపడిన ప్రకృతి వైపరీత్యాలు తోడవుతున్నాయి. అందుకే రానున్న కాలంలో ప్రపంచ ప్రజలు కనీవినీ ఎరుగని పెను సంక్షోభం ఎదుర్కొనబోతున్నారని జైశంకర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు నేరుగా మన అసంతృప్తి తెలియజేయటం, చేస్తున్న తప్పుల్ని దిద్దుకోమని చెప్పటం... ప్రపంచం మునుపట్లా లేదని, ఏకచ్ఛత్రాధిపత్యం రోజులు అంతరించాయని చెప్పడం అత్యవసరం. దీన్ని సకాలంలో నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, తడబాటులేకుండా తెలిపినందుకు ఆయన్ను అభినందించాలి. -
ఫోనులో మాట్లాడుకున్న నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్.. దేనిపై?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బుధవారం ఫోన్ సంభాషణ జరిగింది. భారత్–అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని మరింతగా పెంచేందుకు సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని అంగీకరించారు.ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సాధించిన పురోగతిని మోదీ, ట్రంప్ సమీక్షించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచ శాంతి, భద్రతను ప్రోత్సహించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై చర్చించారు.మోదీ కీలక కామెంట్స్ మోదీ కూడా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ సంభాషణపై స్పందించారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్‌తో ఫలప్రదమైన సంభాషణ జరిగింది. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు సహా ఇతర రంగాల్లో మన ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించాం. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని అంగీకరించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రపంచ శాంతి, భద్రతను ముందుకు తీసుకెళ్లేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపైనా అభిప్రాయాలు పంచుకున్నాం’’ అని మోదీ పేర్కొన్నారు.భారత్, అమెరికా పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయి. అమెరికా పర్యటనలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. ఇరు దేశాలు అవగాహనకు మరింత చేరువయ్యాయని తెలిపారు. అయితే అమెరికా సుంకాల నిబంధనల్లో మార్పులు, సెక్షన్ 301 ప్రక్రియ కీలక అంశాలుగా ఉన్నాయని చెప్పారు. 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం.. అన్యాయంగా భావించే వాణిజ్య పద్ధతులపై అమెరికా దర్యాప్తు చేసి, అదనపు సుంకాలు సహా చర్యలు తీసుకోవచ్చు. ఈ దర్యాప్తులను అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం నిర్వహిస్తుంది.ఇదిలా ఉండగా, ఈ నెల ప్రారంభంలో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టంపైనా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం ప్రకారం రష్యాతో పాటు భారత్, చైనా వంటి ప్రధాన ఇంధన కొనుగోలుదారులపై అమెరికా ప్రభుత్వం సుంకాలు విధించే అవకాశం ఉంది. భారత్ 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతకు భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. -
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. ట్రంప్‌పై ఇరాన్ పిడుగు!
టెహ్రాన్: అంతర్జాతీయ రాజకీయాల్లో ఊహించని సరికొత్త డ్రామా తెరపైకి వచ్చింది. అమెరికాలో మధ్యంతర (మిడ్‌టర్మ్) ఎన్నికల వేళ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ గట్టిగానే షాకిచ్చింది.ట్రంప్ పాలనా విధానాలను, ఆయన తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలను నేరుగా వ్యతిరేకించాలంటూ ఇరాన్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన సైనిక దళం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) అమెరికన్ ఓటర్లకు ఒక బహిరంగ లేఖను సంధించింది. సరిగ్గా ఎన్నికలకు ఐదు వారాల ముందు విడుదలైన ఈ 25 పేజీల సంచలన లేఖ ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది! ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తూ ఇరాన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ అగ్రరాజ్యంలో పెద్ద మంటలే రేపుతోంది.అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించి ఏడు నెలలు గడిచిన తరుణంలో ఈ లేఖ వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా పౌరులకు, అక్కడి స్వార్థపూరిత రాజకీయ నాయకత్వానికి మధ్య చాలా తేడా ఉందని ఐఆర్జీసీ ఈ లేఖలో ఎత్తిచూపింది. ఇరాన్ సామాన్య ప్రజలు, అమెరికన్ పౌరులు ఇద్దరూ కూడా ఖరీదైన యుద్ధాలను ప్రోత్సహించే లీడర్ల బాధితులేనని వాదించింది. ఇజ్రాయెల్‌కు ట్రంప్ ఇస్తున్న గుడ్డి మద్దతును నిలిపివేయాలని, విదేశీ సైనిక జోక్యాలను తక్షణమే వ్యతిరేకించాలని అమెరికన్లను ఈ లేఖ కోరింది.వాషింగ్టన్ తన ఓటమిని అంగీకరించాలిటెహ్రాన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఆర్జీసీ అధికార ప్రతినిధి జనరల్ హోస్సేన్ మొహెబ్బీ ఈ లేఖపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత సంఘర్షణకు తెరపడాలంటే వాషింగ్టన్ తన ఓటమిని అంగీకరించి, సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడమే ఏకైక మార్గమని తేల్చిచెప్పారు. అమెరికాలో ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉన్న తరుణాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ లేఖను విడుదల చేశామని ఆయన కుండ బద్దలు కొట్టారు. అణు ఆయుధాల ముసగులో ట్రంప్ చేస్తున్న డ్రామాలన్నీ ప్రపంచాన్ని మోసం చేయడానికేనని, తమ యురేనియం శుద్ధి కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.‘డెత్ టు అమెరికా’ అసలు అర్థం అదే!ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తరచూ వినిపించే వివాదాస్పద నినాదం ‘డెత్ టు అమెరికా’పై కూడా ఈ లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ నినాదం అమెరికన్ ప్రజలను ఉద్దేశించి కాదని, వైట్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకుని పాలిస్తున్న ‘దయ్యం లాంటి పాలక వర్గాన్ని’ అంతం చేయాలని కోరుతూ చేసే ప్రార్థన మాత్రమేనని వివరించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వేలాది వైమానిక దాడులు చేసినప్పటికీ, తమ మౌలిక సదుపాయాలను దెబ్బతీశారే తప్ప తాము నిర్దేశించుకున్న ఏ ఒక్క లక్ష్యాన్నీ సాధించలేకపోయాయని, చివరికి అమెరికా సైనిక ఆస్తులకే భారీ నష్టం వాటిల్లిందని ఐఆర్జీసీ ఘాటుగా హెచ్చరించింది.ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు ట్రంప్ తంటాలు..ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికలు కేవలం కాంగ్రెస్ స్థానాల కోసమే అయినప్పటికీ, ఇవి పూర్తిగా ట్రంప్ పాలనా తీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలిపే రెఫరెండ్లా మారాయి. ద్రవ్యోల్బణం,పెరుగుతున్న జీవన వ్యయం వల్ల రిపబ్లికన్ పార్టీకి, ట్రంప్ విధానాలకు వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ఈ ఎన్నికల ఉచ్చు నుంచి బయటపడేందుకు ట్రంప్ తంటాలు పడుతూ.. అమెరికన్ ఓటర్లకు ఏకంగా ఐదు వేల డాలర్లు ఇస్తానంటూ వరాల జల్లు కురిపిస్తున్నారు.వియత్నాం యుద్ధ కాలంలో అమెరికన్ సైనికులను తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రసారాలను ఉపయోగించిన ‘హనోయ్ హన్నా’తరహా వ్యూహాన్నే ఇప్పుడు ఇరాన్ అచ్చం దింపిందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. వాషింగ్టన్ పెద్దలను లైట్ తీసుకుని, నేరుగా అమెరికన్ ఓటర్లతోనే ఇరాన్ చక్రం తిప్పుతుండటంతో ట్రంప్‌నకు నిద్రపట్టడం లేదు.మరోవైపు ఇరాన్ కరెన్సీ 'రియల్' విలువ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా పడిపోయి, ఒక అమెరికన్ డాలర్‌కు ఏకంగా 25 లక్షల రియల్స్‌కు చేరినప్పటికీ... ఇరాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ట్రంప్‌ను వేదికపైనే కార్నర్ చేస్తుండటం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది!ఇదీ చదవండి : మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్? -
అమెరికాలో ఐటీ ఉద్యోగం కోసం వెళ్లే వారికి అలర్ట్
-
భారతీయులకు US గ్రీన్ కార్డు గుడ్ న్యూస్
-
సుందర్.. ఈయనో రాక్షసుడు! ఎవరికీ తెలియదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మధ్య వైట్‌హౌస్ వద్ద జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెక్ దిగ్గజాలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. పిచాయ్‌ను ఉద్దేశించి “ఈయనో మాన్స్టర్.. కానీ ఎవరికీ తెలియదు” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సుందర్ పిచాయ్ కూడా ఒక్క నవ్వు నవ్వి బదులిచ్చారు.వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్.. పిచాయ్‌ను పిలిచి “సుందర్.. ఏమైనా చెబుతావా?” అని అడిగారు. పిచాయ్ “ముందుగా థ్యాంక్స్...” అని చెప్పబోతుండగానే ట్రంప్ ఆయనకు అడ్డుపడ్డారు. “వీళ్లెవరో మీకు అసలు తెలియదు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వ్యక్తులు వీళ్లు. ఈయన (సుందర్ పిచాయ్) ఓ మాన్స్టర్(రాక్షసుడు).. కానీ ఎవరికీ ఈ విషయం తెలియదు” అని ట్రంప్ అన్నారు. అంతేకాదు.. ఇలాంటి టెక్ దిగ్గజాలకు ప్రతిరోజూ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేకపోవడం ఎంత మంచి జీవితమో అంటూ వ్యాఖ్యానించారు.“మీకు గుర్తుండాల్సిన పేరు ఒక్కటే.. సుందర్” అని పిచాయ్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు పిచాయ్ అలా ఒక నవ్వు నవ్వి సరదాగా స్పందించారు. “నేను మాన్స్టర్ని అన్నదానికంటే ఇది మంచి ట్యాగ్‌లైన్ అవుతుందని ఆశిస్తున్నా” అంటూ అక్కడ నవ్వులు పూయించారు.Trump: This guy (Sundar Pichai) is a monster, and nobody knows him. What a great life! To be a Monster and not have to go through this. All you have to know is — sundarr! Sundar is his name. pic.twitter.com/smlS58lQdW https://t.co/1swuCa4RYT— Nicholas Mugalli (@RealNickMugalli) September 29, 2026ట్రంప్ భేటీ సారాంశం ఏంటంటే..వైట్‌హౌస్‌లో ట్రంప్.. సుందర్ పిచాయ్‌తో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్, ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ తదితర టెక్ రంగ ప్రముఖులతో సమావేశమయ్యారు. అధునాతన ఏఐ వ్యవస్థల భద్రత, కంపెనీల అంతర్గత నియంత్రణలు, ప్రమాదాల పర్యవేక్షణ తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ‘వైట్‌హౌస్ అకార్డ్ ఆన్ సూపర్ ఇంటెలిజెన్స్’ పేరుతో స్వచ్ఛంద ఒప్పందాన్ని ప్రకటించారు. ఇందులో ఏఐ మోడళ్లపై అంతర్గత రిస్క్ సమీక్షలు, స్వతంత్ర ఆడిట్లు, కంపెనీ బోర్డుల పర్యవేక్షణ వంటి చర్యలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ చట్టబద్ధ నియంత్రణ కాకుండా కంపెనీలు స్వచ్ఛందంగా పాటించే భద్రతా ప్రమాణాల ఒప్పందం.అమోడీకి ట్రంప్ వార్నింగ్?సమావేశంలో ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ(Dario Amodei)తోనూ ట్రంప్ సరదాగా మాట్లాడారు. అమోడీని తన పక్కకు పిలిచిన ట్రంప్.. “ఆయన ఓకే అని మాత్రమే చెప్పారు” అంటూ వ్యాఖ్యానించి, వెంటనే “బీ కేర్‌ఫుల్” అని హెచ్చరించినట్లు నవ్వుతూ చెప్పారు.అధునాతన ఏఐ వల్ల మానవాళికి ప్రమాదాలు ఉండొచ్చని అమోడీ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ఈ సరదా వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అమోడీ కూడా నవ్వుతూ.. ఏఐ రేసులో అమెరికా ముందుండాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో టెక్నాలజీని సురక్షితంగా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు.‘సూపర్ ఇంటెలిజెన్స్’పై పిచాయ్ ఏమన్నారంటే..ఏఐకి సూపర్ ఇంటెలిజెన్స్‌గా ట్రంప్ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం పిచాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ట్రంప్, ఇతర టెక్ నాయకులతో ముఖ్యమైన చర్చ జరిగిందని, వైట్‌హౌస్ అకార్డ్ ఆన్ సూపర్ ఇంటెలిజెన్స్‌పై సంతకం చేసినట్లు తెలిపారు. ఏఐ అభివృద్ధిలో తగిన పరీక్షలు, మూల్యాంకనాలు, రెడ్ టీమింగ్, దుర్వినియోగం నివారణకు భద్రతా చర్యలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ రంగంలో ఆవిష్కరణలు కొనసాగిస్తూనే బాధ్యతాయుతమైన అభివృద్ధి, భద్రతా ప్రమాణాల విషయంలో ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తామని పిచాయ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏఐకి కొత్త పేరు పెట్టిన ట్రంప్ -
ఒక డాలర్‌కు 25 లక్షల రియాల్స్
ఇరాన్: అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇరాన్ కరెన్సీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటోంది. విలువ నానాటికీ పడిపోతోంది. మంగళవారం ఇరాన్ కరెన్సీ విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. టెహ్రాన్‌లోని వ్యాపారులు ఒక అమెరికన్ డాలర్‌కు 25 లక్షలకు పైగా రియాల్స్‌ను మారకం చేసుకున్నారు. సెప్టెంబర్ 2న ఒక డాలర్‌కు 22 లక్షల రియాల్స్ వచ్చాయి. కేవలం 27 రోజుల వ్యవధిలోనే మరోసారి భారీగా పతనం కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశి్చమాసియాలో యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగాయి. ఇరాన్ సైతం ప్రతిదాడులు సాగిస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ కరెన్సీ పదేపదే కొత్త కనిష్ట స్థాయిలకు చేరుకుంటోంది. -
అమెరికా సంచలన నిర్ణయం.. ఇరాక్ నుంచి బలగాల నిష్క్రమణ
ఇరాక్‌లోని చివరి సైనిక స్థావరాల నుంచి అమెరికా బలగాలు బుధవారం నాటికి పూర్తిగా వైదొలగనున్నాయి. 20 ఏళ్లకు పైగా సాగిన అమెరికా సైనిక ఉనికి ముగియడాన్ని ఇరాన్, దాని మద్దతు ఉన్న సాయుధ వర్గాలు విజయంగా అభివర్ణిస్తున్నాయి. ఈ పరిణామంతో ఇరాక్‌లో ఇరాన్ ప్రభావం మరింత పెరగవచ్చని, మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తిరిగి బలపడేందుకు భద్రతాపరమైన ఖాళీ ఏర్పడే అవకాశం ఉందని ఇరాక్ భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అమెరికా బలగాల ఉపసంహరణకు 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ఒప్పందం కుదిరింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. 2003లో సద్దాం హుస్సేన్‌ను గద్దె దించేందుకు అమెరికా ఇరాక్‌పై దాడి చేసింది. 2011 చివర్లో అమెరికా బలగాలు వెనుదిరిగాయి. అయితే 2014లో ఇస్లామిక్ స్టేట్ భారీ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఇరాక్ భద్రతా బలగాలకు సహాయం చేసేందుకు అమెరికా సైన్యం తిరిగి వచ్చింది. 2014 నుంచి 2017 వరకు ఇస్లామిక్ స్టేట్‌పై జరిగిన ప్రధాన పోరులో అమెరికా కీలక పాత్ర పోషించింది.ఇరాక్ భద్రతా విశ్లేషకుడు జాసిమ్ అల్-బహాద్లీ మాట్లాడుతూ.. అమెరికా నేతృత్వంలోని కూటమి వెళ్లిపోవడం వల్ల ఇరాక్‌లో ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకునే సైనిక సమతుల్యత తొలగిపోతుందని అన్నారు. ఇరాన్ అనుకూల మిలీషియా వర్గాలు ఈ పరిణామాన్ని తమ విజయంగా చూపించుకుని భద్రతా నిర్ణయాలు, రాజకీయ వ్యవహారాల్లో మరింత ప్రభావం సాధించేందుకు ప్రయత్నించవచ్చని తెలిపారు. ఇరాకీలకు చారిత్రక విజయంఇరాన్ మద్దతు ఉన్న సాయుధ వర్గాల కూటమి ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ కమాండర్ అబు మోజ్తబా అల్-యాసిరి అమెరికా నిష్క్రమణను “ఇరాక్ ఇస్లామిక్ ప్రతిఘటన వర్గాలకు, ఇరాకీలకు చారిత్రక విజయం, అమెరికా ప్రాజెక్టుకు ఘోర పరాజయం”గా అభివర్ణించారు. సెప్టెంబర్ 30న “ఇరాక్ చరిత్రలోని చీకటి అధ్యాయం ముగింపును” జరుపుకుంటామని తెలిపారు.అయితే ఫలూజా ప్రాంతానికి చెందిన సున్నీ గిరిజన నేత అబ్దుల్రహ్మాన్ అల్-జుబాయీ మాట్లాడుతూ.. ఇరాక్ భద్రతా వ్యవస్థ పూర్తిగా బాధ్యత చేపట్టేందుకు ఇంకా సిద్ధంగా లేదని అన్నారు. అమెరికా నేతృత్వంలోని కూటమి ఈ విధంగా వెళ్లిపోవడం వల్ల ఏర్పడే ఖాళీపై ఇరాకీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.ఇస్లామిక్ స్టేట్ కూడా మరోసారి చురుగ్గా మారే ప్రమాదం ఉందని ఇరాక్ అధికారులు చెబుతున్నారు. ఆ సంస్థకు ఇప్పటికీ రహస్య కార్యకర్తల నెట్వర్క్ ఉందని, అమెరికా నిఘా సమాచారం, సాంకేతిక సహాయం, డ్రోన్ల మద్దతు లేకపోవడం ఉగ్రవాదులకు తిరిగి సమూహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించవచ్చని కుర్దిష్ కమాండర్ సిర్వాన్ బర్జానీ తెలిపారు. ఉపసంహరణ నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన రహస్య కార్యకర్తల కదలికలు పెరిగినట్లు గమనించామని ఆయన చెప్పారు.ఇరాక్ భద్రతా బలగాల ప్రకారం, అమెరికా నిష్క్రమణను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు సిద్ధమైనట్లు అనుమానిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ముఠాను గుర్తించారు. అమెరికా బలగాల నిష్క్రమణ తర్వాత ఇరాక్‌లో ఇరాన్ ప్రభావం, భద్రతా పరిస్థితి, ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలు ఎలా మారతాయన్నది కీలకంగా మారనుంది. -
పెంటగాన్‌పై సైబర్ దాడి.. భారీగా సైనిక సిబ్బంది వివరాలు లీక్
వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌కు చెందిన డేటాబేస్‌పై భారీ సైబర్ దాడి జరిగినట్లు వెల్లడైంది. డిఫెన్స్ మాన్పవర్ డేటా సెంటర్ (డీఎండీసీ) వ్యవస్థలోకి అక్రమ వినియోగదారులు 2025 అక్టోబర్ నుంచి 2026 జూలై వరకు ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో 27.6 లక్షల మంది జీవించి ఉన్న వ్యక్తులు, 2.94 లక్షల మంది మరణించిన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు బయటపడినట్లు సమాచారం. లీకైన సమాచారంలో పేర్లు, సామాజిక భద్రతా నంబర్లు, పుట్టిన తేదీలు, సంప్రదింపు వివరాలు, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఉన్నాయి. ఈ డేటా ఎన్క్రిప్షన్ లేకుండా ఉండటం వల్ల ప్రమాదం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. వ్యవస్థలోని లోపాన్ని గుర్తించిన వెంటనే పెంటగాన్ దాన్ని సరిచేసింది. ఇప్పటివరకు లీకైన సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు చెబుతున్నారు.ఆరు కోట్లకు పైగా రికార్డులుడీఎండీసీ అమెరికా రక్షణ శాఖకు చెందిన ప్రధాన వ్యక్తిగత రికార్డుల కేంద్రం. ఇందులో సైనికులు, రిజర్వ్ సిబ్బంది, పౌర ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, పదవీ విరమణ చేసినవారు, మాజీ సైనికులు, సైనిక కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ వ్యవస్థలో ఆరు కోట్లకు పైగా రికార్డులు ఉన్నట్లు సమాచారం. సైనిక సిబ్బంది ఉద్యోగ వివరాలు బయటకు రావడం జాతీయ భద్రత పరంగా ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు. వారి విధులు, బాధ్యతలకు సంబంధించిన సమాచారం శత్రు దేశాలు లేదా సైబర్ నేరగాళ్లకు ఉపయోగపడే అవకాశం ఉంది. సామాజిక భద్రతా నంబర్లు, పుట్టిన తేదీలు వంటి వ్యక్తిగత వివరాలు గుర్తింపు చోరీ, మోసపూరిత సందేశాలు, ఫిషింగ్ దాడులకు ఉపయోగపడే ప్రమాదం ఉంది.బాధిత వ్యక్తులకు ఒక ఏడాది పాటు ఉచిత క్రెడిట్ పర్యవేక్షణ, గుర్తింపు రక్షణ సేవలను అందించనున్నట్లు పెంటగాన్ తెలిపింది. దాడికి పాల్పడిన వారు ఎవరు, వారి ఉద్దేశం ఏమిటన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది. వ్యవస్థలోని లోపాన్ని జూలై 2026లో గుర్తించిన అనంతరం దాన్ని వెంటనే సరిచేశారు. నెలల తరబడి అక్రమ ప్రవేశం కొనసాగడం అమెరికా ప్రభుత్వ సైబర్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బలమైన ఎన్క్రిప్షన్, క్రమం తప్పని భద్రతా తనిఖీలు, బహుళ-స్థాయి ధృవీకరణ వంటి చర్యలు మరింత పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుతం ఆర్థిక నష్టం లేదా లీకైన సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు బయటపడలేదు. అయినప్పటికీ, సైనిక సిబ్బంది అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దాదాపు 30.5 లక్షల మంది వ్యక్తులకు సంబంధించిన సమాచారం బయటపడటం అమెరికా రక్షణ రంగంలో డేటా భద్రత ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేసింది.ఇదీ చదవండి: దుబాయ్‌లో గుండె జబ్బులు.. భారతీయులే అధికం! -
ప్రభాస్ వీడియో క్లిప్ తో అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
రష్యా చమురుతో భారత్ సరికొత్త గేమ్!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా నుంచి భారీ సుంకాల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి రష్యా చమురు ప్రధాన కొనుగోలుదారులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభించింది. కొత్తగా తీసుకొచ్చిన ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ మరో రెండు వారాల్లో ఆచరణలోకి వచ్చే చాన్స్ ఉంది. దీంతో రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ ఎలాంటి మార్గాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇక్కడే రష్యా చమురు రంగంలో భారత కంపెనీలకు ఉన్న భారీ వాటా తెరపైకి వస్తోంది. రష్యా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం రోస్నెఫ్ట్ అనుబంధ సంస్థ అయిన వాంకోర్‌నెఫ్ట్‌లో భారత ప్రభుత్వ రంగ సంస్థలకు కలిపి 49.9 శాతం వాటా ఉంది. ఓఎన్జీసీ విదేశ్కు 26 శాతం వాటా ఉండగా.. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోరిసోర్సెస్ కలిసి వాంకోర్ ఇండియా ద్వారా మరో 23.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. మిగిలిన 50.1 శాతం రోస్నెఫ్ట్ వద్ద ఉంది.అంటే.. భారత్ రష్యా నుంచి చమురును కేవలం బయట నుంచి కొనుగోలు చేయడమే కాదు. రష్యాలోని చమురు ఉత్పత్తి ఆస్తిలోనే భారత కంపెనీలకు వాటా ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న.. ఈ వాటా ఆధారంగా భారత్ తనకు వచ్చే చమురును ‘భారత చమురు’గా చూపించి అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోగలదా?రష్యా చమురు.. భారత్దిగా మారుతుందా?కానే కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఒక భారత కంపెనీకి రష్యా చమురు క్షేత్రంలో వాటా ఉన్నంత మాత్రాన.. అక్కడి నుంచి వెలికితీసిన ముడిచమురు భారత మూలం గల చమురుగా మారదు. చమురు ఎక్కడ వెలికితీశారన్నదే దాని మూలాన్ని నిర్ణయిస్తుంది. రష్యాలో ఉత్పత్తి అయితే అది రష్యా మూలం గల క్రూడ్గానే ఉంటుంది. ఒకవేళ భారత కంపెనీలు తమ వాటాకు అనుగుణంగా చమురును నేరుగా తీసుకుని భారత్‌కు తరలించినా ఇదే వర్తిస్తుంది. మూడో దేశం మీదుగా పంపినా దాని మూలం మారదు. కాబట్టి 49.9 శాతం వాటా ఉండటం వాణిజ్యపరంగా భారత్‌కు ప్రయోజనం కావచ్చు కానీ.. అమెరికా ఆంక్షల నుంచి ఆటోమేటిక్‌గా మినహాయింపు మాత్రం ఇవ్వదు.మరి ఈ వాటాతో..ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. భారత కంపెనీలకు వాంకోర్‌నెఫ్ట్‌లో వాటా ఉండటం వల్ల ఉత్పత్తిపై ఆర్థిక హక్కు ఉంటుంది. సాధారణంగా రష్యా కంపెనీ నుంచి మార్కెట్లో చమురు కొనుగోలు చేసే బదులు.. వాటాదారుగా ఉత్పత్తిలో తమ వాటాకు సంబంధించిన హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఒప్పందాలు, చెల్లింపులు, మధ్యవర్తులు, రవాణా వంటి వ్యవహారాల్లో మార్పులు రావచ్చు. అలాగని ఇది అమెరికా ఆంక్షలను తప్పించే ప్రత్యేక మినహాయింపు అని మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఏ లావాదేవీకి ఆంక్షలు వర్తిస్తాయన్నది ఉత్పత్తి చేసే సంస్థ, లావాదేవీలోని భాగస్వాములు, చెల్లింపుల విధానం, షిప్పింగ్, బీమా తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాంకోర్.. వోస్టోక్ ఆయిల్‌కు సంబంధమేంటి?ఇక్కడ మరో విషయం అర్థం చేసుకోవాలి. భారత కంపెనీల 49.9 శాతం వాటా మొత్తం వోస్టోక్ ఆయిల్ ప్రాజెక్టులో కాదు.. వాంకోర్‌నెఫ్ట్‌లో ఉంది. వాంకోర్ చమురు క్షేత్రాలు మాత్రం భారీ వోస్టోక్ ఆయిల్ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. రష్యా సెప్టెంబర్‌లో వోస్టోక్ ఆయిల్ నుంచి వాణిజ్య చమురు ఎగుమతులను ప్రారంభించింది. ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ భారీ ప్రాజెక్టును రష్యా భవిష్యత్తులో కీలక చమురు ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. దీంతో వాంకోర్‌నెఫ్ట్‌లో భారత కంపెనీల వాటా మరోసారి చర్చలోకి వచ్చింది. అమెరికా ఆంక్షల మాటేంటి?ఈ పరిణామాలతో అమెరికా ఆంక్షల గండం భారత్‌కు తప్పినట్లేనా?. ఇదే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన విషయం. భారత్‌కు రష్యా చమురు ఉత్పత్తి ఆస్తిలో 49.9 శాతం వాటా ఉన్నప్పటికీ.. ఆ చమురు రష్యాలోనే వెలికితీస్తున్నారు. అందువల్ల దాని మూలం రష్యాదే. కాబట్టి భారత వాటాను చూపించి అమెరికా కొత్త చట్టం కింద వచ్చే సుంకాలు, ఆంక్షల నుంచి పూర్తిగా బయటపడే మార్గం ఏర్పడిందని చెప్పడానికి ఆధారం లేదు. అంటే.. భారత్ చేతిలో ఉన్న 49.9 శాతం వాటా ఒక కీలక వాణిజ్య బలం కావచ్చు. కానీ అదే అమెరికా ఆంక్షలకు కవచంగా మారుతుందా అన్నది మాత్రం అమెరికా నిబంధనల అమలు, లావాదేవీ నిర్మాణం, భవిష్యత్తు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: ట్రంప్‌ని ఎంత పెద్ద మాట అన్నాడు సర్? -
మెట్టు దిగిన ఇరాన్?.. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా మరోసారి చర్చలకు సిద్ధమయ్యాయి. సోమవారం ఇరు దేశాల అధికారులు మధ్యవర్తులతో వేర్వేరుగా సంప్రదింపులు జరిపారు. ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు తాజా దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.ఇరాన్ గత వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను కొద్దిగా సవరించి తాజా చర్చల్లో ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. ఖతార్ మధ్యవర్తులు న్యూయార్క్‌లో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో, అలాగే అమెరికా వర్గాలతో విడివిడిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. యుద్ధంలో అమెరికాదే విజయం: ట్రంప్మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, అమెరికా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. సోమవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధికారులు మధ్యవర్తులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. “మేం గెలవబోతున్నాం. నా వరకు ఇది ఎలాగైనా సరే జరుగుతుంది. చాలా త్వరగానే ఇది ముగిసిపోతుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో అమెరికా విజయం సాధించిన తర్వాత గ్యాస్ ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పారు.ఇరాన్ కీలక ప్రతిపాదన ఇదే..ఇరాన్ ప్రతిపాదనలో ప్రధానంగా యుద్ధాన్ని నిలిపివేయడం, లెబనాన్‌లోనూ శత్రుత్వ చర్యలకు ముగింపు పలకడం, ఫ్రీజ్ చేసిన తమ బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించాలని కోరుతోంది.దీనికి ప్రతిగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రతిపాదించింది. శుద్ధిచేసిన యురేనియం అంశంపైనా చర్చలు జరపాలని అమెరికా కోరుతోంది. ..అయినా చర్చలకు గ్రీన్ సిగ్నల్ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తిరస్కరించినట్లు ప్రకటించారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే ఇరాన్ వేగంగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆదివారం ఇదే అంశంపై మాట్లాడుతూ.. ఈ వారంలో అమెరికా ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. సోమవారం కూడా మధ్యవర్తులతో అమెరికా అధికారులు మాట్లాడినట్లు వైట్‌హౌస్‌లో ట్రంప్ వెల్లడించారు. మరోవైపు, అమెరికా అధికారికంగా తమ ప్రతిపాదనను తిరస్కరించిన సమాచారం తమకు ఇంకా అందలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ చెబుతున్నారు. వాషింగ్టన్ నుంచి స్పష్టమైన సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు. శాంతియుత పరిష్కారం కోరుకుంటే తాము ఇప్పటికే పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించామని పేర్కొన్నారు. హర్ముజ్‌పైనే అసలు పట్టుప్రస్తుత చర్చల్లో హర్ముజ్ జలసంధి కీలక అంశంగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ ఇంధన రవాణాలో భారీగా చమురు, ఎల్ఎన్జీ రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఇక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. సోమవారం కూడా దౌత్య ప్రయత్నాలపై ఆశలు, యుద్ధంపై ఆందోళనల మధ్య చమురు ధరలు పెరిగాయి.గతంలో ఏప్రిల్, జూన్‌లో మధ్యవర్తుల ప్రయత్నాలతో కాల్పుల విరమణలు కుదిరినా అవి ఎక్కువకాలం కొనసాగలేదు. అయితే ఇప్పుడు ఇరాన్ మాత్రం తమ షరతులు నెరవేరిన తర్వాతే హర్ముజ్‌ను పూర్తిగా తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. దీంతో తాజా మధ్యవర్తిత్వ చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా? లేదంటే మరోసారి విఫలమవుతాయా?.. రాబోయే రోజుల్లో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: ఎల్ నినో ఏం చేయబోతోందో తెలుసా? -
ప్రశాంతయానానికి మరో పొడిగింపు
అమెరికా, చైనాల దీర్ఘకాలిక ప్రత్యర్థిత్వం ఎట్లున్నా, ప్రస్తుతానికి నదిని ప్రశాంతంగా ఉంచి అందులో పడవ ప్రయాణం ప్రశాంతంగా సాగించాలన్నది ఇరువురి వ్యూహం. రెండు దేశాల అధ్యక్షులు గత మే నెలలో బీజింగ్‌లో సమావేశమై నప్పుడు చూపిన ఈ వైఖరులే గత వారాంతంలో వాషింగ్టన్లో కూడా కనిపించాయి. సారాంశంలో అంతకుమించిన కొత్తదన మేమీ లేదు. దాని అర్థం ఈ రెండు శిఖరాగ్ర సమావేశాలు నిష్ఫలమైనవని కాదు. వాటికి అనేక ఫలితాలు వర్తమానంలో ఉండటమే కాదు. భవిష్యత్తులోనూ ఉంటాయి.పోరు నష్టం పొందు లాభంఇటువంటి దృక్పథానికి చొరవ తీసుకుని అమెరికా అధ్యక్షునికి ప్రతిపాదిస్తున్నది చైనా అధ్యక్షుడు కాగా, అందుకు ట్రంప్ బీజింగ్‌లో అర్ధాంగీకారం తెలిపి ఇపుడు వాషింగ్టన్ చర్చలలో పూర్తిగా సమ్మతించినట్లు కనిపిస్తున్నది. ఆ మేరకు పత్రాలు అయితే ఏమీ రాసుకోలేదు గానీ, ఇరువురి వ్యాఖ్యలను పరిశీలించినపుడు అందులో సందేహ మేమీ తోచటం లేదు. మనం సహకరించుకుంటే ఇద్దరమూ లాభ పడతామని జిన్‌పింగ్ గత మే నెలలో వలెనే ఈసారి కూడా సూచించారు. ఘర్షణ పడితే ఉభయులమూ నష్టపోగలమని హెచ్చరించారు. అందుకు ట్రంప్ స్పందన గమనించదగ్గది. చారిత్రకంగా అమెరికా, చైనాలు రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రత్యర్థులను ఓడించాయనీ, అదే విధమైన పరస్పర సహకారంతో ముందుకు సాగి అభివృద్ధి సాధించగలమనీ అన్నారాయన. రెండు దేశాలు కూడా ఆ విధంగా తమ ప్రజల మేలుకు, ప్రపంచం బాగుకు కృషి చేయ వచ్చునని ఇరువురూ అభిప్రాయపడ్డారు.ఇవి సంబంధాలను స్థూలంగా నిర్దేశించే మౌలిక వైఖరులు. తక్కిన పలు విధాలైన మాటలన్నీ ఈ పరిధిలోకి ఒదిగిపోయేవే. ఉదాహరణకు, మనం అభివృద్ధిలో పోటీదార్లమే గానీ శత్రువులం కాము, మన మధ్య నిర్మాణాత్మకమైన, వ్యూహాత్మకమైన సుస్థిరత అవసరం. లేనట్లయితే విస్ఫోటనాత్మకమైన ఘర్షణ తలెత్తుతుంది వంటివి. అయితే, ఇటువంటి సామరస్యతను చూపుతూనే చైనా అధ్యక్షుడు, ఆయన సీనియర్ అధికారులు అమెరికాకు కొన్ని హెచ్చరికలను సూటిగా చేశారు. గతం నుంచి చేస్తూ వచ్చినవే ఇపుడు మరొకసారి చేశారు. వాటిని వారు ‘రెడ్ లైన్స్’ అంటున్నారు. రెడ్ లైన్స్వాటిలో అన్నింటికన్న మొదటిది తైవాన్. ఆ విషయంలో తేడాలు వస్తే అమెరికాతో ‘ఏ యుద్ధానికైనా సిద్ధ’మని జిన్‌పింగ్ గత బీజింగ్ సమావేశంలోనే ట్రంప్‌కు స్పష్టం చేయటం తెలిసిందే. అందువల్లనే ట్రంప్ స్వదేశానికి తిరిగి వెళుతూ, తాము అమెరికా నుంచి 9,500 మైళ్లు ప్రయాణించి చైనాతో యుద్ధం చేయలేమ న్నారు. తైవాన్‌కు 14 బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయాన్ని రద్దు చేయలేదు గానీ నిరవధికంగా నిలిపి వేశారు. తైవాన్ స్వాతంత్య్రాన్ని బలపరచబోమని మరొకమారు సూచించారు. అయితే వాషింగ్టన్ శిఖరాగ్రంలో చైనా అధ్యక్షుడు కోరింది, స్వాతంత్య్రాన్ని కేవలం బలపరచకపోవటం కాదు వ్యతిరేకించాలని. ఆయుధ విక్రయాలను రద్దు చేయాలని. ఇందుకు ట్రంప్ స్పందన తెలియదుగానీ, చైనాతో బేరసారాలకు ఇదొక కార్డుగా ఉపయోగపడుతుందన్నారు.ఇరువురు నేతల మధ్య వాషింగ్టన్లో గత మే నెల కన్నాభిన్నంగా చర్చకు వచ్చిన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక్కటే. ఈ విషయమై రెండు దేశాల వైఖరులు పూర్తి భిన్నంగా ఉన్నట్లు ముందునుంచే స్పష్టమైంది. ఇపుడు ఏకాభిప్రాయం రాగలదని ఎవరూ ఆశించలేదు. రాలేదు కూడా. రాగల కాలంలో ఏఐ వల్ల అనూహ్యమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, కనుక అందులో పైచేయి సాధించాలి తప్ప ఎటువంటి నియంత్రణలకు అంగీకరించరాదన్నది ట్రంప్ ప్రభుత్వ విధానం. నియంత్రణలు లేని ఏఐ వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు కూడా అనూహ్యమైనవేనని సాక్షాత్తూ అమెరికన్ నిపుణులు, ఏఐ సంస్థలు హెచ్చరిస్తున్నా, ఆధిపత్య అన్వేషణలో మంచి చెడులను ఆలోచించని ఆయన దేనినీ లెక్క చేయటం లేదు. ఏఐ అభివృద్ధిలో చైనాతో ఏర్పడిన గట్టి పోటీ అందుకు తోడవుతున్నది. ఏఐతో అందరం లాభపడాలని, అదే సమ యంలో నష్టాల నివారణకు ఉమ్మడి నియంత్రణలు అవసరమన్న చైనా అధ్యక్షుని ప్రతిపాదనను ట్రంప్ ప్రస్తుత చర్చలలో అంగీకరించక పోవటానికి కారణం కూడా అదే. వైట్ హౌస్ విందుకు హాజరైన టెక్ దిగ్గజాలు రాగల రోజులలో తీసుకోగల వైఖరి ఏమిటన్నది ప్రపంచం తగినంత ఆందోళనతోనే ఎదురుచూస్తుందనాలి.జీ–2ఇతర విషయాలకు వస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మంటున్న దానికి బీజింగ్‌లో కుదిరిన యుద్ధ విరామం ఈ నవంబర్‌లో ముగియనుండగా దానిని మరో నెలలు జనవరి వరకు పొడి గించుకున్నారు. ఇందులో పెద్ద విశేషం లేదు. అమెరికా తీవ్రమైన వాణిజ్య లోటులో ఉన్నందున దానిని భర్తీ చేసుకునేందుకని చెప్తూ, చైనా సహా అన్ని దేశాలపై యథేచ్ఛగా సుంకాల పెంపు, అందుకు ఎదురు వ్యూహంగా చైనా ప్రభుత్వం తన సుంకాలు పెంచటం, అమెరికా నుంచి కొనుగోళ్లు తగ్గించటం, ముఖ్యంగా అతి కీలకమైన ఖనిజాల ఎగుమతిని నియంత్రించటం వంటి చర్యలు తెలిసినవే. చర్చల ద్వారా ఇందులో చేసుకుంటూ వస్తున్న సర్దుబాట్లను ఇపుడు రెండు నెలలు పొడిగించుకున్నారు. అంతకన్న గత్యంతరం లేదు కూడా. తమ ప్రయోజనాల కోసం ఇతర దేశాలను చతురోపాయాల ద్వారా లొంగదీసుకునే కాలం అమెరికా సహా పాశ్చాత్య కూటమికంతా మెల్లగా గతించిపోతున్నది. చైనా వంటి ‘సమ ఉజ్జీ’ (ఇది పాశ్చాత్యుల పద ప్రయోగమే)తోనైతే వీలు పడేదే కాదు. చివరిగా రెండు ముఖ్య విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, ఈ విధమైన ప్రశాంత ప్రయాణం అమెరికా కన్న చైనాకు ఎక్కువ అవ సరం. పాశ్చాత్య దేశాలకు ఆధిపత్య సాధనలు, యుద్ధాలు, నష్టాలు, తిరిగి కోలుకోవటాలు చరిత్ర పొడవునా ఉన్నవే. అదే క్రమంలో వారు వర్తమానంలోనూ యుద్ధాలు సాగిస్తున్నారు. మునుముందు కూడా చేస్తారు. అందుకు చైనా, రష్యాలు మినహాయింపు కాగలవని ఎవరూ శిలాక్షరాలు రాయలేరు. చైనా పరిస్థితి అది కాదు. నల్ల మందు యుద్ధాల (1839) కాలం నుంచి విప్లవం (1949) వరకు వందేళ్లపాటు విదేశీ ఆక్రమణలకు, తీవ్ర నష్టాలకు గురైనందున ఇక మీదట అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా కేవలం అభివృద్ధి పైన దృష్టిని కేంద్రీకరించాలన్నది వారి ఆలోచన. అందుకోసం అమె రికా అనే గాక సాధారణ రూపంలోనే ప్రశాంతమైన నది, ప్రశాంత మైన పడవ ప్రయాణం వారి ప్రణాళిక. ఇది ఒక విషయం కాగా రెండవది, అమెరికా చైనాల శాంతియుత సహజీవన ప్రభావాలు వారిద్దరిపైనే గాక ప్రపంచ వ్యాప్తంగా, ఆసియా, పసిఫిక్ సహా అనేక ప్రాంతాలపై గణనీయంగా ఉండనున్నాయి. ఆ విధంగా వారి సంబంధం అధికారికంగా జీ–2గా మారకపోయినా, అనధికారికంగా అదే పాత్ర నిర్వహిస్తుంది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
బాంబులను పసిగట్టేందుకు.. వ్యాన్ల వద్ద రోబో తనిఖీలు
బ్రిటన్‌లో అమెరికా బాంబర్ విమానాలు ఉపయోగించే రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫెయిర్‌ఫోర్డ్ స్థావరం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన 3 వ్యాన్లను బాంబు నిర్వీర్య బృందాలు పరిశీలించాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై దర్యాప్తు కొనసాగుతోంది.గ్లౌసెస్టర్షైర్ పోలీసులకు ఆదివారం అర్ధరాత్రి దాటాక 12.45 గంటల సమయంలో ఫెయిర్‌ఫోర్డ్ వైపు 3 అనుమానాస్పద వాహనాలు వెళ్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సాయుధ పోలీసులు రంగంలోకి దిగి విల్ఫోర్డ్ ప్రాంతంలో ఐదుగురిని అరెస్టు చేశారు. తొలుత పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం ఉగ్రవాద చర్యకు సిద్ధమైన అనుమానంతో దర్యాప్తును ఉగ్రవాద నిరోధక పోలీసులకు అప్పగించారు.వాహనాల చుట్టూ 400 మీటర్ల మేర భద్రతా వలయం ఏర్పాటు చేశారు. బ్రిటన్ సైన్యానికి చెందిన పేలుడు పదార్థాల నిర్వీర్య బృందం అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని సుమారు 85 కుటుంబాలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. ఘటనను తక్షణ ప్రమాదం పరిమితమైందని పోలీసులు తెలిపారు.రంగంలోకి బాంబు నిర్వీర్య రోబో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్లో రిమోట్ ద్వారా నడిచే బాంబు నిర్వీర్య రోబో 3 వాహనాల్లో ఒకదాని వద్దకు వెళ్లి సమీపంగా తనిఖీ చేస్తున్నట్లు కనిపించింది. మరో 2 వ్యాన్ల వెనుక తలుపులు తెరిచి ఉండగా, వాటి సమీపంలో పెద్ద నల్లటి వస్తువులు కనిపించాయి.ఈ ఘటన వెనుక ఉద్దేశం ఏమిటన్నది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనకు-ఇరాన్‌కు సంబంధం ఉండొచ్చన్న కోణానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, రష్యా విధ్వంస చర్య లేదా ఇస్లామిస్ట్ కుట్ర కోణాలనూ పరిశీలిస్తున్నారని దర్యాప్తు విషయాలు తెలిసిన వ్యక్తి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నిందితులు పెద్ద నష్టం చేయాలని చూస్తున్నారని అన్నారు.ఫెయిర్‌ఫోర్డ్‌లో అమెరికా వైమానిక దళానికి చెందిన 501వ కాంబాట్ సపోర్ట్ విభాగం, 420వ వైమానిక స్థావర విభాగం ఉన్నాయి. ఈ ఘటన తర్వాత బ్రిటన్‌లోని లాకెన్‌హీత్, మిల్డెన్‌హాల్ స్థావరాల వద్ద కూడా భద్రత పెంచారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుల ఉద్దేశం, ఘటన వెనుక సంబంధాలు స్పష్టమయ్యే వరకు మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.Footage from Britain shows a bomb-disposal robot moving directly toward one of the suspicious vehicles in Whelford, near RAF Fairford, and carrying out a close inspection of the vehicle. The area remains secured while the examination continues. https://t.co/ZkDXPoHzgu pic.twitter.com/VQ27CBJbKr— DDF NEWS (@ddfmarketing1) September 27, 2026 Aerial footage from RAF Fairford shows B-1B bombers dispersed across the base’s eastern parking slots. Meanwhile, British Army bomb-disposal units continue operating in nearby Whelford following the security incident in the area. https://t.co/B4Xraxaysc pic.twitter.com/8uwVCR5hkf— DDF NEWS (@ddfmarketing1) September 27, 2026 -
అమెరికా- ఇరాన్ యుద్ధం.. మధ్యలో బాహుబలి..!
అమెరికా- ఇరాన్ యుద్ధం ఇప్పట్లో అగేలా కనిపించడం లేదు. ఒకరికొకరు వార్నింగ్ ఇవ్వడం.. దాడులు చేయడం ఈ రెండు దేశాలకు కామన్ అయిపోయింది. అయితే ఈ హెచ్చరికలు కాస్తా కొత్త తరహాలో కనిపిస్తున్నాయి. సినిమాల్లోని సీన్స్‌ను జోడించి శత్రుదేశాలకు వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే ఫుల్ ఫన్నీగా అనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రభాస్- రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి మూవీ వీడియోను హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్విటర్లో పంచుకుంది. కాలకేయులతో బాహుబలి యుద్ధం చేస్తున్న వీడియో తెగ ఆకట్టుకుంటోంది. కాలకేయులకు ఎదురొడ్డి బాహుబలి పోరాడినట్లే.. మేం కూడా మా మాతృదేశం కోసం రక్తం చిందించి ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం అంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. ఇటీవలే ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ పెజెష్కియన్ ఐరాస సమావేశంలో 'ఎవరికీ ఎన్నడూ తలవంచము.. మోకరిల్లము' అంటూ మాట్లాడారు. ఈ కామెంట్స్‌ను ఉద్దేశించి హైదరాబాద్‌లోని ఎంబసీ బాహుబలి వీడియోను షేర్ చేసింది.(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో సమంత.. ఆ విషయంలో ఎక్కువ ఫోకస్..!)Dr. Pezeshkian, President of I.R #Iran at UNGA: "Will never bow our head or bend the knee"Like Baahubali standing against the Kalakeyas, we also shed our own blood in sacrifice for the homeland. pic.twitter.com/xc1S9H346Q— Iran In Hyderabad (@IraninHyderabad) September 27, 2026 -
రూ. 336 కోట్ల స్కామ్ : భారతీయుడికి 11 ఏళ్ల శిక్ష
అమెరికాలో అడుగుపెట్టి అసాధారణ విజయాలు సాధించాలనుకున్న ఓ భారతీయుడి డాలర్ డ్రీమ్స్ కటకటాల వెనక్కి పీడ కలగా మిగిలిపోతోంది. అమెరికాలో 35 మిలియన్ డాలర్ల పాన్జీ స్కామ్ చేసిన భారతీయుడికి భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ. 336 కోట్లుకి పైగా భారీ మెసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన సిద్ధార్థ్ జవహర్ (38) కి 11 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. ప్రముఖ ఎన్ఎఫ్ఎల్ (NFL) స్టార్ ట్రావిస్ కెల్స్‌తో సహా అనేకమంది ప్రముఖులను మోసగించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.2005లో 21 ఏళ్ల వయసులో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లిన సిద్ధార్థ్ జవహర్ (Siddharth Jawahar).. టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత 'స్విఫ్టార్క్ క్యాపిటల్' (Swiftarc Capital) పేరిట ఒక ఇన్వెస్ట్మెంట్ సంస్థను ప్రారంభించి ఫైనాన్స్, వెంచర్ క్యాపిటలిజం రంగాల్లో ఎదిగా డు. ఆండీ రోడిక్ ఫౌండేషన్ బోర్డులో స్థానం సంపాదించి, మంచి గౌరవనీయమైన దాతగా కూడా పేరు పొందాడు. కట్ చేస్తే.. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 11 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు, బాధితులకు రూ.300 కోట్లకుపైగా( 31.35 మిలియన్ డాలర్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.స్కామ్‌కు తెరలేచిందిలా..2016 , జూలై నుంచి డిసెంబర్ 2023 మధ్య కాలంలో వివిధ ఇన్వెస్టర్ల నుంచి 35 మిలియన్ డాలర్లకు పైగా సేకరించిన సిద్ధార్థ్, అందులో కేవలం 28 శాతం మాత్రమే (సుమారు 10 మిలియన్ డాలర్లు) పెట్టుబడిగా పెట్టారు. మిగతా డబ్బును విలాసవంతమైన జీవితం, ప్రైవేట్ జెట్ ప్రయాణాలు, లగ్జరీ హోటళ్లు, ఖరీదైన అపార్ట్మెంట్ల కోసం దుర్వినియోగం చేశారు. పాత ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించడానికి కొత్త ఇన్వెస్టర్ల నిధులను వాడుతూ పాన్జీ స్కామ్‌ను నడిపారు.బాధితుల్లో చాలామంది ప్రముఖులుఈ మోసంలో మొత్తం 64 మంది బాధితులు ఉండగా.. వారిలో సింగర్ టేలర్ స్విఫ్ట్ భర్త, ప్రముఖ ఎన్ఎఫ్ఎల్ (NFL) ఆటగాడు ట్రావిస్ కెల్స్ కూడా ఉన్నారు. అలాగే ఎన్బీఏ (NBA) ఆటగాళ్లు గ్యారీ హారిస్, టిమ్ హార్డవే జూనియర్, మేసన్ ప్లమ్లీ తదితరులు కూడా ఈ మోసానికి బలయ్యారు.దాతృత్వ ముసుగులో మోసాలుఆండీ రోడిక్ ఫౌండేషన్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతూ, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సిద్ధార్థ్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ దాతృత్వ ముసుగే సెలెబ్రిటీలు మరియు ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి అతనికి సహకరించింది.అరెస్ట్ -శిక్షచట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న ఇతని నేర చరిత్రను గుర్తించిన అధికారులు.. మోసాలకు పాల్పడినట్లు తేలడంతో అరెస్ట్ చేశారు. జనవరిలో వైర్ ఫ్రాడ్ ఆరోపణలను అంగీకరించిన సిద్ధార్థ్‌కు సెప్టెంబర్ 15న. విచారణను తప్పుదారి పట్టించడానికి సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ఐఫోన్‌ను రిమోట్‌గా వైప్ చేయించడం వంటి అక్రమాలకు కూడా ఆయన పాల్పడినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. -
ఆస్పత్రి శిధిలాల కింద మోజ్తాబా కమేనీ.. ఇదే అసలు నిజం
టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై నిర్వహించిన భీకర వైమానిక దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు ఇరాన్ మతగురువు, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సభ్యుడు అయతుల్లా మొహ్సెన్ హైదరీ అలెకాసిర్ సంచలన విషయాలు వెల్లడించారు.ఖతార్‌కు చెందిన ప్రముఖ ‘అల్ అరబీ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను బయటపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’లో భాగంగా టెహ్రాన్‌లోని అధికారిక కేంద్రాలు, నివాస సముదాయాలపై యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, టోమహాక్ క్షిపణులతో మెరుపు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు.శిథిలాల కింద చిక్కుకున్న మోజ్తాబా ఖమేనీ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వైద్య కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల సమయంలో మూడో ఆసుపత్రిలో ఉన్న మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది శిథిలాలను తొలగించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ని రక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అలెకాసిర్ తెలిపారు. ఇదీ చదవండి: అయతుల్లా అలీ ఖమేనీ ఒంటి చేయి రహస్యం ఇదేనా?అజ్ఞాతంలో ఖమేనీ.. పొంతన లేని ప్రకటనలు మార్చి 8న ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తాబా ఖమేనీ ఎన్నికైనప్పటికీ, ఆ తర్వాత ఆయన భౌతికంగా లేదా మీడియా ముందు బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వర్గాల సమాచారం ప్రకారం.. వైమానిక దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన శరీరంపై బలమైన గాయాలైనట్లు నివేదికలు వచ్చాయి. మరోవైపు, గత వారం ‘ఫాక్స్ న్యూస్’తో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మాత్రం మోజ్తాబా ఖమేనీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ శత్రు దేశాల దాడుల ముప్పును ఎదుర్కొంటూనే అత్యంత గోప్యంగా ఈ ఎంపిక జరిగిందని అలెకాసిర్ వెల్లడించారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 59 ఓట్లకు గానూ మోజ్తాబా ఖమేనీ 50 ఓట్లు సాధించి ఘన విజయం సాధించగా, మరో ఎనిమిది మంది అయతుల్లా అలీరేజా అరఫీకి ఓటు వేశారు. దేశాన్ని చట్టపరంగా, మతపరంగా నడిపించేందుకు ఖమేనీ మాత్రమే తగిన నాయకుడని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. 🇮🇷 🇮🇱 Detalles publicados por primera vez: Durante la guerra, el MOSSAD estuvo muy cerca del asesinato de Mujtaba Khamenei, el hijo de Ali Khamenei. Mohsen Heydari, miembro de la Asamblea iraní de expertos, afirmó que Mojtaba Jamenei fue rescatado de los escombros tras el ataque al hospital de Teherán. Heydari añadió que Jamenei resultó herido durante el ataque. Otros tres hospitales de Teherán fueron bombardeados después de que se supo que su estado se había estabilizado en el hospital. Según Heydari, cuando Jamenei estaba siendo tratado en el tercer hospital, el mismo centro médico también fue atacado y luego fue rescatado de los escombros.— Señor del caos visual ☭ 🇨🇱 (@Darwin_48) September 27, 2026 -
తానా ప్రపంచసాహిత్య వేదిక 96వ సమావేశం విజయవంతం
‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరేళ్లకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (9 సెప్టెంబర్) ని పురస్కరించుకుని తెలంగాణా రాష్ట్రంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తానా ప్రపంచసాహిత్య వేదిక ఆదివారం జరిపిన 96వ అంతర్జాల సమావేశం సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమై విజయవంతంగా ముగిసింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర శాసనమండలి సభ్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, విశిష్ట రచయిత, ప్రజాకవి, వాగ్గేయకారుడు డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ “తెలుగు భాషను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, భాష పరిరక్షణపట్ల ప్రజలలో అవగాహన ఆవసరం అన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉత్తర్వులు, కార్యకలాపాలు తెలుగులో ఉండేటట్లు చూడాలని, ప్రాధమిక స్థాయిలో మాతృభాషను నిర్భందంగా ప్రవేశపెట్టాలని కోరారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తన ప్రసంగంలో “ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజీ తన జీవితం అంతా సామాన్య ప్రజల మధ్యే గడుపుతూ, అనునిత్యం ప్రజాహక్కుల కోసం, తెలుగుభాష పరిరక్షణ కోసం పాటుబడ్డ భాషాభిమాని అని, కేవలం ఆయన జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకుని, ఒక సాహిత్య పురస్కారం అందజేసి చేతులు దులుపుకోకుండా, ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో తెలుగు భాషను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.”విశిష్టఅతిథులుగా పాల్గొన్న తెలంగాణా తెలుగు అకాడమీ ఛైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ, బాల సాహితీవేత్త డా. సిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తల్లి అంటే ఎంత ప్రేమో, తల్లి భాషను కాపాడుకోవడంలోను అంత శ్రద్ధ ఉండాలని, ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రజలంతా కలిసికట్టుగా భాషను కాపాడుకోవాలని, ప్రభుత్వం వెంటనే తగు చర్యలను చేపట్టకపోతే తెలుగునేలమీద తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగువిభాగంలో సహాచార్యురాలిగా పనిచేస్తున్న డా. ఎం. దేవేంద్ర కాళోజీ కలంనుండి వెలువడ్డ కొన్ని ముఖమైన కధలను సంక్షిప్తంగా పరిచయంచేసి ఆయన రచనా నైపుణ్యాన్ని చక్కగా ఆవిష్కరించారు. కార్యక్రమం చివరిలో కాలిఫోర్నియాలో నివసిస్తున్న రచయిత వెంకట్ నాగం రచించిన, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురించిన, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముందు మాటలు వ్రాసిన “కలగూరగంప”, “రచ్చబండ చర్చలు” అనే రెండు గ్రంధాలను డా. ప్రసాద్ తోటకూర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రచయిత వెంకట్ తో పాటు ఆయన భార్య వాణి, మిత్రులు డా. సురేంద్ర దార, వేణు నక్షత్రం, తాటిపాముల మృత్యుంజయుడు, శ్రీకాంత్ గోడే లు పాల్గొని రచయిత వెంకట్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రసార మాధ్యమాలకు, కార్యకర్తలకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు.ఇదీ చదవండి: 9/11 అమరులకు నివాళిగా ‘గ్రాడ’ మెగా రక్తదాన శిబిరం -
డూమ్స్‌డే వార్: ఇరాన్ బిగ్ వార్నింగ్.. ట్రంప్ రియాక్షన్ ఇదే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ముగింపు కోసం దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల రోడ్‌మ్యాప్‌ను అమెరికా తిరస్కరించడంతో.. అవసరమైతే భయానక యుద్ధాన్ని సైతం ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఇరాన్ అంటోంది. ఈసారి యుద్ధం మొదలైతే అదీ ఎవరూ ఊహించని స్థాయిలో భీకరంగా మారొచ్చు అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. యుద్ధం పునఃప్రారంభమైతే అది ‘డూమ్స్‌డే వార్’(Doomsday War)ప్రళయం తరహా) స్థాయికి చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధం అని అమెరికాను హెచ్చరించారాయన. అదే సమయంలో దౌత్యానికి తలుపులు మాత్రం మూసివేయలేదని చెప్పారు.హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించే దిశగా ఇరాన్ ఏడు రోజుల ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. ఇరాన్ తమను ఫ్రీజ్ చేసిన బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయాలని, ఆంక్షలను ఎత్తివేయాలని కోరిందని.. అందుకు తాము సిద్ధంగా లేమని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ తెలిపారు. ఇవి కేవలం అమెరికా విధించిన ఆంక్షలు కాదని, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆంక్షలని ఆయన పేర్కొన్నారు.‘యుద్ధం త్వరలో ముగుస్తుంది’.. ట్రంప్మరోవైపు.. ఆరాఘ్ఛి వార్నింగ్ వెలువడ్డ కాసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ వారంలో ఇరాన్‌తో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. యుద్ధంలో అమెరికా ‘త్వరలోనే విజయం సాధిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు చెబుతున్నారు.న్యూయార్క్‌లో ఐరాస సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరాన్ ప్రతినిధులతో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెంటర్ ఫర్ మిడిల్ ఈస్ట్ స్ట్రాటజిక్ స్టడీస్ సీనియర్ పరిశోధకుడు అబ్బాస్ అస్లానీ తెలిపారు. మధ్యవర్తుల ద్వారా అమెరికా అధికారిక స్పందన కోసం ఇరాన్ ఎదురుచూస్తోందని చెప్పారు. ఇరుదేశాలు తమకు ఉన్న ప్రధాన ఒత్తిడి సాధనాలను ముందుగా ఎవరు వదులుకుంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారిందని ఆయన విశ్లేషించారు.డ్రోన్ స్వాధీనం చేసుకున్నామన్న ఇరాన్ ప్రకటనపై..హర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్ డ్రోన్‌ను ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకుందన్న వార్తలు కూడా ఉద్రిక్తతను పెంచాయి. అయితే ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. డ్రోన్ తమ ఆధీనంలోకి వెళ్లిందన్న వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై అమెరికా దాడులకు ఉపయోగిస్తున్న బ్రిటన్‌లోని ఓ వైమానిక స్థావరం సమీపంలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు, ఉగ్రవాదానికి సంబంధించిన నేరాల అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాళ్లు ఇరాన్ పౌరులని తెలుస్తోంది.నస్రల్లా హంతకుల్ని శిక్షించాల్సిందేమరోవైపు హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నస్రల్లా హత్యను ‘క్షమించరాని నేరం’గా అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ శాఖ.. బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ప్రపంచ దేశాలను కోరింది. 2024 సెప్టెంబర్ 27న బీరుట్‌లోని దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే.మొత్తంగా హర్ముజ్ జలసంధి తెరవడం, ఆంక్షల ఎత్తివేత, అణు కార్యక్రమం వంటి అంశాలపై అమెరికా–ఇరాన్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒకవైపు చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తుండగా.. మరోవైపు యుద్ధం మళ్లీ మొదలైతే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.ఇదీ చదవండి: భారత్-కెనడా బంధంలో కీలక ‘మలుపు’! -
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్‌లోని ఓ క్లబ్లో జరిగిన గొడవ తీవ్ర హింసకు దారితీసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ముగ్గురు పురుషులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారిగా పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రం డెట్రాయిట్లో ఆదివారం ఉదయం సుమారు 7.21 గంటలకు ఈ ఘటన జరిగింది. నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ఈటన్ అవెన్యూ, ప్రెస్ట్ స్ట్రీట్ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాల్పులకు ముందు ఘటన జరిగిన ప్రదేశంలో గొడవ జరిగినట్లు డెట్రాయిట్ పోలీస్ చీఫ్ టాడ్ బెట్టిసన్ తెలిపారు. గొడవ అనంతరం కొందరు తుపాకీతో హింసకు పాల్పడ్డారని చెప్పారు. అయితే అసలు గొడవ ఎందుకు మొదలైంది? కాల్పులకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.ఈ కేసులో పోలీసులకు కొన్ని ఆధారాలు, సమాచారం లభించాయని బెట్టిసన్ తెలిపారు. అయితే దర్యాప్తు దృష్ట్యా వాటిని బహిర్గతం చేయలేదు. అనుమానితుడి వివరాలు లేదా అతడి రూపురేఖలను కూడా పోలీసులు వెల్లడించలేదు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది. డెట్రాయిట్ మేయర్ మేరీ షెఫీల్డ్ ఈ ఘటనపై స్పందిస్తూ, దీనికి సంబంధించిన సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ ఘటనతో ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని డెట్రాయిట్ పోలీస్ విభాగం తెలియజేసింది.ఇదీ చదవండి: సల్ఫర్ ధర డబుల్.. భారత్‌కు సరికొత్త సంక్షోభం! -
Video: పామును ఎలా కాపాడారో చూస్తే షాక్ అవుతారు!
మూడు గోల్ఫ్ బంతులను మింగేసిన ఓ పాము.. వైద్యులనే అవాక్కయ్యేలా చేసింది. శస్త్రచికిత్స లేకుండానే మత్తుమందు ఇచ్చి, పాము శరీరాన్ని జాగ్రత్తగా మానిప్యులేట్ చేస్తూ మూడు బంతులను బయటకు తీశారు అమెరికా పశువైద్యులు. ఈ అసాధారణ రెస్క్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో సౌత్ టెక్సాస్ ఏవియన్, ఎక్సయోటిక్ ఆసుపత్రిలో పాము కడుపులో ఇరుక్కుపోయిన మూడు గోల్ఫ్ బంతులను విజయవంతంగా బయటకు తీశారు.ఈ ప్రక్రియకు సంబంధించిన వీడియోను ఆసుపత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. వీడియోలో మత్తుమందు ఇవ్వడంతో పాము నిద్రలోకి జారుకుంది. అనంతరం వైద్యులు దాని శరీరంలో ఉన్న వస్తువులను ఎంతో జాగ్రత్తగా బయటకు తీసేశారు. ‘‘ఈ పాము మూడు గోల్ఫ్ బంతులను మింగింది. అదృష్టవశాత్తూ శస్త్రచికిత్స అవసరం రాలేదు. పాముకు మత్తుమందు ఇచ్చిన తర్వాత.. మా పశువైద్య బృందం దాని శరీరాన్ని జాగ్రత్తగా మలచుతూ మూడు గోల్ఫ్ బంతులను చేతులతో సురక్షితంగా బయటకు తీయగలిగింది.ఇది నిజంగా గుర్తుండిపోయే కేసు.. ఎగ్జాటిక్ యానిమల్ మెడిసిన్‌లో తమ వద్దకు ఎలాంటి కేసు వస్తుందో ఎప్పుడూ ఊహించలేం’’ అంటూ ఆసుపత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. పశువైద్యులు పాము శరీరాన్ని నెమ్మదిగా మానిప్యులేట్ చేస్తూ గోల్ఫ్ బంతులను దాని నోటి వైపు కదిలించారు.ఇదీ చదవండి: నీటిపై తేలుతున్న డ్రమ్ములో షాకింగ్ దృశ్యంఒక్కో బంతి నోటి దగ్గరకు చేరుకున్నప్పుడు పాము నోరు తెరవడంతో వైద్యులు వాటిని జాగ్రత్తగా బయటకు తీశారు. మొదటి గోల్ఫ్ బంతిని బయటకు తీసిన తర్వాత.. పామును పరీక్షించగా దాని శరీరంలో ఇంకా రెండు బంతులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్యులు అదే జాగ్రత్తతో మిగిలిన రెండు గోల్ఫ్ బంతులను కూడా బయటకు తీశారు. View this post on Instagram A post shared by South Texas Avian & Exotic Hospital (@southtexasavianexotics) -
9/11 అమరులకు నివాళిగా ‘గ్రాడ’ మెగా రక్తదాన శిబిరం
అమెరికాలో 9/11 ఉగ్రదాడుల అమరులను స్మరిస్తూ, 'గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా' (GRADA) ఆధ్వర్యంలో కార్టర్ బ్లడ్‌కేర్ సహకారంతో నిర్వహించిన 4వ మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. డల్లాస్ - ఫ్రిస్కోలోని స్పైసీ వెన్యూ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను, రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. సమాజ హితం కోసం గ్రాడ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డా. దర్గా నాగిరెడ్డి, చెన్నా రెడ్డి కొర్విలకు గ్రాడ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వారి మార్గదర్శకత్వంలోనే సమాజానికి ఉపయుక్తమైన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించగలుగుతున్నామని పేర్కొంది. ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన కోఆర్డినేటర్లు ఉమా మహేశ్వర్, హరినాథ్, జగదీష్‌లతో పాటు చురుగ్గా పాల్గొన్న యువ వాలంటీర్లకు గ్రాడ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గాలి, కార్యదర్శి రాజు కంచం, ఈసీ కార్యవర్గ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రక్తదాన శిబిరానికి స్థలాన్ని కేటాయించి పూర్తి సహకారం అందించిన స్పైసీ వెన్యూ రెస్టారెంట్ యజమాని సునీల్‌కు, ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చిన రక్తదాతలందరికీ గ్రాడ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.ఇదీ చదవండి: జపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు -
గ్యాస్ లీకేజీతో భారీ పేలుడు.. కుప్పకూలిన భవనం
ఏథెన్స్: గ్రీస్ రాజధాని ఏథెన్స్ పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ప్లాకా జిల్లాలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7.30 గంటలకు జరిగిన పేలుడులో ఒక పాత రెండంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు అమెరికన్లు గాయపడ్డారు. 30 మంది అగ్నిమాపక సిబ్బంది భవన శిథిలాలను తొలగించి ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు.గ్రీకు నాగరికతకు నిదర్శనంగా నిలిచే ప్రాచీన ఆక్రోపొలిస్ కట్టడానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఆ భవనంలో గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించి ఉంటుందని ఏథెన్స్ మేయర్ హ్యారిస్ డౌకాస్ అభిప్రాయపడ్డారు. అయితే పేలుడుకు అసలైన కారణాలు దర్యాప్తు తర్వాతే తెలుస్తాయని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి సమీప భవనం సైతం పాక్షికంగా ధ్వంసమైంది.ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం -
ఏఐపై మాట్లాడుకుందాం!
బ్యాంకాక్: కృత్రిమ మేధ(ఏఐ) సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరపడానికి, సైనిక సమాచార మార్పిడిపై కార్యాచరణను వేగవంతం చేయడానికి అమెరికా, చైనాలు అంగీకారానికి వచ్చాయి. నూతన ఏఐ భద్రతా విధానం ఏర్పాటుకు, అలాగే వాణిజ్యం, సైనిక అంశాలపై చర్చలు కొనసాగించడానికి ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఇరుదేశాలు శనివారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ఎంపిక చేసిన ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై సహకారానికి వాణిజ్య, పెట్టుబడుల మండలిని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయానికి వ చ్చినట్లు తెలిపాయి. ఈ బోర్డు ఈ వారం నుంచే కార్యకలాపాలు ప్రారంభించినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. చైనా అధినేత షీ జిన్‌పింగ్ 3 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇరువురు నేతల మధ్య కొత్తగా ఒప్పందాలేవీ కుదరలేదు. పశ్చిమాసియా పరిణామాలపైనా ట్రంప్, జిన్‌పింగ్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమంటూ ఇచ్చిన హామీని ఇరాన్ గౌరవించాలని వారు తే ల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధిలో పరిస్థితులను ప్రస్తావించారు. అంతర్జాతీయ జల మార్గాలపై ఏ దేశం కూడా సుంకాలు విధించడానికి వీల్లేదని స్పష్టంచేశారు. రెండు దేశాల సైన్యాల మధ్య సంక్షోభ సమాచార మార్పిడిని బలోపేతం చేయడం, సంక్షోభ నివారణపై ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాతో సంబంధాలకు ట్రంప్ అధిక ప్రాధాన్యం చైనా అధినేత జిన్‌పింగ్ అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశంలో అడుగుపెట్టారు. గత ఏడాది చైనాతో వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసినప్పటికీ.. ఈ పర్యటన సందర్భంగా జిన్‌పింగ్ పట్ల డొనాల్డ్ ట్రంప్ అసాధారణమైన ఆతీ్మయత ప్రదర్శించడం గమనార్హం. చైనాతో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్రంప్ తన చేతల ద్వారా సంకేతాలిచ్చారు. సంక్షోభ సమయాల్లో సమాచార మార్పిడిని బలోపేతం చేయడం, సంక్షోభాలను నివారించడమే లక్ష్యంగా ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. కానీ, దీనిపై పూర్తి వివరాలేవీ బహిర్గతం చేయలేదు. ఏఐ సంబంధిత అంశాల కోసం అమెరికా, చైనాలు ఒక కమ్యూనికేషన్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. త్వరలో పరస్పర సుంకాల తగ్గింపు దాదాపు 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై పరస్పర సుంకాలను తగ్గించుకోవాలని అమెరికా, చైనాలు భావిస్తున్నాయి. దీన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చాయి. వాణిజ్యపరమైన ఒప్పందాలను మరో రెండు నెలలపాటు పొడిగించేందుకు ట్రంప్, జిన్‌పింగ్ అంగీకరించారు. 2027, 2028లో అమెరికా నుంచి కనీసం 10 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడానికి చైనా అంగీకరించినట్లు వైట్‌హౌస్ స్పష్టంచేసింది. పరస్పర సుంకాల తగ్గింపులో ఎక్కువ భాగం వ్యవసాయ ఉత్పత్తులు లేదా పండుగ అలంకరణ సామగ్రి వంటి వస్తువులకే పరిమితం కానున్నట్లు సమాచారం. -
ప్రభుత్వ సైట్లతో ఏఐ ముచ్చట్లు!
శాన్ఫ్రాన్సిస్కో: తాము అభివృద్ధి చేసిన ఏఐ ఏజెంట్లు అనూహ్య రీతుల్లో అమెరికా ప్రభుత్వ వెబ్సైట్లతో సంప్రదింపులు జరిపినట్లు ఓపెన్ ఏఐ ప్రకటించింది. కంపెనీ ఏఐ మోడళ్లపై సమీక్ష సందర్భంగా ఈ విషయం బయటపడినట్లు తెలిపింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజి కమిషన్ (ఎస్ఈసీ), యూఎస్ సెన్సస్ బ్యూరో డేటాలు నడుపుతున్న రెండు వెబ్సైట్ల సమాచారాన్ని ఏఐ మోడళ్లు వీక్షించాయని ఓపెన్ ఏఐ తెలిపింది. అయితే ఏఐ మోడళ్లు ఎస్ఈసీ క్రెడెన్షియల్స్‌ను, అకౌంట్లను కానీ ఏఐ మోడళ్లు ఉపయోగించలేదని, సమాచారంలో మార్పులు జరిగిన ఆనవాళ్లూ లేవని, వైబ్సైట్లో సెక్యూరిటీ పరమైన లోటుపాట్లు కూడా ఏవీ లేవని తేలిందని వివరించింది. ఏఐ మోడళ్లు మానవ నియంత్రణ నుంచి తప్పిపోయి ఇతర వెబ్సైట్లను హ్యాక్ చేయగలవన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో ఓపెన్ ఏఐ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఏఐ మోడళ్లు ఎస్ఈసీ వెబ్సైట్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఇంకో వెబ్సైట్లో పోస్ట్ చేశాయని, ఈ చర్య అనూహ్యమైందని ఓపెన్ ఏఐ తెలిపింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఏఐ మోడళ్లు డేటాను చేయకూడని సమయంలో ప్రసారం చేశాయని తెలిపింది. సుమారు 53 సార్లు ఏఐ మోడల్ యూజర్ యాక్టివిటీకి సంబంధించిన చిత్రాన్ని ఛాట్‌జీపీటీ నుంచి తీసుకుని మరెక్కడికో ట్రాన్స్ఫర్ చేసిందని వివరించింది. ప్రతి సందర్బంలోనూ వినియోగదారుడు తమ సమాచారంతో శిక్షణ పొందేందుకు ఏఐ మోడల్‌ను అనుమతించారని తెలిపింది. అయినప్పటికీ డేటాను ఈ విధంగా వాడటం సరికాదని అంగీకరించింది. ఈ లోపాన్ని గుర్తించిన తరువాత తాము తగిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. -
రూ. 2.87 లక్షల కోట్ల డీల్ : చైనా-అమెరికా కీలక ఒప్పందం
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా చారిత్రాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఎనిమిది సూత్రాల ఏకాభిప్రాయం ప్రకారం, 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2.87 లక్షల కోట్లు)పరస్పర సుంకాల తగ్గింపు ఒప్పందం, ఏఐ (AI) పై చర్చలు ప్రారంభించడంపై అమెరికాతో ఒప్పందం కుదిరినట్టు చైనా శనివారం తెలిపింది. ఒక వాణిజ్య మండలిని ఏర్పాటుకు, కౌలాలంపూర్‌లో ఇంతకుముందు జరిగిన చర్చల ఫలితాలను పొడిగించడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించా యని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.టారిఫ్ తగ్గింపు ఒప్పందంఅమెరికా, చైనా దేశాలు 30 బిలియన్ డాలర్ల పరస్పర టారిఫ్ తగ్గింపు (tariff-reduction) ఒప్పందానికి అంగీకరించినట్లు చైనా శనివారం ప్రకటించింది. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కుదిరిన తాత్కాలిక విరామాన్ని (trade truce) మరో రెండు నెలలు పొడిగించినట్లు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు.ఏఐ రంగంలో చర్చలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) వల్ల కలిగే లాభనష్టాలపై చర్చించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. రాబోయే నవంబర్‌లో తదుపరి విడత చర్చలు జరగనున్నాయి. అలాగే, ఏఐ సంబంధిత ఘటనలపై కమ్యూనికేషన్ ఛానెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఏఐకి బదులుగా "సూపర్ ఇంటెలిజెన్స్" అనే పద వాడకాన్ని బీజింగ్ స్వాగతించింది.వాణిజ్య మండలి ఏర్పాటుఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలపర్చేందుకు ఒక ట్రేడ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) నాయకుల సమావేశం మరియు G20 శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడంలో పరస్పర మద్దతుకు కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇద్దరు నాయకులు ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చే ఈ సమావేశాలకు హాజరుకావాలని యోచిస్తున్నారు.దీంతోపాటు విదేశాంగ విధానం విషయానికి సంబంధించి ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయకుండా చూసేందుకు కట్టుబడి ఉండాలని, అంతర్జాతీయ జలమార్గాలపై ఏ దేశం కూడా రవాణా టోల్స్ విధించకూడదని ఇరు దేశాల నేతలు అంగీకరించారు. అలాగే, ఏపీఈసీ (APEC), జీ-20 (G20) సమావేశాలకు పరస్పరం హాజరయ్యేందుకు షీ జిన్‌పింగ్, డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఇదీ చదవండి: యూనివర్శిటీ విద్యార్థిని మృతి, లవ్ జిహాద్ ఆరోపణలు కలకలంకాగా నవంబర్ 10న ముగియనున్న వాణిజ్య సంధిని రెండు నెలల పాటు పొడిగించడానికి ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తీసుకున్న చర్యల కొనసాగింపుగా ఈ ఒప్పందం కుదిరిందని, తద్వారా మరింత పెద్ద వాణిజ్య ఒప్పందంపై పనిచేయడానికి ఎక్కువ సమయం లభిస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇటీవల ప్రకటించారు.ఇదీ చదవండి: లవర్‌తో పెళ్లి : పోలీస్కానిస్టేబుల్ని మట్టుబెట్టిన కొడుకు -
ఇరాన్ బిగ్ ఆఫర్.. నో చెప్పి షాకిచ్చిన ట్రంప్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి తెరదించేలా ఇరాన్ చేసిన కీలక ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఏడు రోజుల్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, కాల్పుల విరమణకు వెళ్లడం వంటి ప్రతిపాదనను ఇరాన్ అమెరికా ముందు ఉంచగా.. ట్రంప్ దాన్ని తిరస్కరించినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ కథనం వెల్లడించింది.ఇదే సమయంలో నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మళ్లీ బాంబు దాడులు ప్రారంభించే అవకాశం ఉందని ట్రంప్ తన సన్నిహితులకు చెప్పినట్లు సదరు కథనంలో నివేదించింది. అయితే ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదని పేర్కొంది.ఇరాన్ ప్రతిపాదన ఏంటి?ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు తమ ప్రతిపాదనను పంపినట్లు తెలిపారు. అమెరికా కొన్ని షరతులను అంగీకరిస్తే ఏడు రోజుల్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, సాధారణ నౌకా రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇరాన్ షరతుల్లో ప్రధానంగా అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను సడలించడం, మధ్యప్రాచ్యవ్యాప్తంగా కాల్పుల విరమణ పాటించడం ఉన్నాయి. లెబనాన్‌లోనూ శత్రుత్వాన్ని నిలిపివేయాలని ఇరాన్ కోరింది. దీనికి ప్రతిగా హార్ముజ్‌ను తెరిచి, అమెరికాతో అణు కార్యక్రమంపై చర్చలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు.ట్రంప్ వైఖరి ఏంటి?ఇరాన్ ప్రతిపాదనతో దౌత్యపరమైన చర్చలకు అవకాశం కనిపించినప్పటికీ, ట్రంప్ మాత్రం ఒప్పందంపై అనుమానంతో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్ కథనం పేర్కొంది. ఇరాన్ తన డిమాండ్లను పూర్తిగా అమలు చేస్తుందన్న నమ్మకం ట్రంప్‌కు లేదని అమెరికా అధికారులను ఉటంకించింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తుల ద్వారా సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని ఓ అమెరికా అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. అందువల్ల ప్రస్తుతం పరిస్థితి ఒకవైపు ఇరాన్ ఏడు రోజుల్లో హార్ముజ్‌ను తెరిచే ప్రతిపాదన.. మరోవైపు ట్రంప్ దానిపై విముఖతగా కనిపిస్తోంది. ఇరాన్ మాత్రం అమెరికా అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తోంది.ఇదీ చదవండి: భారత్‌కు పాక్ ప్రధాని సంచలన హెచ్చరిక -
అమెరికా కోర్టులో ఆంత్రోపిక్‌కు ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తీసుకున్న కీలక నిర్ణయానికి అప్పీల్ కోర్టు మద్దతు తెలిపింది. క్లాడ్‌ఏఐ వినియోగంపై కొన్ని భద్రతా పరిమితులను తొలగించేందుకు నిరాకరించిన కారణంగా ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌ను పెంటగాన్ సరఫరా వ్యవస్థ నుంచి తొలగించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేసిన ఆంత్రోపిక్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆంత్రోపిక్ తన క్లాడ్ ఏఐను పూర్తిగా స్వయంప్రతిపత్తితో పనిచేసే ప్రాణాంతక ఆయుధాల్లో, అలాగే అమెరికన్లపై భారీ స్థాయి దేశీయ నిఘాలో ఉపయోగించేందుకు అనుమతించేలా భద్రతా పరిమితులను తొలగించేందుకు నిరాకరించింది. ఈ వివాదం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. మార్చిలో పెంటగాన్ ఆ సంస్థను ‘సప్లై చైన్ రిస్క్’గా ప్రకటించి, దాని సైనిక ఒప్పందాలను రద్దు చేసింది.సైనిక ఆపరేషన్‌లో పెంటగాన్ కాంట్రాక్టర్ పాలంటీర్ క్లాడ్ వినియోగించడంపై ఆంత్రోపిక్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కోర్టు తీర్పులో వెల్లడైంది. సైనిక వ్యవహారాల్లో ఏఐ వినియోగం వల్ల సాఫ్ట్వేర్ అనుకోని విధంగా పనిచేసే ప్రమాదం ఉందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆంత్రోపిక్ తన ఏఐ మోడళ్లను సైన్యానికి అందించిన తర్వాత వాటి ప్రవర్తనను మార్చలేమని వాదించింది. అయితే కొత్త వెర్షన్లను ఉపయోగించేందుకు సైన్యం తన వ్యవస్థలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ప్రమాదాలను ఎలా సమతుల్యం చేయాలనే విషయాన్ని అధ్యక్షుడు, రక్షణ కార్యదర్శే నిర్ణయించాల్సి ఉంటుందని న్యాయమూర్తి గ్రెగరీ కాట్సాస్ అభిప్రాయపడ్డారు.ఆంత్రోపిక్‌తో వివాదం తర్వాత పెంటగాన్ ఇతర ఏఐ సంస్థల వైపు దృష్టి మళ్లించింది. చాట్‌జీపీటీ అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐ కూడా ఒప్పందం చేసుకోగా, ఆ తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా పెంటగాన్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల విలువ ఉన్న ఆంత్రోపిక్ ప్రస్తుతం పెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఏఐ ప్రమాదాలపై ఆ సంస్థ సీఈవో డారియో అమోడెయి చేసిన హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో విమర్శించారు. పెంటగాన్ అధికారి ఎమిల్ మైఖేల్ కోర్టు తీర్పును స్వాగతించారు. ప్రైవేటు సంస్థలు సైనిక కమాండ్ వ్యవస్థలో తమ అభిప్రాయాలను చొప్పించకుండా ఈ తీర్పు రక్షణ కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆంత్రోపిక్ మాత్రం ఈ తీర్పుతో ఏకీభవించలేదు. తదుపరి న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: నేపాల్ వరదలు.. ఇప్పటికీ ఆచూకీలేని 800 మంది! -
షరతులకు అంగీకరిస్తేనే.. హార్మూజ్‌ను తెరుస్తాం
దుబాయ్: తమ షరతులకు అమెరికా ఒప్పుకుంటే హార్మూజ్ జలసంధిని తెరవడానికి అభ్యంతరం లేదని ఇరాన్ స్పష్టంచేసింది. జలసంధిలో అమెరికా నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, తమ చమురు అమ్మకాలపై ఆంక్షలను రద్దు చేయాలని, లెబనాన్‌లో సైతం కాల్పుల విరమణ పాటించాలని తేల్చిచెప్పింది. అలా చేస్తే ఏడు రోజుల్లో హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తామని వెల్లడించింది. అలాగే తమ అణు కార్యక్రమంపై చర్చలను పునఃప్రారంభించడానికి ముందుకొచి్చంది. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం జరిగిన ఒక ప్రైవేట్ సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు తెలిసింది. ఈ సమావేశానికి హాజరైన క్విన్సీ ఇన్స్టిట్యూట్ థింక్ ట్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రిటా పార్సీ మాట్లాడుతూ.. నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌తో త్వరితగతిన ఒప్పందం కుదరడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సహాయపడుతుందని అరాగ్చీ అభిప్రాయపడినట్లు తెలిపారు. అరాగ్చీ తాజా ప్రతిపాదనపై ఇరాన్ ఐరాస మిషన్ గానీ, ఇతర ఇరాన్ అధికారులు గానీ ఇంకా స్పందించలేదు. అయితే, ఈ రాజీ మార్గాలను ఇరాన్ భద్రతా దళాలపై పట్టు కలిగిన పిడివాదులు అంగీకరిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఖతార్ ప్రధానమంత్రికి ఆతిథ్యం ఇచ్చారు. తాజాగా ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన పరోక్ష చర్చల సమయంలో ఖతార్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది. మరోవైపు ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిస్తుండడం గమనార్హం. -
అమెరికా, చైనా సంబంధాలు భేష్!
వాషింగ్టన్: అమెరికా, చైనా దేశాల సంబంధాలు ‘ఎన్నడూ లేనంత మెరుగ్గా’ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భవిష్యత్తు తరాలకు అభివృద్ధి, భద్రతలను అందించేందుకు ఇరుదేశాలు భవిష్యత్తులోనూ పరస్పర సహకారాన్ని బలపరచుకోవచ్చునన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం వైట్‌హౌస్ ఓవల్ అఫీసులో సుమారు రెండు గంటలపాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతరం ఇరువురు నేతలు విలేకరులతో మాట్లాడారు. అమెరికా–చైనా సంబంధాలు మరో చారిత్రక మలుపు వద్దకు చేరుకున్నాయని షీ తెలిపారు. ట్రంప్‌తో నిజాయతీగా, లోతైన చర్చలు జరిపామని, అనేక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని చెప్పారు. ఈ చర్చలు నిర్మాణాత్మక, వ్యూహాత్మకంగా స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త బలం చేకూర్చిందని వివరించారు. ఈ సందర్బంగానే ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను నేతలు ప్రస్తావించారు. చైనా దౌత్యవేత్తలు 158 ఏళ్ల క్రితమే బోస్టన్‌ను సందర్శించారని ట్రంప్ తెలపగా...రెండో ప్రపంచ యుద్ధంలో ఇరు దేశాల సహకారాన్ని షీ గుర్తుచేశారు. తైవాన్‌పై స్పష్టమైన హెచ్చరిక ఓవల్ ఆఫీసులో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో తైవాన్ అంశంపై చైనా తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికా జాగ్రత్తగా వ్యవహరించాలని షీ సూచించారు. కృత్రిమ మేధస్సు విషయంలో ఇరు దేశాలు తమ బలాలను సమర్థంగా వాడుకోవాలని సూచించారు. ఏఐతో రాగల ప్రమాదాలు, ప్రయోజనాలపై చర్చలు కొనసాగించడంతోపాటు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కలిసి పని చేయాలన్నారు. కృత్రిమ మేధస్సుపై మానవ నియంత్రణ కొనసాగాలని, ప్రజా సంక్షేమం కేంద్రంగా విధానాల రూపకల్పన జరగాలని చెప్పారు. ఏఐని మానవ ప్రగతికి ఉపయోగించేలా చూడాలని తెలిపారు. అధికారిక విందులో టెక్ దిగ్గజాలు... చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గౌరవార్థం వైట్‌హౌస్‌లోని ఈస్ట్‌రూమ్‌లో ఘనమైన విందు ఏర్పాటైంది. ఇరుదేశాల సంప్రదాయ వంటకాలతో నిండిన ఈ విందులోనే ట్రంప్ అమెరికా జాతీయ చిహ్నమైన గద్ద ప్రతిమను షీకి బహుకరించారు. విందుకు ఇరు దేశాల ప్రతినిధి బృందాల్లోని మంత్రులు, ఉన్నతాధికారులు ఐటీ కంపెనీల ప్రముఖులు హాజరయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈవో సుందర్ చాయ్, టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్రోత్రా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్, డెల్ అధినేత మైఖేల్ డెల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా, చైనా అధ్యక్షుల విందు సందర్భంగా కొంతమంది ఆందోళన కారులు వైట్‌హౌస్ సమీపంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టిబెట్‌కు స్వేచ్ఛ కల్పించాలని కొందరు, హాంకాంగ్, ఈస్ట్ తుర్కిస్థాన్ల స్వేచ్ఛపై మరికొందరు నినాదాలు చేశారు. మరికొంత మంది షీ అమెరికా పర్యటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. విందు మెనూ...ళీ విందులో గుమ్మడికాయ, పసుపులతో చేసిన సూప్, అడవి పుట్టగొడుగులు, పంది మాంసంతో చేసిన ఇటాలియన్ వంటకం పాన్సెట్టాలను స్టార్టప్‌లుగా వడ్డించారు. ప్రధాన వంటకాలుగా నువ్వుల సీ బాస్ చేప, బేబీ బక్చోయ్, వంకాయ, ప్రత్యేక సాస్‌లు ఏర్పాటు చేశారు. డెజర్ట్‌లుగా వెనీలా క్రీమ్యూ, పుల్లని చెర్రీ మిశ్రమం, వాల్నట్ ఫ్రాంజిపేన్, తేనెతో కూడిన ఐస్‌క్రీమ్‌ను అందించారు. అమెరికన్ విద్యార్థులకు ఆహ్వానంచైనాను సందర్శించేందుకు, చదువుకునేందుకు రానున్న ఐదేళ్లలో లక్షమంది అమెరికన్ విద్యార్థులను ఆహ్వానిస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్‌లో షీ మాట్లాడుతూ ఇరు దేశాల సంబంధాల భవిష్యత్తు యువతరంపై ఆధారపడి ఉందని అన్నారు. -
చైనా ముందుగా అడుగుపెడితే.. జరిగేది ఇదే..!
చంద్రుడిపై మరో అంతరిక్ష పోరుకు తెరలేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనా మధ్య పోటీ ఇప్పుడు భూకక్ష్య దాటి ఏకంగా చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరింది. అక్కడి విలువైన నీటి మంచు నిల్వలున్న ప్రాంతాలను ముందుగా ఎవరు చేజిక్కించుకుంటారన్నది కీలకంగా మారింది. చైనా ముందుగా అడుగుపెడితే.. కీలక ప్రాంతాల్లో అమెరికాకు ప్రవేశం లేకుండా చేసే పరిస్థితి రావొచ్చని నాసా చీఫ్ జారెడ్ ఐజాక్మన్ హెచ్చరించారు. హ్యూస్టన్‌లో జరిగిన ‘ఆఫ్ వరల్డ్’ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.చైనాకు చెందిన చాంగ్ఈ-7 మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువంలోని షాకిల్టన్ క్రేటర్‌ను లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ఎప్పటికీ సూర్యకాంతి పడని ప్రాంతాలు ఉన్నాయి. వీటిని ‘కోల్డ్ ట్రాప్స్’గా పిలుస్తారు. అక్కడ నీరు మంచు రూపంలో ఉండటంతో పాటు భవిష్యత్ చంద్ర పరిశోధనలకు ఉపయోగపడే ఇతర పదార్థాలు కూడా పేరుకుపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అయితే చైనా గత నెలలో చాంగ్ఈ-7 మిషన్‌ను వాయిదా వేసింది. ఈ మిషన్‌లో చంద్రుడి ఉపరితలంపై గతంలో లభించని స్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, మొబైల్ హాపర్ అనే నాలుగు రకాల రోబోటిక్ వాహనాలను ఉపయోగించనున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో మేం లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాన్నే వారు కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కొన్ని వారాల క్రితం చాంగ్ఈ-7 వాయిదా పడటం వల్ల మనం ఒక పెద్ద సమస్య నుంచి తప్పించుకున్నట్టే. ఆ మిషన్ షాకిల్టన్ క్రేటర్‌కు వెళ్లాల్సి ఉందని ఐజాక్మన్ పేర్కొన్నారు.చంద్రుడిపై చైనా ‘ఎక్స్‌క్లూజన్ జోన్లు’ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ఆందోళనలు అమెరికా అధికారుల్లో పెరుగుతున్నాయి. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే వాహనాల చుట్టూ భద్రతా నిబంధనల ప్రకారం సాధారణంగా 1 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రవేశ నిషేధ ప్రాంతం ఉండాల్సి ఉంటుంది. దీంతో ముందుగా అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్న దేశం.. ప్రత్యర్థి దేశాల ప్రవేశాన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడొచ్చని అమెరికా భావిస్తోంది.చాంగ్ఈ-7లో రోవర్లతో పాటు హాపర్ డ్రోన్లు కూడా ఉంటాయని ఐజాక్మన్ తెలిపారు. చంద్రుడిపై ఉన్న నీటి మంచుతో నేరుగా పని చేయడం.. దాని గురించి అధ్యయనం చేయడం చైనా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎవరు ముందుగా చంద్రుడిపైకి దిగుతారనే విషయంలో వెనుకబడితే.. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందంటూ ఐజాక్మన్ వ్యాఖ్యానించారు. చైనా చాంగ్ఈ-7 మిషన్‌ను వాయిదా వేయడంతో చంద్రుడి దక్షిణ ధ్రువానికి ముందుగా చేరుకునే అవకాశం ప్రస్తుతం నాసాకు కూడా లభించింది. బ్లూ ఆరిజిన్‌కు చెందిన ‘బ్లూ మూన్ మార్క్-1’ వాహనాన్ని తొలిసారిగా 2027లో ప్రయోగించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఈ భారీ ల్యాండర్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువానికి నాసాకు చెందిన రెండు ప్రోబ్స్ను పంపే అవకాశం ఉంది.చంద్ర పరిశోధనలో అగ్రశక్తిగా ఎదగడానికి చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. అంతరిక్ష రంగంలో చైనా పురోగతిని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‘చిరకాల కల’గా అభివర్ణించారు. 1972లో అమెరికా తర్వాత చంద్రుడిపై మనుషులను పంపే రెండో దేశంగా నిలవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపే లక్ష్యం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం -
లంచ్ బ్రేక్‌లో వచ్చిన అదృష్టం.. రూ.19 కోట్లు గెలిచిన మహిళ!
అమెరికాలోని వర్జీనియాకు చెందిన మహిళకు.. ఒక రోజు ఊహించని అదృష్టం కలిసొచ్చింది. ఆమె ఏకంగా 2 మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకుంది. సాధారణంగా.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలిస్తే ఎవరైనా ఆనందంతో ఉద్యోగానికి వెళ్లడం మానేసి, కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకుంటారు. కానీ ఈ మహిళ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది.ఆ రోజు ఆమెకు పని విషయంలో చాలా ఒత్తిడిగా అనిపించింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో ఏదైనా తినడానికి బయటకు వెళ్లిన ఆమె, అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలని అనుకుంది. అలా.. లవ్ ఫుడ్ మార్ట్ అనే షాపుకు వెళ్లి 20 డాలర్స్ పెట్టి “ప్లాటినం 7ఎస్” అనే స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.టికెట్ కొనుగోలు చేసి.. అక్కడే దానిని స్క్రాచ్ చేసి చూడగా, తాను కొనుగోలు చేసిన టికెట్‌కు ఏకంగా 2 మిలియన్ డాలర్ల (రూ.19 కోట్ల కంటే ఎక్కువ) జాక్‌పాట్ తగిలింది. ఒక్కసారిగా జీవితమే మారిపోయేంత డబ్బు గెలిచినా, ఆమె అక్కడ పెద్దగా హంగామా చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఆమె లంచ్ బ్రేక్ సమయం అయిపోతోంది!ఆమె టికెట్‌ను జాగ్రత్తగా తన దగ్గర పెట్టుకుని, ఏమీ జరగనట్టుగా తిరిగి తన ఉద్యోగానికి వెళ్లింది. అక్కడ మిగిలిన పనిని కూడా పూర్తి చేసింది. తరువాత వర్జీనియా లాటరీ అధికారులతో మాట్లాడుతూ.., “నేను తిరిగి పనికి వెళ్లి ఏమీ జరగనట్టుగా నటించాల్సి వచ్చింది” అని చెప్పింది.ఆమెకు బహుమతిని తీసుకునే సమయంలో రెండు అవకాశాలు ఇచ్చారు. 2 మిలియన్ డాలర్లను 30 సంవత్సరాల పాటు విడతలుగా తీసుకోవచ్చు లేదా ఒకేసారి నగదు రూపంలో తీసుకోవచ్చు. ఆమె ఒకేసారి నగదు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంత పెద్ద మొత్తంలో లాటరీ గెలుచుకున్నప్పటికీ.. ఆమె తన పేరును కూడా బయటకు వెల్లడించలేదు. వర్జీనియా చట్టం ప్రకారం, కొన్ని సందర్భాల్లో లాటరీ విజేతలు తమ పేరు, స్వస్థలం వంటి వివరాలను రహస్యంగా ఉంచుకోవచ్చు. ఆమె కూడా అదే విధానాన్ని ఎంచుకుంది.ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఆమె డబ్బు గెలుచుకోవడం కాదు. అంత మొత్తం గెలుచుకున్నప్పటికీ.. పని పూర్తి చేయడానికి ఆఫీసుకు వెళ్లడం. జీవితంలో ఒక్కసారిగా ఇంత పెద్ద అదృష్టం వచ్చినా, తన రోజువారీ బాధ్యతను పూర్తి చేసి ఇంటికి వెళ్లిన ఈ మహిళ కథ అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. ఆ తర్వాత ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసిందా లేదా అన్న విషయం మాత్రం తెలియలేదు.ఇదీ చదవండి: ఇలా ఎవరైనా లీవ్ అడుగుతారా?: హర్ష గోయెంకా ట్వీట్ -
శత్రువుల్లా కాదు.. భాగస్వాములుగా పనిచేద్దాం!
వాషింగ్టన్: అమెరికా, చైనాలు ప్రత్యర్థుల్లా కాకుండా భాగస్వాములుగా పనిచేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఇరుదేశాలు ఈ నవయుగంలో అందుకు తగ్గ మార్గాన్ని కనుక్కోగలవన్న ధీమాను వ్యక్తం చేశారు. అమెరికాలో మూడు రోజులపాటు పర్యటించనున్న జిన్‌పింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. మేరిల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో విమానం దిగిన జిన్‌పింగ్ దంపతులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భార్య మెలానియాలు స్వయంగా స్వాగతం పలికారు. అమెరికా రాక సందర్భంగా విడుదల చేసిన లిఖిత పూర్వక ప్రసంగంలో జిన్‌పింగ్ చైనా ప్రజల తరఫున అమెరికన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినట్లు జాతీయ వార్తా సంస్థ షిన్హువా తెలిపింది. ఆ ప్రసంగంలోనే జిన్‌పింగ్ ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు. అంతేకాకుండా..చైనా, అమెరికాలు ప్రత్యర్థులుగా కాకుండా.. భాగస్వాములుగా ఉండాలని, చైనా పునరుజ్జీవం, ‘మేకింగ్ అమెరికా గ్రేట్ ఎగెయిన్’(మాగా) అన్న రెండు లక్ష్యాలను కలిసి సాధించగలమని తద్వారా ప్రపంచ శ్రేయస్సును మెరుగుపరచగలమని జిన్‌పింగ్ తెలిపారు. సహకారమే పునాదిగా చైనా, అమెరికాలు పనిచేయాలని, పోటీని, భేదాభిప్రాయాలను తగ్గించుకోవాలని, శాంతికి పెద్దపీట వేయాలని షీ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. కాలం మారుతున్నా... ప్రపంచం వృద్ధి చెందుతున్నా చైనా, అమెరికాల మధ్య శాంతియుత సహజీవనం అన్న చారిత్రక తర్కంలో మాత్రం మార్పులేదని ఆయన తెలిపారు. అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలతోనూ సంప్రదింపులు జరిపి ఇరుదేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేస్తానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక, ఇతర అంశాలపై లోతైన చర్చలు జరపనున్నామని, వివిధ రంగాల్లో సహకారానికి పెద్దపీట వేస్తామని షీ హామీ ఇచ్చారు. ఈ చర్చలు ఫలప్రదమవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతికి సాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. షీ జిన్‌పింగ్ 2015 తర్వాత అమెరికా రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగే చర్చల్లో టారిఫ్ యుద్ధం, కృత్రిమ మేధస్సు, సైనిక సంబంధాలు, మధ్యప్రాచ్యం, రష్యా–ఉక్రెయిన్ల యుద్ధాలు, అంతరిక్ష ఆయుధపోటీ, తైవాన్‌కు అమెరికా ఆయుధాల వంటి అనేక అంశాలు చర్చకు రావచ్చునని అంచనా. ఈ ఏడాది మేలో ట్రంప్ చైనా పర్యటన సందర్భంగా చైనా, అమెరికాల మధ్య వ్యూహాత్మక స్థిరత్వం కోసం నిర్మాణాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునే విషయంపై ఏకాభిప్రాయం కుదిరిందని జిన్‌పింగ్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఈ నిర్ణయం మార్గదర్శకత్వం వహించిందన్నారు. ఘర్షణకు దిగితే నష్టపోతాం: జిన్‌పింగ్ అమెరికా పర్యటనలో భాగంగా గురువారం వైట్‌హౌస్‌కు చేరుకున్న చైనా అధినేత షీ జిన్‌పింగ్ దంపతులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు లాంఛనంగా స్వాగతం పలికారు. సైనిక బృందం సంగీతం వినిపిస్తుండగా, ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా వైట్‌హౌస్ సౌత్ పోర్టీకో వద్ద జిన్‌పింగ్, పెంగ్ లియువాన్‌లకు స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ‘బీస్ట్’వాహనానికి సమానమైన నలుపు రంగు హాంగ్కీ (రెడ్ ఫ్లాగ్) ఎన్701 కారులో చైనా అధినేత శ్వేతసౌధానికి విచ్చేశారు. వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశం ప్రారంభంలో ట్రంప్ కొద్దిసేపు మాట్లాడారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించడానికి మన ప్రజలు ఎలాగైతే కలిసి పనిచేశారో, అలాగే మన రెండు దేశాలకు మెరుగైన భవిష్యత్తును నిర్మించేందుకు అధ్యక్షుడు జిన్‌పింగ్, నేను కలిసి పనిచేయడం కొనసాగిస్తాం’’అని పేర్కొన్నారు. జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘‘చైనా, అమెరికా వంటి రెండు ప్రధాన దేశాలు సహకారం ద్వారా ప్రయోజనం పొందుతాయి. ఘర్షణకు దిగితే రెండూ నష్టపోతాయి’’అని స్పష్టంచేశారు. మనం పోటీ గురించి ప్రస్తావించడాన్ని మానుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ, ఆ పోటీ ఆరోగ్యకరమైనదిగా, హద్దులకు లోబడి ఉండాలని సూచించారు. ఇది ఒకరినొకరు అధిగమించేందుకు చేసే పోటీలా ఉండాలి తప్ప ఒకరు గెలిచి మరొకరు ఓడిపోయేలా సాగే కుస్తీ పోరులా ఉండకూడదని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. -
క్యాబ్ తలుపు తెరిచేలోపే తెలిసిన నిజం.. భారతీయుడి అనుభవం వైరల్
అమెరికాలో క్యాబ్ ప్రయాణం వేళ బధిర డ్రైవర్‌ను కలిసిన భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ ఖేతర్పాల్ తన అనుభవాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఆయన చేసిన పోస్టు సమాన అవకాశాలపై చర్చకు దారితీసింది.అమెరికాకు వెళ్లిన తర్వాత హోటల్‌కు చేరుకునేందుకు గౌరవ్ ఖేతర్పాల్ లిఫ్ట్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. క్యాబ్ వచ్చే ముందు ఆయనకు కేటాయించిన డ్రైవర్ బధిర వినికిడి లోపం ఉన్న వ్యక్తి అని యాప్‌లో సమాచారం కనిపించింది. ప్రయాణికుడితో సంభాషణ సులభంగా సాగేందుకు యాప్ తెరపై అమెరికన్ సంకేత భాషలోని ప్రాథమిక పదబంధాలను కూడా చూపించింది. ఇందులో ధన్యవాదాలు, హలో వంటి పదాలు ఉన్నాయి.క్యాబ్ అక్కడికి చేరుకున్న తర్వాత డ్రైవర్ తన పరిస్థితిని వివరిస్తూ ఓ చిన్న స్వాగత కార్డును గౌరవ్‌కు అందించారు. దీనిపై స్పందిస్తూ గౌరవ్.. “ఆయన తన పరిస్థితిని వివరిస్తూ, నన్ను స్వాగతిస్తూ ఓ కార్డు ఇచ్చారు. నేను సంకేత భాషలో ధన్యవాదాలు చెప్పాను” అని రాశారు.ఈ అనుభవాన్ని భారత్‌తో పోల్చిన గౌరవ్.. “వికలాంగుల విషయంలో భారత్‌లోనూ ఇలాంటి స్థాయి అవకాశాలు, గౌరవం ఎప్పుడు లభిస్తాయి? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి కోటా ఇవ్వడాన్ని దాటి ముందుకు వెళ్లగలమా?” అని ప్రశ్నించారు. అమెరికాలో కూడా అనేక సమస్యలు ఉండొచ్చని, అయితే వికలాంగతతో సంబంధం లేకుండా సమాన అవకాశాల కల్పనపై అక్కడి విధానం తనను ఆకట్టుకుందని పేర్కొంటూ.. “భారత్.. మనమంతా మరింత ముందడుగు వేయాలి” అన్నారు.ఈ పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు సంస్థలు వికలాంగులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను ప్రస్తావించగా, మరికొందరు బెంగళూరులో క్యాబ్ బుకింగ్ సమయంలో డ్రైవర్ వివరాలు కనిపిస్తాయని తెలిపారు. కొందరు విమానాశ్రయాల్లో బధిర సిబ్బంది సంకేత భాషను ఉపయోగిస్తున్న విషయాన్ని పంచుకున్నారు. మరికొందరు అత్యవసర పరిస్థితుల్లో భద్రతకు సంబంధించిన అంశాలపై సందేహాలు వ్యక్తం చేశారు.Landed in US, booked a cab from @lyft to go to my hotel & saw a note that my driver is deaf/ hard of hearing. The app also prompted me on how to use helpful American Sign Language phrases. And as it turns out, when the cab arrived, my driver was indeed deaf. He handed over a card stating so & welcoming me. And I said thank you in sign language. Will we ever have the same level of opportunity and respect for specially enabled people in India & go beyond just offering them a quota in Government jobs. There may be thousands of things wrong with the US & troll me for it but as a country, it truly does provide equal opportunity for all, regardless of disability. India, we all need to step up.— Gaurav Kheterpal (@gauravkheterpal) September 23, 2026 -
భారత సముద్ర మార్గం నుంచి అమెరికాపై దాడులు చేస్తాం : ఇరాన్
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలపై ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అమెరికా తమపై మళ్లీ దాడులకు దిగితే, ఈ యుద్ధాన్ని హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సీనియర్ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ హెచ్చరించారు.ఇరాన్‌ను నామరూపాలు లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు బదులుగా.. ఇరాన్ తన సైనిక వ్యూహాలను మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు పర్షియన్ గల్ఫ్, ఎర్రసముద్రంలోని హర్మూజ్ జలసంధి వరకే పరిమితమైన దాడులు.. భవిష్యత్తులో అమెరికా స్థావరాలు, యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని హిందూ మహాసముద్రం నుంచి తిప్పికొడతామని సఫావీ పేర్కొన్నట్లు ఇరాన్‌కు చెందిన ఫార్ న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసింది. అమెరికా కవ్వింపు చర్యలు, ఆర్థిక ఆంక్షలు, నౌకాశ్రయాల దిగ్బంధాన్ని తిప్పికొట్టేందుకే ఈ వ్యూహాత్మక మార్పు చేస్తున్నట్లు ఇరాన్ ఐఆర్జీసీ స్పష్టం చేసింది.భారత సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు సఫావీ హెచ్చరికలతో గల్ఫ్ ఆఫ్ ఓమన్, పర్షియన్ గల్ఫ్‌తో పాటు భారత సముద్ర భూభాగమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐరోపాను ఆసియాతో కలిపే బాబ్ అల్-మండెబ్ జలసంధి, ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ తదితర సముద్ర రవాణా మార్గాల్లో నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.భారత్‌పై ప్రభావం - దౌత్య యత్నాలు ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడితే భారత్ యొక్క ముడిచమురు దిగుమతులు, సముద్ర వాణిజ్య మార్గాలు తీవ్రంగా దెబ్బతింటాయి. వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్.. అంతర్జాతీయ జలాల్లో రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, దౌత్య మార్గాల ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది. మరోవైపు, ఇరాన్ బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు న్యూయార్క్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య తెరవెనుక చర్చలు కూడా కొనసాగుతుండటం గమనార్హం. -
ప్రోటోకాల్ దాటి.. జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన స్వాగతం
అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుదైన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ చేరుకున్న జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌లను ట్రంప్, ఆయన సతీమణి మెలానియా స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆహ్వానించారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత.. అమెరికా గడ్డపై ఓ విదేశీ నేతకు లభించిన అత్యంత అరుదైన స్వాగతంగా దీని గురించి చర్చ నడుస్తోంది.జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌లో జిన్‌పింగ్ విమానం దిగగానే రెడ్ కార్పెట్‌పైకి వచ్చిన ట్రంప్ దంపతులు ఆయనకు కరచాలనం చేసి స్వాగతం పలికారు. 21 మంది సభ్యులతో కూడిన గౌరవ వందనం, సైనిక బ్యాండ్, రెండు బి-1 బాంబర్ విమానాల విన్యాసంతో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ట్రంప్, జిన్‌పింగ్ కొద్దిసేపు మాట్లాడుకుని అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఈ మూడు రోజుల పర్యటనలో గురువారం వైట్‌హౌస్‌లో అధికారిక స్వాగత కార్యక్రమం, సైనిక పరేడ్, ద్వైపాక్షిక చర్చలు, స్టేట్ డిన్నర్ జరగనున్నాయి.Chinese President Xi Jinping and his wife, Peng Liyuan, were warmly greeted by U.S. President Donald Trump and his wife, Melania Trump, at the airport in a rare planeside welcome. pic.twitter.com/IoUSosQZ8d— Mulan Chun-Li (@chunlimulan) September 24, 2026ఓ విదేశీ నేతను అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో స్వయంగా స్వాగతించడం.. అదీ సుమారు ఆరు దశాబ్దాల తర్వాత కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ 1962లో పలువురు విదేశీ నేతలను వ్యక్తిగతంగా స్వాగతించారు. ఆ తర్వాత బుష్, ఒబామా కాలంలో పోప్లను మాత్రం స్వాగతించారు. పోటోకాల్ పేరిట అధ్యక్షుడిని మినహాయించి.. విదేశీ నేతలకు అధికార యంత్రాంగం వెల్కమ్ చెప్పటం అక్కడ ఆనవాయితీగా మారిపోయింది. అయితే జిన్‌పింగ్ కోసం ట్రంప్ ఇప్పుడు దానిని చెరిపేశారు.ఎందుకింత ప్రత్యేకం?అమెరికా అధ్యక్షులు సాధారణంగా విదేశీ నేతలను విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా ఆహ్వానించరు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఇలాంటి స్థాయి స్వాగతాలు అత్యంత అరుదు. జిన్‌పింగ్ పర్యటనకు ముందు ట్రంప్ అక్కడికి వెళ్లి స్వయంగా స్వాగతం పలకనున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించడంతోనే ఆసక్తి నెలకొంది.ఈ పర్యటనకు మరో ప్రత్యేకత ఉంది. 2015 తర్వాత అమెరికా రాజధానికి చైనా అధ్యక్షుడి తొలి స్టేట్ విజిట్ ఇది. అయితే 2023లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన అమెరికా–చైనా శిఖరాగ్ర భేటీ, APEC సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఇప్పుడు మాత్రం అధికారిక స్టేట్ విజిట్‌లో భాగంగా వాషింగ్టన్ చేరుకున్నారు. గత మేలో ట్రంప్ చైనాలో పర్యటించినప్పుడు జిన్‌పింగ్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనను కలవలేదు. ఈసారి మాత్రం ట్రంప్ స్వయంగా జిన్‌పింగ్‌ను స్వాగతించడం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్?జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టిన రోజే రెండు దేశాల మధ్య వాణిజ్య అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకారం.. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య సంధిని జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం నవంబర్‌లో ముగియాల్సి ఉంది. సుంకాలను తగ్గించడం, కొత్త వాణిజ్య ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సుంకాలు, అరుదైన ఖనిజాలు, చిప్స్, సాంకేతికత వంటి అంశాల్లో విభేదాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది.టేబుల్‌పై ట్రేడ్.. ఏఐ.. ఇరాన్.. తైవాన్ట్రంప్–జిన్‌పింగ్ భేటీలో వాణిజ్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కీలక అంశంగా ఉండనుంది. ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సాంకేతికతపై ఆందోళనలను చర్చించేందుకు ఇరు దేశాల మధ్య ప్రత్యేక కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటు చేసే అంశం కూడా ప్రాథమిక చర్చల్లోకి వచ్చింది.అరుదైన ఖనిజాల సరఫరా కూడా కీలకంగా మారింది. ఎలక్ట్రానిక్స్ నుంచి సైనిక పరికరాల వరకు అనేక రంగాలకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనాకు ఉన్న ఆధిపత్యం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కీలక చిప్స్, ఇతర సాంకేతిక ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ఎగుమతి నియంత్రణలను చైనా వ్యతిరేకిస్తోంది.ఇరాన్ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఇరాన్‌తో చైనా సంబంధాలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిణామాలు, తైవాన్ అంశాలపై రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మూడు రోజుల పర్యటనలో అసలు చర్చలు గురువారం జరిగే ట్రంప్–జిన్‌పింగ్ సమావేశంపైనే కేంద్రీకృతం కానున్నాయి.భారీ ఏర్పాట్లు.. టెక్ దిగ్గజాలతో విందుజిన్పింగ్ పర్యటనలో భాగంగా గురువారం వైట్‌హౌస్‌లో స్టేట్ డిన్నర్ నిర్వహించనున్నారు. ఇందులో అమెరికా టెక్ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఏఐ, చిప్స్, టెక్నాలజీ రంగాల దిగ్గజాల హాజరు ఈ విందుకు మరింత ప్రాధాన్యతను తెచ్చింది.శుక్రవారం జిన్‌పింగ్, పెంగ్ లియువాన్లు ట్రంప్ దంపతులతో వైట్‌హౌస్‌లో టీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అమెరికా చరిత్రకు సంబంధించిన కీలక పత్రాలు భద్రపరిచిన నేషనల్ ఆర్కైవ్స్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి జిన్‌పింగ్ తిరుగు ప్రయాణం కానున్నారు.అమెరికా–చైనా మధ్య వాణిజ్య, సాంకేతిక, భౌగోళిక రాజకీయ విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. అయితే చర్చల ద్వారా సంబంధాలను అదుపులో ఉంచి, మరోసారి పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయకుండా చూడాలన్న ప్రయత్నం మాత్రం ఈ పర్యటనలో స్పష్టంగా కనిపిస్తోంది. -
అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు!
ఐక్యరాజ్యసమితి: అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగిపోదని, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. సంఘర్షణను ముగించడానికి దౌత్యమే ఏకైక మార్గమని స్పష్టంచేశారు. దాడులకు ప్రతిస్పందించే హక్కు ఇరాన్‌కు ఉందన్నారు. తమ చట్టబద్ధమైన హక్కులను ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించారు. శాంతియుత అణు సాంకేతికతను పొందడం ఇరాన్ హక్కు అని ఉద్ఘాటించారు. పౌర వినియోగ అణు కార్యకలాపాలకు, అణ్వాయుధాల తయారీకి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు. శాంతియుత అణు సాంకేతికతపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన మానుకోవాలని సూచించారు. ఇతర దేశాల అనుమతితో సంబంధం లేకుండా తమను తాము రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ఇరాన్ ఎవరి అనుమతీ కోరబోదని పేర్కొన్నారు. అణు తనిఖీల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పెజెష్కియన్ ప్రశ్నించారు. ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు, ఇతర ఆయుధ సామర్థ్యాలు ఉండగా, ఇరాన్ మాత్రం అంతర్జాతీయ తనిఖీల కోసం ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆక్షేపించారు. అణ్వాయుధాలు ఇజ్రాయెల్ చేతిలో ఉండగా, తనిఖీలు చేస్తామంటూ ఇరాన్‌ను వేధిస్తున్నారని విమర్శించారు. హార్మూజ్ జలసంధి గుండా ఇరాన్ నౌకల రాకపోకలకు ఇతర దేశాలు అడ్డుకుంటున్నాయని ఆరో పించారు. హార్మూజ్ వల్ల తమకు ప్రయోజనం లేనప్పుడు ఇతర దేశాలు కూడా ప్రయోజనం పొందడానికి వీల్లేదన్నారు. ఈ జలసంధిలో శత్రుదేశాల నౌకాదళాలను శాశ్వతంగా మోహరించడం, యుద్ధాన్ని విస్తరించడం వల్ల మనం ఆశించిన శాంతి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బుధవారం పెజెస్కియాన్ ప్రసంగించారు. ఇరాన్ తన పొరుగు దేశాలను ప్రత్యర్థులుగా పరిగణించదని, బలమైన పొరుగు దేశాలు ఉండాలని కోరుకుంటోందని తెలిపారు. టెహ్రాన్‌పై సైనిక చర్యకు మద్దతు ఇస్తున్న ఇతర దేశాలు ఈ జలమార్గాన్ని ఉపయోగించుకోవడాన్ని తాము అంగీకరించబోమని వెల్లడించారు. అమాయక విద్యార్థులను చంపడం ఏమిటి? ఇరాన్ ఒక ఉగ్రవాద దేశం అంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. తాము ఉగ్రవాదులం కాదని.. ముమ్మాటికీ ఉగ్రవాద బాధితులమని తేల్చిచెప్పారు. ఇరాన్ స్వయంగా ఉగ్రవాదానికి లక్ష్యంగా మారిందని అన్నారు. ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. మినాబ్ పాఠశాలపై అమెరికా–ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ఫొటోలను కూడా ప్రదర్శించారు. ఈ రాక్షసకాండలో అమాయక చిన్నారులు బలైపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ ఇరాన్ పౌరులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, జనరల్ అసెంబ్లీలో పెజెష్కియాన్ మాట్లాడుతుండగా అమెరికా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. అస్థిరతకు మేము కారణం కాదు ప్రత్యర్థి దేశాలు తమ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు సహా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారని పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంపై జరుగుతున్న పిరికిపంద దాడులకు సాధారణ ప్రజలే లక్ష్యమయ్యారని ఆక్షేపించారు. ప్రత్యర్థులపై ఇరాన్ సైన్యం చేస్తున్న ప్రతిదాడులను సమర్థించుకున్నారు. ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని చెప్పారు. తమ పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని తమ దళాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. తాము ప్రతిస్పందిస్తున్నాం తప్ప ఇతర దేశాల్లోని సాధారణ పౌరులను ఏనాడూ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. గాజాలోని పరిస్థితిని సైతం ప్రస్తావించారు. అస్థిరతకు తాము కారణం కాదన్నారు. స్వతంత్రంగా జీవించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు.అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ చర్చల్లో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు జేర్డ్ కుష్నర్ పాల్గొనగా, ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశం ‘చాలా ఫలవంతమైనది’గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివరి్ణంచారు. అయితే, ఈ చర్చల ఫలితంగా అమెరికా, ఇరాన్ మధ్య తక్షణ ఒప్పందం గానీ, శాంతి సాధనలో పురోగతి గానీ కనిపించలేదు. -
ఇరాన్ వెన్ను విరిచేలా.. భారత్ అండతోనే ట్రంప్ మాస్టర్ ప్లాన్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్‌కు అండగా నిలిచారు. ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనమిక్ కారిడార్’(IMEC)కు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఐరాస సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్‌తో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ చెక్పాయింట్లు, హర్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల ద్వారా కాకుండా, పైప్లైన్లు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు రవాణాను సురక్షిత ప్రాంతాలకు మార్చడానికి ఈ కారిడార్ ఎంతగానో దోహదపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.దశాబ్ద కాలంగా ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లను అధిగమించే దశలో మనం ఉన్నాం అని పునరుద్ఘాటించారు.జీ20 ఒప్పందం ఇదే..ప్రపంచ చమురు బాండాగారమైన సౌదీ అరేబియా నుంచి భారత్, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాలు సంయుక్తంగా రైలు, నౌకాయాన, ఇంధన, డిజిటల్ రంగాలను అనుసంధానించేలా 2023 సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో ఈ కారిడార్ ఒప్పందం కుదిరింది.వ్యూహాత్మక ప్రత్యామ్నాయం..ఈ కారిడార్ దక్షిణాసియా, పశ్చిమాసియా, ఐరోపా అంతటా అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. చైనాకు చెందిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ అలాగే ఇరాన్ నియంత్రిత చెక్పాయింట్లకు ఇది బలమైన ప్రత్యామ్నాయంగా నిలవడమే కాకుండా, భారత్-ఐరోపా మధ్య రవాణా సమయాన్ని సగానికంటే ఎక్కువగా తగ్గించగలదని భావిస్తున్నారు.ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు..ఐరాస సర్వసభ్య సమావేశంలో ఇరాన్‌ను ఆర్థికంగా ఏకాకి చేశామని, తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఇరాన్ ఒక దేశంగా మనుగడ కొనసాగించే అవకాశాన్ని కోల్పోతుందని ట్రంప్ హెచ్చరించారు. గతంలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్నైట్ హామర్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. -
ట్రంప్‌కు హిస్పానిక్ ఓటర్ల షాక్.. అమెరికా రాజకీయాల్లో సంచలన మార్పులు
-
‘రెండుసార్లు’ జన్మించిన శిశువు! మెడికల్ మిరాకిల్
కొన్ని సంఘటనలు, అరుదైన వ్యాధులు విసిరే సవాళ్లు ఆధునిక వైద్యనికే అంతుచిక్కదు. ఒక్కోసారి ఆ సవాళ్లే కొంగొత్త వైద్య ఆవిష్కరణాలను నాంది పలికి..ఎందరినో ఆ అనారోగ సమస్యల నుంచి బయపడేసేందుకు దారితీస్తుంది. బతికే అవకాశాలు లేనప్పుడూ కూడా వైద్యానికే అందని విధంగా మిరాకిల్ జరిగి మరి జీవిస్తున్న ఎన్నో అద్భుతాలను చూశాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటన అంతకుమించిన మిరాకిల్ ఘటన. ఒక్కసారే ఎవ్వరైన జన్మిస్తాం..కానీ ఈ శిశువు ఏకంగా రెండుసార్లు జన్మించింది. బహుశా ఇదే వైద్యశాస్త్రంలోని అత్యంత అరుదైన ఘటనేమో..!.అసలేం జరిగిందంటే..2016లో ఒక అత్యంత అరుదైన కేసుని ఎదుర్కొన్నారు అమెరికా వైద్యులు. టెక్సాస్‌కి చెందిన మార్గరెట్ బోమర్ సాధారణ ప్రెగ్నెన్సీ చెకప్‌కి వెళ్లింది. ఎప్పటిలానే ఆరోజు పరీక్షలు చేయించుకుంది. స్కానింగ్ ఆమె గర్భంలోని శిశువు వెనుముక చివరలో శాక్రోకాక్సిజియల్ టెరాటోమా అనే అరుదైన కణితి అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగా ఆ శిశువు మనుగడ సాగించడం కష్టమని తేల్చేశారు. ఎందుకంటే ఆ కణితి..పిండానికి అందాల్సిన రక్తాన్ని దారిమళ్లిస్తోంది. ఫలితంగా ఆ ఒత్తిడి గుండెపై పడి గుండె వైఫల్యానికి దారితీసే ప్రమాదిన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అంటే ఆ శిశువు 26 వారాల రాక మునుపే గర్భంలో చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆ విషయం తెలిసి ఆ మహిళ తీవ్ర ఆందోళనకు గురైంది. ఆమెకు ఇది అత్యంత భయాన ఉద్విగ్న క్షణం ఎందుకంటే. అసలు నిజానికి ఆమె గర్భంలో కవలలు పెరిగారు. అందులో ఒక శిశువు రెండో నెలలోనే గర్భస్రావం అయ్యింది. పోనీలే మరో శిశువు ఆరోగ్యంగా పెరుగుతోంది కదా అనుకుంటే ..మళ్లీ ఇలాంటి విషయం వినడంతో మరింతగా హడలిపోయింది మార్గరేట్. చాలామంది వైద్యులు గర్భం తొలగించుకోవాల్సిందే సూచించారు. ఎందుకంటే ఆ కణితిని అతి కష్టంపై సర్జరీ ద్వారా తొలగించినా..ఆ చిన్నారి బతికే అవకాశాలు 50% మాత్రమే అని తేల్చేశారు వైద్యలు. అయితే మార్గరేట్ ఆమె భర్త ఆమెను ఎలాగైనా బతికించుకోవాలనే నిర్ణయానికి వచ్చి.. టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని ఒక ప్రత్యేక శస్త్రచికిత్స బృందాన్ని ఆశ్రయించారు. అక్కడ పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడే..నేరుగా శస్త్ర చికిత్స చేసి..తిరిగి గర్భం కొనసాగేలా ఆ పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టే ప్రమాదకరమైన ప్రక్రియ గురించి వైద్యలు ఆమెకు వివరించారు. 23 వారాల గర్భం నాటికే ప్రమాదం తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో..తక్షణమే గుండె పనితీరుని దెబ్బతీస్తున్న ఆ కణితిని తొలగించే సర్జరీ చేశారు. అరచేతిలో ఇమిడిపోయే అత్యంత చిన్న పిండాన్నే గాల్లో ఉంచే కణితిని తొలగించారు. చెప్పాలంటే..ఆపరేషన్ జరుగుతున్నంత సేపు గుండె ఆగిపోయింది. అయితే హార్ట్ సర్జన్ ఆ శిశువుని బతికించారు. ఆ శస్త్ర చికిత్స సమయంలోనే ఆక్సిజన్ని ప్లాసెంటా ద్వారా తల్లికి అనుసంధానించారు. అలా కణితిని తొలగించి..ఆ ఆడ శిశువుని తిరిగి గర్భంలోని ప్రవేశపెట్టి..శరీరంలో ద్రవాల సమతుల్యత పునరుద్ధరించి..గర్భాశయాన్ని పూర్తిగా కుట్టువేసి మూసివేశారు. అంతేగాదు మార్గరేట్ని కఠినమైన విశ్రాంతిలో ఉంచి ఆ శిశువు గర్భంలో ఆరోగ్యంగా పెరిగేలా చేశారు. అలా 36 వారాల అనంతరం రెండోసారి సీ సెక్షన్ ద్వారా ఆ శిశువుని బయటకు తీశారు. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. ఆ చిన్నారి సుమారు 2.41 గ్రాముల ఆరోగ్యకరమైన బరువుతో ఉండటం విశేషం. ఆ చిన్నారి బయటకొచ్చిన ఎనిమిది రోజులకు వెన్నుముక చివరి ఎముక కణజాలన్ని శుభ్రం చేసేందుకు ఒక సాధారణ ఆపరేషన్ చేశారు. ఆ అద్భుత శిశువుకి లిన్లీ హూప్ అని పేరు పెట్టారు. సదరు తల్లి మార్గరేట్ మాత్రం ఇది అద్భుతమైన భయానక క్షణంగా పేర్కొంది. ఎందుకంటే క్షణం, క్షణం ఉత్కంఠ..బతికించుకోగలనా అన్న సందేహాల మధ్య సాగిన గర్భధారణ అని అంటోందామె.ఇదీ చదవండి: Shruti Haasan: ఎప్పటికీ తల్లిని కాలేననుకున్నా..!: శ్రుతి హాసన్ -
నెతన్యాహు Vs మమ్దానీ.. సిగ్గుపడాలి అంటూ..
న్యూయార్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించేందుకు నెతన్యాహు న్యూయార్క్ చేరుకోనున్న వేళ.. మమ్దానీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్దానీ హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని, న్యూయార్క్‌లో యూదులకు వ్యతిరేకంగా అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు.మమ్దానీ సోమవారం సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహును ‘వార్ క్రిమినల్’, పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న దారుణాలను ‘జెనోసైడ్కు ఆర్కిటెక్ట్’గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెతన్యాహు వీడియో సందేశంలో.. ‘నేను ఐక్యరాజ్యసమితికి వస్తున్నాను. మా వీరోచిత సైనికుల గురించి నిజం చెబుతాను. మీ గురించి కూడా నిజం చెబుతాను’ అని అన్నారు. ఇదే సమయంలో మమ్దానీని ఉద్దేశించి నెతన్యాహు మరింత ఘాటుగా స్పందించారు. ‘షేమ్ ఆన్ యూ, మిస్టర్ మమ్దానీ. మా ప్రజలను హతమార్చిన హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నందుకు సిగ్గుపడాలి. న్యూయార్క్ యూదులకు వ్యతిరేకంగా అల్లర్లను ప్రేరేపిస్తున్నందుకు సిగ్గుపడాలి’ అని వ్యాఖ్యానించారు.అయితే, ఈ వివాదం కొత్తది కాదు. గతంలో నెతన్యాహును న్యూయార్క్‌లోకి వస్తే అరెస్టు చేస్తానని మమ్దానీ వ్యాఖ్యానించారు. అయితే, అలాంటి అరెస్టు చేసే అధికార పరిధి తనకు వాస్తవంగా ఉందో లేదో స్పష్టత లేదని ఆయన తర్వాత అంగీకరించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) నెతన్యాహుపై జారీ చేసిన అరెస్టు వారెంట్ నేపథ్యంలో మమ్దానీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఆరోపణలను తిరస్కరించిన మమ్దానీమమ్దానీపై కొంతమంది రిపబ్లికన్ ప్రత్యర్థులు గతంలో యూదు వ్యతిరేకత ఆరోపణలు చేశారు. పాలస్తీనా అనుకూల వైఖరి, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ఆయన విమర్శలను ఇందుకు ఉదాహరణగా చూపారు. అయితే మమ్దానీ ఈ ఆరోపణలను తిరస్కరించారు. యూదు వ్యతిరేకతను తాను ఖండించానని, ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలపై విమర్శలను యూదులపై ద్వేషంతో ముడిపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. జూలైలోనూ నెతన్యాహు మమ్దానీపై విమర్శలు చేశారు. న్యూయార్క్ మేయర్‌గా అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించాల్సిన ఆయన.. ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా నిలబెడుతున్నారని ఆరోపించారు.ట్రంప్, మమ్దానీ భేటీ..ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ భేటీ అయ్యారు. గ్రేసీ మాన్షన్‌లో జరిగిన ఈ సమావేశంలో న్యూయార్క్‌లో గృహ నిర్మాణం, జీవన వ్యయం, వలసదారుల సమస్యలు, పోలీసింగ్ తదితర అంశాలపై చర్చించారు. క్వీన్స్‌లోని సన్నీసైడ్ యార్డ్స్‌లో సుమారు 12 వేల అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణం, 30 వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుపై ఇరు వర్గాలు తదుపరి చర్చలు జరపాలని నిర్ణయించాయి. గతంలో ట్రంప్, మమ్దానీ మధ్య తీవ్ర విమర్శలు జరిగినప్పటికీ.. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ న్యూయార్క్‌కు మమ్దానీ గొప్ప మేయర్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అంశాల్లో అధ్యక్షుడితో కలిసి పనిచేస్తానని మమ్దానీ చెప్పారు.ఇదీ చదవండి: ఇరాన్‌తో మూడు గంటలు చర్చలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్ -
ఆ ప్రాంతంలో ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్లు.. ఇక 60 రోజులు ఉత్కంఠ
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా తీరంలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా తీరంలో ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు తొలిసారి గుడ్లు పెట్టింది. అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థ (ఎన్ఓఏఏ) ప్రకారం.. అమెరికా పశ్చిమ తీరంలో సముద్ర తాబేలు సహజంగా గూడు కట్టుకుని గుడ్లు పెట్టిన తొలి ఘటన ఇదే.ఆరెంజ్ కౌంటీలోని సీల్ బీచ్ సమీపంలో సెప్టెంబర్ 16న ఆలివ్ రిడ్లీ తాబేలు ఇసుకలో గూడు తవ్వి గుడ్లు పెట్టినట్లు గుర్తించారు. సాధారణంగా ఈ తాబేళ్లు దక్షిణ కాలిఫోర్నియా సముద్ర జలాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. వెచ్చని సముద్ర ప్రవాహాల కారణంగా అవి ఈ ప్రాంతానికి చేరుకుంటాయని ఎన్ఓఏఏ తెలిపింది. అయితే అమెరికాలోనే ఇంతకుముందు ఈ జాతి తాబేలు గూడు కట్టుకుని గుడ్లు పెట్టిన దాఖలాలు లేవు.సీల్ బీచ్‌లో ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత, కొన్ని మైళ్ల దక్షిణాన హంటింగ్టన్ బీచ్ పియర్ సమీపంలో మరో సముద్ర తాబేలు తీరానికి వచ్చినట్లు గుర్తించారు. అది సీల్ బీచ్‌లో గుడ్లు పెట్టిన అదే తాబేలేనా, లేక మరో తాబేలేనా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.60 రోజుల వరకు గుడ్లపై నిఘాతాబేలు గుడ్లు పొదిగే కాలం సాధారణంగా 45 నుంచి 60 రోజుల వరకు ఉంటుంది. స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాయి. గుడ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గూడు ఉన్న ప్రాంతాలను కంచెతో చుట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తీరానికి వచ్చే ప్రజలు సురక్షిత దూరం పాటించాలని, కంచెలు లేదా హెచ్చరిక బోర్డులను తాకవద్దని ఎన్ఓఏఏ సూచించింది.ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ప్రపంచంలోని సముద్ర తాబేళ్లలో అతి చిన్న జాతిగా గుర్తింపు పొందాయి. పెద్ద తాబేళ్లు 100 పౌండ్ల వరకు బరువు, సుమారు 2.5 నుంచి 3 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి దాదాపు 30 నుంచి 50 ఏళ్ల వరకు జీవిస్తాయి. పసిఫిక్ ప్రాంతంలో మెక్సికో, నికరాగువా, కోస్టారికా, పనామా దేశాల్లో వీటి ప్రధాన గూడు ప్రాంతాలు ఉన్నాయి. కాలిఫోర్నియాలో ఇకపై మరిన్ని తాబేళ్ల గూళ్లు కనపడతాయా? ప్రస్తుతం ఉన్న గుడ్ల నుంచి పిల్లలు విజయవంతంగా బయటకు వస్తాయా? అనే అంశాలపై అధికారులు వచ్చే 45-60 రోజుల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. -
రణమా? శరణమా?.. ఐరాస వేదికగా ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన షరతులకు ఇరాన్ ఒప్పుకోవాలని, లేదంటే ప్రపంచ పటం నుంచి ఇరాన్‌ను తుడిచేయాలా? అని హెచ్చరించారు.న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 81వ సాధారణ మహాసభల్లో ఇరాన్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ట్రంప్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను కలకలం రేపుతున్నాయి. ప్రపంచ దేశాలు తీవ్ర భయాందోళనలోకి గురవుతున్నాయి. ఐరాస వేదికగా ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలా? లేక ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టేయాలా?’అని హెచ్చరించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో (మిడిల్ ఈస్ట్) ఇకపై ఇరాన్ ఆటలు సాగవు. ఆ ప్రాంతాన్ని శాసించే దుర్మార్గపు దాదాగిరికి తాము ఇప్పటికే చరమగీతం పలికాం. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ సాగిస్తున్న దౌర్జన్యాలు, ఆధిపత్య ధోరణి పూర్తిగా ముగిసిపోయాయని తేల్చిచెప్పారు. ట్రంప్ చేసిన ఈ హెచ్చరికలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే దానిపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. -
భారత్ నుంచి అమెరికా వరకు.. టెక్నాలజీ రంగంలో కిరణ్ కుమార్ కక్కిరేని విజయ ప్రస్థానం!
భారతదేశంలో ఒక Linux Administratorగా ప్రారంభమైన కెరీర్... కాలంతో పాటు కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ DevOps, AWS, Cloud Computing, Automation రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకున్న ప్రయాణం... చివరకు అమెరికాలోని టెక్నాలజీ రంగంలో నాయకత్వ స్థాయికి చేరుకోవడం. ఇది కిరణ్ కుమార్ కక్కిరేని ప్రొఫెషనల్ జర్నీ.ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న Equinox IT Solutions LLCలో Chief Technology Officer (CTO)గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్, తన కెరీర్లో Cloud Computing, AWS, DevOps, Infrastructure Automation వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.కిరణ్ ప్రయాణానికి పునాది భారతదేశంలోనే పడింది. Electronics and Communicationsలో బ్యాచిలర్ విద్య అనంతరం IT రంగంలోకి ప్రవేశించిన ఆయన, తన కెరీర్ ప్రారంభంలో Linux Administrationపై పనిచేశారు. Servers, application environments, deployment processes, networking, system administration వంటి అంశాలపై సంపాదించిన అనుభవం తర్వాతి దశలో DevOps, automation, cloud technologies వైపు అడుగులు వేయడానికి పునాదిగా మారింది.Linux నుంచి DevOps వరకుసాఫ్ట్వేర్ రంగంలో మారుతున్న అవసరాలను ముందుగానే గుర్తించిన కిరణ్, సంప్రదాయ system administrationకే పరిమితం కాకుండా automation, build and release engineering, Continuous Integration, Continuous Delivery వంటి అంశాలపై దృష్టి పెట్టారు.Jenkins, Ansible, Terraform, Docker, Kubernetes వంటి technologiesతో పాటు CI/CD practicesపై పనిచేస్తూ, software development మరియు IT operations మధ్య automation ఎంత కీలకమో తన కెరీర్లో ప్రత్యక్షంగా చూశారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం Cloud Computing వైపు మళ్లింది.AWSలో EC2, S3, VPC, IAM, RDS, DynamoDB, Lambda, CloudWatch, Auto Scaling, CloudFormation, ECS, SageMaker వంటి విభిన్న servicesతో పనిచేసిన అనుభవంతో scalable, reliable, automated cloud environments నిర్మాణంపై తన expertiseను విస్తరించారు.అమెరికాలో ఉన్నత విద్య... టెక్నాలజీలో తదుపరి అడుగుతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకునే క్రమంలో కిరణ్ అమెరికాలో Computer Science Engineeringలో Master's degree పూర్తి చేశారు. విద్యతో పాటు industry exposure ఆయనకు enterprise-scale technology challengesను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం కల్పించింది.తర్వాతి సంవత్సరాల్లో cloud migration, infrastructure automation, application deployment, monitoring, security, high availability, machine learning infrastructure వంటి విభిన్న రంగాల్లో పనిచేస్తూ తన professional expertiseను విస్తరించుకున్నారు. ఈ ప్రయాణమే చివరకు ఆయనను Equinox IT Solutions LLCలో CTO స్థాయికి తీసుకెళ్లింది.AIతో మారుతున్న DevOps ప్రపంచంపై ప్రత్యేక దృష్టికిరణ్ ఆసక్తి ప్రస్తుతం సంప్రదాయ DevOpsతోనే ఆగిపోలేదు. Artificial Intelligence, Machine Learning మరియు DevOps కలయిక భవిష్యత్తులో IT operationsను ఎలా మార్చబోతోందనే అంశంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.Predictive monitoring, intelligent CI/CD, automated testing, anomaly detection, infrastructure optimization, AI-assisted incident management వంటి technologies భవిష్యత్తులో DevOps teams పనిచేసే విధానాన్ని గణనీయంగా మార్చగలవని ఆయన అభిప్రాయపడుతున్నారు.ఈ అంశాన్నే మరింత విస్తృతంగా professionalsకు అందించేందుకు కిరణ్ “AI-Powered DevOps” పేరుతో పుస్తకాన్ని రచించారు. AI మరియు DevOps కలయిక, intelligent automation, CI/CD, machine learning ఆధారిత infrastructure management, ChatOps, monitoring, security automation, responsible AI వంటి అంశాలను ఈ పుస్తకం చర్చిస్తుంది.అంతర్జాతీయ వేదికపై గుర్తింపులుTechnology రంగంలో తన ప్రయాణంతో పాటు professional communityతో అనుసంధానాన్ని కొనసాగిస్తున్న కిరణ్ IEEEలో Active Memberగా ఉన్నారు. అలాగే ఆయనకు DevOps Distinction Award 2024, Best Employee of the Year 2023, CTO of the Year by Radio City, Asian Research Excellence Award వంటి గుర్తింపులు లభించినట్లు ఆయన ప్రొఫైల్ పేర్కొంటోంది.ఈ గుర్తింపులతో పాటు Cloud Computing, AWS, DevOps, AI-driven automation వంటి రంగాలపై తన professional knowledgeను articles, research-related activities మరియు technology discussions ద్వారా విస్తరించే దిశగా ఆయన కొనసాగుతున్నారు.భారత యువతకు ఒక సందేశంకిరణ్ ప్రయాణంలో కనిపించే ముఖ్యమైన అంశం నిరంతర అభ్యాసం. Linux Administrationతో ప్రారంభమైన కెరీర్ DevOpsకు, అక్కడి నుంచి Cloud Computingకు, ఇప్పుడు AI-powered infrastructure వరకు విస్తరించింది. Technology రంగంలో ఒక skill నేర్చుకోవడం మాత్రమే విజయానికి సరిపోదని, మారుతున్న technology ecosystemకు అనుగుణంగా నిరంతరం నేర్చుకోవడం అవసరమనే విషయాన్ని ఆయన కెరీర్ ప్రయాణం సూచిస్తుంది.భారతదేశంలో కెరీర్ ప్రారంభించి, అంతర్జాతీయ technology ecosystemలో తనకంటూ ఒక professional identity నిర్మించుకున్న కిరణ్ కుమార్ కక్కిరేని ప్రయాణం.. ప్రత్యేకంగా Cloud, DevOps, AI వంటి emerging technologiesలో కెరీర్ నిర్మించుకోవాలని ఆశించే యువ professionalsకు ఒక ఆసక్తికరమైన ఉదాహరణగా నిలుస్తోంది.Linux Administratorగా మొదలైన ప్రయాణం నుంచి CTO వరకు, traditional infrastructure నుంచి AI-Powered DevOps వరకు కిరణ్ కుమార్ కక్కిరేని కెరీర్ మారుతున్న టెక్నాలజీతో పాటు మన నైపుణ్యాలు కూడా మారుతూ ఉండాలనే సందేశాన్ని ప్రతిబింబిస్తోంది. -
ఐరాస సమావేశాల వేళ.. అమెరికా ఆకాశంలో గందరగోళం
అమెరికాలో విమాన రాకపోకలు ఒక్కసారిగా స్తంభించాయి. న్యూయార్క్ ప్రాంతంలోని కీలక విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దుకాగా.. వేలాది ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు చేరుకుంటున్న సమయంలోనే ఈ అంతరాయం కలగడం ఒక్కసారిగా కలకలం రేపింది.ఈశాన్య ప్రాంతంలో ఫిలడెల్ఫియాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో కీలక కమ్యూనికేషన్ సర్క్యూట్ విఫలమవడంతో ఈ సమస్య మొదలైంది. విమానాల రాకపోకలను సమన్వయం చేయడంలో కీలకమైన ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడటంతో ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణపై ప్రభావం పడింది. దీంతో న్యూయార్క్ పరిసరాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నెమ్మదించాయి. ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించాల్సిన బ్యాకప్ ఫైబర్ ఆప్టిక్ లైన్ కూడా నిర్మాణ పనుల కారణంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన కమ్యూనికేషన్ సర్క్యూట్ విఫలమైన సమయంలో బ్యాకప్ లైన్ అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.ఒకదాని తర్వాత ఒకటి..ఫిలడెల్ఫియాలోని ఎఫ్ఏఏ కేంద్రంలో సోమవారం ఉదయం కీలక కమ్యూనికేషన్ సర్క్యూట్ పనిచేయడం ఆగిపోయింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బ్యాకప్ వ్యవస్థ పనిచేయాలి. కానీ అధికారులు దానిని ఉపయోగించేందుకు ప్రయత్నించగా.. న్యూజెర్సీలోని న్యూ బ్రన్స్విక్–నెవార్క్ మధ్య ఉన్న బ్యాకప్ ఫైబర్ ఆప్టిక్ లైన్ కూడా నిర్మాణ పనుల సమయంలో కట్ అయినట్లు గుర్తించారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయింది.ఎఫ్ఏఏ అడ్మినిస్ట్రేటర్ బ్రయాన్ బెడ్ఫోర్డ్ ప్రకారం.. ఫైబర్ లైన్‌ను మరమ్మతు చేయడానికి సుమారు 13 గంటలు పట్టింది. మరోవైపు ప్రధాన సర్క్యూట్‌కు కొత్త లైన్‌ను ఏర్పాటు చేసే పనులు కూడా చేపట్టారు.వేలాది విమానాలు రద్దు!ఈ సాంకేతిక సమస్య ప్రభావం న్యూయార్క్‌లోని మూడు ప్రధాన విమానాశ్రయాలపై పడింది. జాన్ ఎఫ్. కెన్నడీ (JFK), లాగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం కూడా ప్రభావితమైంది. కొన్ని విమానాలను దారి మళ్లించగా.. మరికొన్నింటిని నిలిపివేశారు.ఈ అంతరాయం కారణంగా అమెరికా వ్యాప్తంగా సుమారు 7,000 విమానాలు ఆలస్యంగా నడవగా.. వాటిల్లో కొన్ని రద్దు అయ్యాయి. న్యూయార్క్ ప్రాంతంలోని ప్రధాన విమానాశ్రయాల్లోనే 1,400కుపైగా విమానాలపై ప్రభావం పడింది.మళ్లీ సాధారణ స్థితికి..ఫైబర్ లైన్, టెలికాం కనెక్షన్ల మరమ్మతు పూర్తయ్యాక ఈశాన్య అమెరికాలో విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్లు అమెరికా రవాణా శాఖ తెలిపింది. అయితే అప్పటికే ఏర్పడిన రద్దులు, ఆలస్యాల ప్రభావం రోజంతా కొనసాగింది. కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు అదనపు ఛార్జీలు లేకుండా టికెట్లను మార్చుకునే అవకాశం కల్పించాయి.ఇదే సమయంలో ఎఫ్ఏఏ వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో విమాన షెడ్యూల్ సమస్యలు, వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఎయిర్ ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ఏఐ ఆధారిత కొత్త కంప్యూటర్ వ్యవస్థను పరీక్షించడం ప్రారంభించింది. అయితే ఈ ఏఐ వ్యవస్థకు తాజా విమాన అంతరాయంతో సంబంధం లేదని అధికారులు తెలిపారు.యూఎన్ సమావేశాల వేళ.. మరింత టెన్షన్న్యూయార్క్లో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఉన్నతస్థాయి సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ సమస్య తలెత్తింది. దాదాపు 130 మంది ప్రపంచ నేతలు, పలువురు మంత్రులు న్యూయార్క్‌కు చేరుకుంటున్న సమయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లే విమానం మాత్రం షెడ్యూల్ ప్రకారమే బయలుదేరింది.గతంలోనూ ఇదే కేంద్రం నుంచి..ఇదే ఫిలడెల్ఫియాలోని ఎఫ్ఏఏ కేంద్రం కారణంగా 2025 వసంతకాలంలో కూడా నెవార్క్ విమానాశ్రయంలో పలుమార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలోని పాత కమ్యూనికేషన్ మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. తాజా ఘటనలో మాత్రం ప్రధాన సర్క్యూట్ విఫలమవడంతో పాటు బ్యాకప్ లైన్ కూడా అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది.ఇదీ చదవండి: హౌతీలంటే ట్రంప్‌కు ఎందుకంత భయం? -
ఇరాన్ విమానాలకు అమెరికా షాక్.. 23 నుంచి కఠిన ఆంక్షలు!
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఒత్తిడి మరింత తీవ్రతరమవుతోంది. ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలను అంతర్జాతీయ విమానయాన వ్యవస్థ నుంచి దూరం చేసే దిశగా అమెరికా కీలక హెచ్చరిక చేసింది. సెప్టెంబర్ 23 నుంచి ఇరాన్ విమానాలకు ఇంధనం, ల్యాండింగ్ సదుపాయాలు, టికెట్ విక్రయాలు వంటి సేవలు అందించే విదేశీ సంస్థలపైనా ఆంక్షలు విధించనున్నామని అమెరికా తెలిపింది.అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 23 నుంచి ఇరాన్‌కు చెందిన విమానయాన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా ‘షట్‌డౌన్’ చేసే చర్యలు చేపడతామని తెలిపారు. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు సేవలు అందించే విమానాశ్రయాలు, ఇంధన సరఫరాదారులు, టికెట్ విక్రయ సంస్థలు కూడా అమెరికా చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ విమానాలు ఏదైనా దేశంలో దిగితే.. వాటికి ఇంధనం అందించడం, ల్యాండింగ్ సదుపాయాలు కల్పించడం లేదా టికెట్లు విక్రయించడం వంటి సేవలు అందించే సంస్థలు కూడా అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని బెస్సెంట్ పేర్కొన్నారు. అలాంటి సంస్థలను అమెరికా డాలర్ ఆర్థిక వ్యవస్థ నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఇరాన్ విమానాలకు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం మరింత కష్టతరం కానుంది.ఈ తాజా హెచ్చరికకు ముందు సెప్టెంబర్ 8న అమెరికా ట్రెజరీ విభాగం ఇరాన్ విమానయాన రంగానికి సంబంధించిన 36 లక్ష్యాలపై ఆంక్షలు విధించింది. ఇందులో ఇరాన్‌కు చెందిన 27 విమానయాన సంస్థలు ఉన్నాయి. మిగిలిన ఇరాన్ ఎయిర్‌లైన్స్‌ను కూడా ఆంక్షల కార్యక్రమంలో చేర్చినట్లు అమెరికా తెలిపింది. వాటికి మద్దతు అందించే విదేశీ సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్‌పై అమెరికా గతంలోనే పలు ఆంక్షలు విధించింది. ఆ సంస్థకు ఆర్థిక, లాజిస్టికల్, వాణిజ్యపరమైన సహకారం అందిస్తున్నాయని ఆరోపించిన సంస్థలు, వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంది. జూలైలో చైనా, భారత్, రష్యా, ఇరాన్‌లకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌పై ఆంక్షల అమలుకు సంబంధించి చైనా అధికారులతో చర్చలు జరిపిన తర్వాతే బెస్సెంట్ తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్‌కు చైనా ప్రధాన ఆర్థిక భాగస్వామిగా ఉండటంతో.. అమెరికా ఆంక్షల అమలులో చైనా సహకారం కీలకంగా మారింది. చైనా ఆర్థిక అధికారులు, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ పాన్ గోంగ్షెంగ్తో చర్చలు జరిగినట్లు బెస్సెంట్ తెలిపారు. ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి కేవలం విమానయాన రంగానికే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశానికి ఉన్న మార్గాలను కూడా కట్టడి చేసే దిశగా విస్తరిస్తోంది. -
హౌతీల దూకుడు.. ట్రంప్ ప్లాన్ ఢమాల్!
పశ్చిమాసియాలో ఇప్పటికే ఇరాన్–అమెరికా యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. యెమెన్‌లో హౌతీల దూకుడు ఆ ప్రాంతాన్ని మరో సంక్షోభంలోకి నెడుతోంది. ఇరాన్ మద్దతున్న హౌతీలు ఎర్ర సముద్రం తీరంలో వేగంగా ముందుకు సాగుతూ కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వారి చూపు వ్యూహాత్మక పర్వతాలపై పడింది. మరోవైపు హౌతీలను అడ్డుకునేందుకు అమెరికా సాయం కోరిన యెమెన్ ప్రభుత్వం.. ట్రంప్ నుంచి మాత్రం ప్రత్యక్ష హామీ పొందలేకపోయింది.హౌతీలపై అమెరికా నేరుగా దాడి చేయబోతోందనే పరిస్థితి చివరి నిమిషంలో మారిపోయింది. పక్కా సమాచారం ప్రకారం.. ఆదివారం హౌతీలపై వైమానిక దాడులు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. హౌతీల స్థావరాలపై దాడులు చేసేందుకు విమానాల్లో బాంబులు ఎక్కిస్తున్న సమయంలోనే ట్రంప్ వాటిని నిలిపివేయాలని ఆదేశించారు. అంటే.. హౌతీలపై అమెరికా సైనిక చర్యకు సిద్ధమైనా.. ఆఖరి క్షణంలో ఆ ప్లాన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇటు అమెరికా సెంట్రల్ కమాండ్ అటు వైట్‌హౌస్ రెండూ ఇప్పటికీ స్పందించలేదు.ఇదే సమయంలో సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వం అమెరికా సాయం కోరింది. ఆ దేశ అధ్యక్షుడు రషాద్ అల్ అలీమి, ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. అయితే ట్రంప్ ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.ఇప్పుడు పర్వతాలే టార్గెట్హౌతీల తాజా వ్యూహం యెమెన్‌లో పరిస్థితిని మరింత కీలకంగా మార్చేలా కనిపిస్తోంది. ఈ నెలలో ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వేగంగా ముందుకు సాగిన హౌతీలు.. ఇప్పుడు తైజ్, లహిజ్ ప్రావిన్సుల మధ్య ఉన్న కహ్బూబ్ పర్వతాల వైపు కదులుతున్నారు. ఈ ఎత్తైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ఎర్ర సముద్ర తీరాన్ని దక్షిణ యెమెన్‌లో ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాల నుంచి వేరు చేసే అవకాశం ఉంటుంది.అల్-వజియాహ్ పర్వత ప్రాంతం, బాబ్ ఎల్ మండెబ్ జలసంధి సమీపంలోని రాస్ అల్-అరా ప్రాంతాల్లో పోరు తీవ్రంగా సాగుతున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా బాబ్ ఎల్ మండెబ్ రీజియన్‌పై పట్టు కోల్పోయాక.. యెమెన్ రక్షణాత్మక ధోరణి ప్రదర్శిస్తోందనే విశ్లేషణలు నడుస్తున్నాయి.700 మంది మృతి.. 1.30 లక్షల మంది నిరాశ్రయులుహౌతీల తాజా దాడులతో యెమెన్‌లో మానవతా పరిస్థితి కూడా విషమిస్తోంది. తాజా పోరులో దాదాపు 700 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. సుమారు 1,30,000 మంది యెమెన్లోనే నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మందికి పైగా ఎర్ర సముద్రం దాటి పడవల్లో ఆఫ్రికా వైపు వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలను ఉటంకిస్తూ కథనం పేర్కొంది.హౌతీలను అడ్డుకునేందుకు సౌదీ అరేబియా కూడా రంగంలోకి దిగింది. హౌతీల స్థావరాలపై వందలాది వైమానిక దాడులు చేసింది. అయినప్పటికీ పర్వత ప్రాంతాల్లో హౌతీలను వెనక్కి నెట్టడం సౌదీ బలగాలకు సవాలుగా మారింది.సౌదీ చమురు ఎగుమతులకు కొత్త చిక్కుయెమెన్లో జరుగుతున్న పోరుకు మరో కీలక కోణం ఉంది. అది చమురు రవాణా. బాబ్ ఎల్ మండెబ్ ప్రాంతంలో హౌతీల పట్టు బలపడితే.. హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడే అంతరాయాలను తప్పించుకునేందుకు సౌదీ ఉపయోగించే ప్రత్యామ్నాయ చమురు మార్గానికి ఇబ్బంది కలగొచ్చు. దీంతో సౌదీ ఇప్పటికే హర్ముజ్ మీదుగా మరిన్ని చమురు రవాణాలను పెంచింది.ఆగస్టులో రోజుకు సుమారు 7 లక్షల బ్యారెళ్లుగా ఉన్న సౌదీ చమురు ఎగుమతులు హర్ముజ్ మీదుగా ఇటీవలి రోజుల్లో 29 లక్షల బ్యారెళ్లకు చేరినట్లు ఉపగ్రహ డేటా తెలియజేస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్ మార్గంలో రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగినట్లు పేర్కొంది.అమెరికాకు పెరుగుతున్న ఒత్తిడిహౌతీల దూకుడు ట్రంప్ ప్రభుత్వాన్ని చిక్కులో పడేస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియా తమకు మద్దతుగా అమెరికా సైనిక జోక్యం చేసుకోవాలని కోరుతోంది. మరోవైపు యెమెన్‌లో ప్రత్యక్షంగా మరో యుద్ధంలోకి దిగితే ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశం ఉంది.గతంలో 2025 ప్రారంభంలో అమెరికా రెండు నెలల పాటు హౌతీలపై దాడులు చేసినప్పటికీ.. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ట్రంప్ వాటిని నిలిపివేశారు. అప్పటి నుంచి యెమెన్ ఘర్షణలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు మరోసారి హౌతీలపై దాడులకు సిద్ధమై.. విమానాల్లో బాంబులు ఎక్కించే దశకు వెళ్లిన అమెరికా.. ట్రంప్ ఆదేశాలతో చివరి నిమిషంలో ఆ చర్యను నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.అదే సమయంలో హౌతీలు మాత్రం వ్యూహాత్మక ఎత్తైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తమ ఆధిపత్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకవైపు హౌతీల దూకుడు కొనసాగుతుండగా.. మరోవైపు వారిపై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం యెమెన్ సంక్షోభంలో కీలక పరిణామంగా మారింది.ఇటు హర్ముజ్‌లోనూ ఉద్రిక్తతఇటు హర్ముజ్ జలసంధిలోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. బ్రిటన్ సముద్ర భద్రత సంస్థ యూకేఎంటీవో (UKMTO) ప్రకారం.. జలసంధిలోకి వెళ్తున్న ఓ నౌకపై ప్రాజెక్టైల్ దాడి జరగడంతో సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మరో గ్యాస్ ట్యాంకర్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం.ఇరాన్–అమెరికా మధ్య దౌత్య ప్రయత్నాలు కూడా నిలిచిపోయిన పరిస్థితుల్లో యెమెన్‌లో హౌతీల దూకుడు.. మిడిల్ ఈస్ట్ వార్‌కు మరో కీలక ఫ్రంట్‌ను జోడించింది. హౌతీలపై దాడులకు సిద్ధమైన అమెరికా చివరి నిమిషంలో ఆ ప్రణాళికను ఎందుకు నిలిపివేసిందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? లేదంటే సౌదీ, యెమెన్ బలగాలకే మద్దతు పరిమితం చేస్తుందా? అన్నది చూడాలి.ఇదీ చదవండి: అమెరికా వర్సెస్ చైనా.. ఇప్పుడు ఓ కొత్త వార్ -
వాణిజ్య యుద్ధం తర్వాత ఏఐ వార్.. అమెరికాకు వెళ్లనున్న జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన వాషింగ్టన్ చేరుకోనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల అమలు, కీలక ఖనిజాల సరఫరా, సెమీకండక్టర్లు వంటి అంశాలు ఈ శిఖరాగ్ర భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.జిన్‌పింగ్ పర్యటనకు ముందు న్యూయార్క్‌లో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్, చైనా ఉప ప్రధాని హీ లైఫెంగ్ నేతృత్వంలో చర్చలు జరిగాయి. గతంలో కుదిరిన ఆర్థిక, వాణిజ్య అవగాహనలను అమలు చేయడం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, కృత్రిమ మేధపై చర్చించడం ఇందులో ఉన్నాయి. అమెరికా వైపు నుంచి రైతులు, తయారీదారులు, కార్మికులకు మార్కెట్ అవకాశాలు పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు.జాతీయ భద్రత కోణంలో.. ఈ భేటీలో కృత్రిమ మేధకు సంబంధించి ప్రత్యేక సమాచార వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదన కూడా కీలకంగా మారింది. కృత్రిమ మేధ కారణంగా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో ఏదైనా ఘటన జరిగితే ఇరు దేశాలు ముందుగానే ఒకరినొకరు అప్రమత్తం చేసుకునే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలని అమెరికా ప్రతిపాదించింది. దీనిని అనధికారికంగా ‘కృత్రిమ మేధ హాట్‌లైన్’గా పేర్కొంటున్నారు. అయితే ఏ పరిస్థితుల్లో సమాచారం తప్పనిసరిగా పంచుకోవాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. చైనా ఈ ప్రతిపాదనను అంగీకరించిందా లేదా అన్నది కూడా వెల్లడించలేదు.రేర్ ఎర్త్, కీలక ఖనిజాల సరఫరా కూడా ఇరు దేశాల మధ్య ప్రధాన వివాదాంశంగా ఉంది. సెమీకండక్టర్ల విషయంలో చైనాకు ఆ చిప్‌లు లభించే అవకాశాన్ని అమెరికా పరిమితం చేస్తోంది. అదే సమయంలో చైనా.. పరిమితుల మధ్య కూడా కృత్రిమ మేధ నమూనాలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. 2025లో అమెరికా సంస్థలు కృత్రిమ మేధ రంగంలో 285.9 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా, చైనా సంస్థల పెట్టుబడి 12.4 బిలియన్ డాలర్లుగా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ 2026 కృత్రిమ మేధ సూచీ నివేదిక పేర్కొంది.వాణిజ్యంతో పాటు రష్యాపై అమెరికా ఆంక్షలు, ఇరాన్‌తో అమెరికా ఘర్షణ, తైవాన్, అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం వంటి అంశాలు కూడా భేటీపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్-ట్రంప్ చర్చల్లో ఆర్థిక విభేదాల నిర్వహణతో పాటు కృత్రిమ మేధ రంగంలో ప్రమాదాలను నియంత్రించేందుకు ఇరు దేశాలు ఏ మేరకు సహకార మార్గాన్ని ఏర్పరచుకుంటాయన్నది కీలకంగా మారనుంది. -
ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం
టెహ్రాన్: ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవుపై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసిందని తెలిపింది. ఈ దాడిలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు ప్రకటించింది. అమెరికా క్షిపణుల అటాక్‌లో 12 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారని పేర్కొంది. అదే విధంగా 760 వరకూ వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయని తెలిపింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.ఇరాన్ అధికారి తన ప్రకటనలో "అమెరికా దాడుల్లో 12 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. 420 చేపల వేట నౌకలు (వీటిలో సుమారు 70 సాంప్రదాయ ధోలు, 350 చిన్న పడవలు ఉన్నాయి) 340 వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయి". అని న్యాయవ్యవస్థ ప్రతినిధి అలీ కజెమీ ప్రకటన విడుదల చేశారు. అయితే దీనిని అమెరికా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.అయితే ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, బాధ్యులను గానీ కజెమీ స్పష్టం చేయలేదు. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం విచక్షణ, అనుపాతం, ముందుజాగ్రత్త వంటి సూత్రాలను దాడి చేసినవారు ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్నారని, దాదాపు 300 నౌకల నష్ట వివరాల అంచనా పూర్తయ్యిందని పేర్కొన్నారు.పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలుకాగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా తమ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది." ఏ కారణంతోనూ ఇరాన్‌కు వెళ్లొద్దు. అక్కడున్న అమెరికా పౌరులు ఇప్పుడే ఇరాన్ నుంచి బయిటకు వచ్చేయండీ" అని ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో భద్రతా పరిస్థితులు సంక్షిష్టంగా మారుతున్నాయని హెచ్చరించింది.అదే విధంగా అక్కడి నిరసనలకు, భారీ జన సమూహాలకు దూరంగా ఉండాలని అమెరికాతో బహిరంగంగా అనుబంధం ఉన్న ప్రాంతాలలో తక్కువ ప్రొఫైల్ పాటించాలని పేర్కొంది. వైమానిక దాడులు జరిగితే కిటీకీలు, అద్దాలు తలుపులకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో అమెరికా మరోసారి ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులకు తెగబడుతుందా అనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. -
మాన్ దానీ ఇంటికి ట్రంప్ గ్రేసీ మ్యాన్పన్ లో కీలక భేటీ
-
భీకరంగా మారబోతున్న ఇరాన్ యుద్ధం!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అమెరికా కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని తన పౌరులను ఆదేశించింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉందని.. విమాన సర్వీసులు రద్దు కావడం, గగనతలం మూసివేయడం, సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించడం వంటి పరిణామాలు ఎదురుకావొచ్చని హెచ్చరించింది.అమెరికా వర్చువల్ ఎంబసీ ఇన్ ఇరాన్ తాజాగా విడుదల చేసిన భద్రతా హెచ్చరికలో.. ‘‘ఏ కారణంతోనూ ఇరాన్‌కు వెళ్లొద్దు. అక్కడున్న అమెరికా పౌరులు ఇప్పుడే ఇరాన్ నుంచి బయటకు వచ్చేయండి’’ అని స్పష్టం చేసింది. ఇరాన్లో భద్రతా పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయని ఆ హెచ్చరికలో పేర్కొంది. విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, సరిహద్దు మార్గాలకు సంబంధించిన పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించింది. ఇతర దేశాలకు వెళ్లాలని భావించే వారు ఆయా దేశాల ప్రవేశ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలని తెలిపింది.అమెరికన్లకు పలు సూచనలుఇరాన్లో ఉన్న అమెరికన్లు నిరసనలు, భారీ జనసమూహాలకు దూరంగా ఉండాలని అమెరికా సూచించింది. అమెరికాతో బహిరంగంగా అనుబంధం ఉన్న ప్రాంతాల్లో తక్కువ ప్రొఫైల్ పాటించాలని తెలిపింది. వైమానిక దాడులు జరిగితే కిటికీలు, అద్దాల తలుపులకు దూరంగా ఉండాలని.. కూలిన శిథిలాల వైపు వెళ్లొద్దని హెచ్చరించింది.అత్యవసర పరిస్థితుల్లో దౌత్య అధికారులను సంప్రదించేందుకు ‘స్మార్ట్ ట్రావెలర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ (STEP)’లో నమోదు చేసుకోవాలని సూచించింది. పశ్చిమాసియాలో ప్రయాణించే లేదంటే ఆ ప్రాంతం మీదుగా వెళ్లే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని.. విమాన సర్వీసులు, గగనతల మార్గాల్లో ఆకస్మిక మార్పులు, రద్దులు జరిగే అవకాశం ఉందని అమెరికా తాజాగా హెచ్చరించింది.హౌతీల దాడులతో మరింత టెన్షన్అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో.. ఇరాన్ మద్దతున్న హౌతీల కార్యకలాపాలను కూడా అమెరికా ప్రస్తావించింది. సౌదీ అరేబియాపై, ముఖ్యంగా పౌర విమానాశ్రయాలపై హౌతీలు దాడులకు పాల్పడ్డారని తెలిపింది. ప్రస్తుత సైనిక ఘర్షణలు వేగంగా మరింత విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇరాన్‌కు మద్దతిచ్చే గ్రూపులు అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అమెరికా పేర్కొంది. మధ్యప్రాచ్యంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గతంలో అమెరికా దౌత్య కార్యాలయాలు, సంస్థలు లక్ష్యంగా దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేసింది. అమెరికా వ్యాపార సంస్థలు, సంస్థలు, ఇతర ప్రయోజనాలపైనా ముప్పు ఉండొచ్చని తెలిపింది.సౌదీలోనూ ఆంక్షలుఇరాన్తో పాటు సౌదీ అరేబియాలో ఉన్న అమెరికన్లకు కూడా ఇటీవల భద్రతా సూచనలు జారీ అయ్యాయి. హౌతీల దాడుల నేపథ్యంలో తైఫ్, యన్బు ప్రాంతాలకు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక లేదా వ్యక్తిగత ప్రయాణాలు చేయాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచించింది. మరోవైపు రియాద్ వైపు బాలిస్టిక్ క్షిపణి దూసుకురావడంతో సౌదీ అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఆ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు తెలిపాయి. బిష్, తైఫ్, ఫరాసాన్, యన్బు ప్రాంతాల్లో పౌరులు, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నాలు జరిగినట్లు పేర్కొన్నాయి. హౌతీల దాడులను ఖతార్ ఖండిస్తూ.. సౌదీ అరేబియాకు సంఘీభావం ప్రకటించింది.ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ అంతర్జాతీయ రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా పరిస్థితులు, గగనతల పరిమితులు, విమాన మార్గాల్లో మార్పుల కారణంగా పలు అంతర్జాతీయ సర్వీసులు రద్దు లేదా నిలిపివేతకు గురయ్యాయి. అయితే గల్ఫ్ ప్రాంతంలోని అన్ని విమాన మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. కొన్ని రూట్లలో సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ.. విమాన సంస్థలు పరిస్థితిని బట్టి షెడ్యూళ్లను మార్చుతున్నాయి. తాజాగా ఇరాన్ నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాల్లో దాదాపు మూడో వంతు రద్దైనట్లు సమాచారం. మాహాన్ ఎయిర్ కూడా ఇస్తాంబుల్, అంకారా, మస్కట్ వంటి అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను నిలిపివేసింది. దీంతో ఇరాన్‌కు ప్రయాణం చేయడం, అక్కడి నుంచి బయటకు రావడం గతంతో పోలిస్తే మరింత కష్టంగా మారింది. మరోవైపు అమెరికా–ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నప్పటికీ.. చర్చలకు సంబంధించిన మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. సెప్టెంబర్ 20న ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వగా.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ యూఎన్ జనరల్ అసెంబ్లీకి వెళ్లే కార్యక్రమంలో భాగంగా దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చైనా కూడా ఇరాన్, అమెరికా సంయమనం పాటించి జూన్‌లో కుదిరిన శాంతి ఒప్పందానికి తిరిగి రావాలని కోరుతోంది. అంటే.. ఒకవైపు సైనిక ఉద్రిక్తతలు, మరోవైపు పరోక్ష దౌత్య ప్రయత్నాలు ఏకకాలంలో కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: మొసలి కన్నీరుపై ఇరాన్ ఫైర్ -
ఇరాన్ చుట్టూ ఉచ్చు.. మూడు వైపులా టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరగా.. మరోవైపు ఇరాన్ మద్దతున్న హౌతీలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరాన్–ఫ్రాన్స్ మధ్య దౌత్య వివాదం కూడా ముదురుతోంది. దీంతో ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ప్రాంతీయ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంటోంది.అమెరికా కొత్త దాడికి సిద్ధమవుతోందన్న సమాచారం తమ వద్ద ఉందని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా లేదా దాని మిత్రదేశాలు మరోసారి దాడి చేస్తే.. ఈసారి ప్రతిస్పందన పరిమితం కాదని, అమెరికా స్థావరాలు.. ప్రయోజనాలపై సుదీర్ఘంగా దాడులు కొనసాగిస్తామని ఇరాన్ సైనిక కమాండ్ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలను కూడా ఈ ఘర్షణలో భాగస్వాములుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచారు. ఒప్పందానికి ముందుకు రావాలని.. లేదంటే ఇరాన్ ఆర్థికంగా మరింత కుదేలవుతుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ వారంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి న్యూయార్క్ వెళ్లనున్న నేపథ్యంలో ఆయనతో భేటీకి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పడం గమనార్హం. రియాద్‌పై హౌతీల మెరుపుదాడిఇదిలా ఉండగానే యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. సెప్టెంబర్ 19న క్షిపణి, డ్రోన్లతో దాడి ప్రయత్నం జరిగినట్లు సౌదీ అరేబియా ధ్రువీకరించింది. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడుతో దట్టమైన పొగ అలుముకుంది. అయితే సౌదీ నేతృత్వంలోని కూటమి ఆ దాడిని అడ్డుకున్నట్లు తెలిపింది. పెద్దగా నష్టమూ జరగలేదని వెల్లడించింది. హౌతీలు రియాద్‌తో పాటు యాన్బు, తాయిఫ్, బైష్, ఫరాసాన్ ప్రాంతాల్లోనూ దాడులకు ప్రయత్నించినట్లు సమాచారం. యాన్బు సౌదీ చమురు ఎగుమతులకు కీలక కేంద్రం కావడంతో ఈ దాడులు మరింత ఆందోళనకు కారణమయ్యాయి. ఎందుకంత కీలకం బాబ్-ఎల్-మండేబ్..యెమెన్‌లో హౌతీల దూకుడు ఇటీవలి రోజుల్లో మరింత పెరిగింది. వ్యూహాత్మకమైన మొఖా ప్రాంతంతో పాటు బాబ్ ఎల్ మందెబ్ జలసంధికి సమీప ప్రాంతాలపై వారి పట్టు పెరిగింది. ఈ మార్గం ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌తో కలుపుతుంది. ఆసియా–యూరప్ మధ్య నౌకాయానానికి ఇది కీలకమైన మార్గం.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల కారణంగా ఇంధన రవాణాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పుడు బాబ్ ఎల్ వద్ద కూడా భద్రతా సమస్యలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళన మరింత పెరిగింది. హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ చమురు ఎగుమతుల మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా పరిణామాల్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగానే కొనసాగుతోంది. చైనాకు కూడా టెన్షన్.. ఇరాన్‌పై ఒత్తిడిహౌతీల దూకుడుతో సౌదీ మాత్రమే కాకుండా చైనా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. సౌదీ విజ్ఞప్తి నేపథ్యంలో హౌతీలను అదుపులో ఉంచేందుకు ఇరాన్‌పై చైనా ప్రైవేటుగా ఒత్తిడి తెచ్చినట్లు మూడు ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ ఆ వార్తను ప్రచురించింది. ఎర్ర సముద్ర మార్గం చైనా వాణిజ్యానికి కూడా కీలకం కావడంతో ఈ పరిణామాలను బీజింగ్ నిశితంగా గమనిస్తోంది. ఇటు ఫ్రాన్స్‌తోనూ కొత్త వివాదంఇక ఇరాన్–ఫ్రాన్స్ సంబంధాల్లోనూ కొత్త చిచ్చు రేగింది. టెహ్రాన్‌లో ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ఫ్రెంచ్ భాషా కేంద్రాన్ని ఇరాన్ అధికారులు మూసివేశారు. సరైన లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిందని ఇరాన్ ఆరోపించింది. వ్యక్తుల నెట్‌వర్క్‌లను నిర్మించడం, నైపుణ్యం ఉన్న ఇరానియన్లు దేశం విడిచి వెళ్లేందుకు సహకరించడం వంటి ఆరోపణలను కూడా చేసింది. అయితే ఫ్రాన్స్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ సాంస్కృతిక సంస్థలపై మరో దాడిగా అభివర్ణించింది. ఇరాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరనున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న దౌత్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ‘మొసలి కన్నీరు’ అంటూ ఫైర్ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో ఇరాన్లో మానవ హక్కుల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్ గతంలో అల్జీరియాలో చేసిన చర్యలను ప్రస్తావిస్తూ.. ఇరాన్‌పై ఇప్పుడు సానుభూతి చూపడం ‘మొసలి కన్నీరు’ అంటూ బారోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా దాడుల్లో ఇరాన్ పాఠశాల విద్యార్థులు చనిపోయిన సమయంలో ఫ్రాన్స్ మౌనం వహించిందని కూడా అరాఘ్చీ ఆరోపించారు.ఒకవైపు చర్చలు.. మరోవైపు దాడులుఇలా చూస్తే ప్రస్తుతం ఇరాన్ చుట్టూ ఒకేసారి పలు స్థాయిల్లో ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ మళ్లీ ముదిరే సంకేతాలు, సౌదీపై హౌతీల దాడులు, హర్ముజ్–బాబ్ ఎల్ మండేబ్ జలమార్గాలపై ఒత్తిడి, ఫ్రాన్స్‌తో దౌత్య వివాదం.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడుతున్నాయి.అయితే ఇదే సమయంలో చర్చలకు అవకాశం పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్–ఇరాన్ మధ్య కఠిన ప్రకటనలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ అధ్యక్షుడితో భేటీకి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం దౌత్య మార్గం ఇంకా తెరిచే ఉందనే సంకేతంగా నిలుస్తోంది. మరోవైపు హౌతీలను నియంత్రించేందుకు చైనా ప్రయత్నాలు కూడా తెరవెనుక దౌత్యం కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ ఏడు కండీషన్స్‌తో ఇరాన్ యుద్ధం ముగిసేనా? -
సిలికానాంధ్ర మన బడి.. కొత్త మైలురాయి
సిలికానాంధ్ర మన బడి 20వ విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గత వారాంతంలో అమెరికా, కెనడాలోని దాదాపు 250 నగరాల్లో ఉన్న మనబడి కేంద్రాల్లో కొత్త విద్యా సంవత్సరం ఉత్సాహంగా ప్రారంభమైంది. సుమారు 12,200 మంది విద్యార్థులు మనబడిలో చేరగా.. తొలి రోజున దాదాపు 20,000 మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లలతో కలిసి కేంద్రాలకు హాజరయ్యారు. దీంతో ఉత్తర అమెరికాలోని మనబడి కేంద్రాలు సందడి, ఆనందంతో కళకళలాడాయి.విద్యా సంవత్సరం సజావుగా ప్రారంభమయ్యేలా సుమారు 2,500 మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు, కేంద్ర సమన్వయకర్తలు, ఇతర సమాజ సేవకులు తమ సేవలను అందించారు. తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో వీరంతా సమష్టిగా పనిచేస్తున్నారు. సిలికానాంధ్ర మన బడి 20వ సంవత్సరం ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం కేవలం 150 మంది విద్యార్థులతో ప్రారంభమైన మనబడి, నేడు భారతదేశం వెలుపల కొనసాగుతున్న అతిపెద్ద తెలుగు భాషాభ్యాస ఉద్యమాల్లో ఒకటిగా ఎదిగింది.ఉత్తర అమెరికా వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు చేరువైన మనబడి, ఎన్నో సంవత్సరాలుగా తరతరాల పిల్లలకు తెలుగు మాట్లాడటం, చదవటం, రాయటం నేర్పిస్తూ, వారి భాష, సంస్కృతి, వారసత్వంతో అనుబంధాన్ని బలోపేతం చేస్తోంది. మన బడి ప్రయాణానికి మరో ప్రత్యేకమైన ఉదాహరణ ప్రస్తుతం తరగతి గదుల్లో కనిపిస్తోంది. మన బడి తొలి బ్యాచ్‌లలో చదువుకున్న కొంతమంది విద్యార్థులు నేడు తల్లిదండ్రులుగా మారి, తమ పిల్లలను తెలుగు నేర్చుకోవడానికి మనబడికి తీసుకువస్తున్నారు. కేవలం రెండు దశాబ్దాల్లోనే ఒక తరం నుంచి మరో తరానికి తెలుగు భాషా వారసత్వాన్ని అందించే వేదికగా మనబడి నిలిచింది.మన బడి అభివృద్ధి వెనుక ఉపాధ్యాయులు, కేంద్ర సమన్వయకర్తలు, తల్లిదండ్రులు, నిర్వాహకులు, శ్రేయోభిలాషులతో కూడిన విస్తృత స్వచ్ఛంద సేవా సమాజం ఉంది. ఉత్తర అమెరికాలో భవిష్యత్ తరాల మధ్య తెలుగు భాష జీవించి, అభివృద్ధి చెంది, వికసించేలా చేయాలనే లక్ష్యంతో వారు ఎన్నో సంవత్సరాలుగా తమ సమయాన్ని, సేవలను అందిస్తున్నారు.మూడో దశాబ్దంలోకి అడుగుపెడుతున్న మనబడి లక్ష్యం కేవలం తెలుగు భాషను పరిరక్షించడం మాత్రమే కాదు. పిల్లలకు తమ సాంస్కృతిక మూలాలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, రాబోయే తరాల కుటుంబాల్లో తెలుగు ఒక సజీవ భాషగా కొనసాగేందుకు అవసరమైన సమాజాన్ని నిర్మించడం కూడా మనబడి లక్ష్యంలో భాగమని నిర్వాహకులు తెలిపారు.కొత్త విద్యా సంవత్సరానికి మనబడి ప్రవేశాలు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగనున్నాయి. తమ పిల్లలకు తెలుగు భాషను పరిచయం చేయాలనుకునే కుటుంబాలు సమీపంలోని మనబడి కేంద్రాన్ని సందర్శించి.. కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు, డీన్ చమర్తి రాజు మాట్లాడుతూ.. ‘‘మీ మద్దతే మన సమాజం అభివృద్ధి చెందడానికి ఉత్తమ మార్గం. మీ స్నేహితులు తమ పిల్లలను మన బడిని ప్రత్యక్షంగా అనుభవించేలా ప్రోత్సహించండి. మరో కుటుంబాన్ని మన బడికి అనుసంధానించి, వారి పిల్లలను ఈరోజే మనబడిలో నమోదు చేయమని ప్రోత్సహించండి” అంటూ ఆయన పిలుపునిచ్చారు. -
ట్రంప్‌నకు ఇరాన్ అల్టిమేటం.. 7 షరతులు
ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపు దాలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికాకు భారీ ఆఫర్ ఇచ్చింది. యుద్ధాన్ని ఆపాలంటే తమ వద్ద ఒక ప్లాన్ ఉందని తెలిపింది.. టెహ్రాన్ ప్రతిపాదించిన ఏడు షరతులను అంగీకరిస్తే వెంటనే యుద్ధం ముగిసిపోతుందని లేకపోతే అమెరికా వద్ద మరో ప్లాన్ ఏది లేదని స్పష్టం చేసింది.ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ... ఈ విషయమై మాట్లాడుతూ అమెరికా ముందు తన ఇరాన్‌కు చెందిన ఏడు ప్రతిపాదనలను ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు చేరవేశాం. ప్రస్తుతం యుద్ధం మెుదలై ఏడు నెలలు కావస్తుందని ఇరాన్ షరతులపై ట్రంప్ స్పందన కోసం ఎదురుచూస్తోన్నామన్నారు.ఆయన మాట్లాడుతూ "ఏదైనా చర్చలు ప్రారంభించడానికి ఇరాన్ తన ఏడు షరతులను అమెరికా ప్రభుత్వానికి ప్రకటించింది. టెహ్రాన్ సందేశం స్పష్టంగా, నిస్సందేహంగా ఉంది. వాషింగ్టన్ తాను సృష్టించుకున్న చిక్కుముడి నుండి బయటపడాలనుకుంటే, అందులో మరింత చిక్కుకోకుండా ఉండాలంటే, ఇరాన్ హక్కులు, షరతులను అంగీకరించడం తప్ప దానికి మరో మార్గం లేదు," అని ఆయన ఆదివారం తెల్లవారుజామున Xలో పోస్ట్ చేశారు.ఇరాన్ ప్రధాన డిమాండ్లు ?మెుహ్సెన్ రెజాయీ ప్రకారం, ఇరాన్ ప్రతిపాదనల్లో ప్రధానంగా అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించడం, ఇరాన్‌కు చెందిన స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించడం వంటి అంశాలు ఉన్నాయి. అదే విధంగా యెమెన్‌కు చెందిన హౌతీలు, సౌదీ అరేబియా మధ్య కొనసాగుతున్న పోరాటానికి సైతం ముగింపు పలకాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సైనిక ఘర్షణలకు సమగ్ర ముగింపు రావాలన్నదే తమ ఉద్దేశమని రెజాయీ తెలిపారు.ఖతార్ ద్వారా అమెరికాకు సందేశం.ఇరాన్, అమెరికా మధ్య నేరుగా కాకుండా మధ్యవర్తి దేశం ఖతార్ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇరాన్ షరతులను ఖతార్ అమెరికాకు చేరవేసిందని, ప్రస్తుతం వాషింగ్టన్ నుంచి అధికారిక స్పందన కోసం వేచి చూస్తున్నామని ఆయన చెప్పారు. “ఈ షరతులను అంగీకరించడం అమెరికా ప్రయోజనానికే” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికా నుంచి మరోసారి దాడి జరిగే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు.మరో అమెరికా దాడి జరిగే అవకాశం?ఇరాన్ సైనిక అంచనాల ప్రకారం అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఇంకా చాలా ఎక్కువగానే ఉందని రెజాయీ పేర్కొన్నారు. అందుకే తమ దేశం కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోందని, ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడమే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. ట్రంప్ స్పందనపై సస్పెన్స్?ఇరాన్ తన ఏడు షరతులను అమెరికా ముందుంచిన నేపథ్యంలో, వాషింగ్టన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్ మరో అమెరికా దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధానికి నిజంగా ముగింపు పలికే దిశగా ఇరాన్-అమెరికా చర్చలు సాగుతాయా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
వెయ్యేళ్ల ప్రళయం.. ముంచెత్తబోతున్న రాకాసి జలపాతం!
-
అమెరికాతో ఇక కురుక్షేత్రమే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ అమెరికాకు పిలుపునిచ్చింది. యుద్ధం ముగియాలంటే అమెరికా తమ ఏడు డిమాండ్లకు అంగీకరించాలని, లేదంటే ఆ దేశంతో చావోరేవో తేల్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది.ఒకవేళ తాము పెడుతున్న ఏడు షరతులకు అమెరికా ఒప్పుకుంటే, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుపుతామని తెలిపింది. మరి ఇరాన్ డిమాండ్లపై అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సేన్ రెజాయీ ప్రముఖ ఖతార్ ఆంగ్ల మీడియా సంస్థ 'అల్ జజీరా'తో మాట్లాడారు. “అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ఖతార్ మధ్యవర్తిత్వంతో మా డిమాండ్లు ఏంటో అమెరికాకు తెలియజేశాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.ఇరాన్ డిమాండ్లు ఇవేఅన్ని రకాల సరిహద్దుల్లోనూ యుద్ధాన్ని పూర్తిగా ఆపివేయడం,విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం.ఇరాన్‌పై విధించిన నావికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం. ఇలా మొత్తం ఏడు స్పష్టమైన డిమాండ్లను ఖతార్ ద్వారా అమెరికాకు తెలియజేసినట్లు రెజాయ్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.ఈ సందర్భంగా ట్రంప్ బెదిరింపుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ షరతులను అంగీకరించడమే అమెరికాకు మంచిదని రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా వైపు నుంచి భవిష్యత్తులోనూ దాడులు జరిగే అవకాశం ఉందని తమ సైనిక అంచనాలు చెబుతున్నాయని, దానిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్న అమెరికా నావికాదళ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తమ సైనిక వ్యూహాలను మార్చుకున్నట్లు తెలిపారు. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, ప్రాంతీయంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, వాణిజ్య సంస్థలపై తీవ్ర ప్రతిస్పందన ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.అణు విధానం ఇరాన్ అణు విధానంలో ఎలాంటి మార్పు లేదని రెజాయ్ స్పష్టం చేశారు. అణు ఆయుధాలను నిషేధించే మతపరమైన ఫత్వాకు (డిగ్రీకి) తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే, అమెరికా అనుసరించే దురుసు విధానాల వల్ల తాము 'న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ' నుంచి వైదొలగవలసి వచ్చే పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు.మధ్యవర్తిత్వ ప్రయత్నాలు గతేడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ప్రారంభమైన ఈ సంఘర్షణను ముగించేందుకు ఖతార్,పాకిస్థాన్ దేశాలు దౌత్యపరమైన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఒకవైపు దౌత్య చర్చలకు సిద్ధమంటూనే, మరోవైపు సైనిక సన్నద్ధతను కూడా ఇరాన్ విడనాడలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఇరాన్ ప్రతినిధి బృందానికి అమెరికా విదేశాంగ శాఖ వీసాలు జారీ చేసినట్లు సమాచారం. -
యుద్ధానికి మూల్యం చెల్లిస్తున్నారు
దుబాయ్: అమెరికా ఆంక్షలు, ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న యుద్ధాలకు మూల్యాన్ని ఇరాన్ ప్రజలు చెల్లిస్తున్నారని ఆ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత నర్గీస్ మహ్మదీ(54) వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు, బలగాల అణచివేత కారణంగా సామాన్యులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. ‘ఒక్కసారి ఇరాన్ వీధుల్లోకి వెళ్లి చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏమిటో మీకు అర్థమవుతుంది. వారిప్పుడు మేల్కొన్నారు. హక్కుల కోసం పోరాడాలని తీర్మానించుకున్నారు’ అని మహ్మదీ అన్నారు. ‘నేటి ఇరాన్ యువతలో హక్కుల పట్ల అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్పష్టత ఉంది. వారే మాకు ఆశ, శ్వాస’అని ఆమె పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన నర్గీస్ మహ్మదీని ఇరాన్ ప్రభుత్వం జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేసింది. శుక్రవారం ఆమె అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచి్చన వర్చువల్ ఇంటర్వ్యూలో తన నిర్బంధానికి సంబంధించిన వివిధ అంశాలను ఆమె వివరించారు. బాల్యంతోపాటు జైలులో ఉన్న సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రాసిన ‘ఎ ఉమన్ నెవర్ స్టాప్స్ ఫైటింగ్’ పుస్తకం ఫ్రెంచి, జర్మన్, తదితర 9 భాషల్లో ఈ నెలలో విడుదల కానుంది. ఇంగ్లి‹Ù, పార్సీ ఎడిషన్లు వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. అమెరికాతో కొనసాగుతున్న యుద్ధం, ముదిరిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఇరాన్ ప్రజలు పలు రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారని, భారీ మూల్యం చెల్లిస్తున్నారని మహ్మదీ పేర్కొన్నారు. తమ పాలకులపై ఇరాన్ వాసుల్లో నిశ్శబ్దంగా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందంటూ ఆమె ఇస్లాం డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన కారణంగా 22 ఏళ్ల మహ్సా అమీనిని అధికారులు నిర్బంధించడం, అనంతరం ఆమె ఆస్పత్రిలో చనిపోవడంతో మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కొనసాగిన విషయాన్ని ప్రస్తావించారు. అమీనిని స్మరించుకుంటూ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న నర్గీస్ మహ్మదీకి ఇరాన్ ప్రభుత్వం వివిధ ఆరోపణలు మోపి మొత్తం 44 ఏళ్ల జైలు శిక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం
-
భారతీయులకు మరో బిగ్ షాక్.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికాలో ఉద్యోగం.. అక్కడే స్థిరపడాలనే కలలు కంటున్న భారతీయ టెకీలకు ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయంతో షాకిచ్చింది. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై విధించిన 1 లక్ష డాలర్ల H-1B వీసా ఫీజును మరో ఏడాది పొడిగించింది. ఇప్పటికే ఈ భారీ ఫీజుతో సతమతమవుతున్న ఐటీ రంగానికి తాజా నిర్ణయం మరింత కీలకంగా మారింది. ఈ ఫీజు కారణంగా పెద్ద ఐటీ ఔట్సోర్సింగ్ సంస్థల్లో H-1B రిజిస్ట్రేషన్లు 92 శాతం తగ్గినట్లు ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా H-1B కార్యక్రమం అసలు ఉద్దేశాన్ని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అమెరికన్ల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విదేశీ ఉద్యోగులను తీసుకొస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలు పెంచడం, అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకునేలా చూడటమే లక్ష్యంగా ఫీజును కొనసాగిస్తున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.భారతీయులపైనే ప్రభావం?అమెరికా H-1B వీసా కార్యక్రమంలో అత్యధికంగా లబ్ధి పొందుతున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. దీంతో ట్రంప్ తాజా నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అమెరికాలో కొత్తగా ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అమెరికాలో ఇప్పటికే విద్యార్థి వీసాలపై ఉన్న విదేశీయులకు మంజూరయ్యే H-1B వీసాలు, ప్రస్తుత వీసాల రెన్యూవల్స్‌కు ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదని గత ఆదేశంలో స్పష్టం చేశారు.వీసా దరఖాస్తులపై మరింత నిఘాఫీజు పొడిగింపుతోపాటు H-1B దరఖాస్తుల పరిశీలనను కూడా ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. అమెరికన్ ఉద్యోగులను తొలగించినా లేదా తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించుకునే సమయంలో మరింత నిశితంగా పరిశీలించాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. గతంలో సమర్పించిన లేబర్ కండిషన్ దరఖాస్తులపై 30 రోజుల్లో సమీక్ష ప్రారంభించాలని కార్మిక శాఖకు సూచించింది. అవసరమైతే స్పాన్సర్ సంస్థలపై తదుపరి చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించనున్నారు.కోర్టులో కేసులు.. అయినా వెనక్కి తగ్గని ట్రంప్!2025లో విధించిన లక్ష డాలర్ల ఫీజును సవాలు చేస్తూ రెండు ఫెడరల్ కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, గడువు ముగియనున్న తరుణంలో ట్రంప్ ప్రభుత్వం మరో ఏడాది పొడిగింపు ప్రకటించింది. మొత్తంగా.. H-1B వీసాలపై భారీ ఫీజు, కఠిన తనిఖీలు కొనసాగనున్న నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.ఇదీ చదవండి: ఇరాన్లో ట్రంప్‌కు బిగ్ షాక్ -
ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం
ఉత్కంఠకు తెర పడింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే బిల్లుపై ట్రంప్ ఇవాళ సంతకం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారడంతో ఆయా దేశాలపై ఏ క్షణమైనా 100 శాతం వరకు టారిఫ్‌లు ట్రంప్ విధించే అవకాశం ఉంది. ప్రధానంగా.. భారత్, చైనాలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. లిండ్సే గ్రాహం యాక్ట్ ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ లేదంటే గ్యాస్ దిగుమతి చేసుకునే టాప్-5 దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే చట్టంలో ఆ దేశాల పేర్లను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆయా జాబితాలను ఎలా లెక్కించాలన్న దానిపైనా పూర్తి స్పష్టత లేదు. దీంతో తుది నిర్ణయాధికారం ట్రంప్ ప్రభుత్వానికే దక్కింది. అబ్ ఆయేగా అస్లీ మజా!ట్రంప్ సంతకం చేయడంతో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కానీ అసలు పరిణామాలు ఇప్పుడే మొదలుకానున్నాయి. భారత్, చైనా సహా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఏ దేశాలు ‘టాప్-5’ జాబితాలోకి వస్తాయి? వాటిపై ట్రంప్ 100 శాతం వరకు టారిఫ్ విధిస్తారా? లేక మినహాయింపు ఇస్తారా? అన్నదే ఇప్పుడు కీలకం. తుది జాబితా, టారిఫ్ స్థాయిపై అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఆగస్టు క్రూడ్ దిగుమతుల డేటా ఆధారంగా రష్యా చమురు కొనుగోలులో ముందున్న దేశాలు:భారత్చైనాఇటలీటర్కీనెదర్లాండ్స్ఎస్అండ్పీ గ్లోబల్ ప్రకారం ఆగస్టులో రష్యా క్రూడ్ దిగుమతుల్లో భారత్ రోజుకు సుమారు 16 లక్షల బ్యారెళ్లతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 11 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇటలీ, టర్కీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి చౌకగా లభించే క్రూడ్ ఆయిల్ భారత రిఫైనరీలకు కీలక వనరుగా మారింది. దేశీయ అవసరాల్లో భారీ భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. రష్యా చమురు దిగుమతులు భారత మొత్తం క్రూడ్ దిగుమతుల్లో దాదాపు సగం వరకు ఉన్నాయని తాజా విశ్లేషణలు పేర్కొంటున్నాయి. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లపై అమెరికా చర్యలు తీసుకుంటే భారత రిఫైనింగ్ రంగంతో పాటు అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ ఉత్పత్తులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే భారత్ సహా ఏ దేశాలపై, ఎప్పుడు, ఎంతమేర సుంకాలు విధించాలన్న విషయంలో ట్రంప్‌దే తుదినిర్ణయం కానుంది. మరోవైపు ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. చర్చల్లో మరికొన్ని దేశాలురష్యా చమురు కొనుగోలుదారుల జాబితాతో పాటు రష్యా ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరిస్తున్న దేశాలపైనా చట్టం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్, జపాన్, యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలు కూడా అమెరికా చర్యల పరిధిలోకి రావచ్చనే చర్చ జరుగుతోంది. 30 రోజుల్లో నిర్ణయం?కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన దేశాలపై టారిఫ్‌లు విధించే చర్యలను 30 రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ అంశం కీలకంగా మారింది. రష్యా చమురుపై ఆంక్షలు కఠినతరం చేస్తే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడి ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో వినియోగదారులపై ఇంధన ధరల భారం పెరగకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ అధికారాలను ఎంతవరకు ఉపయోగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.రష్యాపై మరింత ఒత్తిడిఈ చట్టం కేవలం చమురు కొనుగోలుదారులపైనే కాదు.. రష్యా ఇంధన, రక్షణ రంగాలతో పాటు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలకు వీలు కల్పిస్తోంది. ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా ఈ చట్టం పొడిగించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా అమెరికా పేర్కొంటోంది. మొత్తంగా చూస్తే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు ఇది నేరుగా తాకే అంశమే అయినప్పటికీ, 100 శాతం టారిఫ్ ఇప్పటికిప్పుడు ఖరారైన నిర్ణయం కాదు. ఏ దేశాలను తుది జాబితాలో చేర్చుతారు? భారత్‌పై ఎంత మేర ప్రభావం ఉంటుంది? అన్నది ట్రంప్ ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: భూకంపం కాదు.. భూకంపాలు పుట్టిన కిమ్ -
ఆస్కార్ బరిలో గోంధళ్
మరాఠి థ్రిల్లర్ సినిమా ‘గోంధళ్’ ఆస్కార్ బరిలో నిలిచింది. వచ్చే ఏడాది మార్చి 14న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 99వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 15). కాగా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ కోసం భారతదేశం నుంచి ‘గోంధళ్’ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల్లో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ కోసం 33 సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’, ‘హక్’, ‘హనుమాన్ అంశ్’, ‘బోర్డర్ 2’, ‘120 బహదూర్’, ‘ఇక్కీస్’ వంటి 14 హిందీ సినిమాలున్నాయి. అలాగే ‘పెద్ది’, ‘ఇరుముడి’, ‘సింగ్ గీతం’, ‘ఇగ్వా (ఇంకా విడుదల కావాల్సి ఉంది)’ వంటి నాలుగు తెలుగు సినిమాలతో పాటుగా, మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’ కూడా ఉంది. ఈ చిత్రాలన్నింటినీ దాటుకుని ‘గోంధళ్’ మూవీ ఆస్కార్ అవార్డుల పోటీకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.కథ ఏంటంటే..?ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, అనుజ్ ప్రభు, నిషాద్ భోయిర్, కిషోర్ కదమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గోంధళ్’. సంతోష్ దవఖర్ దర్శకత్వంలో దీక్షా దవఖర్ నిర్మించిన ఈ చిత్రం 2025 నవంబరు 14న విడుదలైంది. సంప్రదాయం, మోసం, అధికారం, ఆకాంక్షల అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రం కథ విషయానికి వస్తే... మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా పెళ్లయిన దంపతుల జీవితంలోని అడ్డంకులు తొలగిపోవడానికి రాత్రంతా సంగీతం, నృత్యం, పురాణ కథలతో ‘గోంధళ్’ అనే సంప్రదాయ జానపద పూజ నిర్వహిస్తారు. ఈ పూజ నేపథ్యంతోనే ఈ కథ సాగుతుంది. ఆనంద్ (యోగేష్ సోహోని)తో సుమన్ (ఇషితా దేశ్‌ముఖ్) వివాహం జరుగుతుంది. కానీ, గతంలోనే గోంధల్ ప్రదర్శకుడు సాహెబ్రావ్ (అనుజ్ ప్రభు)ను సుమన్ ప్రేమిస్తుంది. మరి.. ఆ రాత్రి ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ. కాగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగపు నామినేషన్ కోసం గతంలో ‘హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’, ‘శ్వాస్’, ‘కోర్ట్’ వంటి మరాఠి చిత్రాలు పోటీలో నిలిచినా నామినేషన్ దక్కలేదు. మరి..‘గోంధళ్’కు అయినా ఆస్కార్ నామినేషన్ లభిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మదర్ ఇండియా’, ‘సలామ్ బాంబే’, ‘లగాన్ ’ చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్లోని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందినప్పటికీ అవార్డు మాత్రం లభించలేదు. -
ఈ బాలుడు టోర్నెడో రాకను కనిపెడతాడు
పిల్లలూ... మీరు సినిమాల్లో టోర్నెడో (సుడిగాలి) చూశారా? ఇళ్లను, కార్లను గాల్లోకి లేపేసే పెద్ద రాక్షసి అది. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఏడాదికి 50 టోర్నెడోలు వస్తాయి. అక్కడే అనిరుధ్ రావ్ అనే 12 ఏళ్ల తెలుగు అబ్బాయి ఉంటున్నాడు. అతనికి నాలుగైదేళ్ల వయసులో నాష్ విల్లేలో ఉండగా, తన కళ్ల ముందే ఒక టోర్నెడో తన స్నేహితుడి ఇంటిని పూర్తిగా నాశనం చేయడం చూశాడు. ఆ చిన్న వయసులోనే అతని మనసులో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది – ‘మనమెందుకు టోర్నెడో రాకను ముందే పసిగట్టకూడదు?’ అని. అప్పట్నించి అతను పరిశోధిస్తూ ఇన్నాళ్లకు కనిపెట్టిన ఆవిష్కరణే 'Revere’. సాధారణంగా టోర్నెడో పుట్టే ముందు మన చెవులకు వినపడని ‘ఇన్ ఫ్రా సౌండ్’ అనే ప్రత్యేక శబ్దం వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. ఇప్పుడున్న పెద్ద రాడార్లు ఆ శబ్దం తమకు బాగా దగ్గరికి దగ్గరికి వచ్చాకే గుర్తిస్తాయి.సాధారణంగా ఇలా గుర్తించాక 13 నిమిషాలకు టోర్నెడో ఆ ప్రాంతానికి వస్తుంది. కానీ అనిరుధ్ సెన్సార్లు ఉన్న చిన్న డ్రోన్లను తయారు చేసి, టోర్నెడో పుట్టిన వెంటనే అవి ఆ శబ్దం దగ్గరికి తమకు తాముగా వెళ్లి దాని ఆచూకీని కనిపెట్టేలా చేశాడు. దీని వల్ల టోర్నెడో రాబోతున్నదని 40 నిమిషాలకు ముందే తెలిసిపోతుంది. అంటే అనిరుద్ వల్ల దొరికిన ఆ అదనపు 27 నిమిషాలు వందల కుటుంబాల ప్రాణాలను కాపాడతాయి. ఈ గొప్ప ఆలోచనకు గాను అనిరు«ద్‌కు అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘గ్లోరియా బారన్ ప్రైజ్ ఫర్ యంగ్ హీరోస్ 2025’ అవార్డు వచ్చింది. పిల్లలూ... చిన్న ప్రశ్నే పెద్ద ఆవిష్కరణకు మొదటి మెట్టు అని అనిరుధ్ నిరూపించాడు.


